Brahmamudi Serial జూన్ 28th 134 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ‘బ్రహ్మముడి’ సీరియల్ విజయవంతంగా 133 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని నేటితో 134 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Nuvvu Nenu Prema: కృష్ణ నట విశ్వరూపం.. అనుకున్నది సాధించిన కృష్ణ.. ప్రమాదంలో అరవింద..
డాక్టర్ ని బ్లాక్ మెయిల్ చేసిన స్వప్న :
కడుపు తో ఉన్నప్పుడు పప్పాయ తినకూడదు అనే విషయం తెలియక పప్పాయ తినేసి ఇంట్లో అందరినీ కూడా భయపెట్టిన స్వప్న కోసం డాక్టర్ ని పిలిపిస్తాడు రాజ్. డాక్టర్ వచ్చి చెక్ చేసిన తర్వాత అసలు స్వప్న కి కడుపే లేదు అనే విషయాన్నీ తెలుసుకుంటుంది. ఇంట్లో కడుపు అని అబద్దం చెప్తావా..?, నువ్వు నీ కుటుంబాన్ని మోసం చెయ్యొచ్చు కానీ, నేను నా వృత్తిని మోసం చెయ్యలేను అని అంటుంది డాక్టర్. అప్పుడు స్వప్న జరిగిన విషయం మొత్తం చెప్తుంది, తాను ఎందుకు గర్భవతి అయ్యిందో కూడా చెప్తుంది. కానీ డాక్టర్ ఒప్పుకోదు, ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా, నెలలు గడిచే కొద్దీ కచ్చితంగా నీకు కడుపు లేదనే విషయం తెలిసిపోతుంది, అప్పుడు తెలిసేదానికంటే ఇప్పుడు తెలియడమే బెటర్, నేను చెప్పేస్తాను అని అంటుంది డాక్టర్. అప్పుడు స్వప్న అక్కడే ఉన్న కత్తిని తీసుకొని మీరు చెప్తే గొంతు కోసుకొని చస్తాను అని బెదిరిస్తుంది. దీనితో డాక్టర్ కూడా స్వప్న కడుపులో బిడ్డ ఆరోగ్యం గా ఉంది అని ఇంట్లో అబద్దం చెప్పేసి అక్కడి నుండి బయలుదేరుతుంది.

Krishna Mukunda Murari: ముకుంద పంపిన కొరియర్ ను చూసి షాక్ అయినా మురారి.. అసలు అందులో ఏముంది?
ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేసి అవస్థలు పడుతున్న కళ్యాణ్ :
మరోపక్క పాపం కళ్యాణ్ అప్పు దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకొని,శరీర కండరాలు మొత్తం పట్టేసి, నడవలేకపోతుంటాడు. కనీసం ఫోన్ కూడా పైకి లేపలేని పరిస్థితి వస్తుంది. కళ్యాణ్ ఇబ్బంది ని గమనించిన తల్లితండ్రులు ఏమైంది నాన్న అంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నావు అని అడగగా, ఫిట్నెస్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఇలా అయ్యింది అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ తండ్రి ఇప్పటికిప్పుడు ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది రా అని అడగగా, అదేంటి రేపు నా కాబొయ్యే భార్య మీద ఎవరైనా దౌర్జన్యం చెయ్యడానికి వచ్చినప్పుడు నేను కాపాడాలి కదా, అప్పుడు ఈ మాత్రం ఫిట్నెస్ లేకపోతే ఎలా అని అంటాడు కళ్యాణ్. చూసావా అప్పుడే వీడు కాబొయ్యే భార్య గురించి ఆలోచిస్తున్నాడు, ఏరోజైనా మన గురించి ఆలోచించాడా అని అంటాడు నాన్న. అప్పుడు రాహుల్ నేను ఫిటినెస్ గా ఉంటే నా భార్య తో పాటు మిమల్ని కూడా కాపాడుతాను కదా అని అంటాడు కళ్యాణ్. అలా వారి ముగ్గురి మధ్య కాసేపు శారద చర్చ నడుస్తూ ఉంటుంది.

కనకం కిడ్నాప్ నుండి బయటపడిన సేటు :
మరో పక్క కనకం ని తన చేత ఇన్ని తప్పులు చెయ్యిస్తున్నందుకు మీనాక్షి తిడుతూ ఉంటుంది. అవేమి పట్టించుకోకుండా కనకం దర్జాగా కాఫీ తాగుతూ ఉంటుంది. అప్పుడే అప్పు వస్తుంది, సేటుని ఎవరో ఒక ఆడ ఆవిడ కిడ్నాప్ చేసిందట, ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. అది చెప్పగానే కనకం మరియు మీనాక్షి ఉలిక్కిపడుతారు. మీరేంటి ఇంత టెన్షన్ పడుతున్నారు అని అప్పు అంటుంది, అప్పుడు మీనాక్షి టెన్షన్ ఏమి లేదే, ఒక్క ఆడ ఆవిడ ఒక మగవాడిని కిడ్నాప్ చేసిందంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కరు అయ్యుండరు, ఇద్దరు అయ్యుండొచ్చు అని అంటుంది మీనాక్షి.

అలా వీళ్లిద్దరు టెన్షన్ పడుతుంది గమనించి అప్పు అనుమానం పడుతుంది. ఇక మీనాక్షి బెదిరిపోయి సేటు కి కట్లు విప్పేసి బయటకి పంపిస్తుంది. అప్పుడే అప్పు తన నాన్న ని తీసుకొస్తుంది, సేటు ఇంట్లో నుండి బయటకి వెళ్తున్న సమయం లో ఎదురుపడుతాడు. మీరిద్దరూ కంగారు పడింది గమనించే నాన్న ని తీసుకొచ్చాను అంటుంది అప్పు. అప్పుడు జరిగిన విషయం మొత్తం చెప్పగా, కనకం ని మందలిస్తాడు తన భర్త. నా మొహం చూసి ఈ విషయం మర్చిపోండి అని అంటాడు,

కానీ సేటు మాత్రం నేనెందుకు వదుల్తాను, నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ చేసారు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు సేటు. ఇక రేపటి ఎపిసోడ్ లో రాహుల్ ని లొంగతీసుకునేందుకు స్వప్న పాలలో పౌడర్ కలుపుతుంది. అది పొరపాటున కావ్య రాజ్ కి ఇస్తుంది, అది తాగిన రాజ్ మత్తుతో కావ్య రూమ్ లోకి వస్తాడు. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.