Brahmamudi అక్టోబర్ 2 ఎపిసోడ్ 216: స్వప్న ని కిడ్నాప్ చేసిన వాడు ఎవరో చెప్పండి, వాడి అంతు తేలుస్తాను అంటూ రాహుల్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య అంత అవసరం లేదు రాహుల్, వాడిని పోలీసులకు పట్టించాం అని అంటుంది. కేవలం పోలీస్ శిక్ష ఏమి సరిపోతుంది, ఇలాంటి నీచులను చంపేయాలి, నిండు గర్భిణీ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడా, అలాంటి దరిద్రులను ఏమి చేసిన తప్పు లేదు అని అంటుంది. అలా ఇంట్లో వాళ్ళందరూ కిడ్నాపర్స్ ని బూతులు తిడుతూ ఉంటారు.

కుటుంబం పై చిరాకు పడిన రుద్రాణి :
అది వినలేక రుద్రాణి ఇక చాలు ఆపండి అని అంటుంది. ఆ వెధవలను తిడితే నీకు ఎందుకు బాధ వేస్తుంది అని రుద్రాణి ని అడగగా, స్వప్న అసలే అక్కడ ఎంతో ఇబ్బంది పడింది, పాపం ఆమెకి తినడానికి ఎదో ఒకటి పెట్టాలి కదా అని అంటుంది. అపుడు ఇందిరా దేవి పోనిలే ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు అని అంటుంది.

స్వప్న కడుపుని చూసి అనుమానించిన ధాన్య లక్ష్మి :
ఇది ఇలా ఉండగా ధాన్య లక్ష్మి స్వప్న ని చూసి కడుపు అంతలా పెరిగింది ఏంటి అని అంటుంది. అప్పుడు స్వప్న నాల్గవ నెల అంటే ఆ మాత్రం పెరగకుండా ఎందుకు ఉంటుంది అని అనగా, కరెక్టే కానీ మరీ వారం రోజుల్లోనే అంతలా పెరిగేసరికి ఆశ్చర్యం వేసింది అని అంటుంది. అప్పుడు స్వప్న అదేమీ లేదు చిన్న అత్తయ్య, వారం రోజులు కనిపించలేదు కదా నేను, సడన్ గా మీరు ఒక్కసారిగా చూసేసరికి అలా అనిపిస్తుంది. అయినా మీకు నా గురించి పెట్ట్టింపు ఎక్కడిదిలే, ఎప్పుడూ కావ్య భజనే కదా అని అంటుంది.ఇక ఆ తర్వాత ఎవ్వరూ లేని సమయం లో రాహుల్ ని పక్కకి పిలిచి చెంప దెబ్బ కొడుతోంది రుద్రాణి. చెంపదెబ్బ కొట్టినందుకు బాధగా ఉందా?, అంత మించిన పదింతలు బాధ నా మనసులో ఉంది. నిన్ను అందలం ఎక్కించాలని నేను చూస్తుంటే, నువ్వు ఒక్క పని కూడా చక్కగా చెయ్యడం లేదు. ఇలా అయితే నువ్వు ఆ కంపెనీ కి రాజువి కాదు కదా, కనీసం బంటువి కూడా అవ్వలేవు అని అంటుంది. అప్పుడు రాహుల్ అంతా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాను మమ్మీ, ఆ మైఖేల్ గాడు పెళ్లి చేసుకుంటాడని ఊహించలేకపోయాను, ఈసారి ఎవరిని నమ్ముకోను, నేనే చూసుకుంటాను అని అంటాడు.

కిడ్నాప్ విషయం పై అనుమానాలు పెంచుకున్న కావ్య:
ఇప్పుడు మనం ఏమి చేసిన అది రివర్స్ అవుతాది, దెబ్బ పడిన ప్రతీసారి ఆ కావ్య ఎంతో తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కాబట్టి సమయం చూసి కొట్టాలి, ఎక్కువ సమయం కూడా లేదు అని అంటుంది రుద్రాణి. స్వప్న కి ఆరు నెలలు కడుపు దాటితే వాళ్ళ అమ్మ నాన్న లు వచ్చి ఇంటికి తీసుకెళ్తారు, అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిపి మన చేతిలో బిడ్డని పెడుతారు, అప్పుడు మనం చెయ్యగలిగింది ఏమి లేదు,ఈలోపు మనమే ఎదో ఒకటి చేసి ఈ స్వప్న పీడని వదిలించుకోవాలి అని అంటుంది రుద్రాణి. మరోపక్క కావ్య రాజ్ తో ఆ కిడ్నాపర్ కి అంత ధైర్యం ఎలా వచ్చింది అండీ, దీని వెనుక ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది అని అంటుంది.

అప్పుడు రాజ్ స్వప్న తిరిగి వచ్చినందుకు సంతోష పడకుండా ఇవన్నీ ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇంతలోపే విగ్రహాల కాంట్రాక్టర్ శ్రీను వస్తాడు, కావ్య కి చెక్ ఇస్తాడు, అప్పుడు కావ్య ఆ చెక్ రాజ్ కి ఇచ్చి, మార్వాడి అతన్ని పిలిపిస్తాను, అతను డాక్యుమెంట్స్ తీసుకొస్తాడు, మీ చేతులమీదుగా ఈ చెక్ ని ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ ని విడిపించండి అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా కావ్య అపర్ణ ని రేపు వినాయక చవితి సందర్భంగా మా ఆయనని పుట్టింటికి తీసుకెళ్తాను అని అడుగుతుంది. అప్పుడు అపర్ణ అదేమీ కుదరదు, ఒక్కసారి అక్కడికి పంపినందుకు నా బిడ్డని ఇన్ని రోజులు పెట్టుకున్నారు, ఈసారి అసలు ఒప్పుకోను అని అంటుంది.