NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi February 8 2024 Episode 327: ఇంటి పగ్గాలు కావ్యకి.. ఫాపం అనామిక.. రేపటికి సూపర్ ట్విస్ట్

Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights

Brahmamudi February 8 2024 Episode 327: కళ్యాణ్ శోభనం రాత్రి కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. కళ్యాణ్ కూడా గదిలో శోభనం పెళ్ళి కూతురు ఎప్పుడు వస్తుందో అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఘడియలు రానే వచ్చాయి. అనామిక గదిలోకి వచ్చి సిగ్గు పడుతుంది. ఇక అనామిక పాల గ్లాస్ తీసుకువచ్చి కళ్యాణ్ కి ఇస్తుంది అప్పుడే కళ్యాణ్ మురిపాలు ఉన్నప్పుడు ఈ పాలతో పనేముంది అని విరహంతో ఊగిపోతూ మాట్లాడుతాడు. కానీ అనామిక మాత్రం అలాంటి ఆటలు ఏమి సాగవు అని చెబుతుంది. అదేంటి శోభనం రోజు ఏం జరగకూడదంటే ఎలాగా అని కళ్యాణ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అయితే తనకి పీరియడ్స్ వచ్చాయని అనామిక ఇన్ డైరెక్ట్ గా చెబుతాయి. అదేంటి మీకు ఆ డేట్ ఎప్పుడో ముందుగానే తెలియదా అని అంటే.. రావాల్సిన కోయిల మూడు రోజులు ముందుగానే కూసేసింది అని అనామిగా అంటుంది. ఇక చేసేది ఏమీ లేదా అంటే ఏమీ లేదు అని అనామిక చెబుతుంది.

Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights
Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights

ఇక కళ్యాణ్ దిండు దుప్పటి తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటే అనామిక అడ్డుపడి కళ్యాణ్ నువ్వు ఇప్పుడు బయటకు వెళితే ఇంట్లో వాళ్ళందరికీ మన ఇద్దరికీ శోభనం జరగలేదని అనుమానం వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఇదొక అశుభంగా అందరూ భావిస్తారు. దయచేసి నువ్వు బయటికి వెళ్ళద్దు అని అనామిక కళ్యాణి రిక్వెస్ట్ చేస్తుంది సరే నువ్వు బెడ్ మీద పడుకో నేను నేల మీదే పడుకుంటాను అని కళ్యాణ్ చెబుతాడు. ఓకే గదిలో వేరువేరుగా ఆ గదిలో నిద్రపోతారు. ఉదయం కళ్యాణ్ నిద్రలేచేసరికి అనామిక నిద్రలేచి కూర్చుని బాగా నిద్ర పట్టిందా కళ్యాణ్ అని అడుగుతుంది. అసలు నిద్రపోతేనే కదా అని కళ్యాణ్ అంటాడు సారీ కళ్యాణ్ అని అంటే మొదటి రాత్రి గురించి ఎన్ని అసలు పెట్టుకున్నానో నీకేం తెలుసు ఎన్ని కలలు కన్నానో అని కళ్యాణ్ అంటాడు. అనామిక బయటకు వెళ్తున్న కళ్యాణ్ ని ఆపి తన కళ్లకున్న కాటుక లిప్స్టిక్ తీసి షర్టుకి రాస్తుంది.

Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights
Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights

ఇక ఇలా వెళ్తే అందరూ శోభనం జరిగిందని అనుకుంటారు. ఇక్కడ జరగకపోయినా జరిగింది అని అనుకోవాలి కదా అని కళ్యాణ్ అంటాడు. ఇక కళ్యాణి ని అనామిక కిందకు వెళ్ళమని చెబుతుంది. అప్పుడే అనామిక మనసులో ఈ ఇంటి పగ్గాలు నాకు ఆఫీస్ పగ్గాలు నీకు దక్కేంతవరకు నేను నీకు దక్కను కళ్యాణ్ నువ్వు నా గుప్పెట్లో ఉండే అంతవరకు నేను నీ దరిచేరను కాక చేరను.. నా చెప్పు చేతుల్లో నువ్వు, ఈ ఇల్లు ఉండాలి అని అనామిక మనసులో క్రూరంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇవేమీ కళ్యాణ్ పట్టించుకోకుండా గబగబా ఎందుకు వెళ్తాడు ఇక వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నమ్మ హాల్లో కూర్చుని ఉంటారు. ఇక వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కళ్యాణి చూసి పక్కపక్క నవ్వుకుంటాడు. పెద్ద వీర సైనికుడు వచ్చాడని కళ్యాణి చూస్తూ వాళ్ల పెద్దనాన్న నాలుగు చివాట్లు పెట్టి పైకి పంపిస్తాడు. ధాన్యలక్ష్మి కళ్యాణ్, అనామికులను చూసి సంతోషిస్తుంది త్వరగా స్నానం చేసి వస్తే ఇద్దరికీ టిఫిన్ పెడతాను త్వరగా కిందకు రండి అని చెబుతుంది.

Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights
Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights

కావ్య తన గదిలోకి వచ్చేసరికి రాజ్ శ్వేతతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసి కావ్య కోపంగా ఉంటుంది నువ్వు చెప్పు స్వీటీ అంటూ కావ్య ఇంకాస్త ఉడుక్కునేలాగా రాజ్ తన బిహేవియర్ ని చేంజ్ చేస్తూ స్వేతతో మాట్లాడతాడు. ఇక కావ్యకి విపరీతమైన కోపం వస్తుంది కావాలని అటు ఇటు అడ్డం తిరుగుతూ మాట్లాడకుండా చేస్తుంది. ఇక్కడ కొంతమందిని చూస్తుంటే అసలు మాట్లాడాలని కూడా అనిపించదు. నువ్వు మాట్లాడుతుంటే ఎంతసేపైనా నీతోనే మాట్లాడాలి అని అనిపిస్తుంది శ్వేత అని రాజ్ అంటాడు. కావ్యకి కోపం వచ్చి నేను నిద్రపోవాలి అని అంటే సరే నిద్రపో నాకేంటంటే అని రాజ్ అంటాడు. ఇక కావ్య కోపంగా లేచి లైట్ కట్టేస్తుంది. నేను మాట్లాడుతుంటే లైట్ ఆఫ్ చేస్తావ్ ఏంటి అని రాజ్ పెద్దగా అరుస్తాడు. నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు అని కావ్య అంటుంది. నువ్వు పక్కనుంటే నాకు అసలు మాట్లాడాలన్న మూడే రాదు.. నన్ను ఏడిపించాలన్నా పనే నీది కదా అని రాజ్ అంటాడు. ఆ పని చేస్తుంది మీరు అని కావ్య అటు వైపు తిరిగి పడుకుంటుంది. త్వరలో నీకే క్లారిటీ వస్తుంది. అప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటావో నేను చూస్తా అని రాజ్ కావ్య ఆటిట్యూడ్ని చూసి మనసులో అనుకుంటాడు. రాజ్ కావ్య కాన్ఫిడెన్స్ కి ఇదొక టెస్టులాగా పెట్టినట్టు అనిపిస్తుంది.

Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights
Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights

మరోవైపు అప్పు ఉదయాన్నే నిద్ర లేచి నిన్న పోలీస్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది నీలాంటి యంగ్ స్టార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది అని ఆయన చెప్పిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనకం కృష్ణమూర్తి అక్కడికి రాగా వాళ్లతో అదే విషయాన్ని పంచుకుంటుంది ఎలాగో నీకు ఇవ్వాల్సిన మంచి జీవితాన్ని మేము ఇవ్వలేకపోయాము. కనీసం నువ్వు చదువుకుంటాను అన్నా చదువుని చదివించలేకపోయాము. ఇప్పుడు నువ్వు స్థిరపడాలనుకుంటున్న ఉద్యోగంలోకి నువ్వు వెళ్లడానికి మాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తాము అని చెబుతారు. ఇక అప్పు బ్యాగు తీసుకుని ఫిట్ గా ఉండాలని రన్నింగ్ చేస్తూ ఉంటుంది. ఇక తను వాకింగ్ చేసి వస్తూ ఉంటే తన పక్కనే ఉన్న వేరొక అతను నడుచుకుంటూ పడిపోతూ ఉండగా తనని పట్టుకొని అప్పు కాపాడుతుంది. ఆయన అప్పు మాటలకి ఇంప్రెస్ అవుతాడు. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అని అతను చెబుతాడు. అంతేకాకుండా అప్పుకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తాడు.

Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights
Brahmamudi Today Episode February 8 2024 Episode 327 Highlights

రేపటి ఎపిసోడ్ లో అపర్ణ కావ్యని పిలుస్తుంది కావ్య రేపటి నుంచి నువ్వే ఇంటి బాధ్యతలన్నీ తీసుకోవాలి ఈ దుగ్గిరాల కుటుంబ బాధ్యతలు అన్నింటిని కూడా నువ్వే తీసుకోవాలి అని అపర్ణ అందరి ముందు కావ్యకి చెబుతుంది. ఇదిగో ఈ ఇంటి తాళాలు.. ఎవరికి ఏ అవసరం వచ్చినా నీ దగ్గరికే రావాలి అని అపర్ణ చెబుతుంది. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి కుళ్ళుకుంటు ఉంటారు. ఇందిరా దేవి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri