Brahmamudi Serial జూన్ 7 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఆద్యంతం ఉత్కంఠ భరింతంగా సాగుతూ ఇప్పుడు 116 ఎపిసోడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు సీరియస్ గా సాగిన ఈ సీరియల్ ఈరోజు మాత్రం సగం సీరియల్ వరకు సరదాగా సాగిపోయింది.
సంబరాల్లో కనకం :
ఒక పక్క కనకం తన బిడ్డ స్వప్న ని రాహుల్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు సంబరపడిపోతూ ఉంటుంది. పెళ్లి కి ఒప్పుకున్నాడు సరే, పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు?, ఆలస్యం చేస్తే బంగారం ధర పెరిగినట్టుగా, స్వప్న కడుపు పెరుగుతూ పోతుంది. అలా కడుపుతో ఉండగా పెళ్లి చేసుకుంటే అసహ్యంగా ఉంటుంది అంటూ కనకం రెండవ అక్క చెప్తుంది. అప్పుడు కనకం ఏమి చేయమంటావు అక్కా, ఏ మొహం పెట్టుకొని వాళ్ళని పెళ్లి ఎప్పుడు అని అడగమంటావ్ అని అంటుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయం లో ధాన్య లక్ష్మి ఫోన్ చేసి, పెళ్ళికి ముహూర్తం పెట్టడానికి పంతులుని పిలిపిస్తున్నాము, వెంటనే రెడీ అయ్యి ఇంటికి వచ్చేయండి అని ఫోన్ చేస్తుంది. దీనితో కనకం ఎంతో సంబరపడుతూ ఇంట్లో అందరినీ గట్టిగ పిలిచి ఈ శుభవార్తని చెప్తుంది.
కబడ్డీ ఆటలో ఓడిపోయిన అప్పు :
మరో పక్క అప్పు మగవాళ్ళతో కలిసి కబడ్డీ ఆట ఆడుతూ ఉంటుంది, అప్పుని కలవడానికి వచ్చిన కళ్యాణ్ ఆమెని చూసి షాక్ కి గురై , ఇదేంటి మా వాళ్ళు చేసిన అవమానం కి ఏ చెట్టు క్రింద కూర్చొని బాధపడుతూ ఉంటుంది, వచ్చి ఓదారుద్దాం అనుకుంటే మగరాయుడిలాగా కబడ్డీ ఆడుతుంది అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. అప్పు టీం లో అందరూ అవుట్ అయిపోయాక, కేవలం ఒక్క ఆటగాడు మిగులుతాడు. అతని అక్క గారికి యాక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ కాల్ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన కళ్యాణ్ ని చూసి, అతని బదులు కళ్యాణ్ ఆడుతాడు అని అంటుంది అప్పు. అసలు ఆడడమే చేత కానీ కళ్యాణ్, నేను ఆడలేను అని మారం చెయ్యగా, అతనిని బలవంతంగా కబడ్డీ కోర్టులోకి తోస్తుంది. కళ్యాణ్ అవుట్ అయిపోతాడు, ఒక్కరిని కూడా అవుట్ చెయ్యలేకపోయావ్ అని అప్పు కళ్యాణ్ ని తిడుతుంది.
కనకం కుటుంబాన్ని అవమానించిన రుద్రాణి :
మరోపక్క దుగ్గిరాల ఇంటికి కనకం కుటుంబం మొత్తం వస్తుంది, గుమ్మం వరకు వచ్చి గతం లో అపర్ణ ‘ఏ మొహం పెట్టుకొని ఈ ఇంటి గడప తొక్కారు’ అన్న మాటలను గుర్తు చేసుకొని ఆగిపోతుంది. అప్పుడు అపర్ణ ని తన భర్త ‘నువ్వే పోయినసారి కనకం గారిని అవమానించావు, ఇప్పుడు వెళ్లి నువ్వే ఆహ్వానించు’ అని అంటాడు. అప్పుడు అపర్ణ తప్పు చేసింది రుద్రాణి కొడుకు, వెళ్లి రుద్రాణి ఆహ్వానిస్తేనే బాగుంటుంది అని అంటుంది. అప్పుడు రుద్రాణి వెళ్లి కనకం కుటుంబాన్ని అయిష్టంగానే ఆహ్వానిస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే రుద్రాణి కనకం కుటుంబాన్ని సూటిపోటి మాటలతో అవమానిస్తూ ఉంటుంది.
నీ కూతుర్లను మా ఇంట్లో ఉన్న మగవాళ్ల మీదకి భలే తోసావు, పైసా కట్నం ఇచ్చే అవసరం లేకుండా భలే ప్లాన్ చేసావు, చిన్న అమ్మాయి మా రాజ్ ని పట్టేసింది, పెద్ద అమ్మాయి నా కొడుకు రాహుల్ ని పట్టింది, ఇంకో అమ్మాయి మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది, మా కళ్యాణ్ ని చేసుకోమనండి అంటుంది. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో రాహుల్ స్వప్న ని కిడ్నాప్ చేయించే ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరగబోతుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!