Brahmamudi Serial జూన్ 26th 132 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ విజయవంతంగా 131 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు జరగబొయ్యే ఎపిసోడ్ లో ఏమయ్యిందో ఒకసారి చూద్దాము.

రాహుల్ చెంప పగులగొట్టిన రుద్రాణి :
ఇంట్లో నుండి బయటకి వెళ్లిన రాహుల్, ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎత్తుకోవడం లేదు అనే కోపం తో స్వప్న ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి పంచాయితీ పెడుతుంది. అప్పుడే రాహుల్ ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉన్న పరిస్థితి చూడగానే ఈ రాక్షసి ఎదో రచ్చ చేసింది అని అర్థం చేసుకుంటాడు.లోపాలకి రాగానే ఇంట్లో అందరూ రాహుల్ ని ఎక్కడికి వెళ్ళావు అని అడగడం ప్రారంభిస్తారు. అప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదని ఇంట్లో ఇంత పెద్ద పంచాయితీ పెడుతావా, బుద్ధి ఉందా నీకు అని అంటాడు, అప్పుడు రుద్రాణి రాహుల్ చెంప చెల్లుమనిపించి, అందరి ముందు నా పరువు తీస్తున్నావ్, తల ఎత్తుకోనివ్వకుండా చేస్తున్నావ్, బెడ్ రూమ్ లో ఉండాల్సిన వ్యవహారాలను నీ భార్య ఇక్కడ పంచాయితీ పెట్టింది, ఇంకోసారి ఇలా చేస్తే ఇద్దరినీ ఇంట్లో నుండి తరిమేస్తాను అని రుద్రాణి రాహుల్ కి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.

Nuvvu Nenu Prema: కారులో బ్రేకులు తీసేసిన కృష్ణ.. అరవిందను కాపాడేది ఎవరు?
ధాన్య లక్ష్మి కి దొరికిపోతామేమో అని భయపడిన రాజ్ – కావ్య :
ఇక మరోపక్క కావ్య చాలా ఆలస్యం గా నిద్ర లేస్తుంది. ఎప్పుడూ లేనిది ఇంతసేపు పడుకున్నాను ఏమిటి అని అనుకుంటుంది. అప్పుడే ధాన్య లక్ష్మి కావ్య అని పిలుస్తుంది. ఆమ్మో ఈ బెడ్ ని చిన్న అత్తయ్య చూసింది అంటే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకుంటూ, ఆ బెడ్ ని కప్ బోర్డు లో కుక్కుతూ ఉంటుంది. ఇంతలోపే రాజ్ బాత్ రూమ్ నుండి బయటకి వచ్చి కావ్య ఆలా బెడ్ ని కుక్కడాన్ని చూసి అదేమన్నా చాప అనుకుంటున్నావా, అలా కుక్కుతున్నావ్, క్రింద వెయ్ అని అంటాడు. అవునా సరే వేస్తున్న అయితే అని అంటుంది కావ్య. అప్పుడే ధాన్య లక్ష్మి గొంతు విని, వామ్మో పిన్ని వస్తుంది, ఇది చూసిందంటే ఇక ఏమైనా ఉందా అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య చూడనివ్వులే , నాకు కావాల్సింది కూడా అదే అని అంటుంది కావ్య. టైం చూసి ఆడుకోకు వెంటనే లోపాలకి తొయ్యి అని అంటుంది. వాళ్ళు ఇద్దరు అలా తోసే క్రమం లో ధన్య లక్ష్మి వస్తుంది. ఇద్దరినీ చూసి రొమాన్స్ చేసుకుంటున్నారు అని అనుకోని సిగ్గు పడుతూ వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari : ముకుంద మురారి మీద జలసీతో కృష్ణకి నిజం చెప్పేసిందా..
స్వప్న కడుపు నాటకం మొత్తం బయటపడిందా?:
మరో పక్క తప్పిపోయిన సేటుని ఎతుక్కుంటూ పోలీసులు అందరి ఇళ్ళని తనిఖీ చేస్తూ కనకం ఇంటికి కూడా వస్తారు. అప్పుడు పోలీసులు సేటు తప్పిపోయాడు, అందరి ఇళ్లను వెతుకుతున్నాం, మీ ఇంటికి ఏమైనా వచ్చారా అనగా, కనకం మరియు మీనాక్షి టెన్షన్ పడిపోతారు. ఆ తర్వాత మీనాక్షి పిచ్చి వాగుడు ని తట్టుకోలేక SI కి మెంటలెక్కి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సేటు పోలీసులు కంటపడేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ కుదర్లేదు. మరోపక్క రాహుల్ రుద్రాణి కొట్టిన చెంప దెబ్బని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రుద్రాణి రాహుల్ ని ఓదార్చడానికి వస్తుంది. ఎందుకు వచ్చావు , మళ్ళీ కొట్టడానికా?,ఇంకో చెంప ఖాళీగానే ఉంది, వచ్చి కొట్టు అని అంటాడు.

చిన్న చెంపదెబ్బకే వీక్ అయ్యేలా నిన్ను పెంచలేదు రాహుల్, ఏ సమస్య వచ్చినా ఎదురుకునేలా నిన్ను పెంచాను. ఇప్పుడు స్వప్న మీద అందరూ సానుభూతి చూపిస్తున్నారు, మనం ఏ చిన్న పొరపాటు చేసిన భూతద్దం లో చూసి తప్పుబడుతారు. నువ్వు అలాంటి తప్పులు చేసి మనకి ఉన్న అవకాశాలను చెడగొట్టకు అని అంటుంది రుద్రాణి. ఇక తదుపరి ఎపిసోడ్ ప్రోమో లో స్వప్న బొప్పాయి కాయ తినడం చూసి ఏమి తింటున్నావ్ నువ్వు అని అడుగుతుంది అపర్ణ. బొప్పాయి కాయ తింటున్నా అంటుంది స్వప్న, అప్పుడు కావ్య బుద్ధి ఉందా నీకు, కడుపు తో ఉన్నవాళ్లు బొప్పాయి కాయ తింటే కడుపు పోతుంది అని అంటుంది, అర్జెంటు గా ఇక డాక్టర్ ని పిలవాలి అంటదు రాజ్, మరి రేపటి ఎపిసోడ్ లో స్వప్న బండారం బయటపడుతుందో లేదో చూడాలి.