NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

Naga Panchami Today Episode April 27 2024 Episode 341 highlights

Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా ముందు రాజ్ బిడ్డ తన బిడ్డ అని దుగ్గిరాల ఇంటి వారుసుడుని ప్రకటించి అపర్ణ చేత అబద్ధం చెప్పిస్తుంది దాంతో అపర్ణ ఇంట్లో అందరి మీద ఫైర్ అయ్యి రెండు రోజుల్లో రాజ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని లేదంటే నేను చస్తానని బెదిరించి వెళ్ళిపోతుంది. అదంతా చేసింది రుద్రాణి రాహుల్ అని తెలుసుకున్న కావ్య స్వప్నతో కలిసి క్లాస్ పీకి వార్నింగ్ ఇస్తుంది. రాహుల్ సారీ చెప్పి తప్పించుకుంటాడు ఇక రుద్రాణి మాత్రం అక్కాచెల్లెళ్ళు అవమానాన్ని భరించలేక ఇంతకీ ఇంత చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు నేను పెట్టబోయే చిచ్చు నువ్వెలా ఆపుతావో చూస్తాను కావ్య అని అనుకుంటుంది. అనుకున్నదే ఆలస్యంగా అనామిక దగ్గరికి వెళ్తుంది.

Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights
Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights

ఈరోజు ఎపిసోడ్ లో అనామికతో,రుద్రాణి మాట్లాడుతూ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నువ్వు అప్పు మీద పగ తీర్చుకోవచ్చు నిన్ను గుడిలో కళ్యాణ్ కొట్టాడు ఆ విషయాన్ని నువ్వు తేలిగ్గా తీసుకోకూడదు ఇంతకీ ఇంత అప్పు అనుభవించేలా చేయాలి అని అంటే అందుకు నేను ఏదైనా చేస్తాను అని అంటుంది అనామిక. నేను చెప్పినట్టు చేస్తే చాలు అని అంటుంది. అనామికకు ప్లాన్ మొత్తం వివరిస్తుంది రుద్రాణి. ఇలా చేస్తే కళ్యాణ్ కూడా బాధపడతాడేమో అని అంటుంది అనామిక. మొండి మొగుడు గిల్లితే దారిలోకి వస్తాడు అనుకుంటే ఇలా చేయడంలో తప్పులేదు కదా అని అంటుంది. నీకు కళ్యాణ్ అప్పు నుంచి దూరం కావడం కావాలా నీ భర్తతో సంతోషంగా ఉండడం వద్ద అని అంటుంది నాకు ఆపు పీడ విరగడైపోవాలి అని అంటుంది అనామిక అయితే నేను చెప్పినట్టు చెయ్ అని అంటుంది. అనామిక అన్నిటికి సిద్ధపడి కల్యాణ బాధపడిన సరే ఆ అప్పు మాత్రం కళ్యాణ్ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అందుకని నేను ఏదైనా చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే రుద్రాణి ఇంకొక మాట అని అనామికను హ్యాపీ ఇప్పుడు నీకు ఈ పరిస్థితుల్లో నీ చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను నచ్చ చెప్పొచ్చు, కోప్పడచు ఏదైనా చేయొచ్చు కానీ నువ్వు మాత్రం అనుకున్నది అనుకున్నట్లు సాధించాలంటే ఎవరి మాట లెక్క చేయొద్దు అని చెప్తుంది. ఇంత దాకా వచ్చిన తర్వాత నేనెవరి మాట వింటాను ఆంటీ అని అంటుంది. శభాష్ ఇలానే అనుకున్న ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయి అని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక అనామిక వెళ్ళిన తర్వాత రుద్రాణి ఇప్పుడు ఇంటి మీద నేను అనుబాంబు వేసాను కావ్య ఎలా ఆపుతారో చూస్తాను మీ చెల్లి మానం కాపడతావో ఈ ఇంటి పరువు పోకుండా చేస్తావో అది చూస్తాను అని అంటుంది.

Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights
Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights

ఇక మరోవైపు ధాన్యం అనామిక కనిపించట్లేదని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అనామికని ఎక్కడైనా చూసావా అని స్వప్నని అడుగుతుంది. నేను ఎక్కడా చూడలేదు అని అంటుంది ఇంక దాంతో ఏమైంది అని ప్రకాష్ అడుగుతాడు. అనామిక కనిపించట్లేదు అని అంటే ఎక్కడికి పోయి ఉండదులే అని అంటాడు అబ్బా కాదండి, తను ఇంట్లో లేదు బయట లేదు అని టెన్షన్ పడుతూ ఇంట్లో అందరినీ అడిగితే కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ధాన్యం. అనామిక ఎక్కడ అని అడుగుతుంది అనామిక ఎవరు అని అంటాడు. నీ భార్య అనే విషయం కూడా మర్చిపోయావా అని అంటుంది. నీ కోడలు గానే గుర్తు పెట్టుకున్నాను అని అంటాడు. సరే అయితే నా కోడలు ఎక్కడ ఉందో చెప్పు అని అంటుంది. నాకేం తెలుసు అని అంటాడు అదేంటి అని అంటుంది ఏరోజైనా నాకు చెప్పి బయటకు వెళ్లిందా ఏదైనా నాకు చెప్పి చేస్తుందా అని అంటాడు కళ్యాణ్. పక్కనే ఉన్న అపర్ణ అది కాదు కళ్యాణ్ అమ్మ అడిగిందానికి సమాధానం చెప్పాలి కదా అని అంటుంది. ఇంతకీ అనామిక ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసా తెలీదా అని ఉంటుంది నాకు తెలియదు పెద్దమ్మ అని అంటాడు. ధాన్యం నువ్వేమైనా గొడవపడ్డావా అని అడుగుతుంది ఏరోజు పడకుండా ఉన్నాము అని అంటాడు. ఎప్పుడైనా నన్ను భర్తగా చూసిందా అని అడుగుతాడు ఏంట్రా అంత ఆవేశంగా వున్నావ్ ఏదైనా గొడవ జరిగితే చెప్పు అని ఇందిరా దేవి అడుగుతుంది. కళ్యాణ్ ఏం లేదు అని అంటాడు కానీ అక్కడే ఉన్న రుద్రాణి మధ్యలో దూరి, నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉందమ్మా ఏం గొడవ జరగకపోతే అనామిక ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తుంది అని అంటుంది. కళ్యాణ్ అబద్ధం చెప్పడు కచ్చితంగా తెలియదంటే తెలియదని చెప్తాడు అని అంటాడు రాజ్. అవును నీ గురించి కూడా అందరం అలానే అనుకున్నాం కానీ నువ్వు ఏం చేసావు ఇప్పుడు నీ తమ్ముడు కూడా చేయలేదని నమ్మకం ఏంటి, కచ్చితంగా వీడు ఆ అమ్మాయిని కొట్టడం తిట్టడం చేసి ఉంటాడు అని రుద్రాణి అంటుంది. వెంటనే కళ్యాణ్ మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అని అంటాడు. అక్కడే ఉన్న స్వప్న ఆవిడ పని ఆవిడ ఎప్పుడు చేసుకుంది కళ్యాణి పక్కన వాళ్ళ విషయాల్లో దూరి, పైశాచిక ఆనందం పొందడమే ఆమెకి ఇష్టం అని అంటుంది. ధాన్యం ఏదైనా గొడవ జరిగితే చెప్పు అని అంటుంది ఏం లేదు అని అంటాడు కళ్యాణ్ కానీ కళ్యాణ్ కి అప్పుడే గుడిలో అనామిక చెంప పగలగొట్టిన విషయం గుర్తుకు వస్తుంది.

Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights
Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights

ఇక మరోవైపు అప్పు భోజనం చేస్తూ ఉంటుంది. కనకంతో నాన్న ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది ఏ రోజు ఫోన్ చేసినా ఈరోజు రేపు అంటున్నాడు. అక్కడికి వెళ్లిన పని అయినట్టు లేదు అని అంటుంది దాంతో మన కోసమే కదా కష్టపడుతుంది. అని అప్పు ఉంటుంది ఇక ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా పోలీసులు వస్తారు. పోలీసులు చూసి కంగారు పడుతుంది కనకం. నువ్వేం కంగారు పడకు నేను కనుక్కుంటాను అంటుంది అప్పు అప్పుడే పోలీసులు ఇక్కడ అప్పు ఎవరు అని అంటే మా అమ్మాయి అని అంటుంది. మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని అంటారు. మా అమ్మాయిని అరెస్ట్ చేసేదేంటి ఎందుకు అని అడుగుతుంది. తప్పు చేసింది కాక కారణం అడుగుతున్నారా అని అంటే ఏ తప్పు చేసిందో చెప్పమనే కదా అడుగుతుంది అని కనకం అంటుంది. ఇక అక్కడే ఉన్న ఎస్ఐ మీ అమ్మాయి మీద అనామిక కంప్లైంట్ ఇచ్చింది. తన భర్త కళ్యాణ్తో మీ అమ్మాయి చనువుగా ఉంటూ, తనకి తన భర్తకి మధ్య గొడవలు పెడుతుందట అందుకే గృహింస చట్టం కింద మీ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చింది అని చెప్తాడు. దాని గృహంలో మేము ఎప్పుడు ఉన్నాము అని కనకం ఫోన్ చేస్తుంది అనామికకు అనామిక ఫోన్ లిఫ్ట్ చేయదు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ ఎత్తుతారా అమ్మ అని అంటాడు ఎస్ఐ. మీ అమ్మాయిని అరెస్ట్ చేయాల్సిందే అని అంటే అందుకు అడ్డుపడుతుంది కనకం మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటారు పోలీసులు, అమ్మ నువ్వు ఊరుకో కంప్లైంట్ ఇచ్చింది కదా కానీ తేల్చుకుందాం అని అప్పు వెళ్ళిపోతుంది. పోలీసులు అప్పు ఉంది తీసుకొని వెళ్ళిపోతారు ఇక దాంతో కనకం కోపంగా ఎవరైతే నా కూతురు మీద కేసు పెట్టారో ఆ ఇంటికెళ్లి తేల్చుకుంటాను, తెల్లవారి సరికి నేను ఇంటికి తీసుకొస్తాను అని అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights
Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights

మరోవైపు కళ్యాణ్ ని బలవంతంగా అసలు ఏం జరిగిందో చెప్తావా చెప్పవా అని ధాన్యం అడుగుతుంది. కళ్యాణ్ చెంప పగలగొట్టాను అని అంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటాడు సుభాష్. అవును ఒక మనిషి పెట్టలేని కోపంలోనే కొడతాడు అని అంటాడు. అలా కొట్టేటట్లయితే ఎన్నోసార్లు నేను మీ అమ్మని కూడా కొట్టాలి అని ప్రకాశం అంటాడు. అయినా చేయి చేసుకునే అంత తప్పు ఏదైనా జరిగితే మాకు చెప్పాలి కదా అని అంటే ఎన్నిసార్లు చెప్పాను చెప్పు ఏం ప్రయోజనం అని అంటాడు అందుకే ఆవేశంలో కొట్టాను అని అంటాడు అప్పుడే అక్కడికి అనామిక ఎంట్రీ ఇస్తుంది పోలీసులతో, విన్నారు కదా ఎస్ఐ గారు ఇది ఈ ఇంట్లో నా పరిస్థితి. అందరి ముందు ధైర్యంగా ఒప్పుకున్నాడు కదా కొట్టానని నేను ఇందులో అబద్ధం చెప్పేదేముంది అని అంటుంది. నేను చేయాల్సింది నేను చేశాను మీరు చేయాల్సింది చేయండి అని అంటుంది పోలీసులతో అప్పుడే ధాన్యం ఏంటిది అని అడుగుతుంది అనామికను, మీ అబ్బాయి మీద కేసు పెట్టాను అత్తయ్య అని చెప్తుంది. దాంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. సుభాష్ మనం తర్వాత మాట్లాడుకుందాం అమ్మ పోలీసుల్ని వెళ్ళమని చెప్పు అని అంటాడు. ఇప్పటికే చాలాసార్లు మాట్లాకుంకున్నాం మావయ్య ఇకమీదట ఏం లేదు అని అంటుంది. నాకు ఇంట్లో అన్యాయం జరిగింది అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే అంత అన్యాయం జరిగింది అని అడిగితే నా భర్త వల్ల నాకు అన్యాయం జరిగింది అని అంటుంది. ఆ పూత తిరుగుతూ నన్ను పట్టించుకోవడం మానేశాడు నాతో ఉండకుండా అప్పుతో ఉంటున్నాడు అని అంటుంది.

Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights
Brahmamudi Today Episode April 27 2024 Episode 395 highlights

ఇక స్వప్న వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఆ మాత్రం అర్థం చేసుకోలేవు నువ్వు అని అంటుంది. నేను అర్థం చేసుకోవాల్సిందేమీ లేదు అని అంటుంది. రాజ్ అనామికకు నచ్చ చెప్పాలని చూస్తాడు కానీ అనామిక మాత్రం వినదు. అప్పుతో తిరిగి నన్ను నిర్లక్ష్యం చేసి ఆపుతో పెళ్లి చేసుకునే అంత ఘాడమైన ప్రేమలో ఉన్నాడు. అందుకే నన్ను కొట్టి హింసిస్తున్నాడు మీరు యాక్షన్ తీసుకోండి అని అంటుంది. కళ్యాణ్ షాప్ లోనే ఉండిపోతాడు అసలు అనామిక ఎందుకు ఇలా చేస్తుందో కళ్యాణ్ కి అర్థం కాదు అలానే చూస్తూ ఉంటాడు. అదంతా గమనిస్తున్న కావ్య అనామిక దగ్గరికి వచ్చి నాతో చెప్పాలని చూస్తుంది నేను చెప్పేది ఒకసారి విను అనామిక నీకు ఆపరాన్ని నువ్వే తీసుకుంటున్నావు అని అంటుంది. నీ అంత మంచిదాన్ని కాదు నేను కావ్య అక్క రేపొద్దున నీ చెల్లెలు తీసుకొచ్చి, నాకు సవతిగా చేయాలని కళ్యాణ్ చూస్తున్నాడు. నేను అందుకు సహించలేను బావగారు వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని బిడ్డను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన నువ్వైతే ఏమీ అనలేదు కానీ నేను అలా ఊరుకోలేను అని అంటుంది. అనామిక నువ్వు పిచ్చి దానిలా ఉన్నావు ఇప్పుడు నీ భర్త మీద నువ్వే కంప్లైంట్ ఇస్తే రేపొద్దున ఇదే ఇంట్లో ఉండాలి అప్పుడు ఎలా కళ్యాణ్ నీతో ఉంటాడు. నీతో ఎలా కాపురం చేస్తాడు అని అడుగుతుంది వెంటనే ఇందిరాదేవి ఇప్పుడు మాత్రం ఏం కాపురం చేసి వెలగబెడుతుంది అని అంటుంది. ఏవో పిల్ల చేష్టలు అనుకోని, నేనేమీ అనకుండా ఉన్నాము ఈరోజు ఇంత పని చేస్తావా అని అంటుంది. అయినా నీకు ఏదైనా అన్యాయం జరిగితే మీ అమ్మానాన్న తీసుకొచ్చి మాట్లాడాలి కానీ, ఇలా పోలీసులు తీసుకొచ్చి ఇంటి పరువు తీస్తావా అని అంటుంది. పోలీసులు తీసుకురావడం పద్ధతి కాదు అని సీతారామయ్య కూడా అంటారు ఇక్కడ పరువు పోతుందని భయంతో ఎవరూ మాట్లాడట్లేదు. నీకు ఆపరాన్ని నువ్వే నీ చేతిలోరా చిక్కుముడి చేసుకుంటున్నావని హెచ్చరిస్తున్నాను అని అంటుంది. ఇందిరా దేవి ఎంత చెప్పినా అనామిక మాత్రం సైలెంట్ గా ఉంటుంది.

ఇక రాజ్ మా తమ్ముడు సెన్సిటివ్ ఆ అమ్మాయి ఇన్నోసెంట్ ఎక్కడో ఏదో అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి పొరపాటు జరిగింది మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఇది మా ఫ్యామిలీ విషయం మేమే చూసుకుంటాము అయినా మీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఎలా మీరు ఎలా టెకప్ చేశారు అని అంటే ఈ అమ్మాయి నేను చెప్పిన వినట్లేదు సార్ అని ఎస్ఐ చెప్తాడు. మీరు అనామిక చేత కేసు వాపస్ తీసుకోమని చెప్పండి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని అంటాడు ఎస్ఐ కానీ అనామిక మాత్రం కేసు తీసుకోదు. ధాన్యం నువ్వు కేసు వాపస్ తీసుకో కళ్యాణ్ తో నేను మాట్లాడుతాను అపు విషయంలో ఏం చేయాలో నేను చూసుకుంటాను అని అంటుంది అయినా అనామిక మాత్రం సైలెంట్ గా ఉంటుంది రుద్రణి వైపు చూస్తుంది రుద్రాణి వద్దు అని సైగ చేస్తుంది. దాంతో అనామిక కేసు తీసుకోదు. రుద్ర నేను నీకు ఏం చేస్తే ఈ కేసు ఆఫీస్ తీసుకుంటావో చెప్పు అని అంటుంది. వెంటనే స్వప్న నాలుగు తగిలిస్తే దారిలోకి వస్తుంది అని అంటుంది. కావ్య స్వప్నని ఆపుతుంది. ఏంటి అక్క ఆపుతున్నావు మా అత్తని అలా తగిలించే వాళ్ళు లేకుంటే మొగుడు వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటుంది తనను చూసి కూడా ఈ అనామిక అభివృద్ధి తెచ్చుకోకపోతే ఎట్లాగూ అని అంటుంది. నా రుద్రనే నా విషయం నువ్వు జోక్యం చేసుకోవద్దు అని అంటే మరి నువ్వు ఎందుకు దీర్ఘాలు తీస్తూ హిట్స్ ఇస్తున్నావ్ నీ సలహా ఇక్కడ ఎవరూ అడగలేదు అని అంటుంది కోపంగా రుద్రాణి వైపు చూసి స్వప్న. వెంటనే ధాన్యం ఆపండి అని కోపంగా అరుస్తుంది. అనామికతో కేసు వాపస్ తీసుకుంటావా అని అడుగుతుంది ధాన్యం నాకు మాత్రం నా భర్త జైలుకు వెళ్లాలని ఉంటుందా అత్తయ్య కావ్య లాగా నా పరిస్థితి కూడా అవుతుంది ఏమో అని భయంగా ఉంది నాకు సవతి అయ్యే ఇంటికి తీసుకొస్తాడేమో మీ అబ్బాయి అని నాకు భయంగా ఉంది. అని అనామిక అంటే ధాన్యం దీనికి సొల్యూషన్ లేదా అని అంటుంది. మీ అబ్బాయి నాకు సారీ చెప్పి జీవితంలో ఎప్పుడూ అప్పు నీ కలవను అని చెప్తే నేను కేసు వాపస్ తీసుకుంటాను అని అంటుంది. ఇంట్లో అందరూ షాక్ అవుతారు.

ఏంటి నీకు నేను సారీ చెప్పాలా ఇంత జరిగిన తర్వాత నీకు సారీ అలా చెప్తాను అనుకున్నావు అప్పుకి నాతో ఉన్న స్నేహం ఎంత పవిత్రమైందో నాకు తెలుసు నీలాంటి స్త్రీకి అది ఎప్పటికీ అర్థం కాదు నువ్వు పూర్తిగా దిగజారిపోయావు. నేను జీవితాంతం చైన్ లోనైనా ఉంటాను కానీ నీతో మాత్రం కాపురం చేయను అని చెప్తాడు కళ్యాణ్. అది కాదు కళ్యాణ ఆవేశపడకు అని రాజ్ అంటాడు లేదన్నయ్యా నాకోసం ఎవరు ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్రి తో కాపురం చేయడం యావజీవకారాగార శిక్షతో సమానం దానికన్నా జైలుకు వెళ్లడమే మంచిది. నాకోసం నీ పరుగు ని పోగొట్టుకోవద్దు ఎవరు జైలుకు రావద్దు అని చెప్పి కళ్యాణ్ పదండి సార్ అని అంటాడు. మీరేం చేయలేరా అని రాజ్ అడుగుతాడు. నేనేం చేయలేను అని చెప్తారు పోలీసులు. కళ్యాణి పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తారు. కళ్యాణ్ వెళ్ళగానే ప్రకాశం ఇన్నాళ్లు కొడుకుని తప్పు చేశాడు అని కూడా వెనకేసుకొచ్చావు ఇప్పుడు బాగా అయిందా, ఈ పిల్లను చేసుకున్నందుకు వాడు నిన్ను చేసుకునేందుకు నేను జీవితాంతం అనుభవించాల్సిందే అని ఆవేశంగా ప్రకాశం కోపంలో ధాన్యాన్ని తిడతాడు. ధాన్యం ఏడుస్తూ ఉంటుంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో పోలీసులు కళ్యాణ్ అప్పు నీ జైల్లో ఉంచుతారు. అక్కడికి రాజ్ కావ్య ఇద్దరు వెళ్తారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తారు. ఇది చాలా క్లిష్టమైన కేసు అని కోర్టులోనే తేల్చుకోవాలి అని ఎస్ఐ చెప్తాడు. మరోవైపు దగ్గర వాళ్ళ ఇంట్లో కనకం వచ్చి గొడవ చేస్తుంది. నా కూతురికి న్యాయం జరిగేదాకా ఈ ఇంటి నుంచి నేను కదలని దుగ్గిరాల ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మరోవైపు కావ్య అనామిక తండ్రి దగ్గరికి వెళ్లి రేపటిలోగా మీ అమ్మాయి వచ్చి కేసు వాపస్ తీసుకోపోతే నేను ఏం చేస్తాను మీకు తెలుసు అని అంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella