NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Serial జూన్ 6th 115 ఎపిసోడ్: మరోసారి స్వప్న ని ఏమారుస్తున్న రాహుల్..పెళ్లి నుండి తప్పించుకున్నాడా?

Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights

Brahmamudi Serial జూన్ 6th 115 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఇప్పుడు ప్రతీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో ఒకసారి చూద్దాము.

Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights
Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights

స్వప్న ఇంటికి వచ్చిన రాహుల్ :

కనకం వంట చెయ్యడానికి కాకరకాయలు కోస్తూ, స్వప్న – రాహుల్ పెళ్లి ఎప్పుడు చెయ్యాలో దిగ్గిరాల వారిని అడగడానికి ఏదోలా ఉంది అంటూ తన అక్కతో అంటుంది. దీనికి నువ్వు అడగడం ఎందుకు నీ కూతురు కావ్య చేత అడిగించొచ్చు కదా అంటుంది కనకం వాళ్ళ అక్క. ఇంతలోపే రాహుల్ కనకం ఇంటికి వస్తాడు.ఇతను ఏంటి ఇక్కడ అని ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అవుతారు. ఇంట్లోకి రాగానే నన్ను క్షమించండి ఆంటీ అని కనకం ని కోరుతాడు. అప్పు రాహుల్ మీద సెటైర్లు విసురుతుండగా, కనకం ఇంటికి వచ్చిన అబ్బాయితో ఇలాగేనా ప్రవర్తించేది అని అప్పుని మందలిస్తుంది. ఆ తర్వాత స్వప్న ని కలవడానికి ఆమె గదిలోకి వెళ్తాడు రాహుల్.

Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights
Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights

పూజాగదిలోకి వచ్చి పూజ చేసిన కావ్య :

మరో పక్క దుగ్గిరాల కుటుంబం లో కావ్య వంట చేస్తూ ఉన్న సమయం ధాన్య లక్ష్మి అక్కడికి వచ్చి నువ్వు పూజ చెయ్యాలి అని పూజగదికి తీసుకెళ్తుంది. అప్పుడు అపర్ణ ఈ ఇంటి కోడలిగా మొదటి నుండి నేనే పూజలు చేస్తున్నాను, కొత్తగా ఈమె చెయ్యడం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు ధాన్య లక్ష్మి మాట్లాడుతూ ఈ ఇంటి కోడలిగా కావ్య కి పూజ చేసే అర్హత ఉంది. తన తప్పు ఏమి లేదు, జరిగిందంతా రుద్రాణి కొడుకు కారణంగా అని తెలిసి కూడా ఇంకా కావ్యని దూరం పెట్టడం ఏమిటి అని అపర్ణ ని ప్రశ్నించి కావ్య చేత పూజ చేయిస్తుంది ధాన్య లక్ష్మి. పూజ చేసి తిరిగి వెళ్తున్న కావ్యని వెనక్కి పిలిచి, నువ్వు వంట గదిలోకి, పూజ గదిలోకి అడుగుపెట్టినంత మాత్రానా ఈ ఇంటి కోడలివి అయిపోవు. నేను నిన్ను కోడలిగా ఎప్పటికీ ఒప్పుకోను అని అంటుంది. పూజ గదిలోకి , వంట గదిలోకి , మీ అబ్బాయి గదిలోకి మీకు ఇష్టమయ్యే అడుగుపెట్టానా?, ఎదో ఒకరోజు మీరే స్వయంగా నన్ను కోడలిగా స్వీకరిస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights
Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights

పెళ్లి అయ్యాక ఇంటి నుండి వెళ్లిపోదాము అని స్వప్న తో అన్న రాహుల్ :

మరో పక్క రాహుల్ స్వప్న దగ్గర మరో నాటకానికి శ్రీకారం చుడుతాడు. స్వప్న రాహుల్ ని పెళ్లి చేసుకోవాలని ఆశపడేది ఆస్తి కోసమే అనే విషయం అందరికీ తెలిసిందే. రాహుల్ సరిగ్గా గురి చూసి అక్కడే కొడుతాడు, మనం పెళ్లి చేసుకున్నాక ఇంటి నుండి వెళ్ళిపోదాం అని అంటాడు.

Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights
Brahmamudi Serial 6 June 2023 today 115 episode highlights

ఇప్పటికే ఇంట్లో ఈ విషయం గురించి చెప్పేసానని, మీ అక్క కావ్య వల్లే ఇదంతా జరుగుతుందని రాహుల్ అంటాడు. స్వప్న ఏమిటి రాహుల్ ఇలా మాట్లాడుతున్నాడు, నేను ఆ ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళందరిని నా గుప్పిట్లో పెట్టుకొని ఆడియ్యాలి, రాహుల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అయినా తన మైండ్ ని మార్చాలి అని అనుకుంటుంది స్వప్న. ఇంటి నుండి వెళ్ళిపోయాము అంటే ఇప్పుడు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావో నేను కూడా చూస్తా అని అనుకుంటాడు రాహుల్. ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంద్రాణి ఇంటికి వచ్చిన స్వప్న కుటుంబాన్ని అవమానిస్తుంది. ఈ అలగా జనం తో నేను వియ్యం అందుకోవాలా?, నేను చీటింగ్ కేసు పెడతాను అంటుంది రుద్రాణి. ముసుగేసి కావ్య ని తనకి ఇచ్చి పెళ్లి చేసినందుకు నేను కూడా చీటింగ్ కేసు పెడుతా మీ మీద అంటాడు రాజ్. తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu