Brahmamudi: గుడికి నువ్వు రానని తాతయ్య వాళ్ళతో చెప్పమని రాజ్ కావ్యను అడుగుతాడు. నేను చెప్పను. నేను కూడా మీతో పాటు గుడికి వస్తాను అని కావ్య అంటుంది. నువ్వు ఎక్కడ తగిలావే నాకు అని రాజ్ అనగానే.. ఓ అశుభ గడియలలలో నా మెడలో మూడు ముళ్ళు వేసినప్పుడు మీకు భార్యగా వచ్చాను అని కావ్య అంటుంది. నేను మీతో పాటు గుడికి వస్తున్నాను. ఈ విషయంలో ఆ అమ్మవారు కూడా నన్ను ఆపలేదు అని కావ్య అంటుంది.

కనకం తన అక్కతో కలిసి గుడికి వెళుతుంది. స్వప్న తల్లికి దగ్గర అవడం కోసం.. అమ్మవారి గెటప్ లో బాల అని పిలుస్తుంది.. నీ పెద్ద కూతురు ఈ అమ్మవారు నీకు ప్రసాదించిన వరం అని అంటుండగా.. కనకం కి కోపం వచ్చి పూనకంతో ఊగిపోతూ.. తన గురించి నా దగ్గర మాట్లాడొద్దు అమ్మ.. అది నా కడుపున పుట్టిన నష్టజాతకురాలు. తన జీవితం బాగుండాలని మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాను. కానీ తన జీవితాన్ని తన చేతులారా తనని నాశనం చేసుకుంది అని కనకం పూనకంతో ఊగిపోతుంది. ఇంకోసారి నా కళ్ళ ఎదురుగా అని కనిపిస్తే చంపేస్తాను అని అంటుంది.

ఇక ఆ సమస్య తేలిపోగానే ఇద్దరు కలిసి గుడి ప్రదక్షిణాలు చేద్దామని అనుకుంటున్న వాళ్లకి.. కూతురు కావ్య అల్లుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి అదే గుడికి వస్తారు. దాంతో అక్కడి నుంచి తప్పించుకుని వాళ్ళిద్దరూ చేస్తున్న పనులన్నింటినీ దగ్గరుండి చాటుగా చూస్తూ ఉంటుంది.

గుడిలోకి రాగానే పంతులుగారు ఇద్దరికీ బ్రహ్మముడివేసి ప్రదక్షిణాలు చేయమని చెబుతాడు. రాజ్ స్పీడ్ స్పీడ్ గా నడుస్తూ కావ్యను హడావుడి చేస్తూ ఉంటాడు. అందుకు కోపం వచ్చినా కావ్య కాలు బెణికింది అని నాటకం ఆడుతుంది. అప్పుడు పంతులుగారు ప్రదక్షిణలు మధ్యలో ఆపాల్సిన పనిలేదు నీ భార్యను ఎత్తుకొని కూడా ప్రదక్షిణలు చేయొచ్చు అని సలహా ఇస్తారు.

ఇక రేపటి ఎపిసోడ్లో పంతులుగారు ఇచ్చిన ప్రసాదాన్ని నువ్వు తినమని కావ్య రాజకీస్తుంది. రాజ్ కావ్యకి ఇస్తారు ఇద్దరు అలా చూపించుకోవడమేనా ఒకరికి ఒకరు తినిపించుకోండి అని వాళ్ళ నాన్నమ్మ తాత చెబుతారు . ప్రసాదం వాళ్ళిద్దరూ తినిపించుకొని ఎక్కడ దగ్గరవుతారో అని కంగారు పడ్డ స్వప్న జై భవాని అంటూ వాళ్ళిద్దరి మధ్య నుంచి వెళ్తూ ఆ ప్రసాదాన్ని కింద పడేస్తుంది..