NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 1 2024 Episode 372: Brahmamudi : ఇంటి నుండి బయటకు వెళ్లడానికి రాజ్ సిద్ధం..సింహాసనం కోసం, పోటీ పడుతున్న గుంట నక్కలు.. సుభాష్ అదిరిపోయే ట్విస్ట్..?

Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights

Brahmamudi April 1 2024 Episode 372: కావ్య బాబుకి బొమ్మలు కొనుక్కొని వెళ్తూ కనకం కృష్ణ మూర్తిలకు ఎదురవుతుంది. కూతుర్ని చూసి బాధపడతారు తల్లిదండ్రులు. ఏంటిది ఆ ఇంటి రాజు గారి భార్యవి సవతి కొడుక్కి బొమ్మలు తీసుకొని వెళ్తున్నావా అంటే అక్కడ పరిస్థితులతో నువ్వు అలవాటు పడిపోయావా అని అంటుంది కనుకమ్ కోపంగా, బంగారు గర్దయినంత మాత్రాన పీక కోసుకుంటామా అని, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మేము చూడలేకపోతున్నాము అని అంటుంది. వెంటనే కృష్ణమూర్తి కూడా కూతుర్ని చూసి ఏంటమ్మా ఇదంతా ఆరోజు నిన్ను మాతోపాటు ఇంటికి రమ్మన్నాను నువ్వు రాకుండా దుగ్గిరాల ఫ్యామిలీని ఎదిరిస్తాను నిలబడి కడిగేస్తాను అని అన్నావు ఇప్పుడేమో ఆ బిడ్డకి బొమ్మలు తీసుకెళ్లి ఆయాగా మారిపోయావు అతనికి తీరని అన్యాయం చేశాక వదిలేసి రావచ్చు కదా నిన్ను మేము మా ఇంట్లోకి రావద్దని అన్నామా ఇంకా ఆ ఇంట్లోనే పడి ఉండమని చెప్పామా అని అంటాడు అయినా మీ అత్తింటి పరుగు తీసి వాళ్ళని వీధిలోకి లాగుదాం పదహకవ్య ఇటు నుంచి ఇటే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అయినా నీకు ఇంకేం కర్మ భర్త మోసగాడు అయినా సరే పుట్టింటికి రా వద్దని చెప్పే సాటి తల్లిదండ్రుల్లాగా కనిపిస్తున్నామా నీకు నువ్వు అలా అనుకుంటున్నావా ఆ ఇంటి మీద నీ భర్త కేసు పెట్టి మనం మన ఇంటికి వెళ్లి పోదాం పద అని కన్నీళ్లతో కనకం అంటుంది ఇక కావ్య మాట్లాడటం మొదలు పెడుతుంది.

Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights
Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights

ఇక కాపీ మాట్లాడుతూ కేసు పెడదామమ్మ నువ్వు అన్నట్లు అతను మనకు చాలా అన్యాయం చేశాడు కదా కేసు పెట్టి అతని మర్యాదల్ని మనం తీసేద్దాము. స్వప్న మోసం చేసి అక్కడ కూర్చో పెట్టినప్పుడు ఆయన నాకు తాళి కట్టాడు. అందుకు మనం కేసు పెడదాం. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి రోడ్డును పడితే ఆయన కాపాడి మన ఇంటిని మనకు వచ్చేలా చేసాడు అందుకు కూడా మనం కేసు పెట్టొచ్చు పరువు తీసేయొచ్చు విగ్రహాలు ఎత్తుకెళ్లి రౌడీలు ప్రాణాలు తెగించి తను పోరాడి మళ్ళీ తిరిగి మన విగ్రహాలు మనకు తెచ్చేలా చేశాడు అందుకే అలాంటివాన్ని మనం ఎలా క్షమిస్తాము కేసు పెట్టేద్దాం అంటూ వరుసగా రాజు చేసిన ప్రతి మంచి పనిని గుర్తు చేసి,ఇప్పుడు మనం కేసు పెడదామా అని అంటుంది. అప్పుడు వెంటనే బాగా ఉన్నప్పుడు అల్లుడుగారు అని గౌరవించి బాగా లేనప్పుడు రోడ్డుకి ఏడుద్దాం అంటారా అని ఇంట్లో అంతా ఆయనకి ఆల్రెడీ శిక్ష విధించారు అమ్మ ఎవరు ఆయనతో మాట్లాడలేదు అలాంటప్పుడు నేను కూడా మాట్లాడకుండా ఉండాలా, అందరూ శిక్ష వేస్తే నేను శిక్ష వేయాలా ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నాడు ఆయనకి నా అవసరం ఉంది ఆయన తప్పు చేయలేదని నాకు ఇంకా నమ్మకం ఉంది అలా కాకుండా నిజంగా ఆయన తప్పు చేశాడని తెలిసిన రోజు నేనే మన ఇంటికి వచ్చేస్తాను అంతవరకు నా భర్తను ఎవరేమైనా అంటే నేను ఊరుకోను ఇంకొకసారి మీరు ఇలా మాట్లాడొద్దు నా భర్త నిజంగా తప్పు చేసాడు అని తెలిస్తే నేనే అతడికి తగిన బుద్ధి చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాను మీ కూతురుగా మీ ఇంటికి వచ్చేస్తాను అప్పుడు కూడా ఆయన మీద కేసు పెట్టను. నాకు ఇంతే అనుకొని అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాను కానీ అయినమి అనను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు బాధగా అలా చూస్తూ ఉండిపోతారు.

Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights
Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights

ఇక మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రచ్చ మొదలవుతుంది. అంత సీరియస్ గా హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడే రాజు బిడ్డతో ఇంటికి వస్తాడు రాజ్ ని చూసి రుద్రాణి మనసులో పొంగిపోతూ ఉంటుంది. ఇక రచ్చ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు. ఇక సింహాసనం మీద పులి కూర్చుంటుంది. సునకం కూర్చుంటుందో సునకం అంటే నాకొడుకే కదా ఛీ అలా అనకూడదు ఏది ఏమైనా నా కొడుకుని కూర్చో పెట్టాలి అని మనసులో రుద్రాణి అనుకొని ఈ అనంతరం సాగర సమస్య సాగాలి అనుకుంటూ మనసులో రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజ్ బిడ్డతో సహా ఇంట్లోకి వస్తాడు ఇక అపర్ణాదేవి స్టార్ట్ చేస్తుంది నీతో మాట్లాడకూడదని ఒక శాసనం కానీ మాట్లాడక తప్పట్లేదు తల్లి మాటలే కదా మాట్లాడేది పోయేదేముంది మమ్మీ అని అంటాడు అపర్ణాదేవి ఆవేశంగా పైకి లేచి పెద్దరికం పోయింది. మాట పోయింది ఈ ఇంటి పరువు భుజాన వేసుకొని ఈరోజు ఆఫీస్ కి వెళ్ళాము. ఆ వరుణ్ దింపుకోమంటే వినడం లేదు అంటూ సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇందిరాదేవి లేచి రాజుని నిలదీయడం మొదలు పెడుతుంది ఈరోజు ఈ బిడ్డ ఆఫీసుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నావు సరే మరి ఆ బిడ్డని ఎవరంటే ఏం చెప్తావ్ అని అంటుందిరాదేవి నా బిడ్డ అని చెప్తాను అని అంటాడు రాజ్. మరి ఆ బిడ్డకు తల్లి ఎవరంటే ఏం చెప్తావ్ అని అంటుంది. ఇక అందరూ ఏం చెప్తాడు అని చూస్తూ ఉంటారు రాజ్ మాత్రం మౌనంగా ఉంటాడు. నువ్వు సమాధానం చెప్పవు సమాధానం దొరికే వరకు సమాజం నీ జీవితం మీద ఏదో ఒక కథనాలు రాస్తూనే ఉంటుంది నువ్వు నీ బిడ్డని ఆఫీస్ కి తీసుకెళ్లడానికి సంజయ్ ఏంటి అని అపర్ణాదేవి అడుగుతుంది. మీరంతా నన్ను బాబుని వెలివేశారు ఇక్కడే వదిలేసి అతిధి కొడుకు లాగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్లడం నాకు ఇష్టం లేకే నేను ఆఫీస్ కి తీసుకెళ్ళాను అని అంటాడు. అందుకని వెంట తీసుకెళ్లి పరువు తీస్తావా అంటుంది అపర్ణ. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల 10 మంది మాట్లాడుకునేలా చేసింది అని అంటుంది అపర్ణ ఆ పది మంది ఇంట్లోనే ఉన్నారు కదా అని అంటాడు రాజ్.ఇక చాన్స్ దొరికింది అనుకుంటుంది రుద్రాణి. నీకు అర్థం కావట్లేదు వదిన, రాజ్ అంతా స్పష్టంగా చెప్తున్నాడు ఇంకా ప్రశ్నలు అడుగుతున్నావా నువ్వు ఇంట్లో నువ్వు చెప్పింది ఏం జరిగింది? నీకున్న కోపానికి రాజును బిడ్డతో సహా రానివ్వకుండా బయటే ఉంచుదాం అనుకున్నాను కానీ రాశి తో మాట్లాడొద్దంటే వాడి భార్య మాత్రం అన్ని సపరిలు చేస్తూ ఉంటుంది ఏ విషయం మనం ఆపగలిగా ఏ విషయాన్ని నువ్వు ఆపగలిగావు అని అపర్ణాదేవికి ఇంకా కోపం పెరిగేలా చేస్తుంది.అయిపోయింది ఈ సమస్య రాజ్ మొక్కుబడి సమాధానంతో మురిసిపోయింది అంతే తప్ప పరిష్కారం మాత్రం కాదు ఒకప్పుడు నా కొడుకు అమ్మాయిలతో తిరుగుతున్నాడు నీ కంపెనీ దూరం చేశారు మరి ఈరోజు రాజ్ చేసింది ఏంటి అలా చూస్తే రాజ్ చేసిన తప్పు కాకపోతే ఆరోజు నా కొడుకు చేసింది కూడా తప్పుకాదు అని వాదన మొదలు పెడుతుంది రుద్రాణి. సింహాసనం కోసం ఫైట్ మొదలైంది ఇక రాజ్ కరెక్టే అయితే రాహుల్ కూడా కరెక్టే అని రుద్రాణి అనడంతో వెంటనే ప్రకాశం మాట్లాడటం మొదలు పెడతాడు ఇప్పుడు నువ్వే చెప్తున్నావా తప్పులు గురించి అని అంటాడు మరి నువ్వు చెప్పు చిన్నన్నయ్య అని అంటుంది రుద్ర అని ఇలా అందరికీ మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నావు పులిలా ఉండేవాడివి దోషలా నిలబడ్డావు అని రాజ్ బిడ్డని ఆఫీస్ కి తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని ప్రకాశం అంటాడు.

Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights
Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights

ఇక చూసావా ఎప్పుడు రుద్రాణి అడ్డుపడే నేను ఏం చేయలేకపోతున్నాను. నువ్వు చేసింది అంతా తప్పే అంటున్నారు చివరికి బాబాయ్ కూడా నేను సమర్థించలేకపోతున్నారు అని అపర్ణ దేవి అంటుంది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు మమ్మీ అని అంటాడు రాజ్ పరిష్కారాలు రెండే ఉన్నాయి రాజ్. ఒక తప్పుకి పరిహారం చెల్లించక తప్పదు ఇంకొకటి పశ్చాతాపం చెందకు తప్పదు చేసిన తప్పక పశ్చాతాపంగా బిడ్డని వదిలేసి రా లేదంటే దీనికి పరిహారంగా నువ్వే కంపెనీ బాధ్యతలని వదిలేసుకోక తప్పదు అని అపర్ణాదేవి కరాకండిగా చెప్పేస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు రాజుతో సహా అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుందని రాహుల్ రుద్రాణి ఒకరికి ఒకరు సరిగా చేసుకుంటూ అనుకుంటారు ఈ అపర్ణ ఏం మాట్లాడుతున్నావ్ అని సుభాష్ అంటాడు నేను మాట్లాడేది కరెక్టేనండి అని అంటుంది అపర్ణ వాడివి కంపెనీకి కోట్లలో టర్న్ అవర్ తెచ్చాడు మేమంతా కలిసి బాధ్యతలు అప్పగించాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు చేస్తే కంపెనీ కోట్లలో నష్టం వస్తుంది అని అంటాడు సుభాష్ మీరు కంపెనీ నష్టాలు గురించి మాట్లాడుతున్నారు నేను ఇంటి పెద్ద కోడలుగా వంశ నష్టం గురించి మాట్లాడుతున్నాను అని అంటుంది. నేను కూడా ఈ ఇంటి కోడలుగా మాట్లాడుతున్నాను బావగారు రాజ్ కు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ తానే పోగొట్టుకున్నాడు ఆ బిడ్డను వదిలేసి వస్తే ఏ గొడవ ఉండదు కదా అని ధాన్యం అంటుంది. అక్క కరెక్ట్ గానే మాట్లాడుతుంది తన కొడుకు తప్పు చేస్తే నిలదీస్తుంది అంతేకానీ తన కొడుకు తప్పు చేశాడని సమర్థించట్లేదు కదా అక్క చెప్పింది దాంట్లో న్యాయం ఉంది అని అంటుంది ధాన్యం.చెప్పు రాజ్ అని అపర్ణ దేవి అంటుంది ఏం చెప్పాలి మమ్మీ అని అంటాడు రాజ్. అధికారం కోసం రక్త సంబంధాన్ని వదులుకోవాలా రక్తసంబంధం కోసం అధికారాన్ని వదులుకోవాలా అసలు అంత ఆలోచన నాలో లేదు నాలో ఏ పశ్చాత్తాపం లేదు నేనే తప్పు చేయలేదు పరిహారం చెల్లించడానికి భయం లేదు నేను కంపెనీ చూసుకోవడానికి నాకు అర్హత లేదని మీరందరూ అనుకుంటే సంతోషంగా కంపెనీ బాధ్యతలు నుంచి తప్పుకుంటాను అంతేగాని ఈ పసివాడిని అనాధని మాత్రం చేయను అని రాజ్ కరాకండిగా చెప్పేస్తాడు. దాంతో అపర్ణాదేవి ఇందిరాదేవి ఇద్దరు షాక్ అవుతారు. రుద్రాణి అనామిక మాత్రం చాలా సంతోషిస్తారు. ఇక నేను ఈ బిడ్డ బాధ్యత తీసుకున్నాక తల్లి చెప్పిన విను తండ్రి చెప్పిన వినను మీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉంటాను లేదంటే మీరు ఇంట్లో నుంచి వెళ్లిపోమంటే వెళ్ళిపోతాను అంతేకానీ బిడ్డని వదిలేయమంటే మాత్రం వదిలేయలేను నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదు ఇక నేను ఇంట్లో ఉండాలా లేదా అనే నిర్ణయం మాత్రం మీకే వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకొని చెప్పండి అని రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అపర్ణాదేవి షాక్ అవుతుంది ఇక్కడ సీనైతే అసలు ఒక లెవెల్ లో ఉంటుంది కానీ ధాన్యలక్ష్మి అనామిక రుద్రాణి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు.

Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights
Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights

రేపటి ఎపిసోడ్ లో, సింహాసనం కోసం పోటీ పడుతూ ఉంటారు. కళ్యాణ్ కి అధికారం ఇవ్వాలని అనామిక అంటుంది ఏ అర్హత లేకుండా ఏ ఇంట్రెస్ట్ లేని కళ్యాణ్ కి ఆఫీస్ బాధ్యతలు అప్ప చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ ఉన్న రాహుల్ కి ఇవ్వడం బెటర్ అని స్వప్న అంటుంది. ఇక సుభాష్ ఈ ఇంట్లో రాజ్ తర్వాత అతని ప్లేస్ లో ఉండే వ్యక్తి ఒకళ్ళే ఉన్నారు అని ఆ ఒక్కరు ఎవరో కాదు నా కోడలు కావ్యా అని అంటాడు ఆ మాటతో అందరూ షాక్ అవుతారు. సుభాష్ నిర్ణయంతో ఇందిరా దేవి సంతోషిస్తుంది కానీ అనామిక రుద్రాణి కోపంగా చేస్తూ ఉంటారు.

Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights
Brahmamudi Today Episode April 1 2024 Episode 372 highlights

author avatar
bharani jella

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella