32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Waltair Veerayya Review: అభిమానులకు పూనకాలు తెప్పించిన చిరంజీవి “వాల్తేరు వీరయ్య” సినిమా రివ్యూ

Share

Waltair Veerayya Review: మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన “వాల్తేరు వీరయ్య” నేడు రిలీజ్ అయింది. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్ లో సందడి చేస్తూ ఉంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. ఈ సినిమాకి అభిమానులు పోటెత్తుతున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రెంజ్ లో జరిగింది.

 

సినిమా పేరు: వాల్తేరు వీరయ్య
దర్శకుడు: బాబీ
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, రాజేంద్రప్రసాద్, కేథరిన్ తెరిసా, ప్రకాష్ రాజ్, బాబీ సింహ.. తదితరులు.
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్.
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్.
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
విడుదల తేదీ: 13-01-2023

 

పరిచయం:

దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన సినిమా “వాల్తేరు వీరయ్య”. దాదాపు 20 సంవత్సరాల తర్వాత చిరంజీవి రవితేజ కలిసి నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు రిలీజ్ అయింది. చిరంజీవిలో కామెడీ యాంగిల్ నీ పూర్తిగ ఆవిష్కరించే దిశగా ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలోనే తాను అప్పట్లో నటించిన “శంకర్ దాదా ఎంబిబిఎస్” సినిమాలలో ఉండే కామెడీ జోనర్ తరహా ఫుల్ మీల్స్ ఈ సినిమాలో ఉన్నాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ట్రైలర్ లలో.. రవితేజని చాలా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించటం చిరంజీవిని చాలా మాసివ్ గా చూపించడం జరిగింది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా కొన్ని సన్నివేశాలలో కనిపించారు. వాల్తేరులో జాలరిగా చిరంజీవిని వీరయ్య పాత్రలో చూపించారు. మరి ఈ సినిమా కథ కథనం.. మిగతా విషయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

chiranjeevi and raviteja mega movie Waltair Veerayya Review
Waltair Veerayya Review
స్టొరీ:-

 

అంతర్జాతీయ మాఫియా డ్రగ్ ముఠాకి నాయకుడు సల్మాన్ సీజర్ (బాబీ సింహ) వాల్తేర్ పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకుంటాడు. ఈ పరిణామంతో పోలీస్ ఆఫీసర్ సీతపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ కావడం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్ ఇంటర్నేషనల్ మాఫియా లీడర్ సాల్మన్ సీజర్ వాల్తేరు నుండి మలేషియాకి పారిపోవడం జరుగుద్ది. దీంతో.. మలేషియా నుండి సాల్మన్ నీ వాల్తేరుకు తీసుకురావాలంటే వీరయ్య (చిరంజీవి) అందుకు తగిన వాడని సీతపతి బలంగా నమ్ముతాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య 25 లక్షల రూపాయల ఒప్పందం కూడా కుదురుతుంది. దీంతో వీరయ్య వాల్తేరు నుండి మలేషియా కి చేరుకొని.. సల్మాన్ సీజర్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఆ సమయంలో సల్మాన్ అన్న అలియాస్ మైకల్ సీజర్ (ప్రకాష్ రాజ్) కి వేసిన ప్లాన్..? మైకేల్ మరియు వీరయ్యకి మధ్య అంతకముందే ఉన్న సంబంధం..? ఇదే సమయంలో ఏసీపీ విక్రమ్ సాగర్ (రవితేజ) గతం ఏంటి..? హీరోయిన్ శృతిహాసన్ మలేషియాలో ఎందుకు ఉద్యోగం చేస్తది..? వీరయ్య (చిరంజీవి)కి తమ్ముడు విక్రమ్ సాగర్ (రవితేజ) మధ్య ఎందుకు గొడవలు జరుగుతాయి..? విక్రమ్ సాగర్ భార్య (కేథరిన్ తెరిసా)… వీరయ్య ని ఎందుకు అసహ్యించుకుంటది అనే సన్నివేశాలు తెరపై చూడాల్సిందే.

chiranjeevi and raviteja mega movie Waltair Veerayya Review
Waltair Veerayya Review

 

విశ్లేషణ:-

“వాల్తేరు వీరయ్య” అన్నదమ్ములకు చెందిన కథ. ఇటువంటి బలమైన స్టోరీ లైన్ లోకి స్టార్టింగ్ లోనే ప్రేక్షకులను తీసుకెళ్లడంలో డైరెక్టర్ బాబీ సక్సెస్ సాధించారు. సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్ లో స్టోరీ గ్రాఫ్ పెంచుకుంటూ తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ కి 20 నిమిషాలు ముందు వచ్చే సన్నివేశాలకు.. అభిమానులు ఎవరు కూడా సీట్లలో కూర్చోరు. ఆ రకమైన సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు డైలాగులు హై వోల్టేజ్ లో చిత్రీకరించాడు. ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి పూర్తిగా అన్నదమ్ముల మధ్య ఎమోషన్ సన్నివేశాలతో ఆకట్టుకోవడం జరిగింది. చిరంజీవి,, రవితేజ సెకండ్ హాఫ్ నీ పూర్తిగా ముందుండి నడిపించారు. వీరిద్దరూ తెరపై కనిపించే సన్నివేశాలు చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అభిమానులకు పూర్తిగా నచ్చే సినిమా ఇది. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాల్సిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయ్. ఇటీవల పెద్ద సినిమాలలో హీరోయిన్ విషయంలో ఏదో .. ఉండాలి. లేదా పాటల్లో హీరో పక్కన స్టెప్పులు వేయాలి అన్న తరహాలో పాత్రలు ఇరికించి మరీ పెడుతున్నారు. కానీ “వాల్తేరు వీరయ్య”లో హీరోయిన్ శృతిహాసన్ పాత్ర స్టోరీకి తగ్గట్టు… సంపూర్ణమైన న్యాయం దర్శకుడు బాబీ చేయడం జరిగింది. ఇక సినిమాకి మరో హైలెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్ హవా కొనసాగుతుంది. కానీ “వాల్తేరు వీరయ్య” లో చాలా కాలం తర్వాత దేవిశ్రీప్రసాద్ తన విశ్వరూపం చూపించాడు. కొత్తదనం BGM అదరగొట్టే రేంజ్ లో ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకి సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మెగా ఫ్యాన్స్ కి సంక్రాంతి “వాల్తేరు వీరయ్య” ఒక ఫుల్ మీల్స్ సినిమా. అభిమానులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చూడాల్సిన సన్నివేశాలు… సెంటిమెంట్ మరియు కామెడీ, యాక్షన్ అన్ని కూడా పుష్కలంగా ఉన్నాయి.

chiranjeevi and raviteja mega movie Waltair Veerayya Review
Waltair Veerayya Review
మైనస్ పాయింట్స్:-

సాంగ్స్.
చిరంజీవి కాస్ట్యూమ్స్.
సాగదీసే సన్నివేశాలు.
పిక్చరైజేషన్.

ప్లస్ పాయింట్స్:-

ఫైట్స్.
సెకండాఫ్ సెంటిమెంట్ సీన్స్.
చిరు రవితేజ కాంబినేషన్ సీన్స్.
ఇంటర్వెల్ బ్యాంగ్.

 

ఓవరాల్ రిజల్ట్:

పూర్తి మెగా కాంబో… సినిమా వాల్తేరు వీరయ్య. సంక్రాంతికి కుటుంబ సమేతంగా తో పాటు అభిమానులు చూడదగ్గ సినిమా.

 

రేటింగ్: 3/5

Share

Related posts

హ్యాండిచ్చిన చైత‌న్య‌

Siva Prasad

బ‌న్నీతో మురుగ‌దాస్‌?

Siva Prasad

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న చిరు `గాడ్ ఫాద‌ర్‌`.. ఇదిగో స్ట్రీమింగ్ డేట్‌?!

kavya N