Brahmamudi అక్టోబర్ 19 ఎపిసోడ్ 231: నిన్నటి ఎపిసోడ్ లో,కావ్య పాన్ తినాలని ఉంది అంటే రాజ్ బయటకు తీసుకువెళ్తాడు. ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటికి వెళ్తారు. రాజ్ తో బయటికి వెళ్లడం కావ్య సంతోషిస్తుంది ఇక పాన్ షాప్ లో దొంగతనంగా దూరి పాన్ తింటారు. పాన్ షాప్ ఓనర్ పోలీసులకు ఫోన్ చేయడం పోలీసులు వచ్చి ఇద్దరినీ బయటకు రమ్మనడం జరుగుతుంది.ఈ రోజు 231 వ ఎపిసోడ్ లో,రాజ్ పోలీసులతో,మేము దొంగలం కాదండి భార్యాభర్తలం అని అంటాడు. కావ్య అవునండి నాకు కిల్లి తినాలనిపించింది అందుకే బయటకు వచ్చాము. అని పోలీసులతో చెప్తే పోలీసు మీరు భార్యాభర్తలు అనడానికి రుజువు ఏంటి అని అంటాడు. ఏమండీ మొన్న మనం గ్రూప్ ఫోటో దిగాము కదా వినాయక చవితి రోజు ఆ ఫోటో చూపించండి అని అంటుంది కావ్య.ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను కదా ఫోన్ తీయలేదని గుర్తు చేస్తాడు రాజ్.
Nuvvu Nenu Prema: కృష్ణ అనుకున్నదే జరుగుతుందా? అపాయం నుండి అరవింద పద్మావతి కాపాడనుందా?

భార్యాభర్తలు గొడవ..
ఇక పోలీసు ఫోన్ చూపించమంటే, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయారు,మీకు అసలు బుద్ధుందా నేను చెప్తూనే ఉన్నాను కదా ఫోన్ తీసుకొద్దామండి అని మీరే కదా నన్ను తయాని ఇవ్వలేదు మీరు ఫోన్ తేలేదు ఇప్పుడు చూడండి ఏమైందో అంటూ తిట్టడం స్టార్ట్ చేస్తుంది కావ్య ఇక రాజ్ కూడా తిట్టడం స్టార్ట్ చేస్తారు. అసలు మీ అత్త మీఅత్త కొడుకు వాళ్లే మంచి వాళ్ళు కాదు అని అంటుంది కావ్య. ఆ మీ అమ్మ ఏమైనా తక్కువ మీ అమ్మ మంచిది కాదు మీ అక్క మంచిది కాదు మీరంతా ఫ్రాడ్ ఫ్యామిలీ మీరంతా మోసం చేసే వాళ్ళు అని అంటాడు రాజ్. అదంతా అక్కడే ఉండి చూసినా పోలీసు ఆపండి అని పెద్దగా అరుస్తాడు మీరు ఒకరికొకరు మీ ఇంట్లో వాళ్లని మీతో సహా తిట్టుకుంటున్నారు అంటే కచ్చితంగా మీరు భార్యాభర్తలే నాకే ఫోటో చూపించాల్సిన పనిలేదు అని అంటాడు. వెంటనే రాజ్ మీద జాలి చూపిస్తాడు పోలీసు థాంక్స్ చెప్తాడు రాజ్. మేము భార్యాభర్తల అని మీకు ఎలా అనిపించింది అని అంటుంది కావ్య. ఇంతలా కొట్టుకునేది భార్యాభర్తలు తప్పితే ఎవరుంటారు అమ్మ అని అంటాడు పోలీసు వెంటనే 500 రూపాయలు పాన్ షాప్ వాడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజ్ కావ్య. పాన్ షాప్ వాడు 500 రూపాయలు వచ్చినలే అంటారా అంటే పోలీసు కావాలని వీడ్ని కూడా జిమెక్కించండి అంటాడు వద్దులేండి సార్ అని పాన్ షాప్ వాడు కూడా లోపలికి వెళ్తాడు పోలీసులు వెళ్లిపోతారు.
Krishna Mukunda Murari: మురారిని చంపేసిన ముకుంద వాళ్ళ అన్నయ్య.. కానీ, ఊహించని సూపర్ ట్విస్ట్..

మైఖేల్ ఫోన్..
ఇక రాహుల్ స్వప్న నిద్రపోతూ ఉంటే మైకేల్ ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ తోనే రాహుల్ నిద్రలేస్తాడు. ఎవరు అని అంటాడు. అప్పుడే నన్ను మర్చిపోయావా అన్న అని అంటాడు ఎవరో చెప్పు అని అంటాడు రాహుల్ నిద్ర మధ్యలో అదే అన్నా నీ భార్యని చంపమని నాకు డబ్బులు ఇచ్చావు కదా అని అంటాడు మైఖేల్. ఒకసారి గా షాక్ అయ్యి నిద్రలో నుంచి బయటికి లేస్తాడు రాహుల్ ఉలిక్కిపడి పక్కనే ఉన్న స్వప్న చూడకుండా బయటికి గబగబా వెళ్తాడు. అనుమానం వచ్చి వెంటనే స్వప్న కూడా రాహుల్ వెనకే వెళ్లి ఏం మాట్లాడుతున్నాడో వినాలి అనుకుంటుంది రాహుల్ కోపంగా బయటికి వెళ్లి మైకేల్ తో మాట్లాడటం మొదలు పెడతాడు నువ్వా నువ్వెలా ఫోన్ చేస్తున్నావ్ రా నువ్వు జైల్లో ఉన్నావు కదా అంటాడు రాహుల్,జైల్లో ఉంటే ఏమన్నా నా ఏర్పాట్లు నాకు ఉంటాయి అయినా ఏంటి సైలెంట్గా ఏమీ పట్టనట్టు నన్ను జైలుకు పంపించి నీ పని నువ్వు చూసుకుంటున్నావు అంటాడ. నేను చెప్పిన పని నువ్వు ఎక్కడ చేశావు నా భార్య ని చంపేరా అంటే చంపలేదు పెళ్లి గిల్లి అని నాటకం ఆడావు మొత్తం ప్లాన్ రివర్స్ అయింది. నీవల్ల నేను ఇంట్లో ఎన్నో తిట్లు తినాల్సి వచ్చింది మా అమ్మ చేతిలో అంటాడు రాహుల్.

మైకేల్ బెదిరింపు..
అన్నా జరిగిందేదో జరిగిపోయింది నువ్వు అవన్నీ చెప్పి ఇప్పుడు తప్పించుకోవాలని చూడొద్దు. ఏదైనా కారణం మాత్రం నువ్వే కదా అయినా ఇదంతా ఎందుకు నాకు డైలీ ఇప్పిస్తావా లేక నిజం చెప్పేయమంటావా అని అంటాడు. దాంతో రాహుల్ ఇంకా కంగారు పడిపోతాడు రాహుల్ కంగారు చూసి స్వప్న రాహుల్ అంటూ దగ్గరికి వెళ్తుంది ఫోన్ మధ్యలో ఆపేసి ఏంటి స్వప్న అంటాడు. ఏంటి మళ్లీ ఏమైనా తప్పు చేస్తున్నావా ఏంటి కంగారుగా ఫోన్ మాట్లాడుతున్నావ్ అంటుంది స్వప్న లేదు నా ఫ్రెండ్ ఏదో సమస్యలే ఉన్నాడు వాడితో మాట్లాడుతున్నాను నేను చూసుకుంటాను వెళ్ళు అంటాడు రాహుల్. ఇక స్వప్న అనుమానంగానే రాహుల్ ని చూస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది ఇక మైకెల్, నాకు అర్జెంటుగా బెయిల్ ఇప్పించు లేదంటే అని రాహుల్ ని బెదిరిస్తాడు. నువ్వు నాకు డైలీ పెంచకపోతే నేను చేయాల్సింది నేను చేస్తాను ఇదే అని గట్టిగా బెదిరించి ఫోన్ పెట్టేస్తాడు మైకేల్.

కనకంతో రుద్రాణి పాట్లు..అప్పు ఇంటికి కళ్యాణ్..
ఇక కనకం ఏసీ ఎక్కువగా ఉండడంతో రుద్రాణి చీరలు కప్పుకొని పడుకుంటుంది. తెల్లవారిసరికే రుద్రాణి నిద్రలేచి కనకం కప్పుకున్న చీరలు చూసి ఇదేంటి నువ్వు నా చీరలన్నీ ఇలా కప్పుకున్నావులే అని అంటుంది తనకాని నిద్రలేపి అసలు వీటి విలువ ఎంతో తెలుసా అలా ఎలా నా చీరలన్నీ ఇలా పాడు చేశావు అని అంటుంది. వాటన్నిటినీ తీసుకొని రుద్రానికి ఇచ్చి వీటి విలువెంతో నాకు తెలియదు కానీ మీరే చూసుకోండి అని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది కనుకమ్. అది చూసి రుద్రానికి చిర్రే ఎత్తుకు వస్తుంది. ఇక అప్పు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కట్ చేస్తుంది. కళ్యాణ్ ఫోన్ చేస్తుంటే కట్ చేయడం చూసి ఎవరమ్మా ఫోన్లో అని అడుగుతాడు. ఎవరూ లే నాన్న అని అంటుంది అప్పు ఇంతలో కళ్యాణ అక్కడికి వచ్చి చూడండి అంకుల్ నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా కట్ చేస్తుంది మీ అమ్మాయి అని అంటాడు. ఇక ఎందుకు అని అడుగుతాడు ఆంటీ బట్టలు తీసుకొని రమ్మని చెప్పింది అందుకే వచ్చాను మీ అమ్మాయి అవన్నీ ప్యాక్ చేసి ఇస్తుందిలే అని ఫోన్లో చెబుదామంటే తను ఏమో ఫోన్ కట్ చేస్తుంది అని కంప్లైంట్ చేసినట్లుగా చెప్తాడు కళ్యాణ్. వెంటనే అప్పు ఏందిరా బై నీ లొల్లి ఆగు మా అమ్మకి కాల్ చేస్తాను బట్టలు ప్యాక్ చేసి ఉంచాను తెస్తున్న అంటూ లోపలికి వెళ్లి బ్యాగ్ తీసుకొచ్చి కళ్యాణ్ కి ఇవ్వబోతుంది. నువ్వు రా మీ అమ్మ నిన్ను కూడా తీసుకొని రమ్మంది అంటాడు కళ్యాణ్ ఇక కృష్ణమూర్తి అన్నపూర్ణలు వెళ్ళమ్మా అంటుంది కదా ఏదో అవసరం ఉంటుంది వెళ్లకపోతే బాగోదు అనడంతో అప్పు కళ్యాణ్ తో నడుస్తుంది.

రాజ్ నీ ఆట పట్టించిన కుటుంబ సభ్యులు..
ఇక రాజ్ వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అంత హాల్లోకి వచ్చి కూర్చుంటారు. అది చూసి రాజ్ అమ్మో అందరూ లోపలే ఉన్నారు ఇప్పుడు మనం ఎలా పైకి వెళ్తాము అని అంటాడు. దొరికేశాం పో ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అంటాడు. ఇందిరా దేవి ఏంటి ఇంత తెల్లారిన కావ్య కిందకి దిగలేదు అని అంటుంది. నేను అదే చూస్తున్నాను వాళ్ళింకా నిద్రపోతున్నట్టు ఉన్నారు అని అంటుంది. అయినా కాఫీ పెట్టే టైం అయింది కదా ఇప్పుడు కాఫీ ఎవరు పెడతారు నువ్వు వెళ్లి పెట్టుకోరా అని అంటుంది రుద్ర నీతో, నాకు కాఫీ పెట్టడం రాదు అన్నయ్య అని పేపర్ తీసుకొని హాల్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న రుద్రాణి పేపర్ చదువుతూ ఉంటుంది.కావ్య గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే కావ్య నీ రాజ్ నీ రుద్రాణి చూసి, అదిగో వస్తున్నారు బయట నుంచి ఎక్కడికో షికారికి వెళ్ళినట్టున్నారు పొద్దున పొద్దున్నే అని అంటుంది. అపర్ణ వాళ్ళని చూసి కోపంగా ఉంటుంది. ఇక లోపలికి వచ్చిన వాళ్ళిద్దర్నీ చూసి ఇంట్లో వాళ్ళు సకల ప్రశ్నలు అడుగుతారు.

అసలు ఎక్కడికి వెళ్లారు అని అంటే ఇద్దరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే నోరు తెరిస్తే పాన్వాసన వస్తుంది కాబట్టి గుర్తుపట్టేస్తారు పాన్ తినడానికి వెళ్ళాముఅని తెలిసిపోతుంది కాబట్టి.వీళ్ళ వాళ్లకం చూస్తుంటే ఎక్కడికో పొద్దున వెళ్ళినట్టు లేరు రాత్రి వెళ్లి ఇప్పుడు వస్తున్నట్టుంది అంటుంది ధాన్యలక్ష్మి. ఇక అమ్మమ్మ గారు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే సమాధానం చెప్పట్లేదు అంటుంది అపర్ణ. ఇక చున్ని అడ్డం పెట్టుకొనిమీ అబ్బాయిగారు రమ్మంటే బయటకు వెళ్లాను అని చెప్పేసి నేను అందరికీ కాఫీ తీసుకొస్తాను అని రాజ్ ని అక్కడ ఇరికించేసి వెళ్లిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ రాజ్ ని ఆట పట్టిస్తూ ఉంటారు రాజ్ కూడా నేను ఫ్రెష్ వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళిపోతాడు.అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు అని ఆలోచిస్తూ ఉంటే ఇందిరా దేవి వచ్చి వాళ్ళు భార్యాభర్తలు ఎక్కడికైనా వెళ్తారు ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం అని నువ్వెళ్ళి కాఫీ తీసుకురా దాని లక్ష్మి అని అంటుంది.

రేపటి ఎపిసోడ్లో రాహుల్ మైకేల్ ని బెయిల్ తో బయటికి తీసుకురావడానికి లాయర్ తో మాట్లాడుతాడు. లాయర్ చాలా డబ్బులు అడుగుతాడు ఆ డబ్బులు కోసం రాహుల్ ఇంట్లో నగలని ఒక బ్యాగ్ లో వేసుకొని ఎవరికీ తెలియకుండా బయటికి తీసుకెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటే రాజ్ గుర్తుపట్టి ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతాడు. ఆ బ్యాగ్ లో అవి చూపించే ప్రయత్నంలో అవి కింద పడిపోతాయి రాహుల్ దొంగతనం చేసినట్లు ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది