Brahmamudi సెప్టెంబర్ 30 ఎపిసోడ్ 215: కనకం కావ్య కి ఫోన్ చేసి స్వప్న ఎక్కడ ఉందో లొకేషన్ పంపించి వీడియో కాల్ కూడా చేస్తుంది. రాజ్ మరియు కావ్య ఆ లొకేషన్ ని వెంబడిస్తూ వెళ్తారు. ఇంతలోపు ఇక్కడ రాహుల్ పెర్ఫార్మన్స్ అదరగొట్టేస్తూ ఉంటాడు. రుద్రాణి డాక్టర్లను రాహుల్ కి ఎలా ఉంది అని అడగగా, ఇప్పుడు ఆయన చాలా బాగున్నాడు, డిశ్చార్జ్ చేస్తున్నాం అని అంటాడు.

స్వప్న ని తీసుకొని రావడానికి బయలుదేరిన కావ్య – రాజ్:
అదేంటి ఇందాకే నా బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయాడు కదా అని రుద్రాణి అడగగా, అది ఒత్తిడి కి గురి అవ్వడం వల్ల వచ్చింది, అతనిని ఒత్తిడికి గురి కానివ్వకుండా చూడండి అని అంటాడు డాక్టర్. అలా మాట్లాడుతున్న సమయం లో రాహుల్ ఇంజక్షన్ చేయించుకోలేదు అని అంటారు. అప్పుడు లోపలకు వెళ్లి చూడగా స్వప్న ని ఎత్తుకెళ్తున్న దృశ్యాలే నాకు గుర్తుకు వస్తున్నాయి, ఇంజక్షన్ వద్దు అని మారం చేస్తూ ఉంటాడు. మరో పక్క కనకం పెళ్లి జరగకుండా సమయాన్ని వృధా చేయిస్తూ ఉంటుంది.

కిడ్నాపర్ ని పోలీసులకు పట్టించి స్వప్న ని తీసుకెళ్లిన రాజ్ – కావ్య :
నీ వయస్సు ఎంత అని ఆ కిడ్నాపర్ ని అడగగా 37 ఏళ్ళు అని అంటాడు. అప్పుడు కనకం ముందుగా నీకు ముదిరిపోయినా బెండకాయ తో పెళ్లి చెయ్యాలి, ఆ తర్వాత ఈ అమ్మాయికి తాళి కట్టాలి అని అంటుంది. అప్పుడు ఆ కిడ్నపర్ మనుషులు ముదిరిపోయినా బెండకాయ ని తీసుకొని రాగా , కిడ్నాపర్ దానికి తాళి కడుతాడు. అయిపోయింది కదా, ఇప్పుడు నేను స్వప్న కి తాళి కట్టొచ్చా అని అడుగుతాడు. అప్పుడు కనకం బయట ఉన్న డోర్ వైపు చూస్తూ ఇంకా కావ్య, రాజ్ లు రాలేదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోపే వాళ్ళు వచ్చేస్తారు. కిడ్నాపర్ ని పోలీసులకు పట్టించి, అక్కడి నుండి స్వప్న ని తీసుకొని వెళ్ళిపోతారు. కనకం మొన్న విగ్రహాలు కాపాడారు, ఈరోజు నా కూతురి జీవితాన్ని కాపాడారు,.ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలము అల్లుడు గారు అని అనగా, స్వప్న ఇప్పుడు మీ ఇంటి పిల్ల కాదు, మా ఇంటి పిల్ల అది మా బాధ్యత అని అంటాడు.

స్వప్న రావడం చూసి షాక్ కి గురైన రాహుల్ – రుద్రాణి:
మరో పక్క రాహుల్ స్వప్న కనిపించలేదని ఇంట్లో కూర్చొని పెర్ఫార్మన్స్ చించేస్తూ ఉంటాడు. రుద్రాణి అతనిని ఓదారుస్తూ ఉంటుంది. సుభాష్ మరియు అపర్ణ స్వప్న ని అలా వదిలేసి వచ్చినందుకు రాహుల్ ని మందలిస్తారు. అప్పుడు రుద్రాణి ఇప్పుడు నా కొడుకుని ఎందుకు నిందిస్తున్నారు, వెనక నుండి తల మీద బలంగా కొడితే వాడు మాత్రం ఏమి చేస్తాడు. అసలే బాధపడుతున్న నా కొడుకుని ఓదార్చాల్సింది పోయి మందలిస్తారా అని అంటుంది రుద్రాణి. ఇలాగే రాజ్ చేస్తే మీరు ఇలా రెస్పాండ్ అవుతారా ? , రాజ్ కి ఒక రూల్ , రాహుల్ కి కి ఒక రూలా?, ఈ ఇల్లు ఇద్దరినీ వేరు చేసి చూస్తుందా అని రుద్రాణి అంటుంది.

అలా చర్చ నడుస్తూ ఉండగా స్వప్న తో కలిసి రాజ్ మరియు కావ్య వస్తారు. చచ్చిపోయింది అనుకున్న స్వప్న ని చూడగానే రాహుల్ , రుద్రాణి షాక్ కి గురి అవుతారు. అసలు స్వప్న ని ఎవరు తీసుకెళ్లారు అని సీతారామయ్య అడగగా, గతం లో స్వప్న పెళ్లి లో వెయిటర్ గా వచ్చి ఆమెని కిడ్నాప్ చేసిన వ్యక్తే, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లాడు అని అంటాడు రాజ్. ఎందుకు అని సీతారామయ్య అడగగా పెళ్లి చేసుకోవడానికి అని చెప్తాడు రాజ్. చంపమంటే పెళ్లి చేసుకోవాలి అనుకుంటావా?, నాకు కనిపిస్తే నేనే చంపేస్తాను అని రాహుల్ మనసులో తిట్టుకుంటాడు. వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు రాజ్, వాడ్ని నేనే చంపేస్తాను అని అంటాడు రాహుల్ . అంత అవసరం లేదు పోలీసులకు పట్టించాం అని అంటుంది కావ్య.