మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం `గాడ్ ఫాదర్` ఈ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ చేసింది. తాజాగా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. వాటిని ఓసారి గమనిస్తే..
నైజాం – 22 కోట్లు
సీడెడ్ – 13.50 కోట్లు
ఆంధ్రా – 35 కోట్లు
——————————
ఏపీ+తెలంగాణ= 70.50 కోట్లు
——————————
కర్ణాటక – 6.50 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా- 6.50 కోట్లు
ఓవర్సీస్ – 7.5 కోట్లు
———————————
వరల్డ్ వైడ్ టోటల్ బిజినెస్ – 91 కోట్లు
———————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. చిరు ఎదట రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఉంచింది. మరి చిరంజీవి ఇంత భారీ టార్గెట్ను అందుకుని హిట్ కొడతారా.. లేదా.. అన్నది చూడాలి.