Brahmamudi Today September 17 Sharmita Gowda: ఒకప్పుడు సీరియళ్లలో అత్త, అమ్మ పాత్రలకు కొంచెం ముసలైన వాళ్లని తీసుకునే వారు. కానీ ఇప్పుడంతా మోడ్రన్. అత్తకు, కూతురుకు పెద్ద తేడా ఉన్నా నో ప్రాబ్లమ్. ఫ్రేమ్‌లో కలర్‌ఫుల్‌గా కనిపించేందుకు యంగ్ బ్యూటీలనే అత్త, అమ్మ పాత్రల్లో చూపిస్తున్నారు. అలా ఇప్పటివరకు టాలీవుడ్‌లో చాలా వరకు కలర్‌ఫుల్ అత్తల్ని రంగంలోకి దింపుతున్నారు. ‘బ్రహ్మముడి’ సీరియల్‌లో విలనిజం చూపిస్తున్న రుద్రాణి ఇదే కోవలోకి వస్తుంది. రుద్రాణి పాత్రలో.. బ్రహ్మముడి సీరియల్‌లో ఆస్తి మొత్తాన్ని తన కొడుకుకు రావాలని, ఆ ఆస్తికి వారసుడిని చేయాలని పన్నాగాలు పన్నుతూ.. రాజ్, కావ్యలను ఇబ్బంది పెట్టే పాత్రలో ‘రుద్రాణి’ మెప్పిస్తుంది. ఈ రుద్రాణి పాత్రలో కనిపిస్తున్న సుందరి పేరు ‘షర్మిత గౌడ’.

తన అందంతో కుర్రాళ్లలో హీట్ పెంచుతున్న ఈ భామ టాలీవుడ్ సీరియల్ హీరోయిన్లకు టఫ్ కాంపిటిషన్ అని చెప్పవచ్చు. తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో గ్లామరస్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఆమె హాట్ ఫోటోలు, బికినీ స్టిల్స్ చూసి ఒక్కింత షాక్‌కు గురైనా.. ఆమె అందానికి మాత్రం మంత్రముగ్దులు అవుతున్నారు. ఇంతకీ ఈ రుద్రాణి ఎవరు? ఆమె వ్యక్తిగత జీవితం? వయసు? ఆమె చేసిన సీరియళ్ల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

షర్మిత గౌడ వ్యక్తిగత జీవితం..
1985 నవంబర్ 20న కర్ణాటకలోని చిక్మగలూరులో షర్మిత గౌడ జన్మించారు. సెయింట్ జోసఫ్ గర్ల్స్ హై స్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. అలాగే కువెంపు యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. 2008లో కేదార్ ప్రసాద్ అనే వ్యక్తికి వివాహం చేసుకున్నారు. అయితే షర్మిత గౌడకు చిన్నప్పటి నుంచే మోడలింగ్, యాక్టింగ్‌పై ఇష్టం ఎక్కువ. న్యూట్రిషన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ తర్వాత మోడలింగ్ వైపు దృష్టి సారించింది.

మోడలింగ్ టూ సీరియల్స్..
మోడలింగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు సీరియళ్లలో నటించే ఛాన్స్ వచ్చింది. 2017లో ‘జానకి రాఘవ’ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘మనయే మంత్రాలయ’ సీరియల్ ప్రియాంక అనే నెగిటివ్ పాత్ర పోషించారు. ఈ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 2017లో ‘మిస్ కర్ణాటక’ ఫస్ట్ రన్నరప్‌గా కూడా నిలిచారు. తెలుగులో భానుమతి, బ్రహ్మముడి సీరియళ్లలో నటించారు.

ఈ సీరియళ్ల ద్వారా షర్మిత గౌడ మంచి గుర్తింపు పొందారు. తన నటనతో విమర్శకు నుంచి సైతం ప్రశంసలు పొందారు. నెగిటివ్ పాత్రలో లీనమై.. ఆ పాత్రకు న్యాయం చేస్తుంది. అయితే సీరియళ్లలో విలన్‌గా కనిపించే ఈ భామ.. రియల్ లైఫ్‌లో అల్లరి పిల్ల. ఆమె చేసే అల్లరి చేష్టలు అంతా ఇంతా కాదు. వాటికి సంబంధించిన వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంటాయి.

సోషల్ మీడియాలో ఫాలొవర్స్ ఎక్కువే..
సీరియళ్లలో అత్త, అమ్మ పాత్రల్లో కనిపించే ఈ భామ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. తన డైలీ అప్‌డేట్స్, మోడల్స్, వీడియోస్‌ను షేర్ చేస్తూ.. తన అభిమానులకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. రష్మిత గౌడేనా అన్నట్లు బిత్తిరిపోయి చూస్తున్నారు. విలన్ పాత్రలో కనిపించే ఈ భామ.. ఇంత హాట్‌గా కనిపిస్తోందేంటని కామెంట్లు చేస్తున్నారు.

బ్లూ సారీలో దేవకన్యలా..
షర్మిత గౌడ తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. బ్లూ సారీ కట్టుకుని, దానికి మ్యాచింగ్ ఈయరింగ్స్, నెక్లెస్ ధరించింది. చీరకట్టులో తెలుగు తనం ఉట్టి పడేలా.. దేవలోకం నుంచి దిగి వచ్చిన అందాల తారలా కనిపిస్తోంది. ఆమె అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.