Brahmamudi may 30th Episode: స్టార్ మా ఛానల్ లో ప్రతీ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ 108 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 109 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ 109 వ ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒక్కసారి చూద్దాం.

కిడ్నాప్ కి గురైన కావ్య ని కాపాడడానికి బయలుదేరిన అప్పు :
కనకం ఇంట్లో స్వప్న నిశ్చితార్థం కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కనకం ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ రుద్రాణి కొడుకు రాహుల్ నిశ్చితార్థం కూడా ఈరోజే అందుకే వాళ్ళు ఇక్కడకి రాలేకపోయారు అని చెప్తుంది. రాహుల్ కి నిశ్చితార్థం అనే విషయాన్నీ కనకం ద్వారా విన్న స్వప్న ఒక్కసారిగా షాక్ కి గురి అవుతుంది. మరో పక్క కావ్య మరియు శృతి ని రాహుల్ ఏర్పాటు చేసిన రౌడీలు కిడ్నాప్ చేస్తారు. సమయానికి రాజ్ ఫోన్ కావ్య బ్యాగ్ లో ఉంటుంది. అందులో నుండి ఫోన్ తీసి అప్పు కి మేము కిడ్నాప్ కి గురి అయ్యాము వచ్చి మమల్ని కాపాడండి అని మెసేజి చేస్తుంది. స్వప్న కోసం కావ్య ఇచ్చిన ఉత్తరం ని స్వప్న కి పంపేసి , కావ్య ని కాపాడడానికి బయలుదేరుతారు అప్పు మరియు కళ్యాణ్.

రాహుల్ నిజస్వరూపం తెలుసుకున్న స్వప్న :
కావ్య రాసిన ఉత్తరం స్వప్న కి చేరుతుంది. ఆ ఉత్తరం ద్వారా స్వప్న రాహుల్ నిజస్వరూపం మొత్తం తెలుసుకుంటుంది. నీలాగా ఎంతో మంది అమ్మాయిలు రాహుల్ ద్వారా మోసపోయారు, నీకు వాడి నిజస్వరూపం తెలియాలంటే ఒక్కసారి మా ఇంటికి రా అన్నీ నీకే అర్థం అవుతుంది అని కావ్య ఆ ఉత్తరం లో రాసి ఉంటుంది.ఆ ఉత్తరం చదివిన తర్వాత నా రాహుల్ నన్ను మోసం చేశాడా?, ఎవరిని నమ్మాలి , ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వడం లేదు, ఏమి చెయ్యాలి ఇప్పుడు అనే సందిగ్ధం లో ఉంటుంది స్వప్న. మరోపక్క పెళ్లి కొడుకు అరుణ్ మరియు అతని కుటుంబ సభ్యులు నిశ్చితార్థం కి వస్తారు, మరోపక్క రాహుల్ నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఇంట్లో అందరూ ఉన్నారు కావ్య ఎక్కడ అని అరుంధతి రాజ్ ని అడుగుతుంది. అప్పుడు రాజ్ నేనే నా ఫోన్ పగిలిపోయింది , రిపేర్ చేయించుకొని రమ్మని కావ్య ని కళ్యాణ్ తో తోడుగా పంపాను అని కవర్ చేస్తాడు ఇంట్లో.

రాహుల్ నిశ్చితార్ధ మండపం లోకి అడుగుపెట్టిన స్వప్న:
స్వప్న ఇంట్లో నిశ్చితార్ధ ముహూర్తం దగ్గర పడుతూ ఉంది, స్వప్న కి ఈ సమయం లో రాహుల్ ఇంటికి ఎలా వెళ్ళాలి, బయటకి అడుగు పెడితే అమ్మ చంపేస్తుంది అని భయపడుతూ ఉంటుంది. మరోపక్క రాజ్ కావ్య ఎక్కడ ఉంది అని టెన్షన్ పడుతూ , తన ఫోన్ కావ్య దగ్గర ఉంది కనుక వేరే నెంబర్ నుండి కాల్ చేస్తాడు. కిడ్నాపర్లు ఫోన్ రింగ్ అవ్వడాన్ని గమనించి కావ్య దగ్గర నుండి లాగేసుకొని స్విచ్ ఆఫ్ చేస్తారు.

రాజ్ కావ్య ఏమైందో అని కంగారు పడుతూ ఉండగా, అప్పు కావ్య మరియు శృతి ని కిడ్నాప్ చేసిన చోటుకి వచ్చి , కిడ్నాపర్లును చితకబాది కావ్య మరియు శృతి ని విడిపిస్తుంది. అప్పు కి వెంటనే స్వప్న ని మా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పి, కావ్య మరియు శృతి అక్కడి నుండి వెళ్ళిపోతారు.ఇక రేపటి ఎపిసోడ్ లో స్వప్న ని కావ్య రాహుల్ నిశ్చితార్ధ మండపం కి తీసుకొస్తుంది. అప్పుడు స్వప్న అందరి ముందు నేను రాజ్ తో పెళ్లి జరుగుతున్న సమయం లో లేచిపోలేదు, ఈ రాహుల్ లేవదీసుకొని వెళ్ళాడు అని చెప్తుంది.తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే!.