NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights

Brahmamudi May 31 Episode 424:  అపర్ణాదేవి రాజ్, మాయ పెళ్లి జరగాలంటే కావ్యను నో అబ్జెక్షన్ మీద సంతకం పెట్టాలి అని అంటుంది. అందుకు ఇంట్లో పంచాయతీ పెట్టి కావ్యను సంతకం పెట్టమని అడుగుతుంది. కావ్య మొదట సంతకం పెడుతుందా లేదా అని ఇంట్లో అందరూ అనుకుంటారు స్వప్న చెల్లికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేననిఅపర్ణకు ఎదురు తిరుగుతుంది వెంటనే కావ్య ఇప్పుడు సంతకం ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతారు దానికి ఆ బిడ్డ మాయ కొడుకు కాదు మాయ నిజం మాయ కాదు అని చెప్పాలి అలా చెప్తే ఆ బిడ్డ ఎవరని అడుగుతారు అప్పుడు మావయ్య గారికి ఆ బిడ్డకి ఉన్న సంబంధం బయటపడిపోతుంది అలా చేస్తే ఇంట్లో సునామినే వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే, నేను ఇప్పుడు ఈ పత్రాలు మీద సంతకం పెట్టాలి ఇప్పుడు పెళ్లికి కొంత టైం దొరుకుతుంది ఆ టైంలో నేను నిజం మాయని తీసుకొచ్చి ఈ సమస్యని గట్టి ఎక్కించాలి అని అనుకుంటుంది అందుకు అత్తగారితో నేను అబ్జెక్షన్ లెటర్ మీద సంతకం పెడతాను అని అంటుంది. ఆ మాటలకు ఇంట్లో అందరూ షాక్ అవుతారు కళావతి ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా అని రాజ్ అడుగుతాడు. ఎవరు ఏమీ అడ్డు చెప్పద్దు నేను సంతకం పెడతాను అని అంటుంది ఇక కళావతి నో అబ్జెక్షన్ పత్రం మీద సంతకం పెట్టిన తర్వాత అపర్ణ ఈ పని చేసిన తర్వాత నువ్వు ఆకాశానికి ఎత్తుకు ఎదిగిపోయాను అని అనుకుంటున్నావా కాదు నా దృష్టిలో పాతాళానికి పడిపోయావు అని అంటుంది.

Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights
Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights

ఇక అపర్ణ కోడలు నీ నానా మాటలు అంటుంది నువ్వు డబ్బుల కోసమే ఇక్కడ ఉంటున్నావని ఇంతకాలం ఎవరు చెప్పినా నేను నమ్మలేదు ఇప్పుడు రుజువైంది. నువ్వు డబ్బు కోసమే ఇక్కడ ఉంటున్నావు లేదంటే నువ్వు ఇలాంటి పని ఎందుకు చేస్తావు దుగ్గిరాల కోడలు హోదా మాత్రమే నీకు కావాలి అని అంటుంది. అప్పుడే అక్కడికి ఇందిరా దేవి నిజం చెప్పావ్ అపర్ణ అని ఎంట్రీ ఇస్తుంది. నీ భర్తకి ఆ అమ్మాయితో పెళ్లి జరిగినా నాకేం సంబంధం లేదు అని నో అబ్జెక్షన్ మీద సంతకం చేసావా అని కావ్య నిలదీస్తుంది ఇందిరా దేవి, వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి చెంప మీద కొడుతుంది. కావ్య షాక్ అవుతుంది. సంతకం చేసి ఏం సాధించావు, ఎవరికోసం ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది. ఎందుకు చేశావు ఈ సాహసం ఛీ అని అంటుంది. నువ్వు అన్ని తెలిసిందానివి అని అనుకున్నాను నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకునే పిచ్చిదానివి అని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటుంది ఇందిరా దేవి. నీ కాపురం నిలబెట్టాలని నీకు న్యాయం చేయాలని నేను ఎంత తపన పడుతున్నాను నీకు తెలుసా అని అంటుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ గొర్రెల మందలో నుంచి ఒక్కరైనా నీకు అండగా నిలబడ్డారా, తప్పు చేసింది నీ మొగుడు కూడా నీ ఎదురు గానే ఉన్నాడు కదా వాడైనా నిన్ను ఆపాడా అని అడుగుతుంది ఇందిరా దేవి. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నిలబడాల్సిన నీ మామ భార్య నిర్ణయానికి తలవంచి, చేతగాని వాడిలా, భార్యముందు అసమర్ధత కల భర్తల నిలబడ్డాడే వీళ్ళ గురించి నువ్వు ఆలోచించింది అని అంటుంది. జీవితంలో ఏ ఆడదైనా చూస్తూ చూస్తూ సవతిని తెచ్చుకుంటుందా, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరూ లేరా సాటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే ఆపలేకపోయారా అని అంటుంది ఇందిరాదేవి. ఎందుకు ఎందుకు ఇలాంటి పని చేసావు అని కావ్య ని నిలధేస్తుంది.నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అని అంటుంది అప్పుడే అపర్ణ అత్తయ్య గారు అని అంటుంది.

Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights
Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights

ఇక అపర్ణ మాట్లాడుతూ కావ్య సంతకం పెడితేనే కదా ఈ సమస్యకి పరిష్కారం దొరికేది అని అంటుంది. ఛీ నోరు ముయ్ అని అంటుంది కోడల్ని ఇందిరాదేవి. నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది పెద్ద కోడలు హోదా ఇచ్చాను కదా అని పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటావా అని అంటుంది. భార్యని భర్తని విడదీయడమే సమస్యకు పరిష్కారం అయితే, అన్ని తప్పులు చేసినానా మీకు కళ్యాణ్ నాకు అక్కర్లేదు అంటే మనం ఎందుకు నచ్చ చెప్పాము ఎందుకు అని అడుగుతుంది. అని నేరాలు చేసిన రాహుల్ ని వదిలేయమని స్వప్నతో ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు అని అడుగుతుంది. ఏం ధాన్యలక్ష్మి నువ్వు సాటి ఆడదానివే కదా నీ కోడలికి ఇంటి పెత్తనం కావాలని నీ మాటకి గౌరవం కావాలని ఎన్నోసార్లు ఇంట్లో గొడవలు సృష్టించావు కదా, ఈరోజు నీ కోడలా లాంటిదే కదా ఈ కావ్య కూడా ఆపరణని ఎందుకు నువ్వు అడ్డుకోలేకపోతున్నావు ఎందుకు కావ్య ని ఆపలేకపోయావు అని అడుగుతుంది. అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటే ఇక మీదట నువ్వు చెప్పేది ఏది నేను వినను, నువ్వు ఆ అర్హత పోగొట్టుకున్నావా అపర్ణ అని అంటుంది. ఇంత తప్పు చేశావే ఏదో ఒక రోజు నీ కోడలు చేసిన తప్పులేవి లేవని తెలిసిన రోజు నువ్వు పశ్చాత్తాప పడే రోజు ఒకటి వస్తుంది అపర్ణ గుర్తుపెట్టుకో అని అంటుంది. ఆరోజు, నీ కోడలు నిన్ను క్షమించచ్చేమో కానీ నీ అత్తగా నేను ఎప్పటికీ నిన్ను క్షమించను అని అంటుంది ఇందిరా దేవి. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయా రుద్రాణి ఇద్దరు సంతోషిస్తారు.

Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights
Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights

ఇంకా కావ్య ఒక్కతే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. వదిన ఏంటి అశోక వనంలో కూర్చున్నారా అని అడుగుతాడు. అర్థమైంది లే రేపు రాజ్, మాయా పెళ్లి జరిగితే మీరు ఇక్కడ కూర్చోవాలని ముందే డిసైడ్ అయి ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారా అయినా కంగ్రాట్యులేషన్స్ వదిన మీరు మీకు ఆపురాని మొక్కలు చేసుకోవడంలో మీరు సక్సెస్ అయ్యారు చరిత్రలో నిలిచిపోయేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు మీరు మీ తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉండేది. కానీ నా అంచనాలను మించి ఉన్నాయి మీ తెలివితేటలు, ఇంత తెలివిగా మీరు అన్నయ్య పెళ్లికి అభ్యంతరం లేదని సంతకం చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు. కావ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఏంటి వదిన నేను అనే మాటలు మీకు బాధ కలిగిస్తున్నాయా నిజమే కదా నేను మాట్లాడుతుంది అని అంటాడు. మీ భవిష్యత్తును చక్కగా ప్రణాళిక వేసుకుంటే మిమ్మల్ని దేప్పి పడుతున్నానని నేను మీతో మాట్లాడుతున్నానని మీకు కోపం వచ్చిందా, చీత్కరాలు కోపాలు తప్ప ఏం దక్కాయి మీకు, అన్నయ్య భార్యగా ఆయన మీ హక్కుల్ని మీరు కాపాడుకోలేకపోయారు.సర్వస్వాన్ని ధారపోసి సంతకం చేశారు పెళ్లి అయినా ఆ పవిత్ర మూర్తి ఇంటి కోడలుగా చలామణి అవ్వడానికి మీరే సంతకం చేశారు. రేపు వాళ్ళిద్దరూ కలిసి ఉంటే మా పెద్దమ్మ చూసి నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటుంది. ఈ ఇంటి పెద్దరికం చేయ గొడవ లేదు కదా అని సద్దుమనుకుతుంది ఇక మీరు ఏమైపోతారో ఒకసారి మీ గురించి ఆలోచించారా అని అంటాడు. మీరు అందరూ భర్త కోసం త్యాగం చేస్తే మీరు భర్తనే త్యాగం చేశారు ఎంత త్యాగం చేశారు మీకు అర్థమవుతుందా అని అంటాడు. వెంటనే కావ్య అర్థమవుతుంది కవి గారు అని అంటుంది. నా గురించి ఆలోచించే వ్యక్తుల్లో మీరు ఒకరు ఉన్నారని నాకు బాగా అర్థమైంది అని అంటుంది నా గురించి మీరే ఇంతలా ఆలోచిస్తుంటే నేను ఆలోచించిన ఇంకా సమయం ఉంది కదా నేను నా కాపురం కూల్చుకుంటానా ఒక్కొక్క పుల్లా చేర్చి గూడు కట్టుకున్న పక్షి గూడుని అప్పగించేస్తుందా నేను నాకు కాపురం కూలిపోతుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇక మరోవైపు రాహుల్ రుద్రాణి మాయ ముగ్గురు ఒకచోట చేరుతారు కంగ్రాట్యులేషన్స్ మమ్మీ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నావ్ అని అంటాడు రాహుల్. సంతకం పెట్టినందుకు కావ్య నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమైన ఘట్టం ఇంకోటి ఉంది అది వీళ్ళ పెళ్లి జరగాలి అని మాయ వైపు చూసి అంటుంది. వీళ్ళ పెళ్లి జరిగితే ఇక మనం కంప్లీట్ గా మన ప్లాన్ సక్సెస్ అయినట్టే అని అనుకుంటుంది. మాయ మీరు బానే ప్లాన్స్ చేస్తున్నారు కానీ నాకు ఎందుకో భయంగా ఉంది అని అంటుంది. నువ్వు దుగ్గిరాల ఇంటికి కోడలివి కాబోతున్నావు ఇంకా ఎందుకు భయం అని అంటుంది రుద్రాణి. అదే నా భయం కూడా నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని మీ మాట నమ్మి నేను దుగ్గిరాల ఇంటి కోడలిగా రావడానికి ఒప్పుకున్నాను రేపు రాజ్ నా గురించి తెలిసి వదిలేస్తే, నా పరిస్థితి ఏంటి అని అంటుంది వెంటనే రాహుల్ నీకు ఆలోచన అవసరం లేదు రాజ్ ఫస్ట్ మ్యారేజ్ కూడా ఏమన్నా బాగా జరిగింది అని అనుకుంటున్నావా ఇలాంటి గొడవలతోనే జరిగింది. బలవంతంగా కావ్య ని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ మా వాడు ఇప్పటివరకు విడాకులు ఇవ్వట్లేదు వాడు చాలా మంచివాడు వాడికి ఒక టాలెంట్ ఉంది వాడు ఎప్పటికీ అన్యాయం చేయడు. నీకు అభయం అక్కర్లేదు అని అంటాడు రాహుల్ రుద్రాణి నువ్వు ఇంటి కోడలు అయిపోయిన తర్వాత నీకు ఇంట్లో ఎవరితో సమస్య రాదు. వస్తే నాతోనే వస్తుంది అని అంటుంది ఆ మాటకు మాయ అదేంటంటే అలా అంటారు అని అంటే ఈ కావ్యని కూడా ఇలానే మిడిల్ క్లాస్ అమ్మాయి నాకు ఏ ప్రాబ్లం ఉండదు అని ఇరికించి పెళ్లి చేశాను నా మాట వింటుంది అనుకున్నాను కానీ ఇవాళ చూసావు కదా అదే నాకు ఎదురు తిరిగి నిలబడింది. అందుకే నిన్ను ఇక్కడికి రప్పించాను. అని అంటుంది రుద్రాణి నాకు అర్థమైంది ఆంటీ నేనెప్పుడైనా ఓవరాక్షన్ చేసి మీకు ఎదురు తిరిగితే, నన్ను కూడా కావ్య ని పంపించినట్లు పంపించేస్తారు అంతే కదా అని అంటుంది మాయ.అది అమాయకురాలు కాబట్టి, ఇంట్లో నుంచి పంపించేస్తున్నాను. నువ్వు నేను ప్లాన్ చేస్తే వచ్చావు కాబట్టి, తోక జాడిస్తే ఇంట్లో నుంచి కాదు నేరుగా పైకి పంపిస్తాను అని బెదిరిస్తుంది రుద్రాణి. చి చి నేను ఎందుకు అలా చేస్తాను ఇంత పెద్ద ఇంటికి కోడలిగా చేస్తున్నారు నేను ఎవరు ఎన్ని చెప్పినా మీ వైపే ఉంటాను. అని అంటుంది ఉండి తీరాలి అని అంటుంది రుద్రాణి. నాకు అర్థమైంది అని అంటుంది మాయ.సరే వెళ్ళు అని అంటుంది.దీని సంగతి పక్కన పెట్టు మమ్మీ ఆ కావ్య అడగగానే సంతకం పెట్టిందంటే ఏదో ఉంది అని అంటాడు రాహుల్. తనేదో ప్లాన్ లో ఉందని నాకు అనుమానంగా ఉంది అని అంటాడు. ఈసారి ఎన్ని ప్లాన్లు వేసినా సరే ఈ పెళ్లి ఆపడం దాని తరం కాదు అని అంటుంది రుద్రాణి.

Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights
Brahmamudi Today Episode May 31 2024 Episode 424 highlights

ఇక మరోవైపు సుభాష్ నువ్వెందుకు ఇన్ని తల వంపులు తెచ్చుకున్నావు రాజ్ నేను నిజం చెప్పే వాడిని కదా నువ్వెందుకు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని అంటాడు సుభాష్. పక్కనే కావ్య కూడా ఉంటుంది రాజ్ మమ్మీ దృష్టిలో ఆ బాబుకి తండ్రి ఎవరు అని అడుగుతాడు. ఆ బిడ్డ తల్లి మాయ ఆ బిడ్డ తండ్రి నేను మరి మా ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని మమ్మీ అంటే అందులో న్యాయం ఉంది కదా అని అంటాడు. మాయ మోసం చేస్తుందని తెలియక నీ మెడలో తాళి కట్టించాలని మీ అమ్మ చూస్తుంది అని అంటాడు సుభాష్. ఆమె మోసం చేస్తుందని మమ్మీకి తెలియదు కదా అని అంటాడు రాజ్. మరి కావ్య జీవితం బలైపోయిన పర్వాలేదా అని అంటాడు. అది నీకు న్యాయంగా అనిపిస్తుందా అని అడుగుతాడు. నేనేమీ ఆలోచించుకునే పరిస్థితుల్లో లేను అని అంటాడు రాజ్. ఏదో చేస్తానని చెప్పి వెళ్లి నాకు భార్యని తీసుకొచ్చిన మీ కోడలు మీకు సమాధానం చెబుతుంది అని అంటాడు. ఆ మాయ ఇంత మోసం చేస్తుందని నేను అనుకోలేదు అంటుంది కావ్య. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతే అది మాయ చేస్తుంది అని అర్థమైంది అంటుంది కావ్య. ఆమె ఇక్కడికి తీసుకొచ్చిన రోజే చెప్పాను ఇలాంటిదే ఏదో జరుగుతుందని అంటాడు. నువ్వస సంతకం ఎందుకు చేశావు నువ్వు సంతకం చేయకుండా ఉంటే మనకు ఆలోచించుకోవడానికి ఒక టైం ఉండేది కదా అని అంటాడు రాజ్. మీరే మీరు గొడవ పడడం కాదు ఇందులో మీ ఇద్దరి తప్పులేదు తప్పంతా నాదే అని అంటాడు సుభాష్. నావల్ల మీ ఇద్దరు ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. ఇంక చాలు నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అని అంటాడు వెంటనే రాజ్ కావ్య ఇద్దరు ఆపేస్తారు. బాబుని తీసుకొచ్చినప్పుడే నిజం చెప్పే వాళ్ళం కదా, మరి అప్పుడు చెప్పండి నిజం ఇప్పుడు ఎలా చెప్తాము అని అంటాడు రాజ్. మరి ఈ పెళ్లి ని ఎలా ఆపాలి అని అడుగుతాడు సుభాష్. ఈ పెళ్లి జరగదు అని కావ్య అంటుంది. ఇంకా నీకు నమ్మకం ఉందా అని అంటాడు రాజ్. ఈ పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా అని అంటుంది కావ్య. అనుకుంటున్నాను అని అంటాడు. అయితే పెళ్లి చేసుకోండి అని అంటుంది. చి చి నేను చేసుకోను అని అంటాడు. నీకు ఈ పెళ్లి ఆగుతుందని నమ్మకం ఉందా అని అడుగుతాడు సుభాష్ కావ్యని, ఖచ్చితంగా ఆపుతాను అని అంటుంది కావ్య. అయితే నీ మీద నాకు నమ్మకం ఉంది అని వెళ్ళిపోతాడు సుభాష్. రాజ్ మాత్రం నాకు నీ మీద నమ్మకం లేదు ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు అని అంటాడు. నేను ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది కావ్య ఏదో ఒకటి కాదే ఒకటిని రెండు చేస్తావు. నువ్వే చేసిన నా చావు మీదకు వస్తుంది అని అంటాడు. ఏమీ కాదు చూస్తూ చూస్తూ నేను నాకు సవతిని తెచ్చుకుంటానా, ఏదో ఒకటి చేస్తాను కదా అని అంటుంది అది ఏంటో చెప్పవే అంటాడు అదే అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య.

ఇక మరోవైపు అప్పు, కాలనీలో మాయ గురించి ఎంక్వయిరీ చేస్తూ ఉంటుంది. అందరినీ మీకు మాయ తెలుసా అని అడుగుతూ ఉంటుంది. తెలీదు అని చెప్తారు అప్పు మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఒక షాప్ దగ్గరికి వెళ్లి అలసిపోయి మంచినీళ్లు తాగుతూ ఉంటుంది. ఆ షాప్ ఆవిడ ఏంటమ్మా, ఇందాకట్ నుంచి చూస్తున్నాను అటు ఇటు తిరుగుతూ ఉన్నావు అని అడిగితే, జనాభా లెక్కల కోసం వచ్చావా అని అడుగుతుంది. మీరు కథలు రాస్తారా ఏంటి నేనేం చెప్పకుండా మీ అంతట మీరే అల్లేసుకుంటున్నారు అని అంటుంది అప్పు. నువ్వు అటు ఇటు తిరుగుతుంటే నాకు అనుమానం వచ్చింది నేను అడిగానని ఏమనుకోకు అని అంటుంది షాప్ ఆవిడ, ఏం లేదమ్మా మాయా అని మా ఫ్రెండు ఈ పక్కనే ఉండేది ఇప్పుడు ఆ ఇంట్లో లేదు అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్లిందా అని అంటుంది. ఇప్పుడు ఇక లేదుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది గా అంటుంది షాప్ ఆవిడ, అయితే మీకు మాయ గురించి తెలుసా అంటుంది అప్పు తెలుసు అని అంటుంది అయితే ఎక్కడ ఉందో మీరేమైనా అడ్రస్ చెప్తారా అంటుంది వెంటనే ఆ షాప్ ఆవిడ పోస్ట్ ఆఫీస్ పక్క సందులో రెండో ఇల్లు అని చెప్తుంది. మీరంతా మంచి పని చేశారో ఎంత హెల్ప్ చేశారో మీకు అసలు తెలియట్లేదు అని అప్పు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కావ్య అమ్మమ్మ గారి కోసం కాఫీ చేసి తీసుకు వస్తుంది. నీకు తలనొప్పిగా ఉందని కాఫీ చేసి తీసుకు వచ్చాను అని అంటుంది. నాకు కాఫీ నచ్చలేదు అని అంటుంది. తాగకుండా ఎలా చెప్తున్నారు అని అంటుంది కావ్య ఇప్పటివరకు నాకు కాఫీ నువ్విస్తేనే తాగడం అలవాటు చేసుకున్నాను ఇకమీదట అలవాటు మానుకోవాలి అని అంటుంది ఇందిరాదేవి. నువ్వు చేస్తున్న పనుల వల్ల నువ్వు ఈ ఇంట్లో ఉంటావు అన్న నమ్మకం నాకు క్రమక్రమంగా పోతుంది. నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు నీ దారి నువ్వు చూసుకుంటే రేపు ఉదయం నేను నువ్వు ఇచ్చే కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా కుదురుతుంది అని అంటుంది ఇందిరా దేవి. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావని నాకు అర్థం అవుతుంది. ఇప్పుడిప్పుడే నాకు చెడువేసనమంటే ఏందో అర్థం అవుతుంది ఒక మనిషిని నమ్మడం అతిగా ప్రేమించడం కూడా ఒక వ్యసనం గానే నాకు అర్థమవుతుంది ఇకఆ వ్యాసనము మానుకోవాలని ఆలోచిస్తున్నాను అంటుంది ఇందిరా దేవి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రుద్రాణి ఆట నువ్వు మొదలు పెట్టావు ముగింపు నేను ఇస్తాను అని, స్లొగన్స్ చెప్పావు కదా ఇప్పుడు నువ్వు ఓటమి వైపు అడుగు వేస్తూ పేపర్స్ మీద సంతకం పెట్టేశావు కదా అని అంటుంది రుద్రాణి. నీకు ఇప్పటికైనా అర్థమైందా ఈ రుద్రాణి అంటే ఏంటో ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు నన్ను గెలవడం అని అంటుంది రుద్రాణి కావ్య తో, మరోవైపు అప్పు షాప్ ఆవిడ చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది. అక్కడ డోర్ కొడితే ఆ ఇంట్లో వాళ్ళుడోర్ ఓపెన్ చేస్తారు. అప్పు కాఫీ కి ఫోన్ చేసి అక్క నీకు గుడ్ న్యూస్ ఆ మాయ ఎక్కడ ఉంటుందో నేను తెలుసుకున్నాను అని అంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella