Brahmamudi Serial మే 25th ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకి సరికొత్త మలుపులతో దూసుకుపోతూ 104 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 105 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ 105 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

వెన్నెల జీవితం నాశనం అవుతుంది అని బాధపడుతున్న అపర్ణ:
అపర్ణ తన భర్త దగ్గర మాట్లాడుతూ రాహుల్ మన ఇంటి బిడ్డనే అయ్యినప్పటికీ, అతనికి ఒక్కటి కూడా మంచి బుద్దులు రాలేదు. అలాంటి వ్యక్తికి వెన్నెల ని ఇచ్చి పెళ్లి చేస్తే , రేపు ఏదైనా జరిగితే అరుంధతి నన్ను ఈ జీవితం లో క్షమించదు అని భర్తకి తన మనసులోని బాధని చెప్పుకుంటుంది అపర్ణ. దీనికి భర్త సమాధానం ఇస్తూ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏమి చేయలేము, కేవలం ప్రేక్షక పాత్రని పోషించగలం, ఇది కూడా అంతే అంటాడు. అప్పుడు అపర్ణ నిజమే , రుద్రాణి ఇప్పటికీ నా వల్లే తన జీవితం నాశనం అయ్యింది అని అనుకుంటూ ఉంది, ఇప్పుడు ఈ పెళ్లి చెడిపోతే ఇక జీవితం లో నా మొహం చూడడు అని చెప్పుకొస్తుంది.

Nuvvu Nenu Prema: పద్మావతిని నిలదీసిన విక్కి… కృష్ణ గురించి పద్మావతి విక్కి దేగ్గర చెప్పనుందా….
రాహుల్ బండారం బయటపెట్టడానికి ఇంటికి వచ్చిన శృతి :
మరోపక్క కళ్యాణ్ పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ ని చూసి రాహుల్ కి అందరూ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, చేసిన ప్రతీ ఒక్కరికి అదేమీ కాదు , అలాంటిది ఏమి లేదు అని చెప్పుకుంటూ ఉంటాడు రాహుల్. కళ్యాణ్ ఇది గమనించి కావ్య దగ్గరకి మనం వేసిన ప్లాన్ వల్ల రాహుల్ లో చాలా కోణాలు తెలుస్తున్నాయి. మనం స్వప్న ఒక్కటే అనుకున్నాం, స్వప్న లాగ రాహుల్ బాధితురాళ్లు వరుసపెట్టి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు చూడు అని అంటాడు. ఇక శృతి అనే అమ్మాయి అయితే ఆ పోస్టు చూసి ఏకంగా రాహుల్ ఇంటికి వచ్చేస్తుంది. ఆమెని కావడానికి క్రిందకు వెళ్తాడు రాహుల్. ఏంటి నేరుగా ఇంటికి వచ్చేసావ్ అని శృతి ని అడగగా, ఇంటి బయటకి కాదు, నువ్వు బయటకి రాకపొయ్యుంటే నేరుగా లోపలకి వచ్చేదానిని అంటుంది. ఏమైంది ఇప్పుడు అంటాడు రాహుల్, అప్పుడు ఫేస్ బుక్ లో పెట్టిన ఆ ఫోటోని చూపించి ఏమిటిది అని అంటుంది శృతి. ఇక్కడ కాదా బయటకి వెళ్లి మాట్లాడుకుందాం అని పార్క్ కి తీసుకెళ్తాడు రాహుల్, వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ కావ్య మరియు కళ్యాణ్ కూడా వెళ్తారు.

Brahmamudi: రాహుల్ నిజస్వరూపాన్ని స్వప్న కి చూపించడానికి అదిరిపోయే ప్లాన్ వేసిన కావ్య
గొడవలు చేస్తే చంపేస్తాను అంటూ శృతిని బెదిరించిన రాహుల్
రాహుల్ శృతి తో మాట్లాడుతూ ఏంటి శృతి ఇది నేరుగా ఇంటికి వచేస్తావా? అని అంటాడు, అప్పుడు శృతి దానికి సమాధానం చెప్తూ ఇంటికి కాదు, నాకు వచ్చిన కోపానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లేదానిని అని అంటుంది శృతి. పోలీస్ స్టేషన్ కా?, అంటే నా మీద నమ్మకం లేదా?, నన్ను అనుమానిస్తున్నావా?, వాస్తవానికి ఆ నిశ్చితార్థం ని క్యాన్సిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నీలాంటి అమ్మాయిని అసలు పెళ్లి చేసుకోను, నమ్మకం లేని చోట ప్రేమ అసలు ఉండదు అని అంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశ్యం అని శృతి అడగగా, నువ్వు నాకు అక్కర్లేదు అని అంటాడు.

Krishna Mukunda Murari: మురారి తనతో మాట్లాడిందంతా పథకం ప్రకారమే అని ముకుందా తెలుసుకుంటుందా.!?
శృతి అప్పుడు నన్నే మోసం చేస్తావా అని అడగగా మోసమే చేస్తాను, ఎందుకంటే శృతి నీకంటే అందంగా ఉంటుంది, పైగా బోలెడంత ఆస్తి కూడా ఉంది, అప్పుడు శృతి రాహుల్ చొక్కా పట్టుకొని నిలదీస్తూ నిన్ను ఊరికే వదలను రా అంటుంది, మన మధ్య గొడవలు ఎందుకు నీకు ఒక బిజినెస్ డీల్ చెప్తాను, నీ న్యూస్ ఛానల్ ని డెవలప్ చేస్తాను, పెళ్ళైన కానీ నిన్ను బాగా చూసుకుంటాను అని అంటాడు రాహుల్. అంటే ఏంటిరా నీ ఉద్దేశ్యం, నన్ను పరోక్షంగా ఉంచుకుంటాను అంటున్నావా అని అంటుంది శృతి. అలా కాదు పెళ్ళైన తర్వాత కూడా నీ స్థానం నా మనసులో అలాగే ఉంటుంది అని అంటాడు. అప్పుడు శృతి ఎమోషనల్ ఐపోవడాన్ని చూసి రాహుల్ ఇప్పుడు నువ్వు ఎమోషనల్ అయ్యినంత మాత్రాన ఏమి జరగదు. నేను ఇచ్చిన బిజినెస్ డీల్ గురించి ఆలోచిస్తే నీ జీవితం స్థిరపడుతోంది, లేదా ఇంటికి వచ్చి గొడవ చేస్తాను అంటే నీ న్యూస్ ఛానల్ లో నీ మిస్సింగ్ గురించి స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అని బెదిరించి వెళ్తాడు రాహుల్.

అప్పుడు కావ్య శృతి వద్దకి వచ్చి మీ ప్రేమకి ఎదో ప్రూఫ్ ఉంటుంది కదా, అది మాకు ఇచ్చేసి వేళ్ళు, నీకు న్యాయం జరిగేలా చేస్తాను అంటుంది. అప్పుడు శృతి వాడు చాలా పకడ్బందీగా ఇప్పటి వరకు నాతో ఒక్క ఫోటో కూడా దిగకుండా జాగ్రత్త పడ్డాడు అని అంటుంది, ఎదో ఒక్క ప్రూఫ్ అయినా ఉంటుంది ఆలోచించు అని చెప్పగా , ఏమి గుర్తు రావడం లేదు అని అనగా , కళ్యాణ్ తన విసిటింగ్ కార్డు ఇచ్చి సాయంత్రం లోపు గుర్తు చేసుకొని చెప్పు అంటాడు.