Brahmamudi అక్టోబర్ 4 ఎపిసోడ్ 218: దుగ్గిరాల కుటుంబం ఏర్పాటు చేసిన వినాయక చవితి పూజ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనకం, మూర్తి మరియు అప్పు వస్తారు. రాగానే కనకం అపర్ణ కి నమస్కారం పెడుతుంది, అపర్ణ కూడా తిరిగి నమస్కారం చేస్తుంది. అప్పుడు రుద్రాణి కనకం ముఖం అలా వెలిగిపోతుంది ఏంటి?, అప్పు తీరిపోతుంది అనే ఆనందమా?, లేదా ఇంటికి వచ్చామని ఆనందమా? అని అడగగా, రెండునూ అండీ అని సమాధానం చెప్తుంది కనకం.

వినాయక చవితి పూజ కోసం దుగ్గిరాల ఇంటికి వచ్చిన మూర్తి – కనకం :
అప్పుడు రుద్రాణి అవునులే, రూపాయి ఖర్చు చెయ్యకుండా వచ్చేది ఆనందమే కదా అని వ్యంగ్యంగా అంటుంది. అప్పుడు కావ్య దానికి సమాధానం ఇస్తూ కొంతమంది కి కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా ఆ అనందం దొరకదు అండీ అని అంటుంది. ఆ తర్వాత మూర్తి ఇప్పుడు మేమంతా ఇంత ఆనందం గా ఉండడానికి కారణం నువ్వే బాబు, మీరే కానీ మాకోసం అంత సహాయం చేసి ఉండకపోతే ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు అని రాజ్ కి కృతజ్ఞతలు తెలియచేసాడు.

కళ్యాణ్ – అనామిక పెళ్లి ఫిక్స్:
అలా మాట్లాడుకుంటున్న సమయం లోనే అనామిక తన తల్లితండ్రులతో కలిసి పెళ్లి సంబంధం మాట్లాడేందుకు ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పడానికి అనామిక మరియు కళ్యాణ్ భయపడుతూ ఉంటారు. అప్పుడు కావ్య నేను చెప్తాను అసలు విషయం, కళ్యాణ్ మరియు అనామిక ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడం కోసం మన ఇంటికి వచ్చారు అని అంటుంది. అందరు ఎంతో సంతోషిస్తారు.

అప్పుడు ఇందిరా దేవి ఈ విషయం లో కళ్యాణ్ తల్లిదండ్రుల నిర్ణయమే మా నిర్ణయం అని అంటారు. ధన్య లక్ష్మి మా అత్తమామలు , అన్నయ్య వదినలే ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం అని అంటుంది. అప్పుడు అపర్ణ కళ్యాణ్ కి మీరిద్దరూ తల్లిదండ్రులు, ఈ విషయం లో మీరే తుది నిర్ణయం తీసుకోవాలి అని అంటారు. అలా అయితే కళ్యాణ్ ఇష్టమే మా ఇష్టం అని సమాధానం ఇస్తుంది ధాన్య లక్ష్మి. అలా వినాయక చవితి రోజు ఈ మంచి కార్యక్రమం నిశ్చయం అయ్యింది.

తాతయ్య కోసం రాజ్ తనతో ఆడుతున్న నాటకం గురించి తెలుసుకొని కుప్పకూలిపోయిన కావ్య:
ఇది ఇలా ఉండగా రుద్రాణి మీ అమ్మాయిని మా కుటుంబానికి ఇవ్వడానికి మీకు ఉన్న అర్హతలు ఏమిటి అని అడుగుతుంది. మాకు మీ కుటుంబానికి ఉన్నంత పేరు లేదు కానీ, డబ్బు పరంగా , ఆస్తుల పరాంగ బాగానే సంపాదించాము అని సమాధానం ఇస్తాడు అనామిక తండ్రి. మీ ఇంట్లో పేదవాళ్ల కుటుంబం అని కూడా చూడకుండా, మీ అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసారు కదా, ఆ ధైర్యం తోనే అడగడానికి వచ్చాము అని అంటుంది అనామిక తల్లి. అప్పుడు రుద్రాణి అవును అది నిజమే, అక్కడ కూర్చున్నారు చూసావా ?, వాళ్ళు మట్టి కుండలకు రంగులు వేసుకునే వాళ్ళు అని అవమానించాలని చూస్తుంది. అప్పుడు రాజ్ నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం అండీ వాళ్ళు, తమ సొంత కష్టం తో బ్రతికేవాళ్లు అని సమాధానం ఇస్తాడు. అప్పుడు సుభాష్ అవునండి మేము ఆస్తి పాస్తులకంటే గుణం నే చూస్తాము , మాకు మీ అమ్మాయి నచ్చింది మీ సంబంధం ఇంకా బాగా నచ్చింది, మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం అని అంటాడు. ఇక ఆ తర్వాత వినాయక పూజ ఎవరు చెయ్యాలి అనే దాని పై ఇంట్లో ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్లు వాదనలు వేసుకుంటారు. అప్పుడు సీతారామయ్య ఇది ఇలా తేలాడు, పోటీని నిర్వహిస్తాము, ఎవరు గెలిస్తే వాళ్ళు పూజ చెయ్యాలి అని అంటాడు.అలా పోటీలు మొదలు అవుతాయి, ఇక రేపటి ఎపిసోడ్ ప్రోమో లో కావ్య రాజ్ రాసిన కోరికల చిట్టీ చదివి , అసలు విషయం తెలుసుకొని బాధపడుతుంది.