NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi November 14 episode 253: కళ్యాణ్ తో అనామిక పెళ్లి ఫిక్స్.. పైకి చెప్పలేని అప్పు బాధ.. రాజ్ కి ఐ లవ్ యు చెప్పిన కావ్య..

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Share

BrahmaMudi November 14 episode 253:  నిన్నటి ఎపిసోడ్ లో, రుద్రాణి సీతారామయ్య గారు రాసిన వీలునామా చదివి, షాక్ అవుతుంది కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆస్తి వాళ్ళ పేరు మీద రాయినందుకు చాలా ఫీల్ అవుతారు. ఏదో ఒకటి చేసి ఆస్తిని సీతారామయ్య గారి దగ్గర నుండి రాయించుకోవాలి అని అనుకుంటారు. అపర్ణ ఇంట్లో అందరికీ సీతారామయ్య గారి ఆరోగ్యం బాగు చేయడానికి డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ డాక్టర్ గారిని రాజ్ ఇంటికి తీసుకువస్తాడు. ఆయన ఉమ్మడి కుటుంబం వల్లే మీరు ఇంకా ఇలా సంతోషంగా ఉన్నారు మీ కుటుంబం ఎప్పుడు ఇలా కలిసి ఉంటే మీ ఆరోగ్యం తొందరగా నయమవుతుంది దానికి నేను హామీ ఇస్తున్నాను అన్నట్టు చెప్తాడు డాక్టర్ గారు. ఇక డాక్టర్ గారు చెప్పిన మాటలు విని ఇంట్లో అందరూ సంతోషిస్తారు.

Nuvvu Nenu Prema: విక్కీ ఆరోగ్యం గురించి అరవింద కంగారు.. విక్కీ ప్రేమ కోసం పద్మావతి చేసిన ప్రయత్నం.

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Brahmamudi Serial today episode 14 November 2023 episode 253 highlights

ఈరోజు 253 వ ఎపిసోడ్ లో డాక్టర్ గారు సీతారామయ్య గారు ఫ్యామిలీతో మాట్లాడి ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఆయన అని జాగ్రత్తగా చూసుకోండి. ఆయన ట్రీట్మెంట్ నేనిస్తాను అని హామీ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక డాక్టర్ గారు వెళ్లిన తర్వాత సీతారామయ్య గారు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా చిట్టి అని అంటాడు. ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది బావ అని అంటుంది. నన్ను బావ అని పిలిచే వాళ్ళు ఇక ఎవరుంటారు చిట్టి నువ్వు తప్ప, పైకి వెళ్ళినా కానీ అక్కడ రంభ ఊర్వసులు తాతగారు అని అంటారు కానీ బావ అని పిలవరు కదా అని జోక్ వేస్తాడు సీతారామయ్య. దానికి ఇంట్లో అందరూ నవ్వుతారు రుద్రాణి,రాహుల్ మాత్రం ఫేస్ లో ఏ ఫీలింగ్స్ లేకుండా అట్లానే ఉంటారు. ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు ఈ టైంలోనే ఇక నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు సీతారామయ్య ఏంటో చెప్పమని అంటుంది. ఇక ఇప్పుడు మనం జరిగిన దాని గురించి మర్చిపోదాము ఏవో పొరపాట్ల వల్ల అలా జరిగాయి ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా ఉండాలి ఈ సమయంలో ఒక శుభకార్యం జరిపించాలి అని అంటాడు.

Gunde Ninda Gudigantalu november 13 2023 episode 31: బాలు జాతకం ప్రకారం బాలుని దూరం పెట్టిన తల్లి ప్రభావతి బాలు గురించి నిజం తెలుసుకుని తనని దగ్గరికి తీసుకుంటుందా లేదా రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Brahmamudi Serial today episode 14 November 2023 episode 253 highlights

తల్లికి ఫోన్ చేసిన కావ్య..

ఇప్పుడు శుభకార్యం ఏం చేస్తాం బావ అని, సరే మన కళ్యాణ్ కి పెళ్లి అని అనుకున్నాం కదా అదేదో ఇప్పుడే జరిపించేదం అని అంటుంది ఇందిరాదేవి. అందరూ సరే అంటారు కళ్యాణ్ సిగ్గుపడతాడు. ఇక సీతారామయ్య గారి ఆరోగ్యం, బాగు చేయడానికి అమెరికా నుంచి డాక్టర్ వచ్చిన విషయం కావ్య తల్లికి ఫోన్ చేసి చెప్తుంది. ఇక అప్పు వాళ్ల పెద్దమ్మ దగ్గర భోజనం చేస్తూ ఉంటుంది అప్పుడే కనకం ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కనకం ఏంటో చెప్పమ్మా అని అంటుంది. సీతారామయ్య గారిని చూడడానికి డాక్టర్ గారు అమెరికా నుంచి వచ్చారు అని చెప్తుంది కావ్య దానికి చాలా సంతోషపడతారు ఇంట్లో వాళ్ళు అప్పు మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా అలానే ఉంటుంది వెంటనే కనకం దీని మొహంలో ఏ ఫీలింగు రావట్లేదు, దీనికి ఏం పుట్టింది అని తిడుతుంది. ఇక అదే టైం కి అప్పు ఫోన్ కి రింగ్ వస్తుంది. చూస్తే కళ్యాణ్ అని పేరు ఉంటుంది వెంటనే వాళ్ళ పెద్దమ్మకి చూపిస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కళ్యాణ్ అప్పు ఫోన్ లిఫ్ట్ చేయదు దాంతో ఎవరు అని బలవంతంగా కనకం ఫోన్ చూస్తుంది. కళ్యాణ్ ఫోను అప్పు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, లిఫ్ట్ చేయమని బలవంతంగా చెప్తుంది కనుక దాంతో చేసేది లేక అప్పు కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. నిన్ను కలవాలని ఉంది లొకేషన్ పంపిస్తున్నాను ఇప్పుడే రా అని అంటాడు కళ్యాణ్ అప్పుతో కానీ నేను రాను అని అప్పు బదిలిస్తుంది. ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళమని కనకం అప్పు కి చెప్తుంది. ఇక సరే అంటుంది అప్పు.

Krishna Mukunda Murari: కృష్ణ, మురారిని రేవతి దగ్గర అడ్డంగా బుక్ చేసిన ముకుందా.. కృష్ణ రింగ్ ఇచ్చేస్తుందా.!?

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Brahmamudi Serial today episode 14 November 2023 episode 253 highlights

రాజ్ సంతోషం.. కావ్య చాలెంజ్..

ఇక సీతారామయ్య గారు సేఫ్ అని తెలియడంతో రాజ్ చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది ఆమె వచ్చి రావడంతోనే నా ఆనందాన్ని చెడగొట్టడానికి ఇక్కడికి వచ్చావా అని అంటాడు రాజ్, మీరు చాలా సంతోషంగా ఉన్నారని అర్థమవుతుంది అని అంటుంది కావ్య నానందాన్ని పరాయి వాళ్ళతో పంచుకొను అని అంటాడు రాజ్. నేను మీరు తాళి కట్టిన భార్యని నేనేం పరాయిదాన్ని కాదు అని అంటుంది కావ్య. కట్టుకోవడం ఆకట్టుకోవడం మీ అక్క చెల్లెలకు తెలిసిన పనే కదా అని అంటాడు రాజ్. ఎప్పుడూ మా అక్క చెల్లెల్ని అండమేనా మీ పని అక్కడ దానిని ఇక్కడ నన్ను రోలు మధ్యల లాగా వాయిస్తూనే ఉన్నారు దానికి వాళ్ళ అత్త భర్త చాలు, ప్రతిసారి తిట్టడానికి ఇక్కడ మీరు అని అంటుంది కావ్య. ఎన్ని మాటలు అంటే మాత్రం ఏం లాభం మీరు చేయాలనుకున్నది చేస్తారు కదా అని అంటాడు రాజ్. అయినా మీ అక్క చెల్లెలు ఆడిన బొమ్మలాట దాగుడుమూతలు ఆట ముందు అన్ని బలాదూరే అని అంటాడు రాజ్. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ టైంలో మీరు ఇలా ఉండడం కన్నా మనం సంతోషంగా ఉంటే తాతయ్య గారు ఇంకా ఆనందంగా ఫీల్ అవుతారు అని అంటుంది కావ్య. ఓహో ఇప్పుడు ఈ వంక పెట్టుకొని నాతో కలిసి పోవాలని చూస్తున్నావా అని అంటాడు రాజ్. సీతారామయ్యగారి సంతోషంగా ఉండాలంటే మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి వాళ్ల ముందు ఆనందంగా కనిపించాలి, మనం ప్రేమించుకోవాలి అని అంటుంది కావ్య. ప్రేమ అని నవ్వుతాడు రాజ్. నేనేం కాని మాటలు లేదే అని అంటుంది కావ్య వెంటనే రాజు కోపంగా సెటప్ అని అరుస్తాడు. కుటుంబమంతా సంతోషంగా ఉంటే ఇప్పుడు మనం ఇలా ఉంటే ఎలాగు అని అంటుంది మా కుటుంబంలో నువ్వు లేవు అని అంటాడు. ఆ మాటకు కావ్యకి చాలా కోపం వస్తుంది.

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Brahmamudi Serial today episode 14 November 2023 episode 253 highlights

రాజ్ కి ఐ లవ్ యు చెప్పిన కావ్య..

ఇక కావ్య రాజుతో అసలు మీ సమస్య ఏంటండీ అని అంటుంది. నువ్వే నా సమస్య అని అంటాడు రాజ్. సరే ఏం చేస్తే ఈ సమస్య సమస్య పోతుంది అని అంటుంది కావ్య. నువ్వు దూరంగా ఉంటే నాకే సమస్య రాదు అని అంటాడు. అది నావల్ల కాదు అని అంటుంది కావ్య. నావల్ల అవుతుంది అని అంటాడు రాజ్. అయినా సరే నావల్ల కాదు ఏమండీ మీరు నేను కలిసి పోతేనే మనోవ్యాధి తాతయ్య గారిది నయమవుతుందని చెప్తే అర్థం కాదా అని అంటుంది కావ్య. నీలాగా అద్భుతంగా అందరి ముందు నటించడం నాకు రాదు అని అంటాడు. మీరు మీ కుటుంబం కోసం తాతయ్య గారి ఆరోగ్యం కోసం నాతో నటించారు. నేను మా అక్క కోసం మా అక్క గురించి తెలిసిన నటించాను. ఇందులో ఇద్దరు తప్పు ఉంది. నాది నాటకం అయితే మీది నాటకమే నాది మోసం అయితే మీది మోసమే, ఇద్దరం చెరువు అబద్దాన్ని నిజంగా మార్చి అమాయకుల దిరిగాం. బయటపడిన తర్వాత నేనే మిమ్మల్ని దోషాలా చూడలేదే మీరు ఎందుకు నన్ను దోషి లా చూస్తున్నారు. అవును నేను నటించాను కావాలంటే మళ్లీ నటిస్తాను అయినా నీతో కలిసి ఉండాలంటే నాకు ఇష్టం లేదు భార్యగా నిన్ను ఎప్పటికీ నిన్ను ఒప్పుకోను అని అంటాడు. అయితే ఇప్పుడు మీతో పాటు నన్ను కూడా నటించమని చెప్తున్నారా అని అంటుంది. నువ్వుంటే ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఈ ముఖంతోనే ఇక్కడ తిరగాలనుకుంటే, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నేను పట్టించుకోను అని అంటాడు. ఎలా ఉంటాను, మీరు నన్ను ప్రేమగా చూసుకుంటేనే కదా నేను తాతయ్య గారి ముందు సంతోషంగా తిరిగేది అని అంటుంది. ప్రేమ అనే పదానికి, మనిద్దరి మధ్య ఎప్పటికి స్థానం ఉండదు. ఇన్నాళ్లు ఒక భయంకరమైన నిజాన్ని లోపల దాచుకొని పైకి మహానటిలో నటించావు కదా, ఇకముందు కూడా అలానే నటించు అని అంటాడు. నేను నటించడం మొదలు పెడితే అది నిజం కాదని ఎవరు కనిపెట్టలేరు అని అంటుంది కావ్య. అది నాకే చెప్తున్నావా అని నవ్వుతాడు, నీ వండర్ఫుల్ టాలెంట్ గురించి నాకు తెలుసు కదా అని అంటాడు రాజ్. మీకు కావాల్సింది నటనే కదా అంటుంది అవును తాతయ్య గారి కోసం నేను అదే చేస్తాను అంటాడు రాజ్. అయితే ఇప్పటినుంచి నేను నటిస్తాను, నేను నటించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో మీకు తెలియాలి తెలుస్తుంది అని ఛాలెంజ్ చేస్తుంది కావ్య. అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి రాజు వైపు చూస్తుంది. ఏవండీ అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి ఐ లవ్ యు అని అంటుంది ఇదంతా కూడా నటనే నండి అని అంటుంది ఇది టైటిలే ముందు ముందు అసలు సినిమా అని చెప్పేసి వెళ్ళిపోతుంది.

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Brahmamudi Serial today episode 14 November 2023 episode 253 highlights

రాహుల్, రుద్రాణి ప్లాన్..

ఇక స్వప్నని చూస్తూ రాహుల్ గతంలో స్వప్న అన్న మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి రుద్రాణి వస్తుంది. బాగుందిరా ఒకవైపు నేను ఆశ దక్కాలని ఫీల్ అవుతూ ఉంటే నువ్వేమో నీ భార్యని తదేకంగా చూస్తూ మురిసిపోతున్నావా అని అంటుంది. మురిసిపోవట్లేదు మమ్మీ ఆలోచిస్తున్నాను అని అంటాడు. నీ కోడల్ని ఇంట్లో నుంచి ఎలా తరిమేయాలి అని ఆలోచిస్తున్నాను అని అంటాడు. నీకు ఒక దండం పెడతాను స్వామి ఇప్పటికే మన మీద ఇంట్లో అందరూ కోపంగా ఉన్నారు నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేసి దొరికిపోమాకు అని అంటుంది రుద్రాణి. ఈసారి మాత్రం నా పొజిషన్లో స్వప్న ఉంటుంది మమ్మీ నువ్వు కంగారు పడకు అని అంటాడు. నీ మీద నాకు నమ్మకం పోయింది అలాంటివన్నీ ఏం చేయకు అని అంటుంది రుద్రణి. తాతయ్య మనకి ఆస్తి రాయడానికి చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు ఆస్తి దక్కదని తెలిసిపోవడంతో మరో దారిలో కోటీశ్వరులు కావాలి అని అంటాడు రాహుల్. స్వప్న అడ్డు తొలగించుకొని మరో పెళ్లి చేసుకుంటే అది సాధ్యమైపోతుంది కదా మమ్మీ అని అంటాడు రాహుల్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. నీ కోడల్ని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే నువ్వు ఇంకొకటీశ్వరులని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అని ఫిక్స్ అయిపో నేను అలానే చేస్తాను అని అంటాడు. ఎలా చేస్తావు అని అంటుంది రుద్రాణి. లాంగ్ లాంగ్ అగొ సో లాంగ్ ఎగో స్వప్నకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అవును మమ్మీ నువ్వు విన్నది నిజమే కాలేజ్ డేస్ లో మన స్వప్న వెనక ఒకటి పడ్డాడు. కోరింది కొనిచ్చాడు అడిగింది అడ్డు చెప్పకుండా కొనిచ్చాడు చివరికి ప్రేమ అనేసరికి నో నో నేను కేవలం ఒక ఫ్రెండ్ లానే చూసాను అని చెప్పి సైడ్ చేసేసింది నీ కోడలు. వాడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా స్వప్న ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ పెళ్లి పీటల వరకు తీసుకొచ్చాడు. చివరికి స్వప్న పెళ్లి ఆపేసిందనుకో అని అంటాడు. ఇది ఈ రోజుల్లో చాలామంది చేసే పనే కదా, దీనిలో తప్పు పెట్టి బయటకు పంపించడానికి ఏముంది అని అంటుంది రుద్రాణి. పెళ్లికి ముందు చేస్తే తప్పులేదు మమ్మీ పెళ్లి తర్వాత చేస్తే తప్పే కదా అని అంటాడు రాహుల్. పెళ్లయిన తర్వాత కూడా ఆ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉంటే, వాట్ స్వప్న ఇంకా వాడితో మాట్లాడుతుందా దీన్ని అని రుద్రాణి స్వప్న మీదకి వెళుతుంది అంతలో రాహుల్ పక్కకు పిలిచి ఆపుతాడు. మమ్మీ లేదు మమ్మీ ఇప్పుడు స్వప్న వాడితో అసలు మాట్లాడట్లేదు కానీ వాడితో మనం పెళ్లి తర్వాత కూడా రిలేషన్ లో ఉంది అని ఇంట్లో వాళ్ళని నమ్మించావే అనుకో, అప్పుడు ఇంట్లో వాళ్ళే స్వప్నని బయటికి గెంటేస్తారు. నువ్వు చెప్పింది బానే ఉంది కానీ వాడు, మనకెందుకు సహాయం చేస్తాడు. వాడు డాక్టర్ వాడు సొంతగా హాస్పిటల్ పెట్టడానికి పర్మిషన్స్ కోసం ఇబ్బందులు పడుతున్నాడు వాడికి మనం సహాయం చేస్తే వాడు మనకు సహాయం చేస్తాడు అని అంటాడు రాహుల్. ప్లాన్ చాలా బాగుంది. ఇంట్లో అందరిని నమ్మించాలంటే చాలా కష్టమవుతుంది మనం చెప్తే అస్సలు నమ్మరు. కాబట్టి ముందు రాజ్ కి మా వదినకి అనుమానం వచ్చేలా చేయాలి. అందరి ముందు ఒకేసారి బయట పెడతాను. ముందు ఈ ఇంట్లో రాజు మీ అత్తయ్య నమ్మితే ఆ తర్వాత మనం ఏం చెప్పినా వాళ్లే మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ తర్వాత ఇంట్లో అందరినీ నమ్మించొచ్చు అని అంటుంది రుద్రాణి. ఇంట్లో ఇంతమంది కావ్యని స్వప్నని ఎంత తప్పు చేసినా వాళ్ళు వదిలేశారు. అది మీ తాతయ్య గారి కోసం, ఈసారి మాత్రం స్వప్న ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా గట్టిగా ప్లాన్ చెయ్యి అని అంటుంది రుద్రాణి.

Brahmamudi Serial today episode  14 November 2023 episode  253 highlights
Brahmamudi Serial today episode 14 November 2023 episode 253 highlights
అప్పు బాధ.. కోపం..

ఇక అప్పు నీ కళ్యాణ్ ఒకచోట కలవాలని చెప్పడంతో అప్పు అక్కడికి వస్తుంది అప్పుడే అక్కడికి అనామిక కూడా వస్తుంది ఇద్దరినీ కళ్యాణి పిలుస్తాడు. కళ్యాణ్ మీద ఎప్పుడూ అప్పు కోపంతో ఫైర్ అవుతూ ఉంటుంది తనముందే అప్పు కళ్యాణ్తో గొడవపడడం అనామిక చూడలేక పోతుంది. ఇక అప్పు ఎందుకు పిలిచావో చెప్తావా చెప్పవా అని అంటుంది కళ్యాణ్తో ఇంట్లో వాళ్ళు మా పెళ్లి ఫిక్స్ చేశారు అది చెప్పడానికే పిలిచాను అని అంటాడు కళ్యాణ్. వెంటనే అనామిక చాలా సంతోషిస్తుంది. ఆ మాటకి కళ్యాణి హత్య చేసుకొని తన సంతోషాన్ని తెలుపుతుంది అక్కడే ఉన్న అప్పు చాలా కోపంతో చాలా బాధగా ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా ఉండడం చూసి అప్పు తట్టుకోలేక పోతుంది వాళ్ళ పెళ్లి కబురు విని అప్పు షాక్ అవుతుంది.

రేపటి ఎపిసోడ్ లో, హాల్లో ఒక బోర్డు మీద సారి కళావతి అని రాసి ఉంటుంది. ధాన్యలక్ష్మి, ఇంట్లో వాళ్ళు ఆ బోర్డు చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రాజ్ వస్తాడు. ఏమైంది ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతాడు ఒకసారి ఇటు చూడు అని అంటుంది. రుద్రాణి ఏముంది అని అంటాడు రాజ్ తమరు చేసిన నిర్వాకం అని అంటుంది రుద్రాణి. రాజ్ బోర్డు మీద ఉన్నది చదువుతాడు సారీ కళావతి ఇందులో ఏముంది అని, తర్వాత తేరుకొని షాక్ అవుతాడు. రాజ్ నువ్వు కాఫీ కి సారీ చెప్పాలనుకుంటే ఇలా బోర్డు మీద రాయడం ఎందుకు నీ దుర్గనే ఉంది కదా నువ్వు సారీ చెప్పొచ్చు అని అంటుంది దాన్యలక్ష్మి. అపర్ణ చాలా కోపంగా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. కావ్య రాజ్ ని చూసి నవ్వుతుంది.


Share

Related posts

Krishnamma Kalipindhi iddarini: సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తున్న హీరో ఈశ్వర్

bharani jella

చాలా హ్యాపీగా ఉంది.. విడాకుల తర్వాత లైఫ్‌పై చైతు కామెంట్స్ వైర‌ల్‌!

kavya N

SIIMA 2022: సాయి పల్లవికి ఇవ్వాల్సిన అవార్డు పూజా హెగ్డేకి ఇచ్చారా..? సైమా అవార్డు ప్రకటనపై సీరియస్ వ్యాఖ్యలు..!!

sekhar