మెగాస్టార్ చిరంజీవి, తమిళ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `గాడ్ ఫాదర్`. ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్ ఇది,
అయితే తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా పలు మార్పులు, చేర్పులు చేసి గాడ్ ఫాదర్‌ను రూపొందించగా.. దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను దక్కించుకుంది. టాక్ బాగుండటంతో వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసిన ఈ చిత్రం.. వర్కింగ్ డేస్‌లోకి ఎంటర్ అవ్వగానే వీక్ అయిపోయింది.
విడుదలైన 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 83 లక్షల షేర్ ని మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.33 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 11.63 కోట్లు
సీడెడ్: 8.91 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.29 కోట్లు
తూర్పు: 3.42 కోట్లు
పశ్చిమ: 2.04 కోట్లు
గుంటూరు: 3.70 కోట్లు
కృష్ణ: 2.44 కోట్లు
నెల్లూరు: 1.87 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ= 39.30 కోట్లు(64.80 కోట్లు~ గ్రాస్)
————————————-
కర్ణాటక: 4.50 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 4.55 కోట్లు
ఓవర్సీస్: 4.75 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 53.10 కోట్లు(96.35 కోట్లు~ గ్రాస్)
——————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలవాలంటే.. ఇంకా రూ. 40.23 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న జోరు అంత పెద్ద టార్గెట్‌ను అందుకోవడం చాలా కష్టం.