మెగాస్టార్ చిరంజీవి, తమిళ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం `గాడ్ ఫాదర్`. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్` కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథ కొత్తది కాకపోయినా, కథనం అక్కడక్కడా మందగించినా.. మెగాస్టార్ మాయాజాలం ప్రేక్షకులను కూర్చోబెడుతోంది.
దీంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ దుమ్ము దులిపేశాడు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.97 కోట్ల రేంజ్లో షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ. 17.68 కోట్ల రేంజ్లో షేర్‌ను రాబట్టింది. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ ఫస్డ్ డే టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 3.29 కోట్లు
సీడెడ్: 3.18 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.26 కోట్లు
తూర్పు: 1.60 కోట్లు
పశ్చిమ: 0. 59 కోట్లు
గుంటూరు: 1.75 కోట్లు
కృష్ణ: 0. 73 కోట్లు
నెల్లూరు: 0. 57 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ= 12.97 కోట్లు(21.40కోట్లు~ గ్రాస్)
————————————-
కర్ణాటక: 1.56 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 1.05 కోట్లు
ఓవర్సీస్ – 2.10 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 17.68కోట్లు(32.70కోట్లు~ గ్రాస్)
——————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో చిరు ఖాతాలో సూపర్ హిట్ పడ్డాలంటే.. మొదటి రోజు వచ్చిన వసూళ్లు కాకుండా ఇంకా రూ. 74.32 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.