NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights

Brahmamudi:దుగ్గిరాల ఇంట్లో భద్రాచలం అక్షాంతులు భార్యాభర్తలు ఇద్దరు వేసుకోవాలి అని చెప్తారు పంతులుగారు. ఇందిరా దేవి సీతారామయ్య తో అక్షింతలు వేయించుకుంటుంది. సుభాష్ అపర్ణకి అక్షింతలు వేయబోతూ తను తప్పు చేశానని పశ్చాత్తాప పడుతూ ఉంటాడు కానీ ఇంట్లో అందరికీ అనుమానం రాకుండా అక్షింతలు వేస్తాడు తర్వాత కావ్య రాజ్ తో అక్షింతలు వేయించుకుంటుంటే రుద్రాణి ఆపుతుంది నాకో ధర్మ సందేహం ఉంది అని శ్రీరామచంద్రుడు ఏకపత్నివృతుడు అలాంటి మహనీయుడు అక్షింతలు రాజ్ వేయడానికి అర్హత లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది ఇక వెంటనే రుద్రాణి మాటలు వెనుక ఉన్న సెటైర్ ని అర్థం చేసుకున్న స్వప్న రుద్రానికి సెటైర్ వేస్తుంది.

Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights
Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights

ఇక స్వప్న మాట్లాడుతూ శ్రీరామనవమి రోజు అనామిక కూడా సీతారాముల కళ్యాణం రాజ్ చేయడానికి అర్హత లేదన్నట్లు మాట్లాడితే ఈరోజు ఆ పాపం శాపంగా మారి ఏకాకిగా మిగిలి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు మొదలు పెట్టారా మీ బుద్ధి చూపించుకున్నారు అని రుద్రా నీ మీద గొడవకు దిగుతుంది స్వప్న భర్త బతికి ఉండి ఆయన పక్కన లేకపోయేసరికి బాగున్న జంటలు ఇలాగా అక్షింతలు వేయించుకుంటుంటే చూసి ఓర్వలేక అలా మాట్లాడుతుంది అక్క అని కావ్య అంటుంది. నా భర్త పక్కన లేడని నేను ఈరోజు బాధపడలేదు అని కావ్యకుతో అంటుంది రుద్రాణి. మీకు ఆ బాధే ఉంటే ఎప్పుడూ ఆయన దగ్గరికి వెళ్లి పోయే వాళ్ళు అని అంటుంది స్వప్న. మీకు అంతగా కావాలనుకుంటే అక్షింతలు తీసుకొని మీ ఆయన దగ్గరికి వెళ్ళండి అంతేగాని ధర్మసందేహం పేరుతో ఎక్కలేని సందేహాలను అందరిలో కల్పించాలని చూడొద్దు అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నా భర్త మాత్రం శ్రీరామచంద్రుడే అని రాజ్ వైపు చూసి అంటుంది కావ్య. ఇంట్లో అందరూ ఆమె వైపు చూస్తారు ఇక మీరు అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించండి అని అంటుంది కావ్య రాజ్ ఆశిర్వదిస్తాడు ఇక స్వప్న రాహుల్ వైపు చూసి ఏంటి ఇప్పుడు నేను నీ కాళ్ళు మొక్కల అని అంటుంది రాహుల్ తప్పదుగా అని అంటాడు వసుదేవుడికే తప్పలేదు నాకెంతలే అని అంటుంది వసుదేవుడు ఏంటి అని అంటాడు పోనీలే నీకు తెలియదు కదా అది చాలు నాకు అని అనుకుంటుంది స్వప్న అక్షింతలు రాహుల్ స్వప్న కి వేస్తాడు. ఇక స్వప్న ఏంటి అన్నా మీకు ఆ నువ్వు కూడా మా అత్తలాగ ఏకాకిలా మిగలాలనుకుంటున్నావా ఏంటి అక్షింతలు తీసుకెళ్లి కళ్యాణ్తో ఆశీర్వది తీసుకో అని అంటుంది. అనామిక అక్షింతలు తీసుకొని కళ్యాణ్ రూమ్ కి వెళ్తుంది.

Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights
Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights

ఇక కళ్యాణ్ కవితలు రాసుకునే పనిలో నిమగ్నమై ఉంటాడు. కళ్యాణ్ అని పిలుస్తుంది అనామిక వెంటనే కళ్యాణ్ పోయింది అని అంటాడు ఏం పోయింది అని అంటే నువ్వు పిలవగానే నీ లెగ్ ఇక్కడ పడగానే నాకు కవిత్వం రాయాలన్నా ఆశ ఉత్సాహం రెండు పోయాయి అని అంటాడు. కళ్యాణ్ అని పెద్దగా అరుస్తుంది అనామిక ఏంటి గొడవ పెట్టుకోవడానికి వచ్చావా, ఇప్పుడు నాకు నీతో గొడవ పడేంత మూడు లేదు కానీ తర్వాత గొడవ పడదాం వెళ్ళు అని అంటాడు. అది కాదు కళ్యాణ్ కింద అందరూ వాళ్ళ భర్తల చేత భద్రాచలం నుంచి తెచ్చిన అక్షింతలు వేయించుకున్నారు నేను కూడా నీతో అక్షింతలు వేయించుకోవడానికి వచ్చాను అక్షింతలు వేస్తావా వేయవా అని అంటుంది. అయినా నేను నీకు రోజు వేసుకునే ఉన్నాను కదా అక్షింతలు అని అంటాడు. ఏంటి అని అంటుంది అనామిక అదే నేను ఇప్పుడు అక్షింతలు వెయ్యాలి అని అంటావు అంతే కదా అని అంటాడు. అవును అని అంటుంది ఆ అక్షింతలు ఎంత పవిత్రమైనవి నీకు తెలుసా నీలాంటి చూపునకు జాతికి చెందిన శ్రీ మీద అక్షంతలు వేయకూడదు పోనీ వేస్తే చెవులు ముక్కు జాగ్రత్త అని చెప్పాలి ఇదంతా ఎందుకు, అసలు భార్య భర్త, ఇద్దరూ సంతోషంగా వాళ్ళ కష్టాలు జీవితాంతం తోడుగా ఉండాలని కోరుకొని అక్షింతలు వేస్తారు. నేను నిన్ను భార్యగానే చూడట్లేదు నీకు విడాకులు ఇవ్వాలి అని అనుకుంటున్నాను అలాంటప్పుడు ఈ యాక్షన్ తెలుగు నీ మీద ఎలా వేస్తారు చెప్పు, నేను నీతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను అలాంటప్పుడు ఈ అక్షరం తల వేయడంలో అర్థం లేదు అని అరుస్తూ అక్కడినుంచి కళ్యాణ్ బయటికి వచ్చేస్తాడు.

Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights
Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights

ఇక కళ్యాణ్ బయటికి రాగానే కావ్య గదిలో జరిగిందంతా చూస్తుంది కళ్యాణ్ తో కావ్య నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు అని అంటుంది నేనేం చేశాను వదిన అని అంటాడు ఇప్పుడు అనామికత అక్షింతలు వేయకుండా నువ్వు మాట్లాడిన మాటలని నేను విన్నాను అని అంటుంది. అది నా ప్రమేయం లేకుండా జరిగిపోయిన వదిన అని అంటాడు అలా అని ఎన్ని రోజులు తప్పించుకుంటారు అని అంటుంది. అదేంటి వదిన అని అంటాడు పవన్ కళ్యాణ్ నువ్వు అనామిక నుంచి విడిపోవాలనుకుంటున్నారు పెళ్లి చేసుకోవడం అంత తేలిక విడిపోవడం అంతే తేలిక నాకు తెలీదులే ఈ ఇంటికి నేను వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను గౌరవించలేదు, అసలు నన్ను భార్యగా మా ఆయనే గుర్తించలేదు అలాంటిది నేను అప్పటి నుంచి ఇప్పటివరకు పోరాటం చేస్తూనే ఉన్నాను అంతే కానీ నేను విడిపోవాలి అని అనుకోలేదు కదా, అలా అనుకుంటే ఇంకా ఈ భార్యాభర్తల సంబంధం బ్రహ్మముడికి అర్థం ఏముంది అని అంటుంది.భార్యాభర్తల బంధం విడదీయడం ఎవరివల్లా కాదు నీ కాపురం నువ్వు సరి చేసుకోవాలి కానీ ఇలా భార్యని దూరం పెట్టడం పద్ధతి కాదు అని మరిదికి క్లాస్ పీకుతుంది కావ్య.

Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights
Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights

ఇక మరోవైపు కావ్య ఆపు ఇద్దరు కలిసి బాబు తల్లి అయినా మాయ ఇంటి దగ్గరికి వెళ్తారు ఇదేనా మా ఇల్లు అని అడుగుతుంది కావ్య, అవునక్కా ఇదే అని చెప్తుంది అయితే లోపలికి వెళ్దాం పద అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. వెంటనే మాయ వాళ్ళిద్దరిని చూసి తలుపులు వేస్తుంది ఏంటి తలుపు వేస్తున్నావు అంటే మేము ఎవరో నీకు తెలుసు అన్నమాట అని అంటుంది. మీరెవరో నాకు తెలియదు అని అంటుంది మాయ తెలియకుండానే తలుపులు వేసావా అని అంటుంది. ఇక పక్కనే ఉన్న అప్పు ఏంటక్క దీంతో మాట్లాడుతున్నావు దీనికి మనం ఎవరో తెలుసు ఇప్పుడు మనం మాయని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తే వెంటనే పోలీసులు నిజాలు బయట పెడతారు అని అంటుంది వెంటనే మాయా పోలీస్ స్టేషన్ కి వద్దు అని అంటుంది. మరి అయితే నిజం చెప్పు అని అంటుంది ఏ నిజం అని అంటుంది. నీకు తెలిసిన నిజమే అని అంటుంది కావ్య. అవును నేను డబ్బుల కోసం ఇదంతా చేశాను అని అంటుంది. ఆ విషయం నాకు తెలుసు కానీ అసలు నిజం చెప్పు అని అంటుంది కావ్య. ఆ బిడ్డ తల్లివి నువ్వు అని తెలుసు డబ్బుల కోసం బిడ్డని వదిలేయడం అంటే కచ్చితంగా దీని వెనక ఏదో ఉంది ఆ బిడ్డకి మా మామయ్య గారికి ఏ సంబంధం లేదు కదా అని అడుగుతుంది అవును ఏ సంబంధం లేదు ఆ ఇంట్లో ఎవరికీ ఆ బిడ్డతో ఏ సంబంధం లేదు అని మాయ నిజం ఒప్పుకుంటుంది. మరి ఇది అంతా ఎలా అని అడుగుతుంది కావ్య. ఒకసారి సుభాష్ తో జరిగిన తప్పుని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశాను అని మాయ నిజం ఒప్పుకుంటుంది. పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేను బెదిరిస్తే ఖచ్చితంగా లొంగిపోయి నాకు డబ్బులు ఇస్తారు అని అర్థమయ్యే ఇదంతా చేశాను అని చెప్తుంది వెంటనే కావ్య మాయని చెంప మీద ఒకటి కొడుతుంది. నువ్వు అసలు ఆడదానివేనా బిడ్డని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలని చూస్తున్నావా పద పోలీస్ స్టేషన్ కి అని అంటుంది. పోలీస్ స్టేషన్ కి వద్దు అని మాయ ప్రాధేయపడుతుంది. అక్క నువ్వు ఒకటి గమనించావా ఇది పోలీస్ స్టేషన్ కి అని మనం అన్నప్పుడు ఎలా చాలా భయపడుతుంది అంటే ఇది ఒక తప్పే కాదు అక్క పోలీస్ స్టేషన్ కి వెళ్తే దీని తప్పులన్నీ బయటపడతాయని భయపడుతుంది అని అంటుంది అప్పు. చూడు నీ గతం గురించి నాకు అనవసరం ఇప్పుడు నువ్వు వచ్చి మా ఇంట్లో అందరి ముందు నాకు చెప్పింది దాన్ని చెప్పాలి అందరి ముందు ఆ బిడ్డ కి ఇంట్లో మా వారికి మావయ్య గారికి సంబంధం లేదన్న విషయం నువ్వు వచ్చి చెప్పాలి మా అత్తగారి కాళ్ళ మీద పడి ప్రాధేయపడాలి అని అంటుంది. నా భర్త నిరపరాధి అని అక్కడ అందరికీ తెలియాలి నా భర్త మీద ఆ ఇంట్లో వాళ్ళు నింద వేశారు అది నింద మాత్రమేనని నిజం కాదని నువ్వొచ్చి నిరూపించాలి నా భర్త శ్రీరామచంద్రుడని అందరూ అనుకోవాలి ఆ ఇంట్లో వాళ్లు ముఖ్యంగా మా అత్తగారు తన కొడుకు గురించి తప్పుగా అనుకున్నానని పశ్చాతాపడాలి. అందుకే నువ్వు వచ్చి నిజం చెప్పాలి అని అంటుంది.ముందు మాయి ఒప్పుకోదు తర్వాత అప్పు బెదిరించేసరికి సరే అంటుంది. ఇక మాయని తీసుకొని దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది కావ్య.

Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights
Brahmamudi Today Episode May 21 2024 Episode 415 highlights

ఇక మరోవైపు అపర్ణ ఇందిరాదేవితో అత్తయ్య మీ ముద్దుల మనవరాలు ఎక్కడ అని అడుగుతుంది ఎవరు కావ్య అని అంటుంది ఇందిరా దేవి, అవును ఆవిడే ఏదో ప్రజల బాలి పలికింది కదా ఈ రోజు బిడ్డ తల్లిని తీసుకొస్తాను అని ప్రతిజ్ఞలు చేసింది కదా మరి అక్కడ అని అడుగుతుంది. వెంటనే ఇందిరా దేవి తన ఉండే కొమ్మని తనే నరుక్కుంటానని బయలుదేరిందా ఆ పిచ్చిది సరే చూద్దాం అని అంటుంది. అవునత్తయ్య ఎక్కడికి వెళ్లింది తీసుకొస్తా అని చెప్పింది తీసుకురాకుండా ఇప్పుడు వచ్చి ఏదైనా చెప్తుందేమో అని అంటుంది పక్కనే ఉన్న రుద్రాణి. ఇంకా ఎక్కడ తీసుకొస్తుంది వదిన ఇప్పుడు మళ్లీ వచ్చి, తన ముఖం ఎవరికీ చూపించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటుంది కావ్య ఇంకెప్పటికీ తిరిగి రాదు ఏమో అని అంటుంది రుద్రాణి. అన్ని తప్పులు చేసిన మీరే ఇంట్లో ఉండండి ఏ తప్పు నా చెల్లెలు ఇంటి నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటుంది స్వప్న. మరి మీ అక్క ఆ బిడ్డ తల్లిని తీసుకొస్తానని చెప్పింది మరి ఇంత వాడికి రాలేదంటే అలానే అనుకోవాలి కదా అని అంటుంది రుద్రణి, ఇంట్లో నుంచి వెళ్లిపోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు కదా మీ అక్కకి అని అంటుంది వెంటనే కావ్య నాకు అవసరం లేదు అని ఎంట్రీ ఇస్తుంది. కావ్య చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అవును మీరు విన్నది నిజమే నేను అనుకున్నది కొంచెం ఆలస్యంగా చేస్తానేమో కానీ ఇంట్లో నుంచి పారిపోయే రకాన్ని కాదు మా ఆయన తీసుకొచ్చి ఇస్తానని అందరికీ చెప్పాను తీసుకొచ్చాను అని, మాయా అని పిలుస్తుంది వెంటనే మాయ లోపలికి ఎంట్రీ ఇస్తుంది మా ఆయన చూసి సుభాష్ రాజ్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు. చూడండి అత్తయ్య నేను మీకు మాటిచ్చాను ఇచ్చిన మాట ప్రకారం ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాను అని అంటుంది కావ్య. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కావ్య అపర్ణ కావ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది.మాయా అటూ ఇటూ దిక్కులు చూస్తుంటే వెంటనే కావ్య నువ్వు చేసిన ఘనకార్యాలు నువ్వు చేసిన మాయోపాయాలు నువ్వు సాధించిన విజయాల గురించి ఇంట్లో అందరికీ చెప్పు అని అంటుంది. మాయ ఏం చెప్తుందా అని ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో మాయ మాట్లాడుతూ రాజ్ దగ్గర ఉన్న బిడ్డ నా బిడ్డ అని చెప్తుంది. వెంటనే ఆ బిడ్డ తల్లి ఎవరు అని అడుగుతుంది రుద్రాణి. మాయ తన చేతిని జాపి ఆ బిడ్డ తండ్రి రాజ్ అని రాజ్ వైపు చూపిస్తుంది. అంతేకాదే షాక్ అయిపోతుంది రాజ్ ఆశ్చర్యపోతాడు మాయ తన బిడ్డకి తండ్రి రాజ్ అని చెప్పడంతో కావ్య ఫీజులు ఎగిరిపోతాయి కథ మొత్తం మాయ మార్చబోతున్నట్లు మనకు అర్థమవుతుంది చూడాలి మరి మాయ రాజ్ మీద నింద వేసి, ఆ ఇంట్లో సెటిల్ అవ్వాలనుకుంటుందా లేదంటే నిజం చెప్పి బిడ్డని తీసుకెళ్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాలిసిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella