మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా `గాడ్ ఫాదర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ `గాడ్ ఫాదర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సముద్రఖని వంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషించారు.
తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా పలు మార్పులు చేసి గాడ్ ఫాదర్‌ను రూపొందించగా.. దసరా పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో దుమ్ము దులిపేశాడు.
కానీ, వర్కింగ్ డేస్‌లో వీక్ అయింది. వర్కింగ్ డే టెస్ట్ లో ఎంటర్ అయిన గాడ్ ఫాదర్.. తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 1.51 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.06 కోట్ల షేర్ ని అందుకుంది. అయితే పోయిన డిసెంబర్లో బాలయ్య వరుస ఫ్లాపుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అఖండ తొలి వర్కింగ్ డే లో రూ. 3.58 కోట్ల షేర్ ని అందుకుంది.
అయితే చిరంజీవి బాలయ్య రికార్డును చిత్తు చేస్తాడని మెగా అభిమానులు ఆశపడ్డారు. కానీ, బాలయ్య రికార్డ్‌ను చిరు టచ్ కూడా చేయలేకపోయాడు. ఇక ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ ఫస్ట్ ఆరు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం: 11.37 కోట్లు
సీడెడ్: 8.71 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.16 కోట్లు
తూర్పు: 3.35 కోట్లు
పశ్చిమ: 1.98 కోట్లు
గుంటూరు: 3.66 కోట్లు
కృష్ణ: 2.40 కోట్లు
నెల్లూరు: 1.84 కోట్లు
————————————-
ఏపీ+తెలంగాణ= 38.47 కోట్లు(63.50 కోట్లు~ గ్రాస్)
————————————-
కర్ణాటక: 4.40 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 4.40 కోట్లు
ఓవర్సీస్: 4.50 కోట్లు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 51.77 కోట్లు(93.95 కోట్లు~ గ్రాస్)
——————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 91 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలవాలంటే.. ఇంకా రూ. 40.23 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంటుంది.