BrahmaMudi November 21 Episode 259: నిన్నటి ఎపిసోడ్ లో, రాజ్ అరుణ్ గురించి వివరాలు కనుక్కోవాలి అని ఒక సీఐ హెల్ప్ తీసుకుంటాడు. ఇక స్వప్న కావ్యతో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అప్పు వాళ్ళ ఇంటికి కళ్యాణ్ వచ్చి బయటికి వెళ్దాం అని అంటాడు అందుకు కృష్ణమూర్తి ఒప్పుకోడు. కానీ రేపు ఉదయం అప్పు నేను బయటికి వెళుతున్నాను అని చెప్తాడు. కళ్యాణ్ కోసం అప్పు చాలా బాధపడుతూ ఉంటుంది.స్వప్న కాన్ఫిడెన్స్ చూసి కావ్య నేనే తప్పుగా అనుకున్నాను అక్క ఏ తప్పు చేయలేదు అని అనుకుంటుంది. ఈ మాటలన్నీ విన్న రాహుల్ ప్లాన్ బికి స్కెచ్ వేస్తాడు. అరుణ్ కి కాల్ చేసి పది లక్షలు డబ్బులు అడగమని చెప్తాడు. స్వప్న కళ్ళల్లో భయం నేను చూడాలి అని రాహుల్ అంటాడు.

ఈరోజు ఎపిసోడ్ 259 లో, స్వప్నకు అరుణ్ కాల్ చేస్తాడు. వీడేంటి మళ్లీ కాల్ చేస్తున్నాడు వీడి పని చెప్పాలి అని కాల్ లిఫ్ట్ చేసి, నీకు రాత్రి చెప్పాను కదా ఇక నువ్వు మళ్ళీ నన్ను కలవకూడదు మాట్లాడకూడదని మళ్లీ కాల్ ఎందుకు చేశావు అని స్వప్న కోపంగారు మీద అరుస్తూ ఉంటుంది. ఇంకొకసారి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని చెప్పాను అది కూడా మర్చిపోయావా అని అంటుంది. అది కాదు స్వప్న నేను చెప్పేది ఒకసారి విను అని అరుణ్ అంటూ ఉంటే షట్ అప్ అని అరుస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా ఏంటి అని అంటుంది. అసలు ఎందుకు కాల్ చేసావో చెప్పు, ఎందుకు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు. అని స్వప్న గట్టిగ అరుణ్ మీద అరుస్తూ ఉంటుంది.

అక్రమ సంబంధం.. అని అరుణ్ బెదిరింపు..
ఇక స్వప్న గట్టిగా అరుస్తూ ఉంటే అరుణ్ నచ్చ చెప్పాలని చూస్తాడు కానీ స్వప్న వినిపించుకోదు. నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి నువ్వు ఎందుకు నాకు ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటున్నావు అని అంటుంది. అక్రమ సంబంధం అని అంటాడు. స్వప్న షాక్ అవుతుంది. మన మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి నువ్వు మర్చిపోయావా అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా చెప్పు తీసుకొని కొడతాను అని అంటుంది. అయినా ఎందుకురా న నీ రకంగా హింసిస్తున్నావు నీకు కావాల్సిందేంటి, ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నావు అని అంటుంది స్వప్న ఇప్పుడు లైన్ లోకి వచ్చావు స్వప్న అని అంటాడు. మనిద్దరం ప్రేమించుకున్నాం కదా ఆ ప్రేమ సంబంధం ఇంకా మన మధ్య ఉంది కదా అని అంటాడు. ప్రేమ గీమ అన్నావంటే పళ్ళు రాలిపోతాయి అని అంటుంది స్వప్న. అయినా రాత్రి ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అడుగుతుంది. నిన్ను భయపెట్టడానికి వచ్చాను అని చెప్తాడు. వాట్ అనే స్వప్న ఆశ్చర్య పోతుంది. అవును స్వప్న నీకు భయం అంటే ఎలా ఉంటుంది నేను మీ ఇంటికి వస్తే నువ్వు ఎంత భయపడతావో అసలు ఆ పరిస్థితులన్నీ నీకు తెలియడం కోసమే వచ్చాను అని అంటాడు. ఇప్పుడు నాకు కావాల్సింది అడుగుతాను. నువ్వు భయానికైనా ఇస్తావు కదా అని అంటాడు. ఏం కావాలి రా నీకు అని అంటుంది నేను హాస్పిటల్ కడుతున్నాను పది లక్షల కావాలి అని అంటాడు. 10 లక్షలు కావాలంటే ఎలా రా అని అంటుంది. అవన్నీ నాకు తెలియదు స్వప్న నువ్వు 10 లక్షలు నాకు ఇవ్వాలి లేదంటే నువ్వు నేను దిగిన ఫోటోలు మీ ఇంట్లో గోడల మీద అంటిస్తాను అని అంటాడు. నువ్వు నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నామని ప్రూవ్ చేస్తాను అని అంటాడు. నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను నాకు పది లక్షలు ఇవ్వకపోతే నీకు నాకు మధ్య సంబంధం ఉందని నిరూపించేటట్టు, మీ ఇంటికి ఇంకొక రియల్ వస్తుంది అందులో ఫొటోస్ ఈసారి పెద్దపెద్ద ఉంటాయి అని అంటాడు, అరుణ్. ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అదంతా పక్కనే ఉన్న రాహుల్ రుద్రణి వింటారు.

స్వప్న కంగారు.. రాహుల్ ప్లాన్ సక్సెస్..
ఇక అరుణ్ చెప్పిన మాటలన్నీ గుర్తుచేసుకొని స్వప్న ఇప్పటికిప్పుడు 10 లక్షలు కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అనుకుంటుంది. తీసుకురాకపోతే అరుణ్ గాడు అనంతపని చేస్తాడేమో అని భయపడుతుంది. ఈ మాటలన్నీ పక్కనే ఉండి విన్న రాహుల్ రుద్రాణి ఇద్దరు, మమ్మీ ఇప్పుడు తను భయపడమైతే చేశాము మరి నెక్స్ట్ ఏం చేయాలి అని అంటాడు. ఇక దాన్ని ఇంట్లో నుంచి బయటికి అని అంటుంది రుద్రాణి. తను పదిలక్షలు తీసుకొచ్చి చేస్తే అని అంటాడు రాహుల్. దాని దగ్గర ఒకటే దారి ఉంది అది తాతయ్య ఇచ్చిన గారిని తాకట్టు పెట్టడం. అలా చేసిన ఇంట్లో నుంచి బయటికి వెళుతుంది చేయకపోయినా ఇంట్లో నుంచి బయటికి వెళుతుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక స్వప్నకి టైం దగ్గర పడిందని అర్థం అవుతుంది. స్వప్న మాత్రం మనసులో బాధపడుతూ ఇప్పుడు ఎలాగైనా సరే నేను పది లక్షలు తీసుకురావాలి తాతయ్య చిన్నగలని తాకట్టు పెడితే నేను ఇంట్లో అందరి ముందు దోశలా నిలబడాల్సి వస్తుంది పోనీ అలా చేయకుండా ఇంకో మార్గం ఏది ఉందో త్వరగా ఇప్పటికిప్పుడే ఈ రోజు లోపే వెతికేయాలి అని కంగారుగా ఉంటుంది.

అప్పు బాధ.. కనకం ఆవేదన..
ఇక అప్పు ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. చాలా డల్ గా చాలా నీరసంగా ఎవరితో సంబంధం లేదన్నట్టు ఒక పక్కన కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే కనకం మీ ఇంటి ముందు నుంచి చాలామంది పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక కనకం ఏంటి అందరూ అలా పరిగెడుతున్నారు అని బయటికి వెళ్లి చూస్తుంది అప్పుడే అక్కడ ఒక ఆవిడ, ఏమైంది అందరూ అలా పరిగెడుతున్నారు అని అడిగితే, పక్కనే ఉన్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్తారు. ఆ అమ్మాయి పెళ్లి అన్నారు అని అంటుంది కనుకమ్. ఇంకెక్కడి పెళ్లి ఆ అమ్మాయి ప్రేమ విఫలమైందని సూసైడ్ చేసుకొని చనిపోయింది అని అంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయిని ఏదో అన్నారుట ఇక ఆ అమ్మాయి చేసేదేం లేక ఆత్మహత్య చేసుకుంది అని చెప్తారు. సిరి చేసిన పనికి అందరూ చాలా బాధపడుతున్నారు అయినా ఆ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకుంటే చనిపోవాలా అని అంటారు వాళ్ళు, మేమందరం ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాము అని అంటారు.ఇక కనకం ఆలోచనలో పడుతుంది నేను కూడా ఇలానే చేస్తే, అప్పు కూడా ఏమన్నా చేసుకుంటుందేమోనని భయపడుతుంది ఇక అప్పు నీ ఒక్క క్షణం కూడా వదిలి ఉండకూడదు అని అప్పు వెనకాలే తిరగాలి అనుకుంటుంది. అప్పు అలా డల్ గా ఉండకపోతే వచ్చి కూరలు కట్ చేయొచ్చు కదా అని అంటుంది. అప్పు అంతే డల్ గా వెళ్లి తనకు కూరలు కట్ చేయమన్నవి కట్ చేసేసి మళ్ళీ డల్లుగా వచ్చి కూర్చుంటుంది. ఇక కనకం ఈ అమ్మాయి మారదా ఏంటి అని అనుకుంటుంది. ఇక ఎలాగైనా అప్పుకి అన్ని పనులు చెప్పి తనని బిజీగా మార్చాలి అని అనుకుంటుంది. కూరలు కట్ చేసి లోపలికి వెళ్ళిపోతున్న అప్పుతో, బట్టలన్నీ అలానే ఉన్నాయి అని అనే లోపు అప్పుడు కోపంగా చూస్తుంది అంటే ఈ అమ్మ కోసం ఆమాత్రం చేయవా అని అంటుంది. ఏంటి ఇప్పుడు బట్టలు ఉతకాలి అంతే కదా అని అంటుంది అప్పు. అంతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అన్నపూర్ణ కనకంతో ఎప్పుడూ లేనిది పిల్లకి పనులు చెప్తున్నావేంటి అని అంటుంది. అంటే పనులు చేయకూడదా ఏంటి అని అంటుంది. ఏంటి కనకం కంగారుగా ఉన్నావు పక్కింటి సిరి లాగా మనం అమ్మాయి కూడా ఏమైనా చేసుకుంటుంది అనుకుంటున్నావా అని అంటుంది అన్నపూర్ణ. ఏం చేయను తల్లిని కదా అని అంటుంది కనుకం.మీరు కూడా ఒక కన్ను దాని మీద వేసి ఉంచండి అని అంటుంది అన్నపూర్ణ తో

కావ్య మాట నిజం..
ఇక రాజ్ అరుణ్ గురించి కనుక్కోమని ఒక ఎస్ఐ కి చెప్తాడు. అతని కాల్ చేసి ఒకసారి అబ్బాయి మీ స్వప్న చదివిన కాలేజీలోనే చదివాడు. మా అబ్బాయి మీ ఇంట్లో ఉన్న స్వప్న ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, తను ఇప్పుడు మెడిసిన్ చదివి డాక్టర్ గా, హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాడు అని చెప్తాడు. ఓహో అయితే మాకు కళావతి చెప్పిన మాట నిజమైన మాట అని రాజ్ అనుకుంటాడు. ఇక కావ్య అప్పుడే వస్తుంది లోపలికి, రాజ్ ని చూసి మీరు ఎప్పుడు వచ్చారు అని అంటుంది అంటే ఎవరింట్లోకి వస్తున్నారు వెళ్తున్నారో కూడా చూడలేనంత బిజీగా ఉన్నావా అని అంటాడు. నేను వచ్చిన సంగతి కూడా నువ్వు చూడలేదు కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు అని అంటాడు. మొన్న మీరు నా చేత్తో మంచినీళ్లు కూడా తాగనున్నారు అలాంటిది కాఫీ ఇస్తే తాగుతారు లేదో అని అంటుంది కావ్య. అవును నీ చేత మంచిలిస్తే నేను అసలు తాను ఇప్పుడు కూడా తాగను అని అంటాడు. నువ్వు తీసుకురావడం నీ బాధ్యత నేను తాగడం తాగకపోవడం నా ఇష్టం అని అంటాడు రాజ్. లెక్చరర్ ఇవ్వమంటే ఇస్తావు నేను నీటి కోడల్ని నేటి కోడల్ని అని మొగుడి నీ గౌరవించడం నేర్చుకో అనిఅంటాడు. మొన్న నటించమన్నారు అని అంటుంది కావ్య. నటిస్తూనే తీసుకురమ్మన్నాను అని అంటాడు రాజ్. అయితే కాఫీ కప్పు కాకుండా ఖాళీ కప్పు తీసుకొస్తాను. వెంటనే రాజ్ కోపంగా చూస్తాడు కాలిందా అట్లానే కాలుతుంది నాక్కూడా అని అంటుంది. ఇక నడుము తిప్పుకుంటూ వెళ్తుంది. జాగ్రత్త ఊడిపోతుంది అని అంటాడు రాజ్. ఏం ఊడిపోతుంది అని అంటుంది కావ్య. చెవులకు వున్నా జుంకాలు ఊడిపోతాయిలే అని అంటాడు రాజ్.
రాహుల్ హెల్ప్..
ఇక స్వప్న నేను ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నానని ఈ ఆస్థానంతా నేనేదో అనుభవిస్తున్నట్టు అనుకుంటున్నాడు ఈ అరుణ్ గాడు. ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు అడిగితే నేనెలా తీసుకొస్తాను పెద్దింట్లో ఉంటున్నంతమాత్రాన నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు కదా అని అనుకుంటుంది. ఇక అదే టైం కి రాహుల్ అక్కడికి వస్తాడు. ఏంటి స్వప్న ఎలా ఉన్నావు అని అంటాడు. బానే ఉన్నాను కదా అని అంటుంది స్వప్న లేదు ఏదో కంగారుగా ఉంటేను ఏమన్నా హెల్ప్ కావాలా అని అంటాడు. అదేంటి మొన్ననే కదా నాతో ఉండడం ఇష్టం లేదన్నావు ఇప్పుడేంటి హెల్ప్ కావాలా అంటున్నావు అని అనుమానిస్తుంది. తాతయ్య ఆరోగ్యం బాగోలేదు కదా కుదిరిపరేవరకు గొడవలెందుకని అంటాడు రాహుల్. అయినా నేను బాగానే ఉన్నాను అని అంటుంది రాహుల్ ఎలాగైనా నన్ను అడుగుతుంది అప్పుడు ఎందుకు ఏమిటి అని ఆరా తీయొచ్చు అని అనుకొని అక్కడే కూర్చుంటాడు. ఇక స్వప్న రాహుల్ వైపు చూస్తూ అడుగుదామా మళ్లీ పది లక్షలు ఎందుకు అని ఆరా తీస్తాడు వద్దులే అని అనుకుంటుంది. రాహుల్ మాత్రం కచ్చితంగా నన్నే అడగాలి దీనికి ఇంకో ఆప్షన్ లేదు అని అనుకుంటాడు.

రాజ్, కావ్యల గిల్లికజ్జాలు..
రాజ్ తలుపు వేస్తూ ఉంటాడు అది పడదు. కావ్య వచ్చి ఏం చేస్తున్నారు అంటుంది నిన్ను డాక్టర్ దగ్గర చూపించాలి అని అంటాడు. ఎందుకు అని అంటుంది. ఎందుకంటే నీకు నేను చేసేది కనిపించట్లేదు కదా అని అంటాడు. కనిపిస్తుంది లెండి డోర్ వేస్తున్నారు ఎందుకు అని అంటుంది. తమరు నా బెడ్ మీద పడుకుంటారు కదా అందుకు అని అంటాడు. అబ్బో అని అంటుంది కావ్య. అయితే ఏమైంది డోర్ తీసే ఉంచండి అని అంటుంది. నువ్వు చెప్పావు కాబట్టి నేను డోర్ తీసి ఉంచాను. వేస్తాను అని ట్రై చేస్తూ ఉంటాడు ఆ డోర్ పడదు. సరే క్లోజ్ చేసేయండి అని అంటుంది. నువ్వు చెప్పావు కాబట్టి నేను అసలు క్లోజ్ చేయను అని అంటాడు. ఇప్పటికైనా నేను చెప్పినట్టే చేశారుగా అని అంటుంది. రాజకోపంగా చూస్తాడు మీ ఇష్టం ఎందుకు అంత కోపం మూసుకుంటే మూసుకోండి అని అంటుంది. ఏంటది అని అంటాడు. తెలుపండి అని అంటుంది కావ్య ఇక కావాలని రాజ్ కోపంగా తలుపు వేస్తాడు అది రివర్స్లో వచ్చి మళ్లీ రాజ్ మొహానికి తగులుతుంది. ఇక రాజ్ చాలా నొప్పి గా ఉన్న కాఫీ ముద్దు బయటపడకుండా మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకొని బాధపడుతూ ఉంటాడు. కావ్య నవ్వుకుంటుంది.
అప్పు సూసైడ్ ?
కనకం తెల్లవారింది కాఫీ పెడదామని వంటింట్లోకి వెళ్తుంది. అప్పటికి పాలు వంటింట్లో ఉండవు ఇదేంటి ఈ పిల్ల ఇంకా పాలు తీసుకురాలేదు అని, ఇంతసేపు దాకా నిద్ర పోతుందా అని అప్పు గురించి ఆలోచిస్తుంది. వెళ్లి పాలు తీసుకు రమ్మని చెబుదామని అప్పు రూమ్ కి వెళ్తుంది. సూసైడ్ చేసుకున్న యాంగిల్ లో పడుకొని ఉంటుంది. చేతికి మణికట్టు దగ్గర గీత ఉంటుంది. అది చూసి వెంటనే కనకం షాక్ అవుతుంది. అప్పు సూసైడ్ చేసుకుందని భయపడుతుంది. చూడాలి అప్పు నిజంగానే సూసైడ్ చేసుకుందా, లేదా అని తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..

రేపటి ఎపిసోడ్ లో, రాహుల్ ప్లాన్ బి సక్సెస్ అవుతుంది. అందరి ముందు అరుణ్ పంపించిన ఫోటోలు ఉంటాయి. రాహుల్ ఆ ఫోటోలు అందరికీ చూపిస్తాడు. ఇక స్వప్న అప్పుడే బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. ఆగు స్వప్న ఎక్కడికి వెళ్లావు అంటాడు రాహుల్. నన్ను మోసం చేసి బయట ఎవరితోనో తిరిగి వస్తుంది అని అంటాడు ఇంట్లో అందరితో, చూడండి కావాలంటే అన్ని ఫోటోలు చూపిస్తాడు అరుణ్ స్వప్నల్ దిగిన ఫోటోలు. అవును అవన్నీ కాలేజీలో నేను దిగిన ఫొటోస్ వాడు నాకు క్లోజ్ ఫ్రెండ్ ఓన్లీ ఫ్రెండ్. అంతే అని అంటుంది స్వప్న వెంటనే ఇందిరా దేవి నీకు అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే నేను నీకు ఫోటో చూపించి ఎవరు అని అడిగినప్పుడు నాకు వీడెవడో తెలీదు అని చెప్పావు అని అంటుంది ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు.