RC15: 1995లో విజయ్ బాపీనిడు దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటించిన “బిగ్ బాస్”(Bigg Boss) రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సినిమాలో చిరంజీవి లుక్ ఇప్పటికీ హైలెట్. గుబురు గడ్డంతో రఫ్ లుక్ లో చిరంజీవి బిగ్ బాస్ స్టిల్స్ అప్పుడు ఇప్పుడు కూడా ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు చిరంజీవి బిగ్ బాస్ తరహా లుక్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charantej) కనిపిస్తున్నాడు. క్లియర్ కట్ మేటర్ లోకి వెళ్తే సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ సినిమాలో కనిపిస్తున్నట్లు టాక్. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సేమ్ టు సేమ్ చిరంజీవి “బిగ్ బాస్” లుక్ లోనే.. అన్నట్టుగా చరణ్ గుబురు గడ్డంతో.. బ్రేవ్ షేప్ లో కనిపిస్తున్నాడు. పైగా కళ్ళజోడు పెట్టుకుని ఉండటంతో మరీ స్టైలిష్ రఫ్ లుక్ అన్నట్టు పోస్టర్ ఉంది. “RC 15” చరణ్ కొత్త పోస్టర్ చూసిన ప్రతిఒక్కరు సేమ్ చిరు “బిగ్ బాస్” లుక్ లాగే ఉందని అంటున్నారు.
తాజాగా విడుదలైన “RC 15” చరణ్ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం… సందేశాత్మకమైన చిత్రం అన్నట్టు టాక్. చరణ్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా. “RRR” వంటి భారీ విజయం తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో ఆగస్టు మాసంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో కూడిన వీడియో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…