Brahmamudi Serial జూన్ 21st 128 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ 127 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 128 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Krishna Mukunda Murari: మురారి డైరీ చూసిన ముకుంద.. బాధతో మురారిని ఏం చేయనుంది..
స్వప్న బలుపు చూసి ఆశ్చర్యపోతున్న ఇంటి సభ్యులు :
స్వప్న ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ తెగ అతి చేస్తూ ఉంటుంది. టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ టేబుల్ వద్దకి వచ్చిన స్వప్న, టిఫిన్ చేసేటప్పుడు నన్ను పిలవాలని తెలియదా అని అంటే, అప్పుడు అపర్ణ తెలియదు, ఇక్కడ టిఫిన్ కి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం లోపు వచ్చి తింటేనే టిఫిన్ ఉంటుంది, నువ్వు అంతపురం లో మహారాణి లాగ కూర్చొని ఉంటే పనులు మానుకొని నిన్ను పిలవడానికి ఎవ్వరూ రారు అంటుంది. ఇక ఆ తర్వాత ఇడ్లీ ని చూసి ఛీ ఛీ ఇంత క్యాలరీలు ఉన్న ఇడ్లీ ని ఎలా తింటున్నారు. అలా తింటున్నారు కాబట్టే వయస్సుకి మించి పదేళ్లు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు అందరూ , నేను ఈ టిఫిన్ తినను, నా రూమ్ లోకి బ్రెడ్డు మరియు జ్యూస్ తీసుకొని రా అని కావ్య కి చెప్పి చాలా పొగరుగా పైకి వెళ్ళిపోతుంది స్వప్న.

Nuvvu Nenu Prema: పద్మావతిని మెప్పించడానికి సిద్ధూ ప్రయత్నం… కృష్ణ పన్నాగం ఫలించనుందా…
ఇంటికి వచ్చిన సేటుని బంధించి స్టోర్ రూమ్ లో దయచేసి కనకం – మీనాక్షి :
మరోపక్క కనకం ఇంటికి సేటు వస్తాడు, డబ్బులు వచ్చాయని విన్నాను, ఇస్తే మీ పత్రాలు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ఇస్తాను కానీ ఇప్పుడే కాదు, 5 నెలల తర్వాత ఇస్తాను అని అంటాడు. ఇప్పటికిప్పుడు ఇవ్వకపోతే మిమల్ని ఇంట్లో నుండి గెంటేసి ఈ ఇల్లుని స్వాధీన పర్చుకుంటాను అని అంటాడు. పిల్ల పెళ్లి కోసం అప్పు చేసాము, కష్టమో నష్టమో నానా తిప్పలు పడి ప్రతీ నెల వడ్డీ కడుతున్నాము, ఈ నెల కూడా వడ్డీ కట్టాను, మరి ఇలాంటి సమయం లో మీరు అకస్మాత్తుగా ఇల్లు ఖాళీ చేయమనడం చాలా తప్పు కదా అని అంటుంది కనకం.అలా ఎంత నచ్చచెప్పాలని చూసినా సేటు ఒప్పుకోకపోవడం తో అతి నెత్తి మీద కర్రతో బలంగా కొట్టి, స్టోర్ రూమ్ లో కట్టేసి ఉంచుతుంది కనకం. అందుకే మీనాక్షి కూడా సహాయం చేస్తుంది, అతనిని స్టోర్ లో కట్టేసిన తర్వాత కనకం భర్త ఇంటికి వస్తాడు, ఎక్కడో మగ గొంతు వినిపించిందే అనగా, ఇందాక మీనాక్షి వీడియో చూస్తూ ఉన్నింది, దాని తాలూకు ఆడియో అని కవర్ చేస్తుంది కనకం.

రాజ్ కి స్వప్న గర్భవతి కాదు అనే నిజాన్ని చెప్పడానికి వెళ్లిన కావ్య :
మరో పక్క స్వప్న చెట్లకు నీళ్లు పడుతూ తన వైపుకు వచ్చిన పనిమనిషిపై నోరు పారేసుకుంటుంది. ఇదంతా గమనించిన కావ్య, తానేమైనా నీ బానిస అనుకుంటున్నావా అని అడుగుతుంది.అప్పుడు స్వప్న అవును పని మనిషి అంటే బానిసనే అని చాలా పొగరుగా మాట్లాడుతుంది స్వప్న. అప్పుడు కావ్య బానిస కాదు, మనకి తెలియని పని చేసేవాళ్ళని మన అవసరం కోసం పెట్టుకుంటాము, ఎక్కువ చెయ్యకుండా ఆమెకి క్షమాపణలు చెప్పు అంటుంది కావ్య. నేను దీనికి క్షమాపణలు చెప్పడమా, అది ఎప్పటికీ జరగదు, దీని స్థాయి ఏమిటి నా స్థాయి ఏమిటి , కావాలంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, నువ్వే దాని కాళ్ళు కడిగి, పువ్వులు పెట్టి క్షమాపణలు చెప్పుకో అని చెప్పి వెళ్ళిపోతుంది.

ఇదంతా మెడపై నుండి రాజ్ గమనిస్తూ ఉంటాడు. మరోపక్క రాజ్ కి స్వప్న కడుపుతో లేదు అనే విషయాన్నీ చెప్పడానికి వెళ్తుంది కావ్య, మీకు ఒక విషయం చెప్పాలి అంటూ కడుపు గురించి మాట్లాడబోగా, అవసరం లేదు ఇందాక నేను మొత్తం విన్నాను, నాకు అర్థం కానీ విషయం ఏమిటంటే స్వప్న ఇప్పుడే ఇలా ఉందా, చిన్నప్పటి నుండి ఇలాగే ఉందా అని అడగగా, చిన్నప్పటి నుండి దానిని మా అమ్మ గారాబం చేసి పెంచింది , అందుకే కాస్త పొగరుగా ఉంటుంది కానీ, మనిషి చాలా మంచిది అని అంటుంది కావ్య.

ఇక రేపటి ఎపిసోడ్ లో అప్పు మామిడి పండ్లను తీసుకొస్తుంది , కడుపుతో ఉన్నావు కదా పుల్లగా ఏదైనా తినాలి అనిపిస్తుంది అని అమ్మ నీకు ఇవి ఇవ్వమని పంపింది అని అనగా, నాకేమి అలా తినాలని అనిపియ్యడం లేదని బదులిస్తుంది స్వప్న, అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అదేంటి ప్రతీ ఆడపిల్లకు కడుపుతో ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కదా అని అంటుంది అమ్మమ్మ, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.