Brahmamudi: స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా రంగరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇందులో ప్రధాన పాత్రలో కార్తీకదీపం సీరియల్ డాక్టర్ సాబ్ మానస్ నాగులపల్లి హీరోగా నటిస్తుండగా.. ఆయనకు జోడిగా దీపిక రంగరాజు నటిస్తోంది. మోడల్ గా, నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె 1996లో చెన్నైలో జన్మించి..

అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. మొదటిసారి 2019 లో తమిళ చిత్రం ఆరడి అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత తమిళ సీరియల్ చితిరం పెసుతడి అనే సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై కూడా అడుగు పెట్టింది.

ఇక తొలిసారి తెలుగులో బ్రహ్మముడి అనే సీరియల్ ద్వారా ఇక్కడ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ అయిన గట్చోరా కి రీమేక్. ఒకప్పుడు తమిళ సినిమాలతో భారీగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గర అయిందని చెప్పాలి . ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్న దీపిక నిత్యం ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది .

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో ఒక స్టేటస్ స్టోరీ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక స్టోరీలో ఏం పెట్టింది అంటే.. “ఎదుటివారు మిమ్మల్ని జడ్జ్ చేసిన పర్వాలేదు. మీ గురించి గాసిప్స్ క్రియేట్ చేసినా పర్వాలేదు.. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా పర్వాలేదు.. ముఖ్యంగా వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే అది మీ సమస్య కాదు.. మీరు మాత్రం దయతో ఉండండి..

ప్రేమకు కట్టుబడి ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండండి..” అంటూ చెబుతూ కింద మిధున రాశిని సర్కిల్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే రూమర్స్ కి , గాసిప్స్ కి తాను తలవంచను అంటూ డైరెక్ట్ గానే విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.