NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi December 07 2023 Episode 273: కళ్యాణ్, అనామికుల, పెళ్లి జరగాలన్న అప్పు.. మొక్కతో ముడిపెట్టిన కళ్యాణ్ పెళ్లి.. కనకం ప్లాన్ ?

Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights

BrahmaMudi December 07 2023 Episode 273: నిన్నటి ఎపిసోడ్ లో, కనకం తన ప్లాన్ అమలు చేయాలి అనుకుంటుంది. ఎలాగైనా కళ్యాణ్ పెళ్లి ఆపాలి అని అనుకుంటుంది. కళ్యాణ్ పెళ్లి ఆగే టైం కు అప్పు ఇక్కడికి రావాలి అని అన్నపూర్ణత చెప్తుంది. అప్పు కోసం కళ్యాణ్ చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పు లిఫ్ట్ చేయదు కనకం ఫోన్లో నుంచి చేద్దాం అనుకుంటాడు కానీ కనకమందుకు ఒప్పుకోదు, నీకు అప్పు ఇక్కడ ఉండడమే కదా కావాల్సింది దానికి ఫోన్ చేయడం ఎందుకు బాబు నేనే అప్పు ని ఇక్కడికి రమ్మని చెప్పాను వస్తుంది అని అంటుంది. ఇక కనకం తన ప్లాన్ ప్రకారం, పంతులు దగ్గరికి వెళ్లి సూసైడ్ నోట్ చూపించి పంతుల్ని భయపెట్టి, నన్ను చనిపోమంటారా లేదంటే నా కూతురు ప్రేమకు హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. పంతులు భయపడి హెల్ప్ చేస్తాను అని ఒప్పుకుంటాడు. ఇక అరుణ్ పట్టుకోవాలని కావ్య ప్రయత్నాన్ని రాజ్ ఆపేయమంటాడు. కానీ కావ్య మాత్రం అందుకు ఒప్పుకోదు. పంతులు ఇంటికి వచ్చి ముహూర్తాలు చూస్తూ ఉంటాడు కనకం పంతుల్ని చూస్తోంది పందులు కనకం వైపు చూస్తూ ఉంటాడు. ఇదంతా చూసి రుద్రానికి అనుమానం వస్తుంది.

Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights
Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, పంతులుగారు ఇంటికి వచ్చి ముహూర్తం చూస్తూ ఉంటాడు. ప్రతిసారి ఎందుకు ఈ పంతులు కనకం వైపు చూస్తున్నాడు అని రుద్రాణి అనుమాన పడుతూ, ఎంతసేపు చూస్తారు పంతులుగారు ముహూర్తం అని అంటుంది. ఇక ఇందిరా దేవి కూడా ఇంట్లో అందరూ మీరు పెట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు తొందరగా చెప్పండి అని, ఏమైనా దోషమున్న పర్వాలేదు చెప్పండి అని అంటారు.అనామిక కళ్యాణి ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు ఏదైనా ప్రమాదమా అని అంటుంది ఇందిరా దేవి. అవునమ్మా అమ్మాయికి మాంగల్య దోషం ఉంది అని అంటాడు పంతులు. అందరూ షాక్ అవుతారు. అది పెద్ద దోషమని విన్నాను అని అంటుంది కనకం కావాలని, అవునమ్మా మీరు చెప్పింది నిజమే అది పెద్ద దోషమే అని అంటాడు పంతులు.

Nuvvu Nenu Prema: కృష్ణ నిజస్వరూపం తెలిసిన ఆర్య ఏం చేయనున్నాడు? పద్మావతి చేసిన పనికి ఆశ్చర్యపోయిన విక్కీ?

Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights
Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights

అప్పు కోసం ఏదైనా చేయాలి..

ఇక పంతులు దోషం గురించి చెప్పగానే ఇంట్లో అందరూ టెన్షన్ పడి మీరు, సగం చెప్పి సగం చెప్పకుండా ఉంటే మాకు ఎంత కంగారుగా ఉంటుంది మీరు చెప్పాలనుకున్నది ఏమిటో చెప్పండి అని ఇందిరా దేవి నిలదీస్తుంది. మీరు చెప్పకపోతే మేం వేరే వాళ్ళ ద్వారా చెప్పించుకోమంటారా అని అంటుంది. మాంగల్య దోషం అంటే ఇంట్లో పెద్ద వాళ్లకి అపాయం జరుగుతుందమ్మా అని అంటాడు పంతులు వెంటనే ధాన్యలక్ష్మి అవును ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి మా మామయ్య గారికి ఆరోగ్యం బాగుండడం లేదు పెళ్లి అనుకున్నప్పుడల్లా వాయిదా పడుతూ వచ్చింది అని అంటుంది. అమ్మయ్య ఎవరికీ అనుమానం రాకుండా బానే చెప్పాడు పంతులు అని అనుకుంటుంది కనకం మనసులో ఇంతలో సీతారామయ్య గారు బాధగా అమ్మ ధాన్య లక్ష్మి ఒక అమ్మాయి జాతకాన్ని మనం ఇలా అందరిలో పెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు చూడు ఆ అమ్మాయి ఎంత బాధ పడుతుందో అని అంటాడు. ఆ మాటలకి అందరూ జాలిగా అనామిక వైపు చూస్తారు. కనకం కూడా అనామికను చూసి నేనేమన్నా ముర్గంగా ప్రవర్తిస్తున్నానా కానీ, వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందంటే అప్పు తట్టుకుంటుందా? అమ్మో ఏదైనా చేసుకుంటే అప్పు కోసం నేను ఏదైనా చేస్తాను అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari: నందు ఇచ్చిన సలహాతో మురారి కృష్ణ తన భార్యా అని తెలుసుకున్నాడా.!?

Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights
Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights

కళ్యాణ్ అనామిక బాధ..

ఇక నా ఆరోగ్యం ముందు నుంచి బాలేదు కదమ్మా ఇప్పుడు ఈ జాతకం వల్లన ఆరోగ్యం పాడయ్యేదేముంది అని సీతారామయ్య నచ్చ చెప్పాలి అని చూస్తూ ఉంటాడు. అయినా దోషం ఉన్నప్పుడు పరిహారం కూడా ఉంటుంది కదా అని ఇందిరా దేవి అంటుంది. ఏం పరిహారం చెప్పాలో ముందు పంతులుకి అర్థం కాదు మీరు చెప్పకపోతే వేరే వాళ్ళని పిలుచుకుంటాం అని అనగానే, పంతులు కనకం వైపు చూస్తాడు కనకం, మళ్లీ బాటిల్ లెటరు చూపించి భయపెడుతుంది పంతుల్ని పంతులు గారికి ఏం చెప్పాలో తెలియదు అనుకొని వాళ్ళిద్దరి చేత హోమం చేయించండి అని అంటాడు. హోమన్ చేయిస్తే ఇంకా దోషాలు ఏమి ఉండవా అని కనకం కావాలని అంటుంది వెంటనే రుద్రాణి అవును కనకం నీకు ఏమన్నా జాతకాలు చెప్పడం వచ్చా ఏంటి? ప్రతిసారి మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నావు అని అంటుంది. అదేం లేదు రుద్రాణి గారు అని అంటుంది కనుకమ్. ఒక నిమానం ఒక్క తీసుకొచ్చి నాటాలి పసుపు గంధం పూసి జాగ్రత్తగా నాటండి ఆనాటిన మొక్క మరుసటి రోజు కూడా పచ్చగా ఉంటే ఏం పర్వాలేదు ఒకవేళ ఆ మొక్క గనక చనిపోతే మాత్రం ఈ పెళ్లి ఆపేయాల్సిందే అదే పరిహారమైన ప్రమాదమైన మీకే అర్థమవుతుంది అని అంటాడు పంతులు. ఇకనామిక ఏడుస్తూ ఉంటుంది కళ్యాణి నువ్వేం బాధపడకు అనామిక మన పెళ్లి ఆగదు నేను చెప్తున్నాను కదా అని అనామికకు ధైర్యం చెబుతూ ఉంటాడు. అక్కడే ఉన్న అప్పు వాళ్ళిద్దరి బాధపడ్డం చూసి తను కూడా బాధపడుతుంది. ఇక ఇందిరా దేవి పంతులు గారి పరిహారం చెప్పారు కదా, పరిహారం ప్రకారం చేద్దాం మీరు ఏం బాధపడకండి అని అంటుంది.

Brahmamudi December 06 Episode 272: కళ్యాణ్ పెళ్లి క్యాన్సిల్.. కనకం ప్లాన్ సక్సెస్.. కావ్యతో రాజ్ హనీమూన్..?

Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights
Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights

కనకం చేతిలో ఏ మొక్క అయినా చావాల్సిందే..

ఇక కనకం పంతులుగారు వెళ్ళిపోతుంటే వెనకాలే వెళ్లి పంతుల్ని ఆపుతుంది నేనేం చెప్పాను పంతులు నువ్వు ఏం చేశావు అని అంటుంది. అమ్మ నా పరిస్థితి పిలికి గండం వెలికి ప్రాణ సంకటంలో ఉంది నా మీద వాళ్లకి అనుమానం వచ్చేలా ఉంది అలాంటి పరిస్థితులు లో నేనేం చేయాలి అని అంటాడు. మీరిచ్చిన తొక్కలో పరిహారం ఆ మొక్క బతికిపోతే నా కూతురు పరిస్థితి ఏంటి అని అంటుంది. అలా బతకకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే తల్లి అలాంటివన్నీ నేను నా నోటితో చెప్పలేను ఆ మొక్కను నువ్వే చంపేసేయ్ అని అంటాడు. ఇక ఆ మొక్క బతికితే బతకంది నీ చేతుల్లోనే ఉంది నాదేం లేదు అని వెళ్ళిపోతాడు. కనకం మనసులో మొక్కైనా ఏదైనా సరే నా చేతిలో చనిపోవాల్సిందే ఎలా చావదు నేను చూస్తాను అని అనుకుంటుంది.

ప్రేమికుల్ని విడదీయడం పాపం..

ఇక అప్పు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కనకం అప్పుని ఆపుతుంది ఎక్కడికి వెళ్తున్నావ్ అని ఇంటికి వెళ్తున్న అంటుంది అప్పు కాసేపు ఉండొచ్చు కదా అంటే లేదు వెళ్లిపోవాలి అని అంటుంది. సరే ఇంట్లో జరిగింది చూశావు కదా వాళ్ళిద్దరూ విడిపోయేలా ఉన్నారు ఈ దోషాలు అవి ఏదో అంటున్నారు కదా అని అంటుంది కనుకమ్. అమ్మ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ చెరుకు చెడు కోరుకుంటున్నావా, నేను నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని అంటుంది కనుక తప్పు కోరుకుంటున్నావమ్మ ఇటువంటి దండాలు దోషాలు అని చెప్పి ప్రేమించుకున్న వాళ్ళిద్దర్నీ విడదీయొద్దు జాతకాలు కలిసిన ప్రేమ అనేది లేకపోతే ఆ జంట ఎట్లా ఉంటుందో తెలియదా నేనైతే నా ప్రేమ గెలవాలని అనుకోవట్లేదు అమ్మ వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమించుకున్నారు అలాంటప్పుడు వాళ్ళ ప్రేమ గెలవాలని కోరుకుంటున్నాను అని అంటుంది అప్పు. వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు చూసావు కదా అలా బాధపెట్టి వాళ్ళ ప్రేమను విడదీయడం అవసరమా అని అంటుంది అప్పు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నువ్వు రౌడీ వే అయినా మంచి రౌడీ వే నువ్వు ఎన్ని చెప్పినా నీకు కళ్యాణ్ కి బాబుకి పెళ్లి జరిగే వరకు నేను మాత్రం నిద్రపోనుగా అని అనుకుంటుంది కనకం.

Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights
Brahmamudi Today Episode December 07 2023 Episode 273 Highlights
కావ్య రాజ్ వాదన..

ఇక కావ్య రూంలో కూర్చుని పుస్తకాలని తిరగేస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ వచ్చి, ఏం చేస్తున్నావ్ అని అంటాడు తిరగేస్తున్నాను అని అంటుంది ఏంటవి అంటాడు జాతకాలు అని అంటుంది ఎవరివి అని అంటాడు. నీ జాతకాలు నా జాతకాలు చెప్తున్నాను అని అంటుంది. ఏముంది అందులో అని అంటాడు ఇంకా లోతులోకి వెళ్ళలేదు అని అంటుంది కావ్య. ఇప్పుడేగా మొదలు పెట్టాను. ఇప్పుడు నీకు సడన్గా జాతకాలు చూడాలని ఎందుకు అనిపించింది అని అంటాడు. కళ్యాణ్ అనామికుల పెళ్లి జాతకాల వల్ల ఆగిపోతుంది అని, అలా జరగకుండా ఉండాలంటే జాతకాలు తెలుసుకోవాలి కదా అందుకే మనిద్దరిది చూస్తున్నాను. మన దశలే పెద్ద యుద్దంతో జరిగింది కదా పెళ్లి అని అంటుంది కావ్య. అసలు దోషాలు ఏం లేవే నువ్వే నాకు పెద్ద దోషానివి అని అంటాడు రాజ్. నాకు మినప్పప్పు లో ఆ పప్పు ఈ పప్పు కలిపి దోసెలు వేయడమే తెలిసింది. దోషాలు గురించి తెలియదు అని అంటుంది కావ్య. మీ రుద్రాణి అతలాగా మీరు కూడా నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు అని అంటుంది. నిన్ను వదిలించుకోవాలంటే, ఆ పంతులు చెప్పినట్టు యెహోవాలు ఏ మొక్కలు కుక్కల్ని పెంచాల్సిన పని లేదు, స్మశానంలో కూర్చుని మంత్రగత్త దగ్గర ట్యూషన్ పెట్టించుకుని క్షుద్ర పూజలు నేర్చుకోవాలి. స్మశానం ఏమైనా కాలేజీ అనుకుంటున్నారా అక్కడ సేవలుంటాయి వాటిని చూస్తే దడుచుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు అని అంటుంది. ఇక ఇద్దరు అలా వాదించుకుంటూ ఉంటారు. అసలు నీతో వాదించడం నాదే తప్పు అని అంటాడు రాజ్. మీరు కోప్పడడం తప్ప ఇంకేం చేయలేరు కదా అని అంటుంది. నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావ్ అని అంటాడు రాజ్. అదేనండి మనిద్దరం తూర్పు ఉత్తరం లాగా పడుకోవాల్సిందే గానీ మీరు ఏం చేయలేరు కదా అని అంటుంది. రాజ్ కోపంతో చేయెత్తుతాడు చేతికి ముద్దు పెట్టమంటారా అని అంటుంది ఛీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ధాన్యలక్ష్మి బాధని పెంచిన కనకం..

ఇక పంతులుగారు చెప్పిందంతా ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. కనకం అప్పుడే అక్కడికి వస్తుంది. ఈ ధాన్య లక్ష్మీ బాధపడుతున్నట్టు ఉంది మనం ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పెట్టాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆమె పెళ్లొద్దు అని అంటుంది అని అనుకుంటుంది కనకం అనుకున్నట్టుగానే ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది. అసలు ఈ మాంగల్య దోషం ఉందంటారా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఉండడం గురించి నాకు తెలుసు ఎందుకంటే ఇలానే ఒకరు దోషం ఉందని చెప్పినా వినకుండా, పెళ్లి చేసుకున్నారు వెంటనే ఏమైందో తెలుసా అని అంటుంది కనకం, ధాన్య లక్ష్మీ కంగారుగా ఏమైంది అని అడుగుతుంది. వాళ్ళింటి పెద్దాయన చనిపోయాడు ఇక ఆ ఇల్లంతా రోడ్డు మీదకు వచ్చింది ఆస్తులన్నీ కరిగిపోయాయి అప్పులన్నీ ఎక్కువైపోయాయి. అంతటితో ఆగలేదు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చాయి అమ్మాయి ఖర్చు ఎక్కువ పెడుతుంది అబ్బాయికి జీతం తక్కువ ఎంత పెద్ద వాళ్ళు నచ్చజెప్పినా వినకుండా విడాకులు దాకా వచ్చేసింది అని అంటుంది. ఇక ఆ మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇలాంటి దోషాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు పెళ్లి జరగకుండా ఉండడమే బెటర్ అయినా నాకు తోచింది చెప్పాను మీ ఇష్టం అన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం. ధాన్యలక్ష్మి అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ధాన్య లక్ష్మీ బాధపడుతూ ఉంటుంది. అపర్ణ ఏమైంది అని అడుగుతుంది. ధాన్యలక్ష్మి కల్యాణ్ వైపు చూస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో, కావ్య రాజ్ తో జాతకాలు అని చెప్పి వాళ్ళ ప్రేమని విడగొడతామా, మీరే ఏదో ఒకటి చేయాలి అని అంటుంది. మనం ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపితే రేపు జాతక దోషం వల్ల ఏదైనా జరిగితే ఇంట్లో అందరూ మనల్ని అంటారు అని అంటాడు రాజ్. అనామిక కళ్యాణ్ కి ఫోన్ చేసి తెల్లవారేసరికి మన పెళ్లి గురించి నువ్వు పాజిటివ్ గా చెప్పకపోతే రేపు నా శవాన్ని చూస్తావు అని అంటుంది. ఆ మాటలకు కళ్యాణ్ షాక్ అవుతాడు. కనకం తను అనుకున్నట్టుగా నిమ్మ మొక్కని, ఎవరూ చూడకుండా తీసేసి అక్కడ వాడిపోయిన మొక్కని పెడుతుంది. తెల్లవారి ఇంట్లో అందరూ నిమ్మ మొక్కని చూసి వాడిపోయి ఉండడం గమనించి బాధపడుతూ ఉంటారు. కనకం అనుకున్నట్టుగా పెళ్లి క్యాన్సిల్ అవుతుందో కావ్య అనుకున్నట్టుగా జాతకాలు పక్కన పెట్టి కళ్యాణ్ పెళ్లి చేస్తారో తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

author avatar
bharani jella

Related posts

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Karthika Deepam: మా అమ్మ – నాన్నకు మాటలు రావు.. శౌర్య ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Yatra 2 OTT Streaming: గప్చిప్ గా ఓటీటీలోకి వచ్చేసిన టాలీవుడ్ పొలిటికల్ బయోపిక్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Razakar OTT Release: ఓటీటీ లోకి వచ్చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ ” రాజాకార్ ” మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Most Watched Korean Dramas OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన మోస్ట్ కొరియన్ డ్రామాస్ ఇవే..!

Saranya Koduri

Meghamala: మేఘమాల సీరియల్ హీరోయిన్ ఆద్విక గురించి ఐదు ఆసక్తికర విషయాలు..!

Saranya Koduri