Brahmamudi Serial జూన్ 22nd 129 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీరియల్ ఇప్పటి వరకు 128 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు 129 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.

Krishna Mukunda Murari: ముకుంద తన పగతో రేవతిని కూడా భయపెట్టిందా…
స్వప్న కి మామిడి కాయలు ఇచ్చి రమ్మని అప్పు కి చెప్పిన నాన్న :
స్వప్న కోసం మామిడి పండ్లను తీసుకున్న తండ్రి అప్పు కి ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్లి ఇచ్చి రమ్మంటాడు. అప్పుడు అప్పు ఎప్పుడు లేనిది దాని మీద అకస్మాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏమిటి అని అడుగుతుంది అప్పు.అప్పుడు ఆయన కొత్తగా ఏమి పుట్టుకు రాలేదు, అది పుట్టినప్పటి నుండి ఆ ప్రేమ అలాగే ఉంది, కానీ పిల్లలు తప్పును చేయునప్పుడు ఆ ప్రేమని చూపించలేము కదా అని అంటాడు తండ్రి. సరేలే ఇచొస్తాను అంటూ అప్పు స్వప్న ఇంటికి బయలుదేరుతుంది.

Nuvvu Nenu Prema: విక్కీ చెప్పిన మాటలకు కుచల మనసు మారిందా.. అరవింద ను చంపడానికి కృష్ణ ప్లాన్..
రాహుల్ ని నిలదీసిన రాజ్ :
మరో పక్క రాజ్ పని పాట లేకుండా తిరుగుతున్న రాహుల్ ని నిలదీసి ఇంతకు ముందు నువ్వు పార్టీలకు,పబ్బులకు వెళ్తున్నా కూడా నేను ఏరోజు నిన్ను ప్రశ్నించలేదు, కానీ నీకు ఇప్పుడు పెళ్లి అయ్యింది, ఇక నుండి అలాంటివన్నీ ఆపేసి బాధ్యత గా ఉండాలి అని అంటాడు. అప్పుడు రుద్రాణి ఇన్ని రోజులు చేసింది అదే కదా, రాజ్ తో పాటుగా రాహుల్ కూడా కంపెనీ ని చూసుకున్నాడు అని అంటుంది. అప్పుడు అపర్ణ ఎంత బాగా చూసుకున్నాడో అందరికీ తెలుసులే, ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉంటాడని చెప్తున్నాడు అంతే అని అంటుంది అపర్ణ. అప్పుడు రుద్రాణి ఆ మాటికొస్తే కళ్యాణ్ ఏమి చూసుకుంటున్నాడని కంపెనీ ని, తనకంటే రాహుల్ మంచిగా చూసుకుంటున్నాడు అంటుంది రుద్రాణి, తన కొడుకు కళ్యాణ్ ని తక్కువ చేసినందుకు ధాన్య లక్ష్మి రుద్రాణి పై విరుచుకుపడుతుంది , అలా వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండగా, రాజ్ రాహుల్ ని రేపటి నుండి నా బ్రాంచ్ లోనే నువ్వు పని చెయ్యాలి, ఏది చేసిన నాకు చెప్పే చెయ్యాలి అని అంటాడు రాజ్.

అప్పు ని దారుణంగా అవమానించిన రుద్రాణి :
నాన్న ఇచ్చిన మామిడి కాయలను తీసుకొని అప్పు స్వప్న ఇంటికి వస్తుంది. అప్పు రాగానే ధాన్య లక్ష్మి లోపలకి పిలిచి కూర్చోమని చెప్తుంది. లోపలకి వచ్చి కూర్చున్నాక అప్పు కాళ్ళు సోఫా పైన పెట్టడం ని గమనించి అప్పుని తిడుతుంది రుద్రాణి. ఏయ్ ఛీ పైకి లెయ్యి, కూటి కోసం వచ్చావా , అడుక్కోడానికి వచ్చావా, ఏంటి ఆ కూర్చోవడం అని అరుస్తుంది. అప్పుడు అప్పు కూడా కోపం తో రుద్రాణి కి బాగా మండిపొయ్యేట్టు కౌంటర్లు ఇస్తుంది. నీలాగా బయట వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటున్నాం అనుకున్నావా, నీకు దుగ్గిరాల కుటుంబానికి సంబంధం ఏమిటి అని అంటుంది అప్పు. అప్పుడు ఆవేశం తో ఊగిపోయిన రుద్రాణి, ఎంత ధైర్యం నీకు నన్నే అంత మాట అంటావా అని కొట్టడానికి రాబోతుండగా, ఇంద్ర దేవి వచ్చి రుద్రాణి ని మందలిస్తుంది, మా ముందే ఇంటికి వచ్చిన అతిథిని అలా అవమానిస్తావా అంటూ రుద్రాణి ని తిడుతుంది. అలా అప్పు ని అవమానించినందుకు ఇంట్లో ఉన్నవాళ్ళందరూ తిడుతుంటారు.మరో పక్క స్వప్న తన అత్తయ్య రుద్రాణి ని వెనకేసుకొస్తుంది.అసలు వచ్చిన విషయం ఏమిటని అడగగా, ఇది కడుపుతో ఉంది కదా, నాన్న దీని మీద ప్రేమతో ఈ సమయం లో పులుపు పదార్దాలు తినడానికి ఇష్టపడతారు కాబట్టి మామిడి కాయలను ఇచ్చి పంపించాడు అని అంటుంది, అప్పుడు స్వప్న ఛీ ఛీ నేను మామిడి కాయలు తింటాను అని ఎవరు చెప్పారు నీకు అని అనగా, అదేంటి కడుపుతో ఉన్నవాళ్లు పులుపువి తినడానికి ఇష్టపడుతారు కదా, నీకు తినాలని అనిపించడం లేదా అని అనగా, వాళ్ళ ముందు కవరింగ్ చేసుకొని అప్పు ఇచ్చిన మామిడి కాయలను తీసుకొని తింటుంది స్వప్న.
