Brahmamudi ఏప్రిల్ 25: రాహుల్ స్వప్న తో మాట్లాడటం చూసిన కావ్య రాహుల్ ను అడుగుతుంది.. నువ్వు మా అక్కను సేవ్ చేసావ్ కదా థ్యాంక్స్ అలాగే కేఫ్ కు తీసుకెళ్లావంట అందుకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్.. అసలు మా అక్కను ట్రాప్ చేసింది ఎవరో తెలుసుకోవాలి.. తెలుసుకుంటాను అని రాహుల్ కు సవాల్ విసురుతుంది.. ఇక లోపలికి వెళ్ళగానే రాజ్ తాతయ్య, నాన్నమ్మ ల పెళ్లి రోజు.. అందరూ ఎంతో సంతోష్మగా వాళ్ళను గదిలోంచి బయటకు పిలుస్తారు.. వాళ్ళు ఏంటి అని బయటకు వస్తారు.. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతారు.. అయితే మీ పెళ్లి రోజు వేడుకను చెయ్యాలని అనుకుంటున్నాం.. అని అందరూ అనగానె.. రాజ్ నానమ్మ మాత్రం మా పెళ్లి రోజును ఇద్దరు మాత్రం దగ్గరుండి చెయ్యాలని అంటుంది.. ఎవరు చెయ్యాలని అంటారు.. అప్పుడే రాజ్, కావ్యాలు అంటుంది..

రాజ్ మేమా అంటుంది.. కళ్యాణ్ తాతయ్య, నానమ్మల కోసం ఆ మాత్రం చెయ్యలేవా అంటాడు.. దానికి కావ్య కూడా ఏమండి చేద్దాం అండి.. అందరి ముందు బాగోదు అంటుంది.. దానికి సరే అంటాడు రాజ్.. ఇక కళ్యాణ్ ఈ సంతోష సమయంలో ఒక కవిత వదులుతా అంటాడు.. అందరూ షాక్ అవుతారు.. ఇక వేదికను అలంకరిస్తున్న కావ్య, రాజ్ లను చూసి అందరూ తెగ మురిసిపోతారు..ఇక మొత్తం ఏర్పాట్లను రాజ్, కావ్యలు పూర్తి చేస్తారు.. ఇక అప్పుడే రాహుల్ వాళ్ల అమ్మ రాహుల్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం చూసి వస్తుంది.. నేను నిన్ను ఎలా చూడాలనుకుంటున్న కానీ నువ్వు మాత్రం అలా లేవు అంటుంది.. రాజ్ కావ్యాలు ఏ ఫంక్షన్ తో కష్టపడుతున్నారు.. దగ్గరుండి అన్ని చేస్తున్నారు నువ్వు మాత్రం ఇలా అమ్మాయిల ఫోన్లు మాట్లాడుతున్నావు..ఇక లాభం లేదు.. నీకు వెంటనే పెళ్లి చెయ్యాలి.. ఈ ఫంక్షన్ లో నీ పెళ్లి గురించి చెబుతాను అంటుంది.. అది తర్వాత అని రాహుల్ ఫోన్ కట్ చేస్తాడు.. ఇదంతా స్వప్న వింటుంది..

Brahmamudi: అదిరిపోయే ట్విస్ట్.. రాహుల్ బండారం బయట పడుతుందా?
ఇక ఇంద్రాదేవి కనకం కు ఫోన్ చేస్తుంది.. అప్పు ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అంటుంది.. నేను ఇంద్రాదేవిని అంటుంది.. నేను చిరంజీవిని అన్నట్లు చెప్తున్నావు.. మీ అమ్మకు ఇవ్వు అంటుంది.. ఇక కనకం మాట్లాడుతుంది.. ఫంక్షన్ కు రమ్మని చెబుతుంది.. అందరూ ఫంక్షన్ కు రావాలని చెబుతుంది.. ఇక కనకం కృష్ణ మూర్తికి చెప్పి రెడీ అవుతుంది.. అది విన్న స్వప్న రాహుల్ కు ఫోన్ చేసి నేను ఫంక్షన్ కు వస్తున్నా అంటుంది.. నువ్వు వస్తే గొడవలు అవుతాయి అంటాడు.. మా అత్త అస్సలే గొప్ప సంబంధం అంటుంది.. పెళ్లి ఎలా చెబుతుందో.. రాహుల్ గురించి నిజం బయట పెట్టాలి అని రెడీ అవుతుంది.

అందరూ రెడీ అవుతారు.. అప్పుడే స్వప్న కూడా బయటకు వస్తుంది.. నువ్వు వస్తే చెప్పులతో కొడతారు అంటారు.. ఇంట్లో ఉండమని చెప్పి వెళ్తారు.. ఇక రాజ్ నానమ్మ, తాతయ్యల పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.. కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా పెళ్లిని చేసేందుకు రెడీ అవుతారు.. అప్పుడే కావ్య అమ్మాయి, నాన్నలు వస్తారు.. వెనక స్వప్న కూడా వస్తుంది.. తనని చూసిన అపర్ణ ఏమంటుందో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.
