Brahmamudi సెప్టెంబర్ 15 ఎపిసోడ్ 202: పని మనిషి డబ్బు సహాయం కావాలని కోరి అపర్ణ వద్దకి వస్తే ఆమె చెయ్యదు, దీనిని అడ్డం పెట్టుకొని అపర్ణ మరియు కావ్య మధ్య గొడవ పెట్టడానికి ప్లాన్ వేస్తుంది రుద్రాణి. పని మనిషి వద్దకు వెళ్లి నీకు డబ్బు సహాయం కావాలంటే కావ్య మేడంని వెళ్లి అడుగు అని అంటుంది. కావ్య ని అడగగా, ఆమె రాజ్ ని డబ్బులు అడిగి పని మనిషికి ఇవ్వడానికి క్రిందకి వస్తుంది.

కావ్య – అపర్ణ కి గొడవ పెట్టేసిన రుద్రాణి :
ఈ విషయం రుద్రాణి ద్వారా తెలుసుకున్న అపర్ణ కావ్య ని కడిగిపారేయడానికి వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నేను వద్దు అన్న తర్వాత కూడా ఆ పని మనిషికి డబ్బులు ఇవ్వాలని చూస్తావ్ అని అంటుంది. అప్పుడు కావ్య నిజంగా మీరు వద్దు అన్నారు అనే విషయం నాకు తెలియదు అత్తయ్య అంటుంది. అప్పుడు రుద్రాణి ఎందుకు సొల్లు చెప్తున్నావ్, నీకు అన్నీ తెలిసే ఆ పని చేసావ్, పని మనిషి నీతో మాట్లాడిన మాటలు నేను విన్నాను అంటూ అబద్దం చెప్తుంది.

తన హక్కుల గురించి అపర్ణతో బలంగా మాట్లాడిన కావ్య :
ఇక అపర్ణ నిప్పులు తొక్కిన కోతి లాగ కావ్య మీద విరుచుకుపడుతుంది. ఈ ఇంటి డబ్బుని ఏ అధికారంతో తీసుకొని ఇస్తున్నావ్, ఇంతకు ముందు కూడా ఇలాగే మీ పుట్టింటికి డబ్బులు దోచి పెట్టావు. ఇప్పుడు నువ్వు ఇస్తున్న డబ్బు నువ్వు కస్టపడి సంపాదించిన డబ్బులా?, డిజైన్స్ వేసి సంపాదించావా?, నా కొడుకు డబ్బుని ముట్టుకోడానికి నువ్వు ఎవరూ అంటూ నిలదీసింది. అప్పుడు కావ్య మీరు ఈ ఇంటికి కోడలు అయ్యినప్పుడు, మీ అత్తయ్య గారు కూడా మిమల్ని ఇలాగే ప్రతీ విషయం లో ఆపేవారా?, డబ్బు మీద అధికారం ఇవ్వలేదా?, ఈ ఇంటి కోడలిగా నా భర్త డబ్బులు వాడుకోవడానికి నాకు పూర్తిగా అధికారం ఉంది అని అంటుంది. భర్తనా?, కళ్యాణ్ ఎదో నిన్న మనిషి లాగ చూసి, జాలి పడుతుంటే నిన్ను భార్య గా వాడు అంగీకరించాడని అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు కావ్య ఈ ఇంటి కోడలిగా అప్పట్లో మీకు ఎన్ని అధికారాలు ఉన్నాయో, ఇప్పుడు నేను ఈ ఇంటి పెద్ద కోడలిగా అలాంటి అధికారాలు పొందేందుకు అర్హత ఉన్న దానిని అంటూ చెప్పుకొచ్చింది కావ్య .

అపర్ణ ని తీవ్రంగా అవమానించిన రాజ్:
ఇక అపర్ణ నిప్పులు తొక్కిన కోతి లాగ కావ్య మీద విరుచుకుపడుతుంది. ఈ ఇంటి డబ్బుని ఏ అధికారంతో తీసుకొని ఇస్తున్నావ్, ఇంతకు ముందు కూడా ఇలాగే మీ పుట్టింటికి డబ్బులు దోచి పెట్టావు. ఇప్పుడు నువ్వు ఇస్తున్న డబ్బు నువ్వు కస్టపడి సంపాదించిన డబ్బులా?, డిజైన్స్ వేసి సంపాదించావా?, నా కొడుకు డబ్బుని ముట్టుకోడానికి నువ్వు ఎవరూ అంటూ నిలదీసింది. అప్పుడు కావ్య మీరు ఈ ఇంటికి కోడలు అయ్యినప్పుడు, మీ అత్తయ్య గారు కూడా మిమల్ని ఇలాగే ప్రతీ విషయం లో ఆపేవారా?, డబ్బు మీద అధికారం ఇవ్వలేదా?, ఈ ఇంటి కోడలిగా నా భర్త డబ్బులు వాడుకోవడానికి నాకు పూర్తిగా అధికారం ఉంది అని అంటుంది.

భర్తనా?, కళ్యాణ్ ఎదో నిన్న మనిషి లాగ చూసి, జాలి పడుతుంటే నిన్ను భార్య గా వాడు అంగీకరించాడని అనుకుంటున్నావా అని అంటుంది. అప్పుడు కావ్య ఈ ఇంటి కోడలిగా అప్పట్లో మీకు ఎన్ని అధికారాలు ఉన్నాయో, ఇప్పుడు నేను ఈ ఇంటి పెద్ద కోడలిగా అలాంటి అధికారాలు పొందేందుకు అర్హత ఉన్న దానిని అంటూ చెప్పుకొచ్చింది కావ్య .