Brahmamudi సెప్టెంబర్ 18 ఎపిసోడ్ 204: ఇంట్లో వాళ్లకు దూరంగా వేరు కుంపటి పెట్టిన అపర్ణ : అపర్ణ ఇంట్లో అందరితో మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకొని తన పనులు తానే చేసుకోవడం, తన వంట తానే చేసుకోవడం వంటివి చేస్తుంది. ఇదంతా చూసి ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. చివరికి ఇంట్లో వాళ్ళతో కలిసి డైనింగ్ టేబుల్ వద్ద అన్నం తినడానికి కూడా ఇష్టపడడు. నేరుగా వంటింట్లోకి వెళ్లి, తానూ చేసిన కూర ని తెచ్చుకొని సపరేట్ గా కూర్చొని తింటూ ఉంటుంది.

అప్పుడు ఇందిరా దేవి, ఏంటి అక్కడ కూర్చొని తింటున్నావ్ అని అడగగా, అపర్ణ దానికి ఈరోజు నుండి నా పనులన్నీ నేనే చేసుకుంటా, నాకు ఈ ఇంట్లో మనుషులతో సంబంధం లేదు అని అంటుంది. ఇలా వేరు కుంపటి పెట్టి మన కొత్త కోడళ్ళకు ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నావు?, గొడవ పడితే విడిపోమని చెప్తున్నావా అని అంటుంది. సుభాష్ కూడా ఈ ఇంటి పెద్ద కొడుకుగా నువ్వు మాతో కూర్చొని తింటే కానీ ఒక్క మెతుకు కూడా ముట్టుకోను అని అంటాడు.

అపర్ణ ని ఇంటి నుండి వెళ్ళిపో అని ఆదేశించిన ఇందిరా దేవి :
అపర్ణ నిర్ణయానికి చిరాకు పడిన ఇందిరా దేవి , ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న నువ్వు, మరో నిర్ణయం కూడా తీసుకోవాల్సిందే అంటూ లోపలకు చాలా కోపం గా వెళ్తుంది. ఏంటి ఈమె ఇంత ఎమోషనల్ గా వెళ్ళింది అని రుద్రాణి మనసులో అనుకుంటూ ఉండగా, ఇందిరా దేవి ఆస్తి పాత్రలను తీసుకొచ్చి అపర్ణ కి ఇస్తుంది. విడిపోవాలి అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో విడిపోవాలి. ఆస్తి మొత్తం నీ చేతిలోని ఉంది, ఎవరిది వారికి పనిచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది.

అప్పుడు అపర్ణ అంత తప్పు నేనేమి చేశాను అత్తయ్య, కనీసం బాధపడేందుకు కూడా నాకు స్వేచ్ఛ లేదా అని అంటుంది. ఉందమ్మా నీకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంది, అలాగే ఆస్తి మొత్తం నీ చేతిలోనే ఉంది, మేమెవ్వరం నీకు అడ్డు రాము, నీకు ఇష్టమొచ్చినట్టు చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాది. ఆ తర్వాత ఇందిరా దేవి తో పాటుగా ఇంట్లో వాళ్ళు కూడా భోజనం చేయదనే వెళ్ళిపోతారు. అప్పుడు అపర్ణ ఎవ్వరు అన్నం తిన్నా తినకపోయినా నేను మాత్రం తింటాను అని బలవంతంగా తినాలని చూస్తుంది కానీ, ఆమె కూడా తినదు.

కళ్యాణ్ కి ప్రపోజ్ చెయ్యబోతున్న అనామిక:
మరోపక్క అనామిక కళ్యాణ్ కి తన ప్రేమ విషయం ఇక చెప్పేయాలని అనుకుంటుంది. అతనికి మెసేజి చేసి కేఫ్ దగ్గరకి రా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు కళ్యాణ్ అంత ముఖ్యమైన విషయం ఏమిటబ్బా అని అడుగుతాడు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అని అంటుంది అనామిక. అయితే కచ్చితంగా వస్తాను అని రిప్లై ఇస్తాడు. జీవితానికి సంబంధించిన విషయం అని అంటుంది కాబట్టి, కచ్చితంగా ప్రపోజ్ చెయ్యాలని అనుకుంటుంది అని మనసులో అనుకుంటాడు కళ్యాణ్. ఇక కళ్యాణ్ ఇందిరా దేవి వద్దకి వచ్చి అపర్ణ విషయం లో బాధపడుతూ ఉంటాడు. అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది?, జరిగిన సంఘటన లో కావ్య తప్పు ఏమాత్రం కూడా లేదు, తప్పు లేనప్పుడు నేను అమ్మ వైపు ఎలా ఉండేది, రేపు కావ్య ఏదైనా తప్పు చేస్తే మీ అమ్మకి ఒక న్యాయం, నాకు ఒక న్యాయం అని అంటుంది కదా అని అంటాడు. రాజ్ మాట్లాడేది మొత్తం కావ్య వింటుంది, నా వల్ల ఇంట్లో ఇంత మంది బాధపడుతున్నారు, నేనే ఎదో ఒకటి చెయ్యాలి అని అనుకోని అపర్ణ వద్దకి వెళ్తుంది.

అపర్ణ కావ్య ని చూడగానే కోపం తో అక్కడి నుండి వెళ్లిపోవాలని చూస్తుంది. అప్పుడు కావ్య నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని అంటుంది, అప్పుడు అపర్ణ నాకు ఏమాత్రం ఆసక్తి లేదు అంటుంది. మాట్లాడకపోయినా కనీసం వినండి అంటుంది, ఆ అవసరం కూడా లేదు అని అక్కడి నుండి వెళ్లేందుకు ప్రయత్నం చెయ్యగా కావ్య అడ్డు పడుతుంది. నేను చెప్పింది వినాల్సిందే అని మొండికేసి, అసలు నిజం చెప్పాలని చూస్తుంది. పని మనిషికి మీరు డబ్బులు ఇవ్వొద్దు అన్నారనే విషయం నిజంగా నాకు తెలియదు అని అనగా, అప్పుడు అపర్ణ ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు నేనేమి చెయ్యాలి, నా కుటుంబం మొత్తం నాకు దూరం అయ్యింది, అందరూ నిన్న సింహాసం ఎక్కించారు, నీ రాజ్యం ఇక నువ్వు ఏలుకో అని చెప్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.