Brahmamudi: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ రీసెంట్ గానే వంద ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 103 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.ఆఫీస్ అకౌంట్ నుండి రాహుల్ 9 లక్షల రూపాయిలు డ్రా చేసిన విషయాన్నీ గమనించిన రాజ్ , రాహుల్ ని ఎందుకు ఇంత డబ్బు ఖర్చు చేసావ్ అని నిలదీస్తాడు. దానికి రాహుల్ సమాధానం ఇస్తూ ఎప్పుడు లేనిది కేవలం ఈ కావ్య చెప్పిన మాటలు విని నన్ను అవమానిస్తున్నావా, నేను ఇంతకు ముందు ఇప్పటి కంటే ఎక్కువగానే డబ్బులు ఖర్చు చేశాను. అప్పుడు నీకు నా మీద నమ్మకం ఉండేది, వీడు డబ్బులు ఖర్చు పెడితే కేవలం ఆఫీస్ కోసమే ఖర్చు పెడతాడని అప్పుడు నీకు తెలుసు, కానీ ఇప్పుడు ఈ మహాతల్లి మాటలు నమ్మి నన్నే అవమానిసున్నావు కదా, ఇన్ని రోజుల మన స్నేహానికి మంచి విలువ ఇచ్చావు రాజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాహుల్.

Brahmamudi: వచ్చిన పెళ్లి సంబంధం ని చెడగొట్టిన స్వప్న..ఏ ఆడది చెయ్యని పని చేసేసింది!
రాహుల్ మాట్లాడింది మొత్తం విన్న తర్వాత రాజ్ మాట్లాడుతూ అసలు నేను మాట్లాడిన దానికి వాడు మాట్లాడిన దానికి సంబంధమే లేదు అని అనగా కావ్య దానికి సమాధానం ఇస్తూ సంబంధం ఉంది, తప్పు చెయ్యని వాడు ధైర్యం గా సమాధానం చెప్తాడు, రాహుల్ తప్పు చేసాడు కాబట్టే అలా తడబడ్డాడు అని అంటుంది. దీనికి రాజ్ సమాధానం చెప్తూ, ఇది బిజినెస్ కి సంబంధించిన వ్యవహారం, నువ్వు కలగచేసుకోకు అని అంటాడు.మరో పక్క అప్పు కళ్యాణ్ మిస్సెడ్ కాల్స్ చూసి తిరిగి ఫోన్ చేస్తుంది. అప్పుడు కళ్యాణ్ ఫోన్ తీసుకెళ్లి నీ అక్క స్వప్న కి ఇవ్వు అని కావ్య మాట్లాడాలి అంటాడు.అప్పుడు అప్పు స్వప్న కి ఫోన్ ఇవ్వగానే కావ్య రాహుల్ చేస్తున్న మోసం గురించి మొత్తం చెప్పబోతోంది. స్వప్న ఒక్కటి కూడా నమ్మదు. నీ గురించి నాకు రాహుల్ మొత్తం ఇందాకే ఫోన్ చేసి చెప్పాడు, ఇలాగే చెప్తావు అని, నా జీవితాన్ని నాశనం చెయ్యడానికే చూస్తున్నావు నువ్వు, అని అంటుంది స్వప్న. అప్పుడు కావ్య తింగరి మొహం దానా, ఇంకెంత కాలం ఇలా మోసపోతావే, తోడబుట్టిన చెల్లిని నమ్మవు కానీ, వాడి మాటలు నమ్ముతావా అని అంటుంది. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని స్వప్న కాల్ కట్ చేస్తుంది. అప్పుడు కావ్య కళ్యాణ్ తో మాట్లాడుతూ మీ అన్నయ్య కి ఏమో సాక్ష్యాలు కావాలి, మా అక్కకి ఏమో అబద్దాలు కావాలి, ఆ రాహుల్ కి వీళ్ళ బలహీనతలు కావాలి. ఇలాంటోళ్ళు ఇంటికి పెద్దగా ఎలా పుడుతారో అర్థం కావడం లేదు అని కావ్య చిరాకు పడుతుంది.

మరో పక్క అర్రు తన కూతురు వెన్నెల తో కలిసి రాజ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు అపర్ణ ఇంట్లో వాళ్ళ అందరినీ పరిచయం చేస్తుంది. ఆ సమయం లో కావ్య వంట ఇంటి నుండి బయటకి వచ్చి ఇంటికి అతిథులుగా వచ్చిన అర్రు మరియు వెన్నెల కి టీ ఇస్తుంది.చాలా సింపుల్ గా కనిపించిన కావ్యాన్ని చూసి అరుణ్ పని మనిషి అనుకుంటుంది. టీ చాలా బాగా పెట్టావు, ఈ కాలం లో ఇలాంటి సర్వెంట్ దొరకడం నీ అదృష్టం అంటూ అపర్ణ తో అంటుంది అరుణ్. సర్వెంట్ అని చెప్పిన తర్వాత అటు రాజ్ కానీ , ఇటు అపర్ణ కానీ తను సర్వెంట్ కాదు ఈ ఇంటికి కోడలు అని చెప్పలేకపోయారు. అప్పుడు రుద్రాణి కావ్య ఈ ఇంటి సర్వెంట్ కాదు, రాజ్ కి భార్య అని చెప్తుంది. ఇది తెలుసుకున్న అర్రు కావ్య కి క్షమాపణలు చెప్తూ, నేను సర్వెంట్ అని పిలుస్తుంటే కాదని చెప్పడానికి మీ ఇద్దరికీ వచ్చిన నష్టం ఏమిటి అని అపర్ణ మరియు రాజ్ ని నిలదీస్తుంది అరుణ్.

ఇక ఆ తర్వాత రాజ్ కావ్య వద్దకు వెళ్లి మంచి చీర కట్టుకొని చావొచ్చు కదా , నీకు చాలా చీరలు కొనిచ్చాను కదా అంటాడు. మీ విలువ కాపాడుకోవడం కోసం కొనిచ్చారు కానీ, నా మీద ప్రేమ తో కొనిచ్చారా, మీరు ప్రేమతో కొనిచ్చిన రోజే నేను చీర కట్టుకుంటాను అని అంటుంది.మరోపక్క స్వప్న క్లాస్ మాటే అరుణ్ స్వప్న ని పెళ్లి చేసుకుంటాను అని ఇంటికి వస్తాడు.అప్పుడు స్వప్న నేను నిన్ను ఎప్పుడు ఒక స్నేహితుడిగానే చూసాను కానీ ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు, నేను పెళ్లి చేసుకోబోయే వాడి రేంజ్ వేరు అని అంటుంది స్వప్న. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.