Brahmamudi 197 ఎపిసోడ్: తాతయ్య సీతారామయ్య దగ్గుతో ఇబ్బంది పడుతూ నెలకి ఒరిగిపోతుండడం చూసిన రాజ్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సీతారామయ్య కి మంచి నీళ్లు ఇస్తాడు. ఆ తర్వాత చూసుకోవాలి కదా తాతయ్య,మందులు తీసుకొని వస్తాను అంటాడు. ఆ మందులు వేసుకున్నంత మాత్రాన నా ఆయుష్షు ఎమన్నా పెరిగిపోతుందా, రోజులు పెంచుకోవడమే కదా, ఇందువల్ల ఏమి ఉపయోగం లేదు అంటాడు.

రాజ్ ని హెచ్చరించిన సీతారామయ్య :
ఈ విషయం ఎట్టి పరిస్థితిలో చిట్టి కి తెలియనివ్వకు, ఆమె తట్టుకోలేదు అని అంటాడు. ఇక ఆ తర్వాత రాజ్ ని సీతారామయ్య ఒక ప్రశ్న అడుగుతూ నువ్వు కావ్య తో నిజంగానే ప్రేమగా ఉంటున్నావా, లేదా నా సంతోషం కోసం నటిస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు రాజ్ అలాంటిది ఏమి లేదు తాతయ్య, కావ్య పై మొదట్లో కాస్త అయిష్టంగా ఉన్న విషయం వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడే నా ప్రేమని ఆమెకి అర్థం అయ్యేలా చేస్తున్నాను అంటాడు. ఎప్పుడైనా ఇలాంటి బంధాలలో నిజాయితీ గా ఉండు, అబద్దపు ప్రేమ ఒలకబోస్తే ఎదో ఒక రోజు నువ్వు కావ్య కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు.

అనామిక తో ఫోన్ లో ముచ్చట్లు ఆడుతున్న కళ్యాణ్ :
మరోపక్క డిన్నర్ సమయం లో కావ్య మీద రాజ్ విపరీతమైన ప్రేమ చూపించడం ని గమర్శించిన ఇందిరా దేవి కావ్యకి మల్లెపూలు ఇచ్చి, పాల గ్లాస్ తో గదిలోకి పంపుతుంది. కానీ రాజ్ మాత్రం కంట్రోల్ గా ఉంటాడు. ఇక కళ్యాణ్ అనామిక ఫోటో చూస్తూ మీ ఇంట్లో వాళ్లకి నన్నునేరుగా పరిచయం చేసావ్ అంటే, నీకు నేను అంటే ఎంత స్పెషల్ అనేది అర్థం అవుతుంది, నీకు కూడా నేను అంటే ఇష్టం ఉందా, నా మనసులో ఉన్న ప్రేమ నీకు ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. దీనికి అప్పు ని సలహా అడుగుదాం అని కాల్ చేస్తాడు, అప్పు తో మాట్లాడుతున్న టైం లోనే అనామిక ఫోన్ చేస్తుంది. వెంటనే అప్పు కాల్ ని కట్ చేసి అనామిక తో మాట్లాడుతూ ఉంటాడు. నా పని చెడగొట్టి నువ్వు వేరే వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటావా, మళ్ళీ బ్రో అని నాకే కాల్ చేస్తావ్ కదా, అప్పుడు చెప్తా నీ పని అని మనసులో అనుకుంటుంది అప్పు.

కావ్యకి నెక్లెస్ బహుమతిగా ఇచ్చిన రాజ్:
ఇది ఇలా ఉండగా కనకం రోడ్ మీద వెళ్తున్నప్పుడు రాహుల్ కార్ లో వెళ్లడాన్ని గమనిస్తుంది. వెంటనే రుద్రాణి కి ఫోన్ చేసి మీ అబ్బాయి కార్ లో వెళ్తున్నాడు, అతనితో స్వప్న లేదేంటి అని కంగారు గా అడుగుతుంది. అప్పుడు రుద్రాణి వీడొక్కడు చాలు, నన్ను రోడ్డు మీదకి తీసుకొని రావడానికి అని మనసులో తిట్టుకుంటుంది. ఆ తర్వాత కనకం తో మాట్లాడుతూ మా అబ్బాయి రోడ్డు మీద కనిపించడం ఏమిటండి, ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో అని అంటుంది. అప్పుడు కనకం లేదండి, నేను నా కళ్ళతో చూసాను అని అనగా , రాహుల్ హైదరాబాద్ లో ఉండే ఛాన్స్ లేదు, నిన్ననే స్వప్న తో కలిసి వీడియో కాల్ కూడా చేసాడు నాకు అని అంటుంది.

ఇదంతా మీకు తెలియదా, పెళ్ళైన తర్వాత మీ కూతురు మిమల్ని పూర్తిగా వదిలేసిందా అని అంటుంది రుద్రాణి, అప్పుడు కనకం దానిని కవర్ చేసుకునేందుకు లేదండి ప్రతీ రోజు నా కూతురు మాట్లాడుతుంది. నిన్న కూడా ఊటీ లో ఉన్నట్టుగా ఫోన్ చేసింది అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ కాలం లో అబ్బాయిలంతా ఒకే రకంగా గడ్డం పెంచుకొని తిరుగుతూ ఉన్నారు కనిపెట్టడం కష్టం అయిపోతుంది అని అనుకుంటుంది. మరోపక్క కావ్య కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి పూజ చేస్తుంది, అందుకు ఎంతో సంతోషించిన రాజ్ కావ్య కి నెక్లెస్ బహుమతిగా ఇస్తాడు.