NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights

Brahmamudi April 19 2024 Episode 388: కావ్య ఉదయం గుడికి వెళుతుంది.ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.అప్పుడే రుద్రానికి ఎందుకు వచ్చి నీ కోడలు గుడికి వెళ్ళింది వదిన,ఇంట్లో టీ పెట్టే వాళ్లే లేరు అని ధాన్యం వైపు చూస్తూ నీ కోడలు టీ పెట్టమని చెప్పొచ్చు కదా అని అంటుంది. ధాన్యం నీ కోడలైన టీ పెట్టొచ్చు అని అంటుంది. వెంటనే స్వప్న కోడలు అందరూ టీ మాస్టర్ లా ఏంటి? ఇంతకుముందు ఈ ఇంట్లో అత్తలకు టీ పెట్టడం రాదా అని అంటుంది. వెంటనే ధాన్యంనువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అని అడుగుతుంది నేను మిమ్మల్ని ఎక్కడ అన్నాను మా అత్తకి చెప్తున్నాను అని అంటుంది స్వప్న.ఇంతకుముందు ఎప్పుడూ టీ తాగనట్టు పెట్టుకొని కావ్య రాకముందు ఈ ఇంట్లో టీ పెట్టడం ఎవరికీ చేతకానట్టు, మీరు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. ఇంట్లో టి అనేది ద్రౌపదార్థం ఇంతవరకు ఎవరు చూడనట్లు మాట్లాడుతున్నారు అని అంటుంది. ఇక వద్దులే ధాన్యం ఆపేసే లేదంటే టీ కప్పులో తుఫాను వచ్చేలా ఉంది. అని రుద్రాణి అంటుంది ఇక అప్పుడే పైన బాబు ఏడుస్తూ ఉంటాడు ఆ ఏడుపు కిందకి వినిపిస్తూ ఉంటుంది.

Brahmamudi Today Episode April 19 2024 Episode highlights
Brahmamudi Today Episode April 19 2024 Episode highlights

ఇక రాజ్ గదిలో బాబుని ఏడవద్దు అని చెబుతూ సముదాయిస్తూ ఉంటాడు కానీ వాడు పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. ఇక కింద హాల్లో అందరూ కూర్చొని ఉంటారు బాబు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది ధాన్యం. ఆకలేస్తుంది మా అత్తయ్య అని అంటుంది అనామిక, వెంటనే రుద్రాణి వాళ్ళ అమ్మ కానీ అమ్మ పాలు ఉగ్గు అన్ని ఏర్పాటు చేసే గుడికి వెళ్ళిందిలే అని అంటుంది. అయినా ఇక్కడ బాబు అంతలా ఏడుస్తుంటే వాళ్ళ నాన్నమ్మకి ఏమీ అనిపించట్లేదు వాళ్ల తాతయ్య చెట్టులా ఉండి కూడా ఏమీ మాట్లాడడం లేదు అని అంటుంది రుద్రాణి. ఇంతమంది ఉన్నారు కదా బాబు ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కోవాలని మీకు అనిపించట్లేదా అంటుంది స్వప్న. నువ్వు పెద్దమ్మ వే కదా వరసకి వెళ్లి అడుగు ఏమైందో అని అంటే నేను తల్లిని కాబోతున్నాను తల్లిని కాదు ఈ ఇంట్లో తల్లులు ఎంతమంది ఉన్నారు మాతృ హృదయం ఒక్కరి కి కూడా స్పందించట్లేదు అని అంటుంది స్వప్న. ఎవరో అక్కడనుంచి కదలకపోయేసరికి సీతారామయ్య చిట్టి నువ్వు వెళ్లి చూడు అని ఇందిరా దేవికి చెప్తాడు. ఇప్పటివరకు ఈ ఇంట్లో ఒక లైనా కదులుతారు ఏమో అనుకున్నాను ఒకరికి కూడా హృదయం లేదని అర్థమైంది అని నేనే వెళ్తాను అని లేస్తూ ఉంటుంది ఇందిరా దేవి అప్పుడే స్వప్న ఉండండి అమ్మమ్మ నేను వెళ్లి బాబుని కిందకు తీసుకు వస్తాను అని అంటుంది. అప్పుడే కావ్య ఇంట్లోకి వస్తూ ఉంటుంది వెంటనే రుద్రాణి మీరెవరు వెళ్లాల్సిన పనిలేదు అదిగో వాళ్ళ అమ్మగారి అమ్మ ఆపద్బాంధవురాలు లాగా వచ్చింది. అని రుద్రాణి సెటైర్ వేస్తుంది వెంటనే స్వప్న కావ్య లోపలికి రాగానే బాబు ఎందుకో ఏడుస్తున్నాడే వెళ్లి చూడు అని అంటుంది. హడావిడిగా పైకి వెళ్తుంది కావ్య.

Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights
Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights

ఇక కావ్య పైకి వెళ్లి రాజ్ తో ఏమైంది అని అడుగుతుంది. బాబు ఎందుకో ఏడుస్తున్నాడు అని చెప్తాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది ఏమో పాలు పెట్టాను అయినా కానీ ఏడుస్తున్నాడు ఒకసారి వాంటింగ్ కూడా అయింది అని అంటే బాబు నీ ఎత్తుకొని బాబు ఒళ్ళు వేడిగా ఉంది జ్వరం వచ్చింది ఏమో కిందకి వెళ్దాం పదండి హాస్పిటల్ కి తీసుకెళ్దాం అని అంటుంది హాస్పిటల్ కి ఎందుకు డాక్టర్ గారిని అడిగితే టానిక్ ఇస్తాడు కదా అని అంటాడు రాజ్. ఏం కన్నతండ్రి అండి మీరు బాబుని ఇంట్లో ఉండి టానిక్ వేసే కన్నా హాస్పిటల్లో డాక్టర్ సంరక్షణలో ఉంచడం మంచిదా? ఇలాంటి పరిస్థితుల్లో ఇలా నేను ఆలోచించేది పదండి వెళ్దామని బాబును తీసుకొని కిందకి వస్తుంది. కిందకి రాగానే ఇంట్లో అందరూ ఏమైందని అడుగుతూ ఉంటే బాబుకి ఒంట్లో బాగోలేదు జ్వరం వచ్చినట్టుంది అని అంటే రుద్రాణి అవును బాగా వేడిగా ఉంది ఒళ్ళు అని అంటుంది. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకు వెళ్దాం అంటాడు సుభాష్ ఈ ఇంట్లోని రాజ్ కి ఎవరు సహాయం చేయకూడదని మీ ఆవిడ ఆంక్షలు పెట్టింది కదా అని అంటుంది. వెంటనే అపర్ణ నేను ఆంక్షలు పెట్టింది రాజ్ కి మాత్రమే బాబు కాదు, హాస్పిటల్ కి తీసుకువెళ్లండి అని అంటుంది ఇక రాజ్, సుభాష్, కావ్య ముగ్గురు హాస్పిటల్ కి తీసుకువెళ్తారు బాబుని. ఇంట్లో అందరూ టెన్షన్ గా ఉంటారు.

Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights
Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights

ఇక హాస్పిటల్ లో కావ్య బాబు ని డాక్టర్ కి చూపిస్తుంది డాక్టర్ కొన్ని టెస్ట్ లు చేయాలి అని చెప్తాడు కానీ ఏమీ అర్థం కావట్లేదు అని లోపలికి తీసుకువెళ్తారు. మీరెవరు రావడానికి వీల్లేదు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పడంతో ముగ్గురు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఏమైంది అని సుభాష అడుగుతాడు రాజ్ ఏమీ లేదు పాలు తాగాడు పడుకున్నాడు కొంచెం ఏడుస్తున్నాడు మామూలుగానే ఏడుస్తున్నాడు అనుకున్నాను కానీ ఇలా జ్వరం వచ్చేంతగా ఏడుస్తాడని తెలియదు అని అంటాడు. ఉదయం నుంచి ఏడుస్తుంటే నన్ను గుడికి వెళ్లకుండా ఉండమంటే ఉంటాను కదా అని అంటుంది కావ్య. మీరు కష్టపడుతూ వాడి ని కూడా కష్టపడుతున్నారు. అసలు ఆ బాబు తల్లి ఎవరో చెప్తే ఈ పరిస్థితి అంతా బాబుకు రాదు కదా అని అంటుంది. ఊరుకో కావ్య ఇప్పటికే వాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని అంటాడు సుభాష్. రాజు సారీ అని చెప్తాడు ఎవరికి సారి చెప్తున్నారు నాకా? ఆ బాబుకా? లేదంటే వాళ్ళమ్మ కా? మీరు చెప్పాల్సింది ఇప్పుడు దేవుడికి వాడికి ఏమీ కాకుండా బయటపడాలని దేవుడికి సారి చెప్పండి అని అంటుంది. ఇక మరోవైపు ఇంటిదగ్గర రుద్రాణి, బాబుని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అంటుంది. అక్కడ ఉన్న వాళ్లంతా ఇద్దరానివేపి చూస్తూ ఉంటారు ఇక రుద్రాణి నేను చెప్పింది నిజమే ఇక్కడ మీకు ఎవరికీ అర్థం కాని నిజం ఇంకోటి ఉంది ఆ బాబు తల్లి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ బాబుకి జరగరానిది ఏమైనా జరిగి వాడి ఏదైనా అపాయం కలిగితే అప్పుడు మనం అందరం కలిసి వెళ్లి జైల్లో కూర్చోవాల్సి ఉంటుంది అని అంటుంది. నీకు అసలు మంచి మాటలు రావా రుద్రణి అని అడుగుతుంది ఇందిరా దేవి నిజం అమ్మ నేను చెప్తుంది నువ్వే కదా ఇప్పుడు కీడు ఎంచి మేలు ఎంచాలి అంటావు ఇప్పుడు నేను ఎంచుతున్న కీడు అదే, ఆ బాబుకి ఏమైనా జరిగితే వాళ్ళ అమ్మ వచ్చి ఈ దుగ్గిరాల వంశంలో ఇంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి నా బాబుని చంపేశారు అని మన మీద కంప్లైంట్ ఇస్తే మనం వరుసగా వెళ్లి జైల్లో ఒకే కంపార్ట్మెంట్లో కూర్చోవాల్సి ఉంటుంది పెద్ద చిన్న ముసలి ముతకాని కూడా చూడకుండా అందరిని తీసుకెళ్లి లోపల వేస్తారు. మీడియా వాళ్ళు వచ్చి ప్రశ్నలు వేస్తారు వాడికి సమాధానం చెప్పలేక మనం పరువు మతం తీసుకోవాల్సి ఉంటుంది అని అంటుంది. ఏంటి వదిన మొన్న నీ ఫ్రెండ్ శకుంతల వచ్చినప్పుడు ఇంటి పరువు నేను తీస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు నీకు పరువు ఎవరు తీస్తున్నారో బాగా అర్థమైంది కదా అని అంటుంది ఇక అక్కడే ఉన్న ధాన్యం రుద్రాణి చెప్తుంది అంత నిజమే అనిపిస్తుంది అని అంటుంది.

Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights
Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights

ఇక అక్కడే ఉన్న అపర్ణ నేను రుద్రాణి చెప్పిన మాటలు గురించి లెక్క చేయట్లేదు కానీ బాబు మాత్రం క్షేమంగా రావాలి క్షేమంగా వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోక ముందే రాజుని నిలదీసి వాడి తల్లి దగ్గరికి వాడీని చేర్చాలి అని అంటుంది. ఇక మరోవైపు హాస్పిటల్లో డాక్టర్ గారు బయటకు వస్తారు. ఏమైందండీ అని అడుగుతాడు సుభాష్ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి నువ్వు అసలు తల్లిపాలు పడుతున్నావా అని కావ్య ని అడుగుతారు కావ్య లేదు అని సమాధానం చెబుతుంది. అదేంటి ఎందుకు పట్టట్లేదు అని అడుగుతుంది డాక్టర్ వెంటనే కావ్య నేను బిడ్డకు తల్లిని కాదండి అని చెప్తుంది దాంతో ఒకసారిగా ఆశ్చర్య పోతుంది డాక్టర్ గారు అవునా మీరు అయితే ఏ హాస్పిటల్ కి వెళ్ళినా ప్రయోజనం ఉండదు ఆ బిడ్డకు తల్లి కావాలి తల్లిపాలు కావాలి తల్లి స్పర్శ కావాలి అలా జరిగినప్పుడు ఆ బాబు ఇలానే బాధపడుతూ ఉంటాడు ముందు ఆ బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చండి అని చెప్తుంది. మీరు ఏ కారణాల వల్ల వాళ్ళ అమ్మని దూరంగా ఉంచారు నాకు తెలియదు కానీ ఆ బిడ్డకు మాత్రమే తల్లి అవసరం చాలా ఉంది తల్లి మీద బెంగ పెట్టుకున్నాడు అని చెబుతుంది.డాక్టర్ ఇచ్చిన సలహా విని సైలెంట్ గా అందరు బయటకి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన రాజ్ సుభాష్ కావ్యాలను అపర్ణ ఆపుతుంది.

Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights
Brahmamudi Today Episode April 19 2024 Episode 388 highlights

ఇక అపర్ణ కొడుకుతో ఏమైంది బాబుకి నీ కొడుకు ఇప్పుడు బానే ఉన్నాడు కదా అని అడుగుతుంది. రాజ్ ఓకే అన్నట్లుగా తల ఊపుతాడు. ఇక కావ్య వైపు తిరిగే అసలు ఏమని చెప్పారు అని అడుగుతుంది. కావ్య ఏమి మాట్లాడదు తల్లి కానీ తల్లివి మాతృ దేవతలాగా వెళ్లావు కదా మాతృ స్థానంలో అలాంటప్పుడు ఏమైందో చెప్పు అని అంటుంది. ఇక కావ్య మాట్లాడుతూ మాతృ స్థానంలో వెళ్లాను కానీ ఆ బిడ్డకు తల్లిని కాలేను కదా వాడికి ప్రపంచంలో ఏ స్త్రీ తల్లి అయినా కూడా వ్యర్థమే అని డాక్టర్ గారు చెప్పారు అని అంటుంది. బాబుకి తల్లి స్పర్శ కావాలన్నారు. మాతృ స్థానం ఎంత గొప్పదో నాకు ఈరోజు అర్థమైంది తల్లిలా మారినంత మాత్రాన తల్లిని కాలేను అని తెలిసింది. నా ఊహె నిజమైంది. పాలు తాగే పసివాడికి తల్లి ఒడి తప్పితే సుఖమైన ప్లేస్ ఇంకోటి లేదు ఆమె స్థానాలే వాడికి కావాలి. వాడికి వాళ్ళ అమ్మ మీద బెంగ మొదలైంది తల్లి కోసం మన వాడి చెప్పలేని హృదయంలో బాధ మొదలైంది అని చెప్తుంది.ఇప్పుడు డాక్టర్ కూడా అదే చెప్పారు అని అంటుంది. ఇక అపర్ణ నా రాజ్ వైపు చూస్తూ, ఈ అమానుషానికి ఎవరు కారణం నీ రాక్షసత్వానికి ఈ బాబుని బలి చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతుంది అపర్ణ. రాజ్ సైలెంట్ గా ఉండిపోతాడు.

ఇక అపర్ణ సైలెంట్ గా ఉంటే ఎలా రాజ్ ఏంటి మర్యాద ఆ పసివాడి ప్రాణం పోకముందే నిజం బయట పెట్టు వాడి తల్లి ఎవరో చెప్పు, ఈ ఇల్లు ఏ అనర్ధానికి సాక్ష్యం కాకముందే నువ్వు నోరు తెరవాలి. ఆ బిడ్డని వాడి తల్లి దగ్గరికి చేర్చాలి ఆ బిడ్డ తల్లి ఎవరో నువ్వు నోరు ఇప్పి చెప్పాలి. అని గట్టిగా అడుగుతుంది అపర్ణ కానీ రాజు సైలెంట్ గా ఉంటాడు వెంటనే కావ్య ఇప్పుడు కూడా మీరు వాడి తల్లి ఎవరో చెప్పకపోతే అసలు మీరు కన్న తండ్రి కాదు వాడి తల్లి కోసం దిగులు పడుతున్నాడు ఈ టైం లో కూడా మీరు ఇలా మౌనంగా ఉంటే ఇక్కడ ఉన్నవాళ్లే కాదు ఎవరు కూడా మిమ్మల్ని మనిషిలా కూడా గౌరవించరు అని అంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ నీ తల్లి ఎవరో చెప్పమని అడుగుతూ ఉంటారు. ప్రకాశంఅసలు నువ్వు రాజువేనా ఎవరికి సహాయం కావాలన్నా ముందుండి నిలబడే వాడివి. ఇప్పుడు నువ్వే ఒక ప్రశ్నగా నిలబడ్డావా ఇప్పటికి కూడా నీ మనసు కరగట్లేదా నీలో మానవత్వం ఉందన్న విషయం మర్చిపోయావా, ఇప్పటికైనా నిజం చెప్పు రా అని అంటాడు ఇక ధాన్యం ఇప్పటివరకు ఇది నీ సమస్య ఇప్పుడు ఏంటి సమస్యగా మారిపోయింది ఇక ఇప్పుడు నువ్వు నోరు తెరవకపోతే ఇంట్లో అందరూబాధపడే టైం వచ్చింది అని అంటుంది. రాజ్ నువ్వు నోరు విప్పి చెప్పకపోతే మనం చట్టం దృష్టిలో సమాజం దృష్టిలో దోషులుగా మిగిలిపోయి లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటాం రా నిజం చెప్పు అని అంటుంది. ఇక ఇందిరా దేవి, చూడు రాజ్ ఈ బిడ్డకు తల్లి కావాలి, నీ తల్లికి నిజం కావాలి, నీ భార్యకు న్యాయం కావాలి, ఈ ఇంట్లో వాళ్లకి సమాధానంకావాలి,అలా మౌనంగా ఉంటే కుదరదు సమాధానం చెప్పు అని గట్టిగా అడుగుతుంది. ఇక అప్పుడు రాజ్ సారీ నానమ్మ అని అంటాడు. ఒకసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

ఇక రాజ్ మాట్లాడుతూ నేను ఈ బాబు తల్లి గురించి మాట్లాడను తండ్రి తల్లి రెండు నేనే అయి పెంచుకుంటాను అని అంటాడు. బాబుకి తల్లి మీద బెంగ పోయేలా నేనే చేస్తాను అని అంటాడు.ఇక ఆపర్ణ దేవి బాగా కోపంతో చెప్పడు వాడు నిజం ఎప్పటికీ చెప్పడు. ఈ ఇల్లు అనర్ధాలతో ఆహుతి అయ్యేవరకు వీడు నిజం చెప్పడు అని అంటుంది. ఆ బిడ్డకు తల్లిని చూపించవు, మాకు నిజం చెప్పవు. ఇంట్లో ఇంకో అర్థం జరగక ముందే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది అపర్ణ. అందరూ ఏం చెబుతుందా అని అపర్ణ వైపు చూస్తూ ఉంటారు, ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, సుభాష్ కారులో వెళ్తూ ఉంటాడు. రాజ్ సుభాష్ కారుని ఆపుతాడు. సుభాష్ కారులో నుంచి దిగుతాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబుని అని అడుగుతాడు రాజ్. ఇంట్లో నీ స్థానం పడిపోయి నువ్వు ఇంటికి దూరం అవుతానన్నప్పుడు కూడా నువ్వు నిజం చెప్పకపోతే నేనే నిజం చెప్పాల్సి ఉంటుంది కదా అని అంటాడు. ఇదంతా దూరం నుంచి కావ్య వింటూ ఉంటుంది. అంటే సుభాష్ కి నిజం తెలిసిందని ఇక్కడ మనకి అర్థం అవుతుంది. ఇంట్లో నుంచి వెళ్లడానికే నేను డిసైడ్ అయ్యాను అని అంటాడు రాజ్. నా కొడుకు ఏ తప్పు చేయనప్పుడు, ఇంట్లో నుంచి అందరూ వెలివేస్తుంటే మౌనంగా ఇంటి నుంచి బయటకు వెళ్తానంటే నేను నిజం చెప్పక తప్పదనిపిస్తుంది అని అంటాడు ఇక కావ్య షాక్ లో చూస్తూ ఉండిపోతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella