Brahmamudi Serial జూలై 5th 140 ఎపిసోడ్: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్ విజయవంతంగా అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దోసుకుపోతూ 139 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకొని 140 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 140 వ ఎపిసోడ్ లో ఏమి జరింగిందో ఒకసారి చూద్దాము.

అప్పు ని జైలు నుండి విడిపించడానికి వచ్చిన మీనాక్షి :
అప్పు కోసం పోలీస్ స్టేషన్ లోనే మకాం వేస్తారు అప్పు తల్లిదండ్రులు. అప్పు అరెస్ట్ అయ్యిందనే విషయం తెలుసుకొని మీనాక్షి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. దీనమైన స్థితిలో కూర్చున్న కనకం మరియు ఆమె భర్త ని చూసి ఎలా అయినా అప్పు ని విడిపిస్తాను అని లోపలకు వెళ్తుంది. లోపలకు వెళ్లిన తర్వాత ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పోలీస్ కి చిరాకు రప్పిస్తుంది. మర్యాదగా బయటకి వెళ్లకపోతే మీ అప్పు తో పాటు నిన్ను కూడా జైలు లోకి తోస్తామని అంటాడు ఎస్ ఐ.ఆ తర్వాత కనకం వచ్చి మీనాక్షి బలవంతంగా బయటకి తీసుకెళ్తుంది.

Nuvvu Nenu Prema మే 20 ఎపిసోడ్ : అరవింద్ ను చంపటానికి రెడీ అయిన కృష్ణ.. అరవింద్ ను కాపాడేదెవరు?
రాజ్ మీద కోపం తో ఆటో లో వెళ్లిపోయిన కావ్య :
మరోపక్క రాజ్ క్లైంట్స్ తమ డిజైన్స్ నచ్చడం తో చాలా సంతోషం గా ఉంటాడు. అప్పుడు కావ్య శ్రీవారు చాలా ఆనందంగా ఉన్నట్టు ఉన్నారు అని అడగగా, చిరాకు మొహం తో అంత డీల్ సెట్ అయితే ఆనందం వెయ్యకుండా బాధ వేస్తుందా అని అంటాడు. అప్పుడు కావ్య కనీసం ఆ ఆనందాన్ని అయినా సంతోషం గా పంచుకోవచ్చు కదా, నా మొహం చూసి చిరాకు అవుతారు ఎందుకు అని అంటుంది కావ్య. నీ మొహం అలాగే ఉందిమరి, వెళ్లి మీ అమ్మని అడుగు ఎందుకు నన్ను ఇలా కన్నావు అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య ఇందాక మీ ఆఫీస్ స్టాఫ్ మొత్తం నేను అందంగా ఉన్నాను అంటూ పొగిడారు అని అనగా, నిన్ను ఎంత పొగిడినా జీతాలు ఏమి పెంచరు అని చెప్పకపోయావా అని అంటాడు రాజ్, అయితే జీతాలు ఇచ్చినోడిని ఎందుకు పొగడరో అని అంటుంది కావ్య .

Krishna Mukunda Murari : ముకుంద మురారి మీద జలసీతో కృష్ణకి నిజం చెప్పేసిందా..
రాజ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లిన కావ్య :
అప్పుడు రాజ్ వెదవ సోది ఆపి నిన్న రాత్రి ఏమి జరిగిందో చెప్పు అంటాడు, నేను చెప్పను అని అంటుంది కావ్య, అప్పుడు రాజ్ ఆఫీస్ కి తీసుకొస్తే చెప్తా అన్నావ్ కదా అని అంటాడు, మాట తప్పాను అయితే ఏంటి ఇప్పుడు అని అంటుంది కావ్య, అది నీకు అలవాటే కదా అని అంటాడు రాజ్. అప్పుడు కావ్య స్వప్న అక్క విషయం లో రాహుల్ తప్పు ఉందని తెలిస్తే భార్య గా అంగీకరిస్తాము అని మాట ఇచ్చి , తప్పింది ఎవరో అని అంటుంది కావ్య. అవును నేను మాట తప్పాను, కానీ నీలాగా ఎప్పుడూ మోసం చెయ్యలేదు, పద ఇంటికి అని అంటాడు.

ఆ తర్వాత స్పీడ్ గా నడుస్తున్న కావ్య ని చూసి, నువ్వు ఎంత ఫాస్ట్ గా నడిచినా కార్ నాది, నేనే తియ్యాలి అని అంటాడు రాజ్, కార్ మీదని ఫోజు కొడుతున్నారా..?, మీ కార్ లేకపోతే నేను ఆటో లో రాలేనా అని చెప్పి ఆటో వెళ్తుంది కావ్య. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వంట విషయం లో వీళ్లిద్దరి మధ్య గిల్లి కజ్జాలు మొదలవుతాయి.

కావ్య చేసిన వంటని తినకుండా అప్పుడే వచ్చిన బిచ్చగాడికి ఆ వంట మొత్తాన్ని దానం చేస్తాడు రాజ్. ఇక రేపటి ఎపిసోడ్ లో శ్వాస అందక ఇబ్బంది పడుతున్న రాజ్ ని హాస్పిటల్ కి స్కూటీ మీద తీసుకెళ్తుంది కావ్య, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.