Brahmamudi అక్టోబర్ 5 ఎపిసోడ్ 219: వినాయకుడికి ఎవరు ముందుగా పూజలు చెయ్యాలి అనే దానిపై ఎటు తేల్చుకోకపోయేసరికి సీతారామయ్య మగవాళ్లకు, ఆడవాళ్లకు ముందుగా ఒక పోటీ పెడుతాడు. ఆ పోటీ లో ఆడవాళ్లు ఓడిపోతారు. ఆ తర్వాత భార్య భర్తలు జంటగా గురి చూసి బాణం వేసే ఆటని నిర్వహిస్తారు. ఈ ఆటలో ముందుగా స్వప్న – రాహుల్ పోటీ చేసి ఓడిపోతారు.

అప్పుని పక్కకి నెట్టేసిన అనామిక :
ఆ తర్వాత కళ్యాణ్ – అనామిక వంతు వస్తుంది. అప్పుడు కళ్యాణ్ అప్పు ని పిలిచి నువ్వు రా బ్రో, నువ్వుంటే కరెక్ట్ గా కొడుతాను అని అంటాడు. అప్పు సరే అని అక్కడికి వస్తుంది, ఇది చూసి ఉడికిపోయిన అనామిక, మధ్యలోకి వెళ్లి మీరెప్పుడు ఆదుకుంటూనే ఉంటారు కదా, ఇక్కడ కూడా మీరే ఆడాలా?, ఇదెక్కడి న్యాయం బ్రో, మీరు పక్కకి జరగనుంది అని అప్పు ని అంటుంది. అప్పుడు అనామిక మరియు కళ్యాణ్ బాణం వెయ్యడానికి సిద్ధపడుతారు. ఏంటి కవిగారు కాబొయ్యే పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని, మీ బ్రో తో కలిసి ఆడుతారా అని అనగా, అప్పుడే అసూయ మొదలైందా అని అంటాడు కళ్యాణ్.

పోటీలో గెల్చిన కావ్య – రాజ్ :
చివరికి వీళ్లిద్దరు కూడా గురి చూసి బాణం వెయ్యడం లో విఫలం అవుతారు. అప్పుడు ఇందిరా దేవి కుర్రోళ్ళు అయ్యుండి ఇలా ఆడుతున్నారు ఏందీ, అదే నేను మా బావ అయితే చాలా తేలికగా గెలిచేస్తాము అని అంటుంది, అప్పుడు సీతారామయ్య నేను రెడీ చిట్టీ అని అంటాడు. మీకు ఎందుకు తాతయ్య శ్రమ, మీ మనవడిగా , మీ వారసుడిగా మీ పేరు నిలబెట్టడానికి నేను ఉన్నాను కదా అని కావ్య తో కలిసి వస్తాడు రాజ్. కరెక్ట్ గా గురి చూసి కొట్టి, పూజ చేసే అర్హత సంపాదిస్తారు. ఇదంతా అనామిక చూసి, ఆ పూజ చేసే స్థానం లో మనం ఉండాల్సింది అంటూ నిరాశ చెందుతూ ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ నేను గెలిచినా మా అన్నయ్య గెలిచినా ఒక్కటే, నువ్వు అలాంటివి ఏమి పెట్టుకోకు అని అంటాడు. కొత్త కోడలిగా పూజ ముందు నేనే చెయ్యాలి అని నాకు ఉంటుంది కదా అని అనామిక అనగా, దగ్గర్లోనే దసరా ఉంది , అలాగే దీపావళి కూడా ఉంది అప్పుడు చేద్దాంలే అని అంటాడు కళ్యాణ్.

రాజ్ తనని ప్రేమించడం లేదని నిజం తెలుసుకొని కుప్పకూలిపోయిన కావ్య:
కళ్యాణ్ – అనామిక ని చూసి ఎందుకో ఎదో తెలియని బాధతో ఉంటుంది అప్పు. ఇది గమనించిన ధాన్య లక్ష్మి ఏంటి అప్పు అంత డల్ గా ఉన్నావు అని అడుగుతుంది. అలా ఏమి లేదు ఆంటీ, మీరే బాగా అలిసిపోయినట్టు ఉన్నారు అని అంటుంది అప్పు. అప్పుడు ధాన్య లక్ష్మి నిజమే అప్పు, ఏమి అనుకోకపోతే ఈ పూల దండాన్ని గుమ్మానికి కడుతావా అని అడుగుతుంది. దీనికి మీరు ఇంతగా అడగాలా ఆంటీ, ఇలా ఇవ్వండి అని తీసుకుంటుంది. అప్పుడు కళ్యాణ్ అక్కడికి వచ్చి , ఏమిటి బ్రో అన్ని సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు, అనామిక వాళ్ళ ఇంట్లో వాళ్ళను తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వస్తుంది అనే ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను అని అంటాడు.

అప్పుడు అప్పు నేనేమైన నీ పర్సనల్ అసిస్టెంట్ అనుకుంటున్నావా ?, నాకు పనులు ఉండవా అని కోపం గా సమాధానం చెప్తుంది. ఏంటి బ్రో అంత కోపం గా ఉన్నావ్, అనామిక తో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. అప్పుడు అప్పు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకు ఎందుకు అని అంటుంది. అలా వాళ్ళ మధ్య సీరియస్ గా చర్చ నడుస్తున్న సమయం లో అనామిక కళ్యాణ్ ని పిలిచి తీసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత కావ్య తమ ఇంటి పత్రాలను రాజ్ చేతుల మీదుగా తన తల్లి దండ్రులకు ఇప్పిస్తుంది. మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో రాజ్ రాసిన కోరికల చీటీ చదివి, అసలు నిజం తెలుసుకొని కావ్య కుప్ప కూలిపోతుంది.