Brahmamudi: ఇంటికి తీసుకువస్తూనే గుమ్మంలోనే తనని విసిరి నేలకు కొడతాడు. ఏమైంది అలా చేస్తున్నావో అని అందరూ రాసి నిలదీస్తుండగా.. అసలు తిను ఏం చేసిందో మీకు తెలిస్తే ఊరుకోరు అంటూ స్వప్న హోటల్ ఉందని.. నేను వెతకడానికి వెళ్లాను కదా.. ఈలోపే తను అక్కడికి వచ్చి స్వప్నను తప్పించింది అంటూ తనమీద నిందలు వేస్తాడు. స్వప్న తప్పిపోలేదు కళావతినే తప్పించింది. తిను మాత్రమే కాదు వీల్ల ఇంట్లో వాళ్ళందరూ కూడా పెద్ద దొంగలు అంటూ లేనిపోని ఆ బాండాలన్నీ కళావతిపై రాజు వేస్తాడు.

అసలు మా మీద నీకు ఇంత కోపం వచ్చింది కళావతి రాశి నిలదీస్తుంది . అందుకు రాజ్ కోపంతో ఊగిపోతూ స్వప్నను అక్కడి నుంచి తప్పించింది నువ్వే కదా అని నిలదీస్తాడు.. అసలు నేను హోటల్లో లోపలికి వచ్చాను లోపలికి వచ్చి స్వప్న ఎక్కడ ఉంది అని ఎంక్వైరీ చేస్తుండగానే తను లేదు అని సమాధానం చెప్పేలోపే ఇదంతా జరిగిపోయింది.. ఆ విషయం నీకు కూడా తెలుసు అయితే మరి నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు అని రాజ్ కళావతిని నిలదీస్తాడు.. ఎందుకు వచ్చానంటే నీకోసమే వచ్చాను నేను ఈ ఇంటి కుటుంబం పరువు కాపాడడం కోసం అక్కడికి వచ్చాను అని కళావతి అంటుంది.

మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటి పరువు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే నేను అక్కడికి వచ్చాను అని కళావతి అంటుంది. అంతేకాకుండా దుగ్గిరాల వారసుడు రోడ్డుకి పది మంది ముందు ఒక అమ్మాయిని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా. అందరూ మీతో పాటు మీ ఇంటి పరువు కూడా పోతుంది అలా పరువు పోకూడదని నేను అక్కడికి వచ్చాను. నేను అక్కడికి వచ్చి ఆపకపోతే మీరు ఆ స్వప్న మీద విరుచుకుపడేవాళ్లు ఆ స్వప్న గురించి ఆడ తీసి తను మిమ్మల్ని వద్దనుకుని వెళ్లిపోయిన అమ్మాయి అని తెలిస్తే పోయేది మీ పరువే అంటూ కళావతి హితబోధ చేస్తుంది కోపం ఆలోచనని అంతం చేస్తుంది. వివేకం విచక్షణ విజ్ఞత అన్నింటినీ సమూలం చేస్తుంది.
కళావతి వాళ్ళింట్లో వాళ్ళు కళావతి లేక ఇక్కట్లు పడుతూ ఉన్నారు. తను చేసే బొమ్మలుకి బోలెడంత గిరాకీ ఉండేదని ఇప్పుడు తను లేకపోవడంతో ఆ గిరాకీ కూడా పోయి ఆర్డర్లు తగ్గడంతో పాటు చేసిన ఆర్డర్ కి కూడా తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు. మరోవైపు స్వప్న బయట కూర్చుని ఉంటుంది ఆకలితో నకనకలు అడుగుతున్న ఆమెకు పంతులు వచ్చి ఓ చిన్న కప్పు ప్రసాదం ఇస్తాడు. ఆ ప్రసాదం తినగానే నేను కూడా ఎంగిలాకులా అయిపోయాను అని ఆలోచిస్తూ వెంటనే రాహుల్ కి ఫోన్ చేస్తుంది ఇక రాహుల్ ఎలాగైనా స్వప్నని కంట్రోల్ చేసి తప్పించుకుంటాడు
ఇక రేపటి ఎపిసోడ్ లో కళావతి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడడానికి రాజ్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు కానీ రాజు అందుకు ఒప్పుకు పోగా తననే వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్తాను అని అందరి ముందు చెబుతాడు. ఆ నిర్ణయానికి కళావతి ఆనందంతో పొంగిపోతుంది..