రియల్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తాజా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహర్, రణబీర్ కపూర్, అపూర్వ మెహతా కలిసి దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్, షారుఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం.. తొలి షో నుంచే మిశ్రమ స్పందనను దక్కించుకుంది. సినిమాలో గ్రాఫిక్స్, విజువల్స్ తప్పా ఏమీ లేదని, కథ మొత్తం గందరగోళంగా సాగిందంటూ పెదవి విరిచారు. అయితే టాక్ ఎలా ఉన్నా.. మేకర్స్ చేసిన భారీ ప్రమోషన్స్ వల్ల ఈ చిత్రం తొలి రోజు అదిరిపోయే కలెక్షన్స్‌ను వసూల్ చేసింది.
ముఖ్యంగా తెలుగుతో తొలి రోజే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చేరువైంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 2.5 కోట్ల రేంజ్ అనుకుంటే ఏకంగా 3 కోట్ల మార్క్ ని దాటేసి రూ. 3.68 కోట్ల షేర్, రూ. 6.70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక తెలుగులో ఏరియాల వారీగా బ్రహ్మాస్త్ర టోటల్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..
నైజాం: 1.85 కోట్లు
సీడెడ్: 0.42 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.39 కోట్లు
తూర్పు: 0.28 కోట్లు
పశ్చిమ: 0.18 కోట్లు
గుంటూరు: 0.27 కోట్లు
కృష్ణ: 0.15 కోట్లు
నెల్లూరు: 0.14 కోట్లు
————————————
ఏపీ+తెలంగాణ మొత్తం= 3.68కోట్లు(6.70కోట్లు~ గ్రాస్)
————————————
కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 5.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే తొలి రోజే ఈ సినిమా రూ. 3.68 కోట్ల షేర్‌ను రాబట్టడంతో.. ఇంకా రూ. 1.82 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రహ్మాస్త్ర ఇక్కడ క్లీన్ హిట్ అయినట్లే.
Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!