స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టర్‌గా సినీ కెరీర్‌ను గ్రాండ్‌గా ప్రారంభించిన బుచ్చిబాబు.. తన తదుపరి చిత్రాన్ని ఎలాగైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే చేయాలని బలంగా డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్‌పైనే కసరత్తులు చేస్తున్నారు.
కానీ, ఇంతలో ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. `పుష్ప 1`తో సూపర్ సక్సెస్ అయిన సుకుమార్.. ఇప్పుడు `పుష్ప 2`ను తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో అల్లు అర్జున్ హీరో కాగా.. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఫిబ్రవరిలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. కానీ, వెళ్లలేదు. పార్ట్ 2ను ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్న సుక్కూ.. కథ మరియు స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు.
అయితే తాజాగా సుకుమార్, బుచ్చిబాబు కూర్చొని కథ డిస్కషన్స్ చేస్తున్నట్లుగా ఓ ఫొటో బయటకొచ్చింది. దీంతో `పుష్ప 2` కోసం తనకి తోడుగా ఉండమని సుకుమార్ బుచ్చిబాబును సాయం కోరాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. పుష్ప స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు కూడా సుకుమార్ కోసం వర్క్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై బుచ్చిబాబు స్పందించాడు. సుకుమార్‌కు సాయం చేసేంత సీన్ తనకు లేదని కుండబద్దలు కొట్టేశాడు.
`ఈ ఫొటో నేను తరువాత చేయబోయే నా సినిమా కథ డిస్కషన్ సందర్భంలోది. మా గురువుగారు సుకుమార్ సార్ నా కోసం, నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు` అని పేర్కొంటూ సుకుమార్‌తో చర్చలు జరుపుతున్న ఫొటోను ట్విట్టర్ ద్వారా బుచ్చిబాబు షేర్ చేశాడు.
ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X
— BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!