NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 24 Episode 418: కళ్యాణ్ ను హెచ్చరించిన అనామిక.. ఇంటి పెద్దలు కావ్య కే సపోర్ట్.. సుభాష్ ని బెదిరించిన మాయ..

Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights

Brahmamudi May 24 Episode 418:  కావ్య ఇంట్లో కి మాయ ని తీసుకురావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. దుగ్గిరాల ఇంట్లో మాయ వచ్చి రాజ్ తన బిడ్డకి తండ్రి అని చెప్పడంతో, సీతారామయ్య ఎటువంటి నిర్ణయం తీసుకోలేక కొన్ని రోజులు మాయని ఇక్కడే ఉండమని చెప్తాడు. కావ్య అసలు మాయగా ఎందుకు చెప్పిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. చివరికి అది అసలు మాయ కాదని చిత్రా అని రుద్రాణి ప్లాన్ వల్లే ఇదంతా జరిగిందని, కావ్య తెలుసుకుంటుంది ఆ విషయం చిత్రా రుద్రాణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా కావ్య వెళ్లి ఈరోజు కాకపోతే రేపైనా మీ బండారం బయటపెడతానని, చిత్రకి రుద్రానికి ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మరోవైపు రుద్రాణి ఎప్పటికీ కావ్య నిజం బయట పెట్టదు ఎందుకంటే తను ఒక సెంటిమెంటల్ ఫుల్ అని, ఏంటికి నష్టం జరుగుతుందంటే ఏమీ మాట్లాడదని రుద్రాణి చిత్రతో నువ్వు ధైర్యంగా నటించొచ్చు అని అంటుంది ఇక చిత్రా రుద్రాణి ఇద్దరు కలిసి ఇంట్లో గందరగోళం సృష్టించాలని డిసైడ్ అవుతారు ఎలాగైనా చిత్రని కావ్య ప్లేస్ లోకి తీసుకువచ్చి ఆ ఇంటి కోడలిని చేయాలని రుద్రాణి గట్టిగా స్కెచ్ వేస్తుంది.

Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights
Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights

ఇక మరోవైపు కళ్యాణ్ తో అనామిక, ఏదైనా మీ వదినని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది ఎవరు అలాగా తెలివిగా ఉండలేరు అంత తెలివితేటలు ఎవరికి ఉండవు అసలు అంత ధైర్యం కూడా ఎవరికి ఉండదు అని అంటుంది వెంటనే కళ్యాణ్ ఏమంటున్నావ్ అని అంటాడు. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నది నిజమే ఎవరైనా సవితిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా కానీ మీ వదిన చేసింది అంటే దానికి ఎంత తెలివి ఎంత ధైర్యం కావాలి అలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు అని అంటుంది. వెంటనే కళ్యాణ్ మా వదిన అలా ఎందుకు చేసిందో దాని వెనక ఎంత కారణం ఉందో నాకు ఇప్పుడైతే తెలియదు కానీ ఏదో ఒక రోజు దాని వెనక బలమైన కారణం ఉంది అన్న విషయం ఇంట్లో అందరికీ అర్థం అవుతుంది అని అంటాడు. అవునవును చాలా బలమైన కారణమే ఉందిలే అని అంటుంది అనామిక, మా వదిన ఆవిడని తీసుకొచ్చిన దాని కంటే కూడా జరిగిన నష్టానికి నువ్వు సంతోషపడుతున్నట్లు ఉన్నావు అని అంటాడు కళ్యాణ్. నన్ను అపార్థం చేసుకోవడం తప్ప అర్థం ఎప్పుడు చేసుకున్నావ్ అని అంటుంది. నువ్వు ఇలాంటి మనిషివేనా తెలియక ప్రేమించి తప్పు చేశాను, నీ మనసులో మాటలని అర్థం చేసుకొని నీతో ఎప్పటికీ మాట్లాడకూడదు అని అనుకుంటున్నాను అని అంటాడు. మీ వదిన మాటల్ని బాగా అర్థం చేసుకున్నావు కదా ఇప్పుడేం సాధించావు ఆవిడ గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే మౌనంగా చూస్తూ ఉండిపోయావు అని అంటుంది. మా వదిన ఇంట్లోంచి వెళ్లి పోతుంది నీకు ఎవరు చెప్పారు అని అంటే ఒకరు చెప్పాల్సిన అవసరం ఏముంది కళ్ళముందు కనిపిస్తుంది కదా అని అంటుంది అనామిక. ఇప్పుడు ఒక అమ్మాయి మనకు ఇంట్లోకి వచ్చింది ఆవిడకి న్యాయం చేయాలి అని అంటే, మీ అన్నయ్య నుంచి పెళ్లి చేయాల్సిందే కదా అని అంటుంది అనామిక. అది జరిగితే మీ వదిన స్థానం ఏమవుతుంది అని అడుగుతుంది. రాజుతో ఆ బిడ్డ తల్లికి పెళ్లి చేస్తే, అఫీషియల్ గా ఇంటికోడలు అవుతుంది మీ వదిన పరాయిదవుతుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ముందు అది చూసుకో అని అంటుంది అనామిక, అలా ఎప్పటికీ జరగదు అని అంటాడు కళ్యాణ్.అదే జరుగుతుంది మీ పెద్దమ్మ గురించి తెలియదా ఏంటి అదే జరుగుతుంది చూడు అని అంటుంది అనామిక. అదే జరుగుతుంది ఇంట్లో ఎవరు చూస్తూ ఊరుకోరు అని అంటాడు.అలా అడ్డుపడే వారి అయితే ఆ అమ్మాయి ఇంట్లోకి రాగానే అడ్డుపడేవారు లేదు ఇంట్లో ఉండమని ఎప్పుడైతే తీర్పించారో, అప్పుడే అర్థమైపోవట్లేదు న్యాయం ఏదో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని న్యాయం ఎటువైపు ఉందో నీకు కూడా తెలుసు కదా కళ్యాణ్ అని అంటుంది. నా మాట రాసి పెట్టుకో మీ వదిన ఇంట్లో ఉండడం అనేది జరగదు ఎక్కడ నుంచి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది అని అంటుంది. కళ్యాణ్ అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఏదో ఒకటి చేసే వదినకు సహాయం చేయాలి అని అనుకుంటాడు.

Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights
Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights

మరోవైపు సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య పాపం తను ఏదో నా కోసం చేయాలనుకుంది కానీ ఇప్పుడు తను సమస్యల్లో ఇరుక్కుంది . ఆలస్యం చేసే కొద్ది ఏదైనా జరగొచ్చు అని మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అపర్ణ అన్నమాటలని గుర్తు చేసుకుంటాడు రాజ్ కి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాను అమ్మాయి ఎవరు వాడు చెప్తే ఎవ్వరు ఏమన్నా సరే నేను వాళ్ళ పెళ్లి చేస్తాను అని గతంలో అపర్ణ అన్న మాటలు సుభాష్ గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు రాజ్ కోసం ఈ మాయని ఇచ్చి అపర్ణ పెళ్లి చేద్దాం అని అనుకుంటే అప్పుడు కావ్య కూడా ఏమీ చేయలేదు అంతదాకా వెళ్లేకముందే నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. అసలు మాయలేడిగా ఇక్కడికి వచ్చినా మాయని ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటాడు. మరోవైపు స్వప్న కావ్యని తీసుకొచ్చి నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని అంటుంది. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థం అవుతుందా కావ్య అని అంటుంది స్వప్న నాకు ఇంతకన్నా అది వేరే దారి కనిపించలేదు అక్క అని అంటుంది. అలాగని నీ దారి నువ్వే మూసేసుకుంటావా అని అంటుంది స్వప్న. అసలు నువ్వు చేసిన పని వల్ల నీకు ఏ నష్టం జరిగిందో నీకు అర్థం అవుతుందా, అని అంటుంది స్వప్న వెంటనే కావ్య మా ఆయన నాకు దూరం అవుతాడు అంతే కదా అని అంటుంది. అంతే కదా అని, అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు అని అంటుంది. నీ మొగుడితో కలిసి ఉండడానికి ఎంత కష్టపడ్డావు ఎంత మందితో పోరాడావు, ఆఖరికి నీ మొగుడు నేను ఇంట్లో నుంచి తరిమేసిన వర్షంలో నిలబడి పోరాడి తిరిగి ఇంట్లోకి వచ్చావు. ఇప్పుడు నీ అంతటి నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, అని స్వప్న కావ్య ని నిలదీస్తుంది. ఇంకొకసారి నేను ఈ గడప దాటి బయటికి వెళ్లాలి అని అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే అని అంటుంది కావ్య. మరి ఈ మాయ ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంది. అక్క నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది ఇంట్లో జరుగుతున్న గొడవలు అన్నీ చూస్తున్నావు కదా, మా అత్తయ్య ఆ బిడ్డ తల్లి రాకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని అన్నది విన్నావు కదా, తనని ఆపడానికి నాకు ఇది తప్ప వేరే దారి కనిపించలేదు. మీ అతని ఆపడానికి దీన్ని తీసుకొచ్చి ఆ తర్వాత ఏం చేస్తావు అని అంటుంది స్వప్న. మీ అత్త దానికి ఇచ్చి నీ మొగుడితో పెళ్లి చేయాలంటే ఏం చేస్తావు అని అంటుంది. ఏమో నాకు తెలీదు, అని అంటుంది కావ్య ఒసేయ్ పిచ్చిదానా నీ మొగుడితో నీకు విడాకులు ఇప్పించే ఎలా ఉంది మీ అత్త అని అంటుంది. తెలీదు తెలీదు అని అంటుంది కావ్య. నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అక్క అని అంటుంది. ఏదో ఒకటి చేసి ఈ సమస్య నేను పరిష్కరిస్తాను అదొక్కటే నాకు తెలుసు అని అంటుంది కావ్య. లోతు ఎంతో తెలుసుకోకుండా నదిలోకి దిగకూడదని నువ్వే నాకు చెప్పావు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా కనీసం ఈత కూడా నేర్చుకోకుండా నేరుగా సముద్రంలోకి దూకినట్లు ఉంది అని అంటుంది. ఆ రాముడు సీతని అడవులకు పంపించినట్లు తన కూడా అడవులు ఎలా బతకాలో తెలీదు, కానీ సీతమ్మ బతికి చూపించింది కదా నేను కూడా అంతే, ఏం చేయాలో తెలియనప్పుడు ఆగిపోవడం కంటే ముందుకు వెళ్లడమే మంచిది అని అంటుంది కావ్య. మీ అత్తయ్య గారు నేను ఓడించాలనుకుంటుంది అని అంటుంది స్వప్న. మీ అత్తగారు నిన్ను గాలికి వదిలేసింది కదా అని అంటుంది. మా అత్తయ్య గారు నన్ను ఎప్పుడు ఓడించాలి అని అనుకోవట్లేదు వాళ్ళ అబ్బాయిని గెలిపించాలి అనుకుంది. నా గురించి తనకి పూర్తిగా అర్థమైంది రోజూ ఇంట్లో అందరికంటే మా అత్తగారి నాకు సపోర్ట్ గా నిలబడుతుంది అని అంటుంది కావ్య. నాకు ఆ నమ్మకం లేదు అని అంటుంది స్వప్న కానీ నాకుంది అక్క అని అంటుంది కావ్య. అదంతా జరగాలి అంటే ముందు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరాలి, అది నేను ఎలాగోలా చూసుకోగలను. కానీ అప్పటివరకు దయచేసి నా విషయం నాకోసం ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అని అంటుంది కావ్య. నిన్ను బాధ పెడుతుంటే సహించే ఓపిక సహనం నాకు లేదు. నీ జోలికి ఎవరైనా వస్తే నేను సహించను అది ఎవరైనా సరే లాగిపెట్టి కొడతాను అని అంటుంది.

Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights
Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights

ఇక మరోవైపు సుభాష్ మాయ దగ్గరికి వెళ్తాడు. ఏంటి మామయ్య గారు నాతో ఏదో మాట్లాడాలని చెప్పి సైలెంట్ గా ఉన్నారు అని అంటుంది. ఓహో మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోకుండా ఇంటికి వచ్చాను అని అంటుంది వెంటనే సుభాష్ కోపంగా చూస్తాడు. ఏంటి ఇదంతా కోపమేనా అయినా నా మీద మీరు కోపం చూపించరులెండి పరిస్థితి అలాంటివి అని అంటుంది. నాకు నీలాగా వంకర ఇంకా మాట్లాడటం రాదు సూటిగా వచ్చు అని సుభాష్ మాయతో మాట్లాడుతాడు. నువ్వు ఆ బిడ్డ తల్లివి కాదు అని నాకు తెలుసు నాటకాలు ఆడుతున్నావని తెలుసు నువ్వు ఇంటికి వచ్చింది డబ్బు కోసమేనా అని అంటాడు. ఏమనుకున్నాను కానీ నీ గురించి విన్నదంతా నిజమే అని అంటుంది. నీకు ఎంత కావాలో చెప్పు నువ్వు డబ్బు కోసమే ఇక్కడికి వస్తే నీకు ఎంత కావాలన్నా ఇస్తాను అని అంటాడు సుభాష్. మరి మీ ఆవిడ అడిగితే ఏం చెప్తారు అని అంటుంది. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నీ దారిని వెళ్లిపోయి ఏం చేయాలో నేను చూసుకుంటాను అని అంటాడు సుభాష్. వావ్ సూపర్ మీ తెలివితేటలు అమోఘం మామగారు, నాకు డబ్బులు ఇచ్చి, మీ మాట వినాలని చేసి అందరి ముందు ఇది మోసగతే నా దగ్గర డబ్బులు తీసుకుంది అని నిరూపించి, మీరు ఇచ్చిన డబ్బు తిరిగి లాగేసుకుని, నన్ను ఇంట్లో నుంచి గంట్యాలని చూస్తున్నారా అని అంటుంది. నేను అప్పటికి అలా చేయను నువ్వు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు నేను మాటంటే మాట అని అంటాడు. మరి మీ ఆవిడ ఉన్నా కూడా మీరు వేరే అమ్మాయితో పెళ్ళానికి అన్నారు కదా అని అంటుంది మాయ. మరి మీ భార్యకు అన్యాయం చేయనని పెళ్లి చేసుకునేటప్పుడు మాట ఇచ్చి తర్వాత మీరు చేసింది ఏంటి మీ డబ్బు ఉన్న వాళ్ళని నేను నమ్మలేను అందుకే చుట్టూ అందకపోతే కాళ్లు, నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటాడు నేను మీరనుకుంటున్నదే ఎప్పటికైనా ఈ ఇంటికి కోడలిగా ఉండాలనుకుంటున్నాను మీరు ఇచ్చే చిల్లర డబ్బులు కాశపడి ఇంత పెద్ద అవకాశాన్ని ఎలా వదులుకుంటాను అని అంటుంది మాయ. అంటే నువ్వు ఇక్కడే ఉంటావా అని అంటాడు శాశ్వతంగా ఉండిపోవాలని కదా ఇంత పెద్ద కుటుంబంలోకి వచ్చింది అని అంటుంది. అది నేను ప్రాణాలతో ఉండగా జరగదు అని అంటాడు సుభాష్ మీకు సంబంధం లేదు మావయ్య గారు కింద అత్తయ్య గారు ఉన్నారు కదా, ఆవిడకి ఆవిడ కొడుకు అంటే చాలా ప్రేమ ఇప్పుడు ఆ బిడ్డకు తల్లి నేను అని స్పష్టంగా ఆవిడకి అర్థం అయిపోయింది రేపు మాకు పెళ్లి చేస్తుందని నమ్మకం కూడా నాకుంది. కాబట్టి నాకేం అభ్యంతరం లేదు అయినా నేనేంటి మీతో ఈ నిజాలన్నీ మాట్లాడేస్తున్నాను మీరు వెళ్లి ఎవరితో చెప్పారు కదా చెప్పరులేండి ఎందుకంటే మీ చీకటి కోణం బయటికి వస్తుంది కాబట్టి అని అంటుంది దాంతో సుభాష్ షాక్ అవుతాడు. మాయ ఇంకా నేను ఇంట్లో తేల్చుకోవాల్సింది లెక్కలు చాలా ఉన్నాయి ఎలాగైనా ఈ ఇంటి కోడలు అయ్యి మహారాణి హోదాలో మళ్లీ నేను ఇంట్లో తిరుగుతాను అది మీరు చూస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights
Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights

మరోవైపు సీతారామయ్య ఇందిరా దేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది చిట్టి అని అంటాడు సీతారామయ్య. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అలాంటి పరిస్థితిలో తన ఎందుకు వెళ్ళిందో, నాకే అర్థం కావట్లేదు అని అంటాడు. కావ్య మాయని తీసుకొచ్చిందని మనం ఇప్పుడు కావ్యకి అన్యాయం చేయలేము అసలు కావ్యని తీసుకురావడానికి కారణం ఎవరు మనవడే కదా బావ అని అంటుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇంట్లో ఒకరికి న్యాయం చేస్తే మరొకరికి అన్యాయం జరుగుతుంది అని అంటాడు నేను మాట్లాడుతుంది స్వార్థం అనుకో ఇంకా ఏదైనా అనుకో బావ, నాకు అర్థం కావ్యకి న్యాయం చేయాలని ఉంది అని అంటుంది. ఏంటి బావా అలా చూస్తున్నావ్ ఇంటికి పెద్దదాన్ని అయ్యుండి కూడా, ఒకరికి న్యాయం చేస్తే ఒకరికి అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఒకరిపై నిలబడుతున్నావేంటి అని అనుకుంటున్నావా అని అంటుంది. నీకున్న తెగింపు కూడా నాకు లేదని బాధపడుతున్నాను చిట్టి అని అంటాడు సీతారామయ్య. కావ్య కి న్యాయం చేయాలని నాకు మనసులో ఉన్న ధైర్యంగా బయట పెట్టలేక పోతున్నాను అని అంటాడు. దానికి నా వయసు పెద్దరికం అడ్డుపడుతుంది. కావ్యకి రాజ్ కి పెళ్లి జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకో బావ అని అంటుంది. తన ఇంట్లోకి వచ్చిన తర్వాత తనని కూతురుగా చూసుకుంటామని తనకి ఏ కష్టమొచ్చినా అండగా నిలబడతామని, వాళ్ళ అమ్మ నాన్నలకి మనం మాట ఇచ్చాము. ఇప్పుడు ఆ మాటని వదిలేయమంటావా అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి నా కూతురికి ఇలాంటి అన్యాయం చేశారంటే అని అడిగితే ఏం సమాధానం చెప్తాము మౌనంగా తలదించుకోవడం తప్ప అని అంటాడు సీతారామయ్య. ఎవరు ఏమన్నా సరే మనిద్దరం కావ్య వైపు నిలబడదాం, ఎవరు ఏమన్నా సరే అని అంటుంది నా మనసులో మాటని, నీ మాటలుగా చెప్పావు తప్పకుండా అలానే చేద్దాం కావ్య లాంటి మంచి మనసున్న అమ్మాయికి అన్యాయం జరగకూడదు అని అంటాడు సీతారామయ్య.

Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights
Brahmamudi Today Episode May 24 2024 Episode 418 highlights

ఇక మరోవైపు ఉదయాన్నే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. అప్పుడే మాయ కావ్య ఇద్దరు వంటింట్లో కాఫీ పెడుతూ ఉంటారు మాయా కాఫీ అంతా రెడీ చేసేసి ఎందుకు చెల్లి నువ్వు కష్టపడతావు నేను ఆల్రెడీ చేసేసాను కదా అని అంటుంది. నువ్వు వెళ్లి కాఫీ ఇస్తే ఎవ్వరూ తీసుకోరు అని అంటుంది కావ్య అయితే చూడు అని మాయా కాఫీ తీసుకొని హాల్లోకి వెళుతుంది. అప్పుడే ధాన్యం కాఫీ కావాలి అని అంటుంది పక్కనే ఉన్న రుద్రాణి కొత్త కోడలు తీసుకొస్తుందని పాత కోడలు తీసుకురాకుండా ఉంటుందేమో లేదంటే బాధ కోడలు ఉంది కదా అని కొత్త కోడలు సైలెంట్ గా ఉంటుందేమో అని అంటుంది. ఇదంతా ఎందుకు నీ కోడల్ని పిలిచి కాఫీ ఇవ్వమని చెప్పు అని అంటుంది. నా కోడలికి కాఫీ పెట్టడం రాదు తాగడం మాత్రమే అని అంటుంది అప్పుడే ప్రకాశం నీకు రుద్రానికి కూడా తాగడం వాగడమే వచ్చు కదా అని అంటాడు. ఇదంతా చూసి అపర్ణ నేనే కాఫీ పెట్టికి తీసుకొస్తాను అని లేవబోతే,కాఫీ రెడీ అనుకుంటూ హాల్లోకి వస్తుంది మాయ. అందరికీ నేనే కాఫీ తీసుకొచ్చాను అని అంటుంది. నాలికకు ఒక రుచి ఉంది ఇంట్లో ఎవరికి ఏం కావాలో నీకు ఎలా తెలుసు అని అంటే అందరికీ ఏమేం కావాలో నాకు తెలుసు అని నాకు రాజు చెప్పాడు అని అంటుంది. ఆ మాటలతో ఇంట్లో అందరితోపాటు కావ్య కూడా షాక్ అవుతుంది. అందరికీ కాఫీ ఇస్తుంది స్వప్న దగ్గరికి వెళుతుంది స్వప్న కాఫీ తీసుకో అంటే సిగ్గు శరం ఉంది నాకు నేను తీసుకొని అని అంటుంది. పక్కనే ఉన్న రాహుల్ ని చూపించి ఈయనకి ఇవ్వు ఆయనకి సిగ్గు శరం ఏమీ లేదు తీసుకుంటాడు అని అంటుంది రాహుల్ నాకక్కర్లేదు అని అంటాడు. అప్పుడే అక్కడి నుంచి మాయ ప్రకాశం దగ్గరికి వెళ్లి మీకు కాఫీ తీసుకొచ్చాను చిన్న మామయ్య అని అంటుంది. నాకు సిగ్గు శరం ఉన్నాయమ్మా అక్కర్లేదు అని అంటాడు. అప్పుడే అమ్మమ్మ గారు మీకు కాఫీ అని అంటుంది. నాకొద్దు అని అంటుంది ఇందిరా దేవి. నేను కాఫీ బాగా కలుపుతాను అని అంటుంది మాయ. నువ్వు నీకు కలపడం వచ్చాను బానే అర్థమవుతుంది వరుసలు కూడా చాలా బాగా కలుపుతున్నావు కదా అని అంటుంది ఇందిరా దేవి. అయినా నాకు మా కావ్య కాఫీ ఇస్తేనే తీసుకుంటాను అని అంటుంది. కావ్య కూడా అమ్మమ్మ గారికి అపర్ణకి కాఫీ చేసి రెండు కప్పులు ప్లేట్లో పెట్టుకుని వస్తుంది. మాయా అపరా దగ్గరికి వెళ్లి కాఫీ ఇస్తుంది అప్పుడే కాఫీ కూడా కాఫీ తీసుకెళ్లిస్తుంది ఇద్దరి వైపు చూస్తుంది అపర్ణ కానీ అపర్ణకి కావ్య అంటే ఇష్టం ఉండదు కాబట్టి మాయకి సపోర్ట్ చేస్తూ మాయ ప్లేట్ లో ఉన్న కాఫీ తీసుకుంటుంది. మాయని కోడలుగా యాక్సెప్ట్ చేసిందని మాయ సంతోషిస్తుంది. ఇందిరా దేవితో చూసావా అమ్మ వదిన కూడా తీసుకుంది అని అంటుంది. మాయ ఉదయం నుంచి కష్టపడి అందరికీ ఏం కావాలో అవన్నీ తీసుకొస్తే తీసుకోకపోతే తన బాధ పడుతుంది కదా అమ్మ అని అంటుంది. అప్పుడే ఏందిరా దేవి కష్టం గురించి బాధ గురించి నువ్వే చెప్పాలి అలాంటప్పుడు సంవత్సరం నుంచి కావ్య ఏమేం కావాలో ఇంట్లో అందరికీ చూస్తుంది మరి కావ్య కష్టం ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా అర్థం చేసుకోకపోగా నిందలు వేయడం మీ అందరికీ అలవాటే కదా అని అంటుంది. ఇక మాయ నేను మీకు నచ్చేలా మారతాను అమ్మమ్మ గారు అని అంటుంది నువ్వు మారతావేమో నేను మారను అని గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. ఇక అప్పుడే స్వప్న నువ్వు ఎవరికి నచ్చిన నచ్చకపోయినా మా అత్తకి బాగా నచ్చుతావ్ ఇద్దరు బుద్ధులు ఒకటే అని అర్థం అవుతుంది అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో మాయా టిఫిన్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అప్పుడే కావ్య కూడా టిఫిన్ తీసుకొని వడ్డించబోతూ ఉంటుంది రుద్రాణి కావాలని మాయతో నీకు ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటిగా తింటారు నీకు ఎలా తెలుస్తుంది అని చేసుకొచ్చావు అని అంటుంది. నాకు అన్నీ తెలుసు అని అంటుంది మాయ అయితే మా రాజ్ కి ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు అని అంటుంది రుద్రాణి. పెసరట్టు ఉప్మా అంటే మీ రాజకీయ చాలా ఇష్టం కదా అని అంటుంది మాయ అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక అప్పుడే రాజ్ టిఫిన్ చేయడానికి కిందకి వస్తాడు. మాయా కావాలని నటిస్తూ రాజ్ రా నీ కోసం నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను అని అంటుంది. మరి రాజ్ మాయ మాటలకి, తను చెప్పినట్లుగా టిఫిన్ చేస్తాడా లేదంటే కావ్యకి అన్యాయం చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella