Brahmamudi Serial జూన్ 27th 133 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ ఎపిసోడ్ టాప్ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తూ ఇప్పుడు 133 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

పప్పాయ తిన్నందుకు స్వప్న ని నిలదీసిన అపర్ణ :
హాల్ లో అందరూ కూర్చొని ఉండగా, స్వప్న పప్పాయ కాయ ని ఒక బౌల్ లో వేసుకొని వచ్చి తింటుంది. అప్పుడే అది చూసిన అపర్ణ, ఏమి తింటున్నావ్ నువ్వు అని అడుగుతుంది. పప్పాయ కాయ తింటున్నాను, ఇది తినడం వల్లే అందరూ నన్ను ఇంత గ్లామర్ గా ఉంటాను అని చెప్తుంటారు.ఇప్పుడు నీ అందం గురించి ఎవరూ మాట్లాడట్లేదు, నువ్వు ఇప్పుడు తినేది ఏంటి?, పప్పాయ యేనా అని అడుగుతుంది అపర్ణ, ఈ సమయం లో ఏమి తినాలో ఏమి తినకూడదు తెలుసుకోలేదా అని ఇంట్లో వాళ్ళు అందరూ స్వప్న ని తిడుతూ ఉంటారు. అసలు ఏమి జరిగిందని అందరూ అలా టెన్షన్ పడుతున్నారు అని స్వప్న అడగగా, అప్పుడు కావ్య పప్పాయ తింటే నీ కడుపు పోతుంది అని బదులిస్తుంది.

Nuvvu Nenu Prema: కారులో బ్రేకులు తీసేసిన కృష్ణ.. అరవిందను కాపాడేది ఎవరు?
డాక్టర్ ని పిలిపించిన రాజ్ :
ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత నీదే రుద్రాణి, నీ కోడలికి నువ్వు చెప్పకపోతే ఇక ఎందుకు అంటూ ఇందిరా దేవి రుద్రాణి ని మందలిస్తుంది. ఇది భలే ఉంది అమ్మా, ఆ అమ్మాయి అలా చేస్తుంది అని నేనేమైన కల కన్నానా? అని అంటుంది రుద్రాణి. ఇంతలోపే రాజ్ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేసి పిలిపించాలి అని అంటాడు.అప్పుడు కావ్య నేను డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తా అని అంటుంది. అప్పుడు రాజ్ హాస్పిటల్ దాకా వెళ్లడం ఎందుకు, డాక్టర్న్ నే ఇక్కడికి పిలిపిద్దాం అని అంటాడు.

ఇక అక్క పని అయిపోయింది, దొరికేస్తాది అని మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య.కాసేపటి తర్వాత కావ్య స్వప్న ని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి, ఇప్పుడే ఉన్న నిజాన్ని చెప్పేస్తే కాస్త పరువు దక్కుతుంది, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొని క్షమిస్తారు, నా మాట విని నిజం చెప్పేయ్ అక్కా అని అంటుంది కావ్య. అప్పుడు స్వప్న నువ్వెంటి నాకు చెప్పేది, ఎప్పుడు ఏది చెయ్యాలో నాకు తెలుసు, నీకు ఇది అనవసరం అని అంటుంది స్వప్న.

Krishna Mukunda Murari : ముకుంద మురారి మీద జలసీతో కృష్ణకి నిజం చెప్పేసిందా..
స్వప్న కి కడుపు లేదనే విషయం తెలుసుకున్న డాక్టర్ :
నాకే అవసరం, నిన్ను గుడ్డిగా నమ్మి ఈ పెళ్లి చేశాను, ఇంట్లో బయటపడిన రోజు నా పరువు కూడా పోతుంది, ఇప్పుడే చెప్పేస్తే ఏ సమస్య ఉండదు అని అంటుంది కావ్య. నాకు తెలుసు నీ ప్లాన్ నన్ను ఇంటి నుండి ఈ విషయం బయటపెట్టి, నన్ను ఇంటి నుండి గెంటేసి నువ్వు ఒక్కటే ఇంట్లో ఏ పోటీ లేకుండా బ్రతకాలని అనుకుంటున్నావు కదా, అది నేను జరగనివ్వను, ఈ సమస్య నుండి ఎదో ఒకటి చేసి నేనే బయటపడుతాను, ఈలోపు నువ్వు నిజం చెప్తే మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. మరో పక్క కిడ్నాప్ చేసిన సేటుతో డీల్ మాట్లాడుకోవడానికి కనకం చూస్తుంది.కానీ సేటు ఒప్పుకోడు, బయటకి వచ్చిన తర్వాత మీ ఇద్దరి అంటూ తేలుస్తా అని మీనాక్షి మరియు కనకం ని బెదిరిస్తాడు. అప్పుడు కనకం సేటు నెత్తి మీద నాలుగు దెబ్బలు వేసి మళ్ళీ బంధించేస్తుంది. మరోపక్క రాజ్ పిలిపించిన డాక్టర్ వచ్చేస్తుంది. అక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది, ఇక రేపటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో స్వప్న కి కడుపు లేదు అనే విషయాన్నీ తెలుసుకుంటుంది డాక్టర్, ఇప్పుడే ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అని చెప్పి బయటకి వస్తుంది, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.