Brahmamudi Today సెప్టెంబర్ 13 ఎపిసోడ్ 200: నిన్నటి ఎపిసోడ్ లో కళ్యాణికి దెబ్బ తగలడం. అది తెలుసుకొని అనామిక వాళ్ళ ఇంటికి రావడం. అందరూ అనామికని వింతగా చూడడం. అనామిక తన గురించి కళ్యాణ్ వాళ్ళింట్లో వాళ్ళందరికీ చెప్పడం. తర్వాత కళ్యాణ్ తో కలిసి కళ్యాణ్ రూమ్ చూడ్డం రాజు కావ్యని కూల్ చేయడంజరుగుతుంది.

ఈరోజు 200 వ ఎపిసోడ్ లో అనామిక కళ్యాణ్ రూమ్ లో బెడ్ మీద ఒక ఫోటో చూసి అదేంటో తెలుసుకోవాలనుకుంటుంది ఈలోపు కళ్యాణ్ అక్కడికి వచ్చి ఆ ఫోటోలు దాచేస్తాడు. అదేంటో చూపించండి అని అంటుంది అనామిక వెంటనే కళ్యాణ్ కూడా అనామిక చెప్పిన డైలాగే చెప్తాడు. కవి కవి గారు అయ్యుండి నా డైలాగ్ కాపీ కొడతారా అంటుంది అనామిక. కొన్నిసార్లు తప్పదు మరి అని అంటాడు కళ్యాణ్. మొత్తానికి అనామిక తన ఫోటోని కళ్యాణ్ రూమ్ లో చూడదు. నేను వెళ్ళాక మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రశ్నల వర్షం కురిపిస్తారు అని అంటుంది. ప్రశ్న వర్షం ఏం కర్మ క్వశ్చన్ పేపర్ రాయాలి నేను అని అంటాడు కళ్యాణ్ నవ్వుతూ

కావ్యకు రాజ్ సహాయం..
కావ్య అనామిక కోసం కిచెన్ లో స్వీట్ చేద్దామని వెళుతుంది. అక్కడికి వచ్చిన రాజు కావ్య కి సారీ చెప్పాలనుకుంటాడు. కావ్య మీరు చెప్పే మాటలు నేనేం వినదల్చుకోలేదు మీరు ఎప్పటికీ మారరు అని అంటుంది.నేను ఇప్పుడు నీకు సహాయం చేద్దామని వచ్చాను అని అంటూ స్వీట్లో పంచదార అనుకొని ఉప్పు కలిపేస్తాడు రాజు అది కావ్య చూసుకోదు స్వీట్ అయిపోయింది అనుకొని అనామిక కోసం ఒక కప్పులో వేసుకొని హాల్ లోకి తీసుకు వెళుతుంది. కావ్య వెళ్ళిన తరువాత రాజ్ స్వీట్లో పంచదార బదులు ఉప్పు వేసిన సంగతి అర్థం అవుతుంది వెంటనే అది అనామిక తినకుండా చేయాలి అనుకుని కావ్య వెనక పరిగెడతాడు.

Brahmamudi Serial September 13 Episode 200: అనామిక చేతే స్వీట్ వద్దు అనిపించిన రాజ్
కళ్యాణి అనామిక ఇద్దరూ మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటారు. కావ్య స్వీట్ తీసుకువెళ్లి అనామికకు ఇవ్వబోతుంది. ఇంతలో రాజ్ ఆ కప్పు లాక్కొని అనామికకు ఇవ్వడు. ఈ కాలం ఆడపిల్ల కదా స్వీట్ తిన్నది కాబోలు అని అంటాడు. అనామిక నవ్వుతూ లేదండి నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం తింటాను అని అంటుంది. కావ్య రాజు వైపు చూసి స్వీట్ తనకి ఇవ్వు అని సరిగా చేస్తుంది రాజు నేను ఇవ్వను అని అంటాడు ఆ సీన్ లో రాజ్ కామెడీ పండిస్తాడు. పాపం తను డైట్ లో ఉంది కాబోలు అని అంటాడు మళ్ళీ రాజ్ కావాలని, ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ రాజ్ నీకేమైంది తన స్వీట్ ఇవ్వు అని అంటూ ఉంటారు.ఇంట్లో వాళ్ళందరూ వరుస పెట్టి అన్ని క్వశ్చన్స్ రాజుని అడిగేటప్పటికీ రాజు ఒకసారిగా ఆపండి అని అంటాడు.

ఇది శాంపిల్ కప్పు ఇది తింటే పింపుల్స్ వస్తాయి ఓకేనా మీకు తినండి అంటూ అనామిక్కి ఇస్తాడు రాజ్. అనామిక అమ్మ పింపుల్స్ ఆ నాకొద్దు అని స్వీట్ తినకుండా ఉంటుంది రాజ్ అన్నయ్య అనుకున్నది సాధించాను అనుకుంటాడు. కావ్య అనామికకు చీర పెట్టి పంపిస్తుంది. కళ్యాణ్ అనామికని కార్ దాకా వెళ్లి డ్రాప్ చేసి వస్తారు. ఇంట్లో అందరూ ఏమైంది అని కళ్యాన్ ని ఆటపట్టిస్తారు. కళ్యాణం తన జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోతాడు.

రాజ్ స్వీట్ చేసిన సంగతి అందరికీ తెలిసిపోతుంది..
ఇక సుభాష్ అమ్మ కావ్య ఆ స్వీట్ తీసుకొని రా అమ్మ అని అంటాడు. కావ్య తీసుకురావడానికి వెళ్తుంటే రాజ్ ఒకసారి గా నో అని అరుస్తాడు. ఏమైందిరా అని అంటారు అందరూ ఏం లేదు అని వెకిల్ నవ్వుతూ ఉంటాడు రాజ్. స్వీట్ తీసుకొని రా అని అంటారు అందరూ అందులో షుగర్ ఎక్కువైంది నానమ్మ వద్దులే అని అంటాడు రాజ్. స్వీట్ల షుగర్ ఎక్కువ కాక ఉప్పు ఎక్కువ అవుతుందా అంటాడు సుభాష్. అదే ఎక్కువైంది నాన్న అని మనసులో అనుకొని సైలెంట్ గా ఉంటాడు ఈలోపు కావ్య వెళ్లి అందరికీ కప్పుల్లో స్వీట్ తీసుకొని వస్తుంది. అది తిని అందరూ ఒక్కసారిగా ఫేసు తేడాగా పెడతారు.

వెంటనే ఏమైంది అంటుంది కావ్య ఉప్పు ఎక్కువైందని అందరూ ఒకేసారి చెప్తారు. వెంటనే ఆ విషయం నాకు తెలియదు మీ అబ్బాయి గారిని అడగండి అని అంటుంది కావ్య. రాజేష్ నాకేం తెలీదు అని అంటాడు వేసింది తనే తననే అడగండి అంటుంది కావ్య. తను చేశారు కాబట్టే ఇందాక అనామిక తినకుండా ఆపాలనుకున్నారు అని అంటుంది కావ్య వెంటనే అందరికీ రాజ్ వంటింట్లో స్వీట్ చేశాడు అన్న విషయం తెలిసిపోతుంది. వెంటనే సుభాష్ అయినా వంటింట్లో నీకేం పని రా అని అంటాడు భాగ్యలక్ష్మి ఈమధ్య వాళ్ళ ఆవిడ ఎక్కడుంటే అక్కడే తిరుగుతున్నాడు అని అంటుంది సీతారామయ్య గారు మంచిదే కదా అని అంటాడు ఈలోపు రుద్రాణి అపర్ణ ఇద్దరూ రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. రాజు చేసేదేమీ లేక సైలెంట్ గా ఉంటారు.
అప్పులో మార్పు..
కనకం భర్తకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇంతలో రూమ్ లో ఉన్న అప్పు కి ఫ్రెండ్ ఫోన్ చేసి సినిమాకి వెళ్దాం అని అడుగుతాడు అప్పు నేను రాను మీరు వెళ్ళండి అని అంటుంది. వెంటనే నువ్వు మారిపోయావా పో చాలా మారిపోయావు ఎంతసేపు ఆ కళ్యాణ్తో ఉంటున్నావు అని అంటాడు ఫ్రెండ్. నీ మొఖం ఫోన్ పెట్టే అని తిట్టేసేసి ఫోన్ పెట్టి డల్ గా ఉంటుంది అప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన కనకం హే అప్పు ఎలా ఉన్నావేంటి అని అంటుంది.ఎప్పుడు రచ్చ చేస్తూ ఉండే నువ్వు ఈరోజు ఇంత సైలెంట్ గా ఉన్నావేంటి ఏంటి మార్పు అని అడుగుతుంది నవ్వుతూ అందరూ ఇదే కాల్ చేస్తారు నేనేం మారాను అనేసి బయటికి వెళ్లి మెట్ల మీద కూర్చుంటుంది అప్పు.

ఇప్పుడు నేను ఏమన్నానని అంతా కోపంగా బయటికి వెళ్ళింది అని అంటుంది కనకం సరే వదిలేసేయ్ అంటాడు కృష్ణమూర్తి ఇక కృష్ణమూర్తి నేను విగ్రహాల దగ్గర కాపలాగా పడుకుంటాను నువ్వు లోపలికి వెళ్లి పడుకో అని అంటాడు. కృష్ణమూర్తి బయటికి వచ్చి అప్పు మెట్ల మీద కూర్చుంటే అమ్మ మంచులో కూర్చున్నావ్ ఏంటి లోపలికి వెళ్ళిపోమా మంచి పడుతుంది అని అంటాడు కాసేపు కూర్చొని వెళ్తాలి అంటుంది అప్పు సరే అమ్మ అనేసి కృష్ణమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పు చందమామనే చూస్తూ కనకం లోపలికి వెళ్ళగానే అక్కడే లోపల పుస్తకం చదువుతున్న అన్నపూర్ణ అప్పుని చూసి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. వెంటనే అప్పుతో ఈ వయసులో వెన్నెలను చూస్తూ కూర్చున్నావంటే, కచ్చితంగా నువ్వు నీ జీవితం గురించి గానీ నీ జీవితం జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తున్నావు అని అంటుంది. అదేం లేదులే అని అంటుంది అప్పు ఆలోచించు తప్పేముంది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంది అన్నపూర్ణ అసలు నాకు తెలియక అడుగుతున్నా నాలో అంత మార్పు ఏమొచ్చింది పెద్దమ్మ అని అంటుంది అప్పు నన్ను కాదే నీ మనసుని నువ్వే అడుగు సరైన సమాధానం చెబుతుంది నువ్వు ఎందుకు మారుతున్నావో ఎవరికోసం మారుతున్నావో నీకు తెలుస్తుంది అంటుంది అన్నపూర్ణ. ఇంకా ఆపమ్మ నువ్వు చాలానే చెబుతావు. అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పు.
కావ్య కు అనుమానం..
ఇక కావ్య కోసం రాజిల్లంత వెతుకుతూ ఉంటాడు కావ్య తాతయ్య దగ్గర ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు ఇక వెంటనే అమ్మ తాతయ్యతో నిజం చెప్తుందో ఏమో, అని ఫాస్ట్ గా తాతయ్య దగ్గరికి వెళ్లిలేడీస్ చెప్పకూడదు ఉన్నది వేరే లాగా చెప్పాలి అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు రాజ్. కావ్యకి ఏమీ అర్థం కాదు సీతారామయ్య గారు ఏం మాట్లాడుతున్నావ్ రా అని అంటుంది ఇంతలో టాబ్లెట్లు బాక్స్ ఇవ్వమని అడుగుతాడు సీతారామయ్య ఆ బాక్స్ చూసి కావ్య ఏంటి ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అని అనుమానంగా అడుగుతుంది. వెంటనే రాజు కంగారుగా ఒకటి రక్తపోటుకి ఒకటి మధుమేహానికి ఒకటి బీపీకి ఒకటి షుగర్ కి అంటూ ఏదేదో చెప్పేసేసి టాబ్లెట్ బాక్స్ లాగేసుకుంటాడు కావ్య దగ్గర నుండి. ఇక వెంటనే సీతారామయ్య గారు మీరిద్దరూ ఆ టాబ్లెట్స్ బాక్స్ నాకు ఇచ్చి వెళ్లిపోండి ఇక్కడి నుంచి అని అనేస్తాడు. కావ్య మాత్రం అన్ని టాబ్లెట్స్ ఎందుకు ఉన్నాయి అని ఆలోచిస్తుంది.

అపర్ణ దగ్గరికి ఒక పనిమనిషి వచ్చి ₹15,000 అప్పుగా జీతం ఇవ్వమని అడుగుతుంది. దానికి అపర్ణ ఇప్పుడు నేను ఇవ్వను అని పంపించేస్తుంది.వెంటనే పనమ్మాయి దగ్గరికి రుద్రాణి వెళ్లి నువ్వు కాఫీ దగ్గరికి వెళ్లి నీ పని అయిపోతుంది అని చెప్తుంది పని అమ్మాయి కావ్య దగ్గరికి వెళ్లి 15 వేల రూపాయలు అడుగుతుంది. కావ్య ఇస్తాను ఉండు అని అంటుంది అప్పుడే రుద్రాణి అపర్ణ దగ్గరికి వెళ్లి అత్త కోడల మధ్య చిచ్చు పెడుతుంది. నువ్వు పనమ్మాయికి డబ్బులు ఇవ్వనన్నావు నీకోడలిస్తుంది ఒకసారి చూడు అని అంటుంది ఇక వెంటనే అపర్ణ చాలా కోపంగా కావ్య డబ్బులు ఇచ్చే టయానికి అక్కడికి వెళ్లి ఆగు అని అంటుంది.