Brahmamudi Serial జూలై 4th 139 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ విజయవంతంగా అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో నడుస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ ఇప్పటి వరకు 138 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని ఇప్పుడు 139 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

డిజైన్స్ సిద్ధం కాలేదని టెన్షన్ పడుతున్న రాజ్ :
అమెరికా నుండి క్లైంట్స్ వచేసేలోపు రాజ్ ఇంకా తన స్టాఫ్ డిజైన్స్ సిద్ధం చెయ్యలేదని టెన్షన్ పడుతూ వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు. అరగంట డిజైన్స్ సిద్ధం చెయ్యండి, ఈలోపు నేను వాళ్ళని మాటల్లో పెట్టి మ్యానేజ్ చేస్తాను అని లోపలకు వెళ్తాడు. అక్కడ క్లైంట్స్ తో మా డిజైనర్ ఇంకా ఆఫీస్ కి చేరుకోలేదు, ట్రాఫిక్ లో ఇరుక్కుంది, ఒక అరగంట వెయిట్ చేస్తారా అని అడుగుతాడు. దీనికెందుకు ఇంత మొహమాటం పడుతున్నారు, ఎం పర్వాలేదు, ఎదురు చూస్తాము. ఈలోపు మాకు ఇరానీ చాయ్ తెప్పించండి అని అంటారు.

Krishna Mukunda Murari: మురారి ప్రేమించిన అమ్మాయి ముకుందేనని రేవతి ద్వారా తెలుసుకున్న కృష్ణ..
వాళ్లకు ఇరానీ చాయ్ తెప్పించి రాజ్ తన క్యాబిన్ లోకి వెళ్లి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ ని గమనించి మీరేదో ఆఫీస్ కి వచ్చి ప్రశాంతం గా పని చేసుకుంటున్నారు అని అనుకున్నాను, కానీ ఇంత టెన్షన్ పడుతారని అనుకోలేదు. ఇకమీదట మీరు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను మిమల్ని విసిగించను అని అంటుంది. అప్పుడు రాజ్ మాట్లాడుతూ తాతయ్య హయాం లో ఉన్న ఉద్యోగులు ఎంతో మంచి అనుభవం ఉన్న వాళ్ళు, ఏ డిజైన్ అయినా క్షణాల్లో తయారు చేసి ఇచ్చే వాళ్ళు. కానీ ఇక్కడ ఈ యంగ్ జనరేషన్ స్టాఫ్ మొత్తం బాధ్యతారాహిత్యం గా వ్యవహరిస్తున్నారు , వేస్ట్ ఫెలోస్ అంటూ రాజ్ తిడుతాడు. దీనికి కావ్య మీరు ఉదయం కూడా ఏమి తినలేదు, ఇప్పుడు ఏమైనా తింటారా అని అడుగుతుంది. అప్పుడు రాజ్ ఈ టెన్షన్ లో నాకు తినాలని అనిపించడం లేదు, నీకు తినాలని అనిపిస్తే తిను అంటాడు.

Nuvvu Nenu Prema: కృష్ణ మీద విక్కీకి అనుమానం.. అను మీద కుచల కోపం..
అప్పు ని అరెస్ట్ చేసిన పోలీసులు:
మరోపక్క అప్పు రాకేష్ తల ని బ్యాట్ తో పగలగొట్టినందుకు గాను పోలీసులు అరెస్ట్ చెయ్యడానికి ఇంటికి వస్తారు. అప్పుడు పోలీసులను కనకం మరియు ఆమె భర్త మా అప్పు ని వదిలేయండి అని బ్రతిమిలాడుతారు. మీ అమ్మాయి మీద రాకేష్ తల్లితండ్రులు హత్యాప్రయత్నం కేసు ని పెట్టారు, ఆ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నాడు, ఏమి కాకూడని కోరుకోండి, ఏదైనా అయితే మాత్రం ఆ మీ అమ్మాయికి 14 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది అని అంటాడు పోలీస్. మీరు ఏమి టెన్షన్ పడకండి అమ్మా, తప్పు జరిగిపోయింది , శిక్ష అనుభవించి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పు, ఆ తర్వాత కనకం మరియు ఆమె భర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి తమ కూతుర్ని విడిచిపెట్టండి అంటూ బ్రతిమిలాడుతారు. కానీ పోలీసులు మీరు రూల్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు, కాసేపటి తర్వాత మా SI వస్తాడు, కావాలంటే ఆయనతో మాట్లాడుకోండి అంటాడు.

కావ్య తెచ్చిన డిజైన్స్ ని చింపేసిన రాజ్ :
మరో పక్క రాజ్ టెన్షన్ పడడం ని చూసి కావ్య డిజైన్స్ తయారు చేసి రాజ్ వద్దకి తీసుకెళ్తుంది. అప్పుడు రాజ్ ఆ డిజైన్స్ ని కూడా చూడకుండా చించి అవతల వేసి, ఇదేమైనా ముగ్గుల పోటీ అనుకుంటున్నావా?, అవతల నేను టెన్షన్ తో చస్తుంటే , నువ్వు నీ ప్రయోగాలు ఏంటి, వెళ్లి మూలాన కూర్చో అని అంటాడు. అప్పుడు ఆ కంపెనీ లో పనిచేసే డిజైనర్ కావ్య ని చూసి బాధపడుతుండగా, నేను డిజైన్స్ స్కాన్ చేసి మెయిల్ లో పెట్టాను, అవి తీసుకెళ్లి చూపించు అంటుంది కావ్య. శృతి అవి తీసికెళ్ళి రాజ్ కి చూపించగా ఎంతో బాహున్నాయి అని అభినందిస్తాడు, క్లైంట్స్ కూడా అందరూ శృతి ని మెచ్చుకుంటారు.