Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అపర్ణ ప్రాణ స్నేహితురాలు అరుంధతి తన కూతురు వెన్నెలతో కలిసి ఇంటికి వచ్చి రాహుల్ తో పెళ్లి సంబంధం అడుగుతుంది. రాహుల్ ఈ పెళ్లి నీకు ఇష్టమే కదా అని అరుంధతి అడగగా, సరిగ్గా ఆ సమయం లోనే రాహుల్ కి స్వప్న నుండి ఫోన్ కాల్ వస్తుంది. రాహుల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి సమాధానం లేదు అని అరుంధతి అంటుంది. అప్పుడు రాహుల్ తల్లి రుద్రాణి మాట్లాడుతూ సమాధానం వాడు కాదు నేను చెప్తాను, ఈ ఇంట్లో పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయానికి చిన్నవాళ్లు కట్టుబడాల్సిందే, ఎదురు చెప్పరు, నాకు ఈ సంబంధం ఇష్టమే అని అంటుంది రుద్రాణి, ఆ తర్వాత రాహుల్ కూడా అదే మాట చెప్తాడు, ఇంకేమి ఉంది మంచి ముహుర్తాలు చూసి పెళ్లి చేసేద్దాం అంటుంది అరుంధతి. మరో పక్క కావ్య మరియు రాజ్ కోపం తో రాహుల్ వైపు చూస్తుంటారు.

మరో పక్క స్వప్న నాన్ స్టాప్ గా రాహుల్ కి కాల్ చేస్తూనే ఉంటుంది, ఇది గమనించిన అరుంధతి అన్ని సార్లు కాల్ వస్తుందంటే ఎదో ముఖ్యమైన విషయమే అయ్యుంటాది, వెళ్లి మాట్లాడి రా పర్వాలేదు అని అంటుంది. అప్పుడు రాహుల్ సెపెరేట్ గా పైన ఉన్న గదికి వెళ్లగా స్వప్న కాల్ చేస్తుంది. రాహుల్ కాల్ ఆన్సర్ చెయ్యగానే స్వప్న మాట్లాడుతూ మా ఇంట్లో ఇక్కడ ఎవడో నన్ను పెళ్లి చేసుకుంటాను అని వచ్చాడు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ సంబంధం ఒప్పేసుకున్నారు అని అంటుంది. ఈ వార్త రాహుల్ ‘అబ్బా పీడా విరగడైంది..ఇక్కడ నాకు కోటీశ్వరుల సంబంధం, అక్కడ నీకు దరిద్రుడితో సంబంధం’ అని మనసులో అనుకోని పైకి మాత్రం స్వప్న తో పెళ్లి చేసుసుకో స్వప్న, మన విషయం మా ఇంట్లో తెలిసినప్పటి నుండి నన్ను ఎవరూ మనిషిలాగ చూడడం లేదు, బయటకి గెంటేస్తే చిల్లిగవ్వ కూడా నా చేతిలో ఉండదు, నీ ప్రేమ పొందే అదృష్టం నాకు లేదు అనుకోని నీ ఆనందం చూసి అయినా తృప్తి పడుతాను అని ఎమోషనల్ డైలాగ్స్ కొట్టి కాల్ కట్ చేస్తాడు.

Krishna Mukunda Murari: మురారి తనతో మాట్లాడిందంతా పథకం ప్రకారమే అని ముకుందా తెలుసుకుంటుందా.!?
మరోపక్క కావ్య రాహుల్ వెన్నెల తో కలుపుతున్న పులిహోర ని గమనించి వాళ్ళతో సెల్ఫీ తీసుకో మీ అన్నయ్య కి చూపిద్దాం అని అంటుంది. కావ్య చెప్పినట్టు గానే కళ్యాణ్ రాహుల్ మరియు వెన్నెల తో సెల్ఫీ తీసుకుంటాడు.ఆ సెల్ఫీ ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ కాబొయ్యే దంపతులకు శుభాకాంక్షలు అని చెప్పి మా స్వప్న అక్కని ట్యాగ్ చెయ్యి, అప్పుడు విషయం ఆమెనే అర్థం చేసుకుంటుంది అని అంటుంది కావ్య. సూపర్ ఐడియా, ఇప్పుడు ఆ పని చేస్తాను అని చెప్పి కళ్యాణ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా ధాన్య లక్ష్మి తనని తిరస్కరిస్తూ ఉండడం తట్టుకోలేకపోతాడు రాజ్.

అప్పుడు బాధతో రాజ్ ధాన్య లక్ష్మి ని పక్కకి పిలిచి చిన్నప్పటి నుండి నన్ను ఎప్పుడూ ఇలా దూరం పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు పిన్నీ ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు, కావ్యకి నువ్వు చేస్తున్న అన్యాయం నాకు నచ్చడం లేదు. అందుకే మానేసాను నీతో మాట్లాడడం అని అంటుంది ధాన్య లక్ష్మి, ఆలా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కాసేపు జరుగుతూ ఉంటుంది, మరోపక్క స్వప్న కి అరుణ్ తో పెళ్లి ఫిక్స్ , త్వరలోనే ముహుర్తాలు పెట్టిస్తాను అని అంటుంది కనకం, అప్పుడు స్వప్న ఈ పెళ్లి నాకు వద్ద అమ్మా అంటూ పాత విషయాలను గుర్తు చేస్తూ కనకం ని ఏమార్చాలని చూస్తుంది, కానీ కనకం నువ్వు ఎన్ని చెప్పిన ఈ పెళ్లి జరిగే తీరుతుంది అని అంటుంది. మరోపక్క రేపటి ఎపిసోడ్ లో కళ్యాణ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ చూసి అతను మోసం చేసిన ఒక అమ్మాయి ఇంటికి వస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.