Bramhamudi june 3rd 113 వ ఎపిసోడ్ : ఈ వారం బ్రహ్మముడి సీరియల్ మంచి ఉత్కంఠ నడుమ సాగింది.112 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 113 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

Brahmamudi june 2nd Episode : రాహుల్ – స్వప్న పెళ్ళికి ముహూర్తం సిద్ధం చేసిన కుటుంబ సభ్యులు
రాహుల్ – స్వప్న పెళ్లి తేదీని నిశ్చయించిన దుగ్గిరాల కుటుంబం:
రాహుల్ తో స్వప్న పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాజ్ తన అమ్మమ్మ ఇంద్ర దేవి మరియు తాతయ్య కలిసి వస్తాడు. ఆ పెద్దలను చూసి స్వప్న తండ్రి కంటతడి పెట్టుకొని నేను బొమ్మలు అందంగా తయారు చేస్తాను, కానీ మా ఇంట్లో ఉన్న ఈ బొమ్మని సరిగా తయారు చెయ్యలేదు, అది శిధిలంగా మారింది, ఆ శిధిలాన్ని మీ ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకుంటారా అని అడుగుతాడు. తప్పుడు మీ అమ్మాయిది మాత్రమే కాదు, మా ఇంటి అబ్బాయిది కూడా ఉంది, అందుకే న్యాయం చెయ్యడానికి ఇక్కడికి వచ్చాము, వారం రోజుల్లోపు రాహుల్ మరియు స్వప్న ని పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాము, ఆ అభిప్రాయం తెలియచెయ్యడానికే ఈరోజు ఇక్కడికి వచ్చాము అని చెప్పగానే స్వప్న ఆనందం తో అమ్మమ్మ మరియు తాతయ్య ఆశీర్వాదం తీసుకుంటుంది.

రాహుల్ – స్వప్న పెళ్ళికి ఒప్పుకోను అంటూ మొండికేసిన రుద్రాణి:
మరోపక్క దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి మరియు ఆమె కొడుకు రాహుల్ ని ఇంట్లో అందరూ తిడుతూ ఉంటారు. ఇంట్లో అందరి మీద పెత్తనం భలే చేసావు, కానీ నీ కొడుకు ని ఇలాగా పెంచేది? అంటూ రుద్రాణిని తిడుతూ ఉంటారు. ఈలోపు తాతయ్య మరియు అమ్మమ్మ ఇంటికి వస్తారు. రాగానే ముందు విషయం లోకి వెళ్తూ వారం రోజుల్లో రాహుల్ మరియు స్వప్న కి పెళ్లి చేస్తామని స్వప్న ఇంట్లో చెప్పి వచ్చాము అని అంటుంది ఇంద్ర దేవి. దీనికి నేను ఒప్పుకోను అని రుద్రాణి అనగా, అపర్ణ ఎందుకు ఒప్పుకోవు? , నీకొడుకు చిన్నప్పటి నుండి మా అబ్బాయి వస్తువులన్నీ లాగేసాడు, చివరికి వాడు ఇష్టపడి పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని కూడా పెళ్లి పీటల నుండి లేపుకెళ్లాడు. అందుకోసంగా మేము పగ తీర్చుకోవడం లేదు, నీ కొడుకు ఒక అమ్మాయి శీలాన్ని దోచుకున్నాడు, అది నలుగురి మధ్య రుజువు అయ్యింది, అందుకే న్యాయం చేస్తున్నాము, వెళ్లే ముందు అత్తయ్య మామయ్య మా అందరి అభిప్రాయాలను తీసుకొని మేము సమ్మతించిన తర్వాతనే అక్కడి వెళ్లి మాట్లాడారు అని చెప్పుకొస్తుంది అపర్ణ.

Krishna Mukunda Murari: నిజం తెలుసుకున్న రేవతి..బాధపడిన మురారి.. ముకుంద ఏం చేయనుంది…
నీకు ఈ కుటుంబానికి సంబంధం ఏమిటి అని రుద్రాణిని నిలదీసిన అపర్ణ:
అందరూ సమ్మతించారు కానీ, నా అంగీకారం ఇక్కడ ఎవరికీ అవసరం లేదా? అని అంటుంది రుద్రాణి. అప్పుడు కావ్య ఒప్పుకోకపోతే చెప్పండి, మా అక్క చేత రాహుల్ పై పోలీస్ కేసు వెయ్యిస్తాను, సాక్ష్యాధారాలతో రుజువు చేసి జీవితాంతం చిప్ప కూడు తినేలా చేస్తాను అంటుంది కావ్య. అప్పుడు ఇంద్ర దేవి మాట్లాడుతూ ఈ సమస్య కోర్టు దాకా వెళ్ళింది అంటే, దుగ్గిరాల కుటుంబ గౌరవం రోడ్డున పడినట్టే, దుగ్గిరాల కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకు గాను , నిన్ను నీ కొడుకుని శాశ్వతంగా వెలి వెయ్యాల్సి ఉంటుంది. అమ్మ అని పిలిచే నువ్వు, ఇక నుండి అమ్మగారు అని పిలవాలి ఉంటుంది. ఆ స్థాయికి వెళ్తావా, లేదా అత్తగారి స్థానం లో ఉంటావా అని అడుగుతుంది ఇంద్ర దేవి.

అప్పుడు రుద్రాణి నాన్న గారు కావాలంటే ఆ స్వప్న కి అబార్షన్ చేయించి , ఎంతో కొంత డబ్బులిచ్చి పంపేయండి అంటుంది. అప్పుడు కావ్య రుద్రాణి పై అరుస్తుంది, వాళ్లిద్దరూ గొడవలు పడుతున్న సమయం లో రాహుల్ అసలు ఈ గొడవ అంతటికి కారణం ఇదే అంటూ కావ్యపై అరవగా, రాజ్ నా భార్యనే అంటావా రా అంటూ రాహుల్ చెంప పగలగొడుతాడు. ఆ తర్వాత ఏది ఏమైనా కానివ్వండి, నా కొడుకుకి చెల్లెలు వరుస అయినా ఆ స్వప్న తో పెళ్లి చెయ్యడానికి నేను ఒప్పుకొని అంటుంది రుద్రాణి. అప్పుడు అపర్ణ ఈ కుటుంబానికి ఏమి అవుతావు నువ్వు?, ఒక అనాధవి, ఇంటికి తెచ్చుకొని మామయ్య పెంచుకున్నాడు అంటూ రుద్రాణి పరువు తీసేస్తుంది అపర్ణ.ఇక వాదనలు అనవసరం, వారం రోజుల్లో రాహుల్ స్వప్న పెళ్లి, ఇదే నా నిర్ణయం అని చెప్తాడు, ఆ తర్వాతి ఎపిసోడ్ లో ఏమి జరగబోతుంది అనేది తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే.