NewsOrbit
Entertainment News సినిమా

చిరంజీవి బ‌ర్త్‌డే.. ఒక రోజు ముందే రాబోతున్న‌ మెగా ట్రీట్!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాద‌ర్‌` ఒక‌టి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు.

కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇక‌పోతే ఆగ‌స్టు 22న చిరంజీవి పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఒక రోజు ముందే `గాడ్ ఫాద‌ర్‌` నుంచి మెగా ట్రీట్ రాబోతోంది. ఇంత‌కీ ఆ ట్రీట్ మ‌రెంటో కాదు.. `గాడ్ ఫాద‌ర్‌` టీజ‌ర్‌. రేపు సాయంత్రం 6:30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ విష‌యాన్ని కొంతసేపటి క్రితమే అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌.. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా బ‌య‌ట‌కు వదిలారు.

ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, మలయాళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన‌ `లూసిఫర్`కు రీమేక్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. `లూసిఫర్`లో మోహన్ లాల్ న‌టిస్తే.. రీమేక్ లో ఆయ‌న పాత్ర‌ను చిరు పోషిస్తున్నాడు. మ‌రి ఈ రీమేక్ మూవీతో చిరు ఏ మేర‌కు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని స‌క్సెస్ అవుతాడో చూడాలి.

author avatar
kavya N

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri