Brahmamudi సెప్టెంబర్ 20 ఎపిసోడ్ 205: నిన్నటి ఎపిసోడ్ లో అపర్ణ దేవి చేసిన గొడవకు ఇంట్లో అంతా అల్లాడిపోతూ ఉంటారు. కావ్యను దోషిగా చేసిన అపర్ణాదేవి తన పంతం మార్చు కొను అన్నట్లుగా ఉంటుంది. రాజ్ వాళ్ళమ్మ అలా ఉండడం చూసి బాధపడుతూ ఉంటాడు ఎలాగైనా నా వల్లే సమస్య వచ్చింది కాబట్టి నేనే సరి చెయ్యాలి అనుకుంటుంది కావ్య అత్త గారితో మాట్లాడడానికి వస్తుంది.

ఈరోజు 205 ఎపిసోడ్ లో అత్తయ్య నేను మీతో మాట్లాడాలి అని అంటుంది దానికి అపర్ణాదేవి ఒప్పుకోదు కానీ నేను మాట్లాడేది మీరు వినొచ్చు అని అంటుంది. చూడండి అత్తయ్య ఇప్పటివరకు మీరు అనుకున్నది ఏదీ నేను చేయలేదు కానీ ఇక ముందు అలా జరగదని మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వలేను అని అంటుంది కావ్య కోపంగా చూస్తుంది అపర్ణాదేవి నాతోనే సవాల్ చేస్తున్నావా అంటుంది అయ్యో అత్తయ్య ఎంత ధైర్యం నాకు ఈ జన్మలో కూడా రాదు మీరు అనుకున్నట్లు నేను ఎవరిని నా వైపు తిప్పుకోరును మీ అబ్బాయి కూడా నా వైపు లేరు అసలు నా వైపు తిప్పుకోవాలని ఉద్దేశం కూడా నాకు లేదు అని అంటుంది కావ్య. మరి జరిగిందా దానికి ఏం సమాధానం చెప్తావ్ అంటుంది అపర్ణాదేవి.

అపర్ణలో మొదలైన భయం.
అపర్ణ దేవి అడిగినా ప్రశ్నకు సమాధానంగా కావ్య మీరు అనుకునే దానికి ఆరంభం అత్తయ్య ఇది అని అంటుంది ఒక చూపు చూస్తుంది అపర్ణ దేవి ఇప్పటివరకు ఎవరు మిమ్మల్ని దాటి నన్ను ఒప్పుకున్నది లేదు మీరు పెట్టే, షరతులకు ఎంతోకొంత గౌరవం కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు నన్ను దూరం పెడితే వాళ్ళందరూ నాకు కావాల్సినంత సానుభూతి తో నాకు దగ్గరవుతారు. ఇలా మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని అంటుంది కావ్య వెంటనే అపర్ణ కంగారు పడుతుంది. ఇక కావ్య మాత్రం మాట్లాడటం ఆపకుండా మీ అబ్బాయి నాకు కూడా నా తప్పులేదు అని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టే ఆయనకి నేను నిలపరాధిగా కనిపించాను కాబట్టి ఆయన నాకు దగ్గర అయిపోతారేమో, దీనిని బట్టి దుగ్గిరాల కుటుంబం దూరం అయ్యేది ఎవరు? నేనా? మీరా అని అంటుంది. మీరు ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో అదే జరుగుతుంది. ఈ అవకాశాన్ని నాకు మీరే ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు నాకు రహదారివేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటుంది కావ్య వెంటనే అపర్ణాదేవి భయపడుతున్నట్లుగా కావ్య వైపు చూస్తుంది. ఇకముందు మీ స్థానంలో మీరు ఉండాలంటే ఇంటికి ఇంటి సభ్యులకి దూరమై సాధించేదేమీ ఉండదు. గొడవలు చేసి రుద్రాణి లాంటి వాళ్లకు కూడా మీరు సమాధానం చెప్పుకోలేరు ఇకమీదట మీరే ఆలోచించండి అత్తయ్య ఏం చేయాలి అన్నది మీ ఇష్టం అనేసి కావ్య వెళ్ళిపోతుంది.

రుద్రాణి సంతోషం..
అపర్ణాదేవి కావ్య మీద యుద్ధం ప్రకటించింది అని తెలిసి రుద్రాణి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక రుద్రాణి డ్రింక్ చేస్తూ కావ్య గురించి రగిలిపోతూ కావ్య నామీద పొగరు చూపిస్తావా ఇప్పుడు మీ అత్త నీ మీద యుద్ధం ప్రకటించింది ఇప్పుడు అలా చేసింది నేనే ఇప్పుడేం చేస్తావు నేను నా మొగుడికి దూరంగా ఉంటున్నాను అన్నావు కదా ఇప్పుడు మీ అత్త తోనే నీ భర్త నుండి నిన్ను దూరం అయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు అని తనలో తాను నవ్వుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటుంది.

కావ్య తో మాట్లాడిన అపర్ణ..
ఇంట్లో పనులన్నీ కావ్య చేస్తూ ఉంటుంది అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఈ పేపర్ నా దేవి కావ్యనీ చూసుకుంటూ కోపంగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. వెంటనే రుద్రాణి అపర్ణాన్ని చూసి వదినేంటి కావ్యని పులి జింకన్ చూసినట్లుగా చూస్తుంది మార్నింగ్ మార్నింగ్ మంచి యాక్షన్స్ ఎపిసోడ్ జరుగుతుందేమో అని అనుకుంటుంది. ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. ఇంట్లో వాళ్ళు కూడా అపర్ణాదేవి కోపాన్ని చూసి కావ్యని ఏమంటుందో ఏంటో మళ్లీ అని అనుకుంటూ ఉంటారు. ఇక అపర్ణాదేవి రాత్రి కావ్య అన్నమాట గుర్తుకొస్తాయి దీంతో కావ్య అని పిలుస్తుంది అపర్ణ. వెంటనే ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు మెట్లు దిగుతూ వస్తున్న భాగ్యలక్ష్మి వాళ్ళు కూడా చూసి ఇదేంటి కావ్య మీద కోపం నెలరోజుల వరకు ఉంటుంది అనుకున్నాం కదా మర్చిపోయిందా ఏంటి రాత్రి జరిగింది అని అంటుంది.వెంటనే కావ్య పరుగు పరుగున వచ్చి చెప్పండి అత్తయ్య అంటుంది ఏంటి ఈ రోజు చేసే పనులు కూడా నేనే చెప్పాలా లేక మేము నిన్ను అడుక్కోవాలి అనుకుంటున్నావా ఇంత తెల్లారింది ఒక్కరికి అయినా కాఫీ ఇచ్చావా అని అంటుంది అపర్ణాదేవి. సుభాష్ మా అందరికీ కాఫీ ఇచ్చింది కావ్య నీ కోసం పక్కన పెట్టింది నువ్వు రాలేదు కదా అందుకని అని అంటాడు. ఇప్పుడే తెస్తాను అత్తయ్య అంటూ కావ్య పరుగు తీస్తుంది లోపలికి
Krishna Mukunda Murari: దగ్గరైన కృష్ణ మురారిని చూసిన ముకుంద అందరి ముందు ఏం చేసిందంటే.!?

గొడవ పెంచాలని చుసిన రుద్రాణి..
అక్కడ జరిగేదంతా చూసి రుద్రానికి ఏమీ అర్థం కాదు ఇదేంటి ఇంత బిల్డప్ ఇచ్చి కాపీ అడుగుతుంది మా వదిన ఇంట్లో వాళ్లకి పిచ్చి ఉన్నట్టుంది. రోజుకో షాక్ ఇస్తున్నారు నాకు అని అనుకొని బిత్తర మొహం వేసి రుద్రాణి అపర్ణ దగ్గరికి వస్తుంది. ఏంటి వదిన ఇది నిన్ననే కదా అంత పెద్ద గొడవ జరిగింది కావ్య తో అప్పుడే మాట్లాడుతున్నావేంటి అంటుంది కోపంగా, అంటే ఏంటి నీ ఉద్దేశం గొడవ జరిగితే అలానే ఉండి పోవాలా అంటుంది ఇందిరాదేవి కోపంగా, మనుషులు కలిసి మాట్లాడుకుంటే రుద్రానికి అస్సలు నచ్చదు అత్తయ్య అంటుంది భాగ్యలక్ష్మి. రాత్రి తను చేసింది తప్పనిపించి గొడవ పెట్టుకుంది ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది నువ్వు లేనిపోనివన్నీ పెట్టొద్దు అని అంటాడు సీతారామయ్య రుద్ర నీతో ఏంటి నాన్న అంత నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు తప్పు చేసింది కావ్య అని మళ్ళీ జరిగింది గుర్తు చేయబోతుంది రుద్రాణి. రుద్రాణి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఏం పనిచేయవు కావ్య రుద్రానికి కాఫీ తీసుకొచ్చి చూడండి రుద్రాణి గారు మీరు అనుకున్నవేవీ నామీద చెప్పి ఎందుకు ఇలా చేస్తున్నారు అని రివర్స్ గా అడుగుతుంది. అవన్నీ అపర్ణ పట్టించుకోనట్టుగా కావ్య వాగింది చాల్లే కానీ వెళ్లి టిఫిన్ చెయ్ అంటుంది.అయిపోయింది అత్తయ్య అని 10 నిమిషాల్లో తెస్తాను అంటుంది కావ్య ఏం చేసావ్ అంటుంది అపర్ణ రవ్వ ఇడ్లీ చేసాను అత్తయ్య అని అంటుంది కావ్య అంతా నీ ఇష్టమేనా నాకు దోశలు కావాలి అని అంటుంది అపర్ణాదేవి. సరే అత్తయ్య చేస్తాను అని కావ్య లోపలికి వెళ్తుంది నవ్వుకుంటూ

రాజ్ తో మాట్లాడిన అపర్ణ దేవి..
కావ్యకి దోసెలు వేయమని చెప్పి అపర్ణాదేవి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది. ఎదురుగా వాకింగ్ పూర్తి చేసి తిరిగి వస్తూ ఉంటాడు రాజు అపర్ణాదేవి మాట్లాడదులే అని తలదించుకొని వెళ్తూ ఉంటే రాజ్ అని పిలుస్తుంది అపర్ణాదేవి ఆనందంతో వెనక్కి తిరిగిన రాజ్ తల్లి దగ్గరికి వెళ్లి మమ్మీ నువ్వు నాతో మాట్లాడుతున్నావా నాతో మాట్లాడుతున్నావా అంటూ సంబరంగా అడుగుతాడు అవును నాన్న ఎంతైనా నేను నీ తల్లిని కదా ఎంత కోపం ఉన్నా మాట్లాడకుండా ఉండలేను కదా అయినా నీ మీద నాకెందుకు కోపం వస్తుంది నువ్వేమైనా తప్పు చేస్తున్నావా ఏంటి అని నవ్వుతూ అంటుంది అపర్ణాదేవి. నువ్వు నాతో మాట్లాడితే చాలు మమ్మీ నేను తప్పే చేయను ఒకవేళ చేసినా దాన్ని సరి చేసుకుంటాను అని లోపలికి పరుగు తీస్తాడు రాజ్. ఇంట్లోకి వెళ్లిన రాజు అందరితో మా మమ్మీ నాతో మాట్లాడింది అని తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాడు. అప్పుడే భాగ్యలక్ష్మి అంత కోపం లో ఉన్న మీ మమ్మీ మాట్లాడడానికి కారణం మీ భార్య తన విలన ఈ మీ మమ్మీ అందరితో మాట్లాడేటట్టు చేసింది అని నిజం చెప్తుంది భాగ్యలక్ష్మి రాజ్ తో, రాజు వెంటనే కావ్య ఎక్కడుంది అని అడిగి కావ్య దగ్గరకు వెళ్తాడు

కావ్య కి థాంక్స్ చెప్పిన రాజ్..
కావ్యను ఎత్తుకొని గుర్రం తిప్పేస్తూ మమ్మీ నాతో మాట్లాడింది అది నీవల్లే థాంక్యూ అంటాడు రాజ్. మీతోనే కాదు నాతో కూడా మాట్లాడింది అంతమాత్రాన నేను మిమ్మల్ని ఇలా ఎత్తుకొని తిప్పానా అంటుంది కావ్య వెంటనే దింపేస్తాడు సారీ మా మమ్మీ నాతో మాట్లాడింది అది కూడా నీ వల్లే అని తెలిసి సంతోషాన్ని తట్టుకోలేక ఇలా చేశాను అని అంటాడు. మీతో అంటే కొడుకు కాబట్టి మాట్లాడింది నాతో ఎందుకు మాట్లాడిందో నాకు ఇంకా అనుమానం గానే ఉంది అని అంటుంది. ఆవిడ ఎప్పుడు నన్ను కోడలిగా ఒప్పుకోదన్న సంగతి నాకు తెలుసు కానీ ఎందుకు అంత ఈజీగా క్షమించేసింది అని అంటుంది రాజ్ తో, మాది మా మమ్మీ మంచితనం మా మమ్మీ నిన్ను శిక్షించకుండా క్షమించేసింది అని అంటాడు. మీ మమ్మీ అలాంటి రకం కాదే అని అంటుంది. ఇదిగో ఎత్తుకున్నాను కదా అని చంక ఎక్కాలని చూడకు మా మమ్మీ ఏదైనా అంటే నేను ఊరుకోను అని కోపంగా అంటాడు రాజ్. మా మమ్మీ దేవత ఆమెను అనుమానిస్తే కళ్ళు పోతాయి అయినా నువ్వు చేసిన సహాయానికి నేను ఏదో ఒక రోజు నేను రుణం తీర్చుకుంటాలే అని అంటాడు తల్లి కొడుకులు కలిపి రుణం తీర్చుకునే భర్త దొరికిన అని చాలా అదృష్టం అని అనుకుంటుంది కావ్య మనసులో, కానీ కావ్యకు మాత్రం మనసులో అనుమానంగానే ఉంటుంది.

అపర్ణాదేవి కుట్ర..
ఇక అపర్ణాదేవి రుద్రనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మాట్లాడని తెగ సంబరి పడిపోతుంది ఆ కావ్య కానీ నేను అంత తొందరగా తనని క్షమించను. తనని కోడలిగా ఎప్పటికీ ఒప్పుకోనని తనకి తెలియదు అది నా మంచితనం అనుకుంటే అది కచ్చితంగా దాని అమాయకత్వం కాదు నాకు చేసిన అవమానాన్ని నేను ఎలా మర్చిపోతాను రుద్రాణి అని అంటుంది. మరి అయితే ఎందుకు మాట్లాడవు వదిన అంటుంది రుద్రాణి తప్పు కావ్య చేస్తే శిక్ష నేను ఎందుకు వేసుకోవాలి? తప్పు చేసిన తనే కాబట్టి తనకే శిక్ష వేస్తాను అని అంటుంది అపర్ణాదేవి పొగరుగా, ఏం శిక్ష వేస్తావ్ వదిన అని అంటుంది రుద్ర అని తనకి బుద్ధి చెప్పడానికి మంచి ప్లాన్ వేశాను. తనకి బుద్ధి చెప్పడానికి ప్లాన్ ఎందుకు వదిన జస్ట్ పనిమనిషిని సంవత్సరం పాటు జీతం అడ్వాన్స్గా ఇచ్చి పనిలో నుంచి తీసేస్తే చాలు అని అంటుంది ఆపనే చేశాను ఇక పని మనుషులు ఇంటికి రారు అని అంటుంది అపర్ణాదేవి. ఇంటి పని మొత్తం ఈరోజు నుంచి కావ్య చేస్తుంది పెద్ద వాళ్ళ మాటకు విలువ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఈరోజు తనకి నేను చేసి చూపిస్తాను అని అపర్ణ చెప్పేసి వెళ్లిపోతుంది.ఇక రుద్రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శిక్ష వేసావా నువ్వు ఏం చేస్తున్నావు నీకే తెలియడం లేదు ఆ కావ్యకి నువ్వు గుణపాఠం చెప్పాలనుకున్న నేను దానికంటే పెద్ద గుణపాఠమే చెప్తాను. అని మనసులో అనుకుంటుంది రుద్రాణి.
రేపటి ఎపిసోడ్ లో కావ్య రెడీ అయ్యి మీ ఆశీర్వాదం కావాలి తాతయ్య గారు అని అంటుంది దేనికి అని అడుగుతుంది భాగ్యలక్ష్మి. ఈరోజు మేము అనుకున్న కాంట్రాక్టు కంప్లీట్ అయిపోతుంది మా నాన్న చేసిన అప్పులన్నీ తీరిపోతాయి మళ్లీ మా ఇల్లు మాకొచ్చేస్తుంది అని అంటుంది. వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి తన కొడుక్కి ఫోన్ చేసి ఎలాగైనా కావ్య అనుకున్నది జరగడానికి వీల్లేదు అని అంటుంది. రాహుల్ఈరోజు రాత్రికి విగ్రహాలన్నీ మాయమైపోతాయి మమ్మీ నువ్వేం కంగారు పడకు అని అంటాడు. రౌడీలు వెళ్లి విగ్రహాలన్నీ దొంగలిస్తున్నట్టు చూపిస్తారు. తల్లి కొడుకులు కలిసి కావ్య కుటుంబానికి పెద్ద అపాయమే తలపెట్టబోతున్నారు.