Entertainment News సినిమా

`బ్రహ్మాస్త్ర` ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. బాలీవుడ్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందేనా?

Share

గ‌త కొంత కాలం నుంచి బాలీవుడ్ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డుతోంది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ చూపు మొత్తం `బ్ర‌హ్మాస్త్ర‌` పైనే ఉంది. హిందీలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఎంతో ప్ర‌తిష్ట్రాత్మ‌కంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భ‌ట్ జంట‌గా న‌టించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, మౌనీ రాయ్‌, కింగ్ నాగార్జున త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అయాన్ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. సెప్టెంబ‌ర్ 9న హిందీతో పాటు తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ నార్త్ తో పాటు సౌత్ లోనూ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాను చూసిన ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు, బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు తన రివ్యూను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

`బ్రహ్మాస్త్ర అన్ని విధాలుగా పెద్ద సినిమా, పెద్ద స్టార్స్, పెద్ద కాన్వాస్, ఎస్​ఎఫ్​ కోసం భారీ ఖర్చు. భారీగా ప్రమోషన్స్​. భారీ అంచానాలు. కానీ, బాధాకరం ఏంటంటే ఈ భారీ అంచనాలే నిరుత్సాహపరిచాయి. బ్రహ్మాస్త్రానికి సోల్ లేదు. మెరుస్తున్నదంతా బంగారం కాదు అని బ్ర‌హ్మాస్త్ర నిరూపించింది. బాలీవుడ్​లో ఫాంటసీ, అండ్వెంచర్​ సినిమాలు చాలా అరుదు. ఒక అద్భుతమైన ఊహా లోకాన్ని సృష్టించిన అయాన్ ముఖార్జీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

కానీ, బ్రహ్మాస్త్రం సినిమా స్క్రీన్​ప్లే, కథ పూర్తి యావరేజ్​గా.. అలాగే కొన్నిసార్లు గందరగోళంగా ఉన్నాయి. ఈ చిత్రంలో రణబీర్ చాలా కన్ఫ్యూజింగ్ గా క‌నిపిస్తాడు. అయితే అలియా భ‌ట్‌, మౌనీ రాయ్ మాత్రం అద‌రగొట్టేశారు. అమితాబ్ నటన ఎప్పటిలాగానే చాలా అద్భుతంగా ఉంది, అయితే, ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉండ‌టం విచార‌క‌రం` అని రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు 2.5 స్టార్ రేటింగ్ మాత్ర‌మే ఇచ్చారు. ఇక ఈయన రివ్యూతో నెటిజ‌న్లు `బ్ర‌హ్మాస్త్ర‌`పై సైతం బాలీవుడ్ ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే అంటూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Share

Related posts

Tollywood: టాలీవుడ్ పరిస్థితి ఏమిటి? ఏపీ సర్కార్ ఎదుట మోకరిల్లిందా? గెలుపెవరిది?

Ram

RRR – Bheemla nayak: పవన్ కళ్యాణ్ సడన్‌గా భీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేయడానికి కారణం రాజమౌళినా..?

GRK

Chiranjeevi: ముంబైలో షూటింగ్ టైం లో చిరంజీవి కి వార్నింగ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

sekhar