BrahmaMudi:నిన్నటి ఎపిసోడ్ లో, సీతారామయ్యని చెక్ చేసిన డాక్టర్ గారు ఉమ్మడి కుటుంబం ఇలా ఉండడం వల్లే ఆయన ఆరోగ్యం బాగుంది మీరు ఎప్పుడు ఇలా కలిసే ఉండాలి అని చెప్పేసి ఆయనకు నయం చేసే బాధ్యత నాది అని ఇంట్లో వాళ్లకి గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోతాడు. సీతారామయ్య ఈ ఆనందం ఇలానే కొనసాగాలంటే మన ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి అని అంటాడు కళ్యాణ్ పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఈ విషయం తెలిసి అప్పు చాలా బాధపడుతుంది. రాహుల్ రుద్రాణి కలిసి స్వప్నని ఏదో ఒక విధంగా ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మాస్టర్ ప్లాన్ వేస్తారు. అప్పు ముందే కళ్యాణ్ అనామికతో క్లోజ్ గా ఉంటాడు. అది చూసి అప్పు చాలా బాధపడుతుంది.
ఈరోజు254 వ ఎపిసోడ్ లో, కళ్యాణ్ పెళ్లి గురించి, అనామికకు చెప్పగానే అనామిక చాలా సంతోషించి కళ్యాణి హగ్ చేసుకుంటుంది. అక్కడే ఉన్న అప్పు చూసి చాలా బాధపడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం ఇప్పుడే మా నాన్నకి చెప్పాలి అని అంటుంది. ఇప్పుడెందుకు ఇంటికి వెళ్లి చెబుదువు గాని విలే అని అంటాడు కళ్యాణ్. లేదు ఇప్పుడే చెప్పాలి అని పక్కకు వెళ్తుంది అనామిక ఫోన్ తీసుకొని, కళ్యాణ్ చూశావా బ్రో తను కూడా నీలానే నువ్వేమో కోపం వస్తే ఆగలేవు తను సంతోషం వస్తే ఆగలేదు అని మాట కంప్లీట్ అయ్యే లోపు పక్కకు తిరిగితే అక్కడ అప్పు ఉండదు. ఎక్కడికి వెళ్లిందా అని కళ్యాణ్ చూస్తూ ఉంటాడు అప్పు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది వెనకనుంచి కళ్యాణ్ చూస్తాడు. కళ్యాణ్ పిలుస్తాడు అప్పు ఆగకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది తనకి ఇంత మంచి న్యూస్ చెప్తే ఎలా వెళ్ళిపోయింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పు ఎక్కడ అని అనామిక వచ్చి అడుగుతుంది వెళ్ళిపోయింది అని చెప్తాడు కళ్యాణ్. నీకంటే పనే ముఖ్యమ తనకి అని అంటుంది అనామిక అదే తెలుసుకుంటాలే అని అంటాడు కళ్యాణ్.

రాహుల్ డెవిల్ ప్లాన్..
ఇక రాహుల్ శేఖర్ ని పిలిచి బెదిరిస్తూ ఉంటాడు. నీకు నా భార్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతాడు దానికి శేఖర్ చాలా కంగారు పడతాడు. తను నా కాలేజీలో ఫ్రెండ్ అంతే అని అంటాడు శేఖర్. అవునా కాలేజీలో మీ మధ్య ఏం జరగలేదా అని అంటాడు రాహుల్. నా మాటలకి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శేఖర్ ఊరికే జోక్ చేశాను లే అని వెంటనే రాహుల్ నవ్వుతాడు. చాలా కంగారు పడ్డాను సార్ అని అంటాడు శేఖర్ సరే నువ్వు హాస్పిటల్ పెట్టడానికి పర్మిషన్స్ కోసం వెతుకుతున్నావు కదా ఆ పని నేను చేసి పెడతాను అని అంటాడు. అవునా నా పని మీరు చేస్తారా అయితే మీకు బదులుగా నేనేం చేయాలి అని అంటాడు. అయిపోతావ్ బిజినెస్ మాన్ అయిపోతావ్ నీకు ఆ లక్షణాలన్నీ చాలా ఉన్నాయి అని అంటాడు రాహుల్ అయితే నేనేం చేయాలో చెప్పలేదు అని అంటాడు శేఖర్. చాలా సింపుల్ నువ్వు నా భార్యతో రిలేషన్ పెట్టుకోవాలి అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటాడు పెట్టుకోవాలి అన్నాను అంటే నిజంగా పెట్టుకోమని కాదు పెట్టుకున్నట్టు నటించాలి నువ్వు అని అంటాడు. తేడా వస్తే మీ వాళ్ళందరూ కలిసి నన్ను జైల్లో పెడతారు సార్ అని అంటాడు. అక్కడిదాకా రానివ్వను నేనున్నాను కదా అన్ని చూసుకోవడానికి అని అంటాడు

కళావతి నాటకం మొదలు..
ధాన్య లక్ష్మీ ఇంట్లో బోర్డు చూపిస్తుంది అపర్ణకు ఏంటది అని అడుగుతుంది మీరే చూడండి అని అంటుంది. ఆ బోర్డు మీద సారి కళావతి అని రాసి ఉంటుంది. వెంటనే అందరికీ అర్థం అయిపోతుంది రాజ్ బోర్డు మీద కావ్య కి సారీ చెప్పడానికి అలా రాశాడు అని, ఇదంతా పైనుండి కావ్య చూస్తూ నాటకం నేను మొదలు పెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు అని అనుకుంటుంది. అక్కడికి వచ్చిన రుద్రాణి ఇలా బోర్డు మీద రాసి సారీ చెప్పకపోతే ఏమైంది అని అంటుంది. అక్కడే ఉన్న ఇందిరా దేవి, తప్పు చేయడంఅందరికీ తెలుసు కానీ, నలుగురిలో సారీ చెప్పడం నా మనవడికే కుదురుతుంది అని మాట్లాడుతుంది. ఈ రాజ్ ఏ చేసినా గాని వీళ్ళు పొగుడుతుంటారు అదే నా కొడుకు చేస్తే మాత్రం అన్ని తప్పు పడతారు అని అనుకుంటుంది. ఇక కావ్య జాగింగ్ కని వెళ్లిన వాళ్లు ఇంకా రాలేదేంటి అని రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆయన వచ్చేలోపు మనం వెళ్లి నాటకం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుంది. ఏమీ తెలియనట్టు అందరి ముందుకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. నీకేం తెలీదా అని అంటుంది రుద్రాణి. మీ గురించి నాకు తెలుసులే కానీ ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏముంది అని అంటుంది కావ్య నా గురించి కాదు ఈ బోర్డు గురించి అని అంటుంది రుద్రాణి. బోడ అని ఏమీ తెలియనట్టు కావ్య బోర్డు వైపు చూసి సారీ కళావతి అని రాసి ఉంటుంది ఎవరు రాశారు అని అంటుంది కళావతి ఏమీ తెలియనట్టు. వెంటనే ధాన్యలక్ష్మి ఇంకెవరు నిన్ను కళావతి అని ప్రేమగా పిలుస్తారు ఇంట్లో నీ భర్త మాత్రమే కదా రాజ్ రాసి ఉంటాడు అని అంటుంది. రాజ్ కి ఇలాంటివి పబ్లిక్ గా చెప్పడం ఇష్టం ఉండదు అని అంటుంది రుద్రాణి. నువ్వు గాని కావాలని చేయించావా అని అంటుంది. అయ్యో నేనెందుకు చేయిస్తాను నా మాట అసలు వినడు అని అంటుంది కళావతి. ఇంతకీ ఇంత ఘనకార్యం చేసిన నీ భర్త ఎక్కడ అని అడుగుతారు.

బోర్డు చూసి షాక్ అయినా రాజ్..
ఇక అందరూ రాజ్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ అప్పుడే జాగింగ్ కంప్లీట్ చేసుకుని వస్తాడు. ఏంటి అందరూ పొద్దున్నే మీటింగ్ పెట్టారు అని అంటాడు. నువ్వు చేసిన ఘనకార్యం చూసి ఆనందంతో, ఆశ్చర్యంతో ఉబ్బిదబి బై చూస్తున్నాము అని ఇంట్లో అందరూ తలా ఒక డైలాగ్ చెప్తారు. ఏంటి అందరూ అంతా ఆశ్చర్యపడే పని నేనేం చేశాను అయినా ఇవన్నీ నాకు అలవాటే ఎన్ని పనులను గుర్తుపెట్టుకుంటాను కావాలంటే మా మమ్మీ ని అడగండి గతంలో కూడా ఇలాంటి పనులు చాలా చేశాను అని బోర్డు చూడకుండా, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నామో నీకు తెలుసా అని అంటుంది. దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటాడు వెంటనే రుద్రాణి అన్నయ్య నువ్వు కొంచెం పక్కకు జరుగు నీ కొడుకు తన ప్రతిభను చూసుకుంటాడు అని అంటుంది రుద్రాణి. వెంటనే సుభాష్ పక్కకు జరుగుతాడు, రాజ్ బోర్డుని చూస్తాడు. సారీ కళావతి ఏముంది ఇందులో అని వెంటనే వామ్మో అని నోరుతెరుస్తాడు. వెంటనే బోర్డు దగ్గరికి వెళ్లి మళ్లీ ఇంకొకసారి చదివి అక్కడే ఉన్న కావ్యతో ఏంటి ఇది అని అంటాడు. చెప్పానుగా నాటకం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో అని ఇప్పుడే మొదలైంది అని అంటుంది కావ్య. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజ్ ఈ బోర్డు నువ్వే రాసావా అని అంటారు. ఆయనే రాశారు అని అంటుంది కావ్య. ఎందుకు అని అడుగుతుంది అపర్ణ. వెంటనే రాజ్ కంగారుగా ఏదో ప్లాన్ చేశావు కదా, చెప్పి తగలడు అని అంటాడు.
Nuvvu Nenu Prema: పద్మావతికి అరవింద సలహా.. విక్కీ కోసం పద్మావతి ఇలాంటి వేషం వేసిందా?

మహానటివే నువ్వు అని అనుకున్న రాజ్..
రాజ్ అయోమయంలో ఉంటే కావ్య నేను చెప్తాను అని అంటుంది. వారం రోజులుగా మన ఇంట్లో జరుగుతున్న విషయాలన్నిటికీ తను నా తప్పేం లేదని తెలుసుకొని నాకు సారీ చెప్పాలనుకున్నారు అందుకే ఇలా రాశారు అని అంటుంది. అవును కదండీ అని అంటుంది కావ్య రాజు చేసేదేం లేక అవును అని అంటాడు. ఇక రాజ్ ని అందరి ముందు సారీ చెప్పమని కళావతికి ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు దేనికి అని అంటాడు రాజ్ మరి బొడ్డు మీద రాశావు కదా అదేదో ఇక్కడే అందరి ముందు చెప్పేసేయ్ అని అంటారు సరే అని రాజు చేసేదేం లేక నేను ఈ వారం రోజులుగా అని అనబోతూ ఉండగా, వెంటనే కావ్య రాజ్ నోరుమూసి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు నేను చేసిన తప్పుల్ని మీరు అర్థం చేసుకున్నారు అంత వాడికి చాలు మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదండి అని అంటుంది ఏం నటిస్తున్నావే మహానటి లాగా అని అనుకుంటాడు రాజ్. నాకు ఇది చాలండి ఈ మాత్రం నన్ను అర్థం చేసుకొని మీ భార్యగా ఒప్పుకున్నారు అని అంటుంది కావ్య. ఈ మాటకి నాకు కడుపు నిండిపోయింది అండి అని అంటుంది. వెంటనే ఇందిరాదేవి మీ ఇద్దరిని చూస్తుంటే మాకు కూడా అలానే ఉంది అని అంటుంది. మీ అందరికీ ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం టిఫిన్ తింటేనే కడుపు నిండుతుంది ఆ పని చూడు అంటుంది రుద్రాణి కావ్య తో, కావ్య సరే అని వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి రాజ్ ని చూసి నవ్వుతుంది ఇక రాజ్ అందరి ముందు బుక్ అయిపోయాడు. అపర్ణాదేవి చాలా ఆశయంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. రుద్రాణి రాహుల్ తో ఏం జరుగుతుంది రా ఈ ఇంట్లో అని అంటుంది ఏమో మమ్మీ నాకేం తెలుసు అని అంటాడు రాహుల్.

అప్పు ఇంటికి కళ్యాణ్ రాక..
ఇక అప్పు కళ్యాణ్ అనామికతో పెళ్లి గురించి చెప్పడం, అనామిక కళ్యాణ్ క్లోజ్ గా ఉండడం అప్పుకి గుర్తొస్తూ ఉంటుంది. చాలా బాధగా రూమ్ లోకి వెళ్లి తలుపేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. రా బాబు కూర్చో అని, అప్పు అని పిలుచుకు వస్తాను అని లోపలికి వెళ్తుంది కనుకమ్. నువ్వు వద్దులే నేను పిలుస్తాను ఉండు అని వాళ్ళ వదిన లోపలికి వెళ్లి అప్పుని పిలుస్తుంది. అప్పటికే అప్పుకి కళ్యాణ్ వచ్చాడని అర్థం అవుతుంది. వాళ్ళ పెద్దమ్మ లోపలికి వెళ్లి కళ్యాణి వచ్చాడు బయటికి రా అని అంటుంది నేను రాను అంటుంది రాకపోతే బాగోదు మీ అమ్మే వచ్చి పిలుస్తుంది చేసేదేం లేదురా అని అంటుంది. బ్రో, నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అని అంటాడు కళ్యాణ్ అప్పు రాగానే, ఏం చేసింది బాబు అని అంటుంది కనుకమ్. నేను తనకి గుడ్ న్యూస్ ముందు చెబుదాం అనుకుంటే అందరికన్నా తనకి తానేమో వచ్చేసింది అని అంటాడు కళ్యాణ్. ఏంటి బాబు ఆ గుడ్ న్యూస్ అది తింగరిది వినదు నాకు చెప్పు అని అంటుంది. కళ్యాణ్ సిగ్గుపడుతూ అనామికతో నా పెళ్లి ఫిక్స్ అయింది అని అంటాడు. వెంటనే కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దుగ్గిరాల ఇంట్లో మళ్లీ పెళ్లి బజార్లు మోగుతున్నాయా అని అంటుంది. చూసావా ఆంటీ మీరే ఇంత సంతోష పడుతుంటే అప్పు నా ఫ్రెండ్ అయ్యుండి కూడా కనీసం నాకు కంగ్రాట్స్ కూడా చెప్పలేదు అని అంటాడు. వెంటనే అప్పుఅందరూ పెళ్లి చేసుకుంటున్నారు నువ్వు చేసుకుంటున్నావు అందులో గొప్పేముంది,అని అనగానే కనకం,ఏం మాట్లాడుతున్నావే అని అంటుంది. నేను ఇలానే మాట్లాడుతాను అని అంటుంది అప్పు ఇష్టమైతే నాతో ఉండమని లేదంటే వెళ్ళిపొమ్మను అయినా నాకు ఫ్రెండ్స్ లేరు. ఎవరూ లేరు నేను ఎప్పటికీ ఒంటరిదాన్ని ఒంటరిగానే మిగిలిపోతాను అని బాధగా లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటుంది వెంటనే చూశారా ఆంటీ ఇలానే ఉంటుంది ఈ మధ్య నాతో అసలు మాట్లాడట్లేదు ఎప్పుడు కోపంగా ఉంటుంది తను ఇది వరకు అప్పు లాగా ఉండట్లేదు. ఇదంతా నాకు తెలియదా ఆంటీ మీరు మాత్రం అప్పుని నా పెళ్ళికి పంపించాలి తనే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుని ఎలా చేయాలి అని అంటాడు కళ్యాణ్. తప్పకుండా బాబు అని అంటుంది కనకం. కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పు ఏంటి విచిత్రంగా ప్రవర్తిస్తుంది అక్క ఆ అబ్బాయితో అలా ప్రవర్తిస్తుంది ఏంటి అని అంటుంది కనుకమ్. ఏమో నాకేం తెలీదు అని అంటుంది. అపూర్ రూమ్ లోకి వచ్చి కళ్యాణ్ ఫోటో తీసుకొని కళ్యాణ్ ఫోటో నేను చూస్తూ బాధపడుతూ ఉంటుంది. వెనక ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. అప్పు ఆ ఫోటో వెనకాల ఐ లవ్ యు అని రాసి పెట్టుకుని ఉంటుంది. అది చూసి బాధపడుతూ ఉంటుంది.
రాజ్ కోపం..
కళావతి రూమ్ లోకి ఎప్పుడొస్తుందా అని రాజ్ ఎదురు చూస్తూ ఉంటాడు. రాణి దీని పని చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే కావ్య వస్తుంది. ఏంటి నువ్వు చేసిన పని అని అంటాడు. ఉల్లిపాయలు జరిగి సాంబార్ చేసి అన్ని, వంటకు సంబంధించినవి చెప్తుంది. ఏంటి స్మార్ట్ గా సమాధానం చెప్తున్నావు అనుకుంటున్నావా అంటాడు రాజ్ అవును అందరూ నేను స్మార్ట్ గా ఉన్నానని అంటున్నారు ఇప్పుడు మీరు కూడా అన్నారా అని సిగ్గుపడుతుంది కావ్య.
రేపటి ఎపిసోడ్లో రుద్రాణి పార్సిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కొరియర్ బాయ్ వచ్చి మేడం పార్సిల్ అని అంటాడు.కావాలని, రుద్రాణి రాహుల్ ఇద్దరూ ఆ పార్సెల్ ని, ఇందిరా దేవి తీసుకునేలా చేస్తారు ఇందిరా దేవి అందులో ఫోటోలను చూసి షాక్ అవుతుంది. వెంటనే ఆ ఫోటోలను తీసుకెళ్లి స్వప్నకి చూపిస్తుంది స్వప్న కూడా షాక్ అవుతుంది.